శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అదే మన్నా ఆంధ్రా అనుకున్నావా ? అబద్దాలప్రచారానికి అడ్డులేకపోవటానికి ? "కువైట్...... కుళ్లబొడుస్తారు జాగ్రత్త"

>> Saturday, September 15, 2012

andhrajyothyi daily news

బ్రదర్ అనిల్ సభ రద్దు!
కువైట్‌లో తప్పిన అరెస్టు ముప్పు
అనుమతి లేకుండానే సభకు యత్నం
కువైట్ సర్కారు సీరియస్
రాజకీయ కోణంలో వేసిన ఎత్తు చిత్తు
మామ పేరు చెప్పుకొని బయటపడ్డ వైఎస్ అల్లుడు

ఆన్‌లైన్ గల్ఫ్ ప్రతినిధి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు కువైట్‌తో చేదు అనుభవం ఎదురైంది. తనదైన శైలిలో క్రైస్తవ సభ నిర్వహించేందుకు ఆయన వేసిన ఎత్తుగడను పోలీసులు భగ్నం చేసి.. సభను పూర్తిగా రద్దు చేశారు. దీంతో భార్య షర్మిలతో కలిసి కువైట్‌కు వచ్చిన అనిల్ పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రాలో మాదిరిగానే.. కువైట్‌లో కూడా మామ వైఎస్ ప్రతిష్ఠను అడ్డుపెట్టుకొని అరెస్టు అవకాశాన్ని తృటిలో తప్పించుకొని బయటపడ్డారు. వారి వెంట ప్రయాణించేందుకు తొలుత ఆసక్తి చూపించిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి రాజకీయ కారణాలతో చివరి నిమిషంలో ఆగిపోవడం గమనార్హం.

కువైట్‌లోని తెలుగు క్రైస్తవ మందిరాలతో సంబంధాలున్న బ్రదర్ అనిల్‌కుమార్ ప్రోత్సాహం మేరకు కడప జిల్లాకు చెందిన జోసఫ్ రెడ్డి చర్చిని నిర్వహిస్తున్నారు. దాని ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు అనిల్ ను ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమం కోసం భార్య షర్మిల, పిల్లలు, బంధువులతో కలిసి బ్రదల్ అనిల్ కువైట్‌కు వచ్చారు. గతంలోకూడా అనేక సార్లు బ్రదల్ అనిల్ కువైట్ సందర్శించి, కైస్త్రవ మత సభల్లో పాల్గొన్నారు.

కానీ, ఈసారి 'రాజకీయ' కోణంలో భారీ సభకు పథక రచన చేశారు. కువైట్‌లోని రాయలసీమ వాసులను వైసీపీలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తుగడే పన్నారు. వైసీపీకి పెరిగిన సీట్ల బలం, వైఎస్ ప్రతిష్ట కలిసి సభ బ్రహ్మాండంగా జరిగిపోతుందని అంచనాలు వేశారు. కానీ, ఈ విషయాలేవీ కువైట్ పోలీసులు తెలియకుండా చాప కింద ఏర్పాట్లు మొదలుపెట్టారు.

క్రైస్తవ సభ విషయం చెప్పకుండా.. ఎన్ఆర్ఐల సాంస్కృతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కువైట్‌లోని ఒక పార్కును తీసుకున్నారు.తీరా చూస్తే ఆ ఛాయలేవీ కనిపించకపోగా పార్కు వద్ద భారీ హంగామా నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమం ముసుగులో క్రైస్తవ మత సభను నిర్వహిస్తున్నారన్న విషయం బయటకు పొక్కింది. దీనిపై కువైట్ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఎంపీ డాక్టర్ వలీద్ అల్ తబ్‌తబై బ్రదర్ అనిల్‌కుమార్ బృందంపై తీవ్రంగా మండిపడ్డారు.

మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా లిబియాలో చిత్రం విడుదల చేశారంటూ ఆ దేశంలోని అమెరికా కాన్సులేట్ రాయబారిని హత్య చేయడం, తదనంతర పరిణామాలపై ఇటీవల కువైట్‌లో జరిగిన నిరసన సభలో తబ్‌తబై పాల్గొన్నారు. తన ప్రసంగంలో భాగంగా బ్రదర్ అనిల్ తలపెడుతున్న క్రైస్తవ మత సభలను గురించి ప్రస్తావించారు. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు.

అసలే అమెరికాపై, ఇతర కైస్త్రవ దేశాలపై కాక మీద ఉన్న కువైటీలు.. సభకు వచ్చే భారతీయులపై విరుచుకుపడే అవకాశం ఉండొచ్చని వారు ఆందోళనకు గురయ్యారు. పార్కులో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, నిర్వాహకులను పిలిచి మందలించారు.

క్రైస్తవ మత ప్రచారం, మత స్వీకరణ తంతును బహిరంగంగా మైకులు పెట్టి చేయడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. పోలీసులు, ఎంపీకి కువైట్‌లోని కడప వాసులు సర్దిచెప్పడంతోపాటు ముస్లింలకు వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్నీ ప్రస్తావించి బ్రదల్ అనిల్‌ను అరెస్టు ముప్పు నుంచి బయట పడేశారు. 
----------------------------------------------------------------------------------------------






  ఈమాత్రం స్పందన హిందువులలో ఉండి ఉంటే  ???????????????????

6 వ్యాఖ్యలు:

just the way I am September 16, 2012 at 1:41 AM  

so u think Moslems are doing a good job? super! thay started that good job in India too. ait for some more years they do the same thing to u in ur on country.

చిలమకూరు విజయమోహన్ September 16, 2012 at 4:52 PM  

ఆయన ఆజ్ఞాపిస్తే వర్షమే ఆగిపోయింది,పోతుంది.మరి ప్రచారం చేయకుండా చేసిన కువైటీయులను ఎందుకు ఆపలేకపోయాడో!

Anonymous September 16, 2012 at 7:20 PM  

బ్రదర్ అనిల్‌కు ఏసు భక్తికి సంతసిస్తూ, సౌదీలో మత ప్రచారాలకు తెగబడాలని ఆశిస్తూ, మద్దతునిస్తున్నా. శిలువ వేసినా, అనిల్ బ్రదర్ రక్తంతో వారిపాపములు పరిశుద్ధాత్ముడు కడిగివేయును.

durgeswara September 16, 2012 at 8:59 PM  

అయ్యా
జస్ట్ దవే గారూ

అన్నంపెట్టిన ఇంటిలో అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కొంపలు కూల్చటంలో మీ ఇద్దరూ సిధ్ధహస్తులే .
కాకుంటే మీకు వాల్లే కరెక్ట్ మొగుళ్ళు.
ఇక మేమంటావా ! వేలసంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి దాడులు. సత్యాన్ని నమ్మి ఉన్నాము కనుక సహనంతో భగవంతుని పై భారం వేసి వేచిచూస్తున్నాము .

indian hindu October 11, 2012 at 6:50 AM  

హిందువులకు ధర్మరక్షణా స్ఫూర్తి లోపించడానికి "సహనం" అనే ముసుగు ఎందుకు? జై శ్రీరామ్

indian hindu October 11, 2012 at 6:53 AM  

హిందువులకు భగవానుని ధర్మరక్షణా స్ఫూర్తి లోపించడానికి "సహనం" అనే ముసుగు ఎందుకు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॐ

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP