శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్వామీ ! నీమహిమ !---మనసులను మార్చావు మనుషులను కలిపావు. జైశ్రీరాం

>> Friday, September 14, 2012

ఆహా!  కలియుగంలో  హనుమదుపాసన ఎంత శీఘ్రఫలితాలనిస్తున్నదో ఇదొక ఉదాహరణ.

మొన్న ఆదివారంకాక  ముందటి ఆదివారం ఒక ఇంజనీర్ గారు వచ్చారు పూజకు. ఆయన ఎలక్ట్రికల్డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు .  వారొక సమస్య లో తీవ్ర ఇబ్బందిలోఉండి   ఇక్కడ కొచ్చి  అమ్మను దర్శించుకుని   హనుమంతులవారికి అర్చన చేపించాలని మనసులో సంకల్పిమ్చుకున్నారట.
ఈయన కు వీరి అన్నదమ్ములతో వివాదం చెలరేగింది. ఆస్తుల విషయంలో  పంతాలు,పట్టుదలలు పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చి సంవత్సరాలుగా  ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులో ఉన్న వారి గృహంలో లోపాలు కూడా ఇందుకు తోడయ్యాయి. మనశ్శాంతి కరువై అల్లల్లాడి పోతున్నారు. ఎవరో చెప్పగా పీఠానికి వచ్చారు .


భార్యాభర్తా శ్రధ్ధగా స్వామిని సేవించుకుని   అర్చనలు జరిపారు. వారి సమస్యకు పరిష్కారం అడిగారు.

మనుషులు చెప్పే పరిష్కారం వల్ల సమస్య పూర్తిగా తొలగదు. స్వామినే ఆశ్రయించండి  అనిచెప్పి ఒక నలుబది రోజులు ప్రదక్షిణలు నియమం చెప్పాము.  హనుమాన్ చాలీసాపారాయణ విధి ని  సూచించాము .
 ఆయన వెళ్ళి సాధన ప్రారంభించారు . చిత్రం స్వామి  మహిమ సాకారందాల్చినది.
వారం తిరగకుండానే వారికుటుంబసభ్యుల మనసులలో  మార్పుకలిగినది. చిత్రంగా   సమస్య జటిలమవటానికి  ముఖ్య కారనమయిన ఆడువారి మనసులలోనే పరివర్తన కలిగింది. ఉద్యోగం ఉన్నవాల్లు లేనివారి పట్ల కరుణ చూపించారు. పోనీలే మనకు ఉద్యోగం ఉంది కదా ! ఆస్తులలో కాస్త ఎక్కువగా లేనివారికిద్దామనే దయాహృదయం ఆవిష్కరింపబడింది. ఇంకేం ! అన్నదమ్ములంతా  ఇకసమయం ఇవ్వకూదదు మరలా మనసులు ఎలామారుతాయో ? ఎవరికి తెలుసు అని  ఒప్పమ్దపత్రాలు వ్రాసుకుని మొన్న సోమవారం  రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారట. 

   స్వామి అనుగ్రహంతో   మా అన్నదమ్ముల మనసులలో కలతలు లేకుండా  వివాదం పరిష్కరింపబడినదని  వారు ఆనందపడుతున్నారు.

మనం భూమిపై ఉండేదే నాలుగు రోజులు .పోయేటప్పుడు ఎవరమూ కట్టుకుని పోయేదేమీ లేదు . ఈ ఆస్తులకోసం ఆప్యాయతలను ,ధర్మాన్ని వదులుకోవాల్సిన పనిలేదు. అందువల్ల ముందుగా అన్నదమ్ములు ఎలాఉండాలో తెలియాలంటే మన పిల్లలకు రామాయణం చదివించి అనుబంధాలు పెంచాలి . 
ధర్మం పట్ల శ్రధ్ద కలవారిని ధర్మరక్షకులైన హనుమత్ ప్రభువులు కాపాడుతూనే ఉంటారు. జైశ్రీరాం .



1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల September 14, 2012 at 11:25 PM  

రామచంద్రప్రభో పాహి,

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP