శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ముందు వీళ్ళకు నేర్పాలి మనదైన చదువును

>> Thursday, June 7, 2012

ఈరోజు రాజీవ్ విద్యామిషన్ తరపున  ఉపాధ్యాయులకిస్తున్న వృత్యంతరశిక్షణలో   నేను మాట్లాడవలసి వచ్చినది . మారిన    పాఠ్య పుస్తకాలలో  వందేమాతర గీతం   తొలగించినా  ఎవరికీ   చీమ కుట్టినట్లు లేదు . ఇక  అన్నం పెడుతున్న  ప్రభుత్వ పాఠశాలలను బ్రతింకించుకోవాలంటే  తెలుగు భాషను బ్రతికించుకోవాలనే విషయాన్ని గూర్చి గట్టిగా వాదనలు లేవు.
 ఇక మూడవతరగతి తెలుగువాచకంలో ఇతిహాసకథలలో భీముడు రాణివాసంలో పుట్టినట్లుగా పెరిగినట్లుగా వ్రాసారు.  కోట్లరూపాయలు వెచ్చిస్తున్న పాఠ్యపుస్తక నిర్మాణంలో ప్రమాణాలు ఎలా తగలబడుతున్నాయో ఇదొక ఉదాహరణ. కనీసం భారతంగూర్చి అవగాహన కూడా లేదా వీల్లకు అనే అనుమానం కలుగుతుంది .  మొదటి పాఠంలో ఉన్న పాటలో పదాలు ప్రాసకోసం కూర్చినట్లుందిగాని  ప్రామాణికంగా లేదు. సరే ! మూడోతరగతికే కదా అనుకున్నా వ్రాసిన పంతులుగారికి భాషపై ఉన్న  అవగహన  ఇంతేనా అనిపిస్తుంది తెలిసినవారికి.


ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం ఎండకు మాడిపోతూ రావటం పోవటమే  పెద్ద శిక్ష[ణ]గాఉంది అని వాపోతున్న పంతులుగార్లశాతం ఎక్కువ. 
 ఇక కుర్రకారు పంతుళ్ళసంగతి  చెప్పనక్కరలేదు .మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల  సరైన అవగాహనా ,అభిమానం ఉన్నట్లనిపించటం లేదు .  వీళ్ళలో ఎక్కువమందికి  ఇంగ్లీషు చదువులు ,మార్కుల పరీక్షల విధానంలోనే చదువులు సాగాయనిపిస్తున్నది . 
ఇప్పుడే  ఓ ఆలోచనచేస్తున్నాను . మానవీయ విలువలు బోధించే భారతభాగవత రామాయణా దులను వీరిచే వచనభాగంగానైనా చదివింపచేయాలి . అందుకోసం ముందుగా వచన రామాయణాన్ని సాధ్యమైనంత మందికి అందించాలి . వీరిచే  చదివించాలి 

జైశ్రీరాం  

7 వ్యాఖ్యలు:

Sandeep P June 7, 2012 at 10:45 AM  

ఉషశ్రీ రామయణం, భాగవతం, భారతం non-detailed గా పెడితే బాగుంటుందేమోనండి.

Anonymous June 7, 2012 at 11:05 AM  

విద్య, వైద్య రంగాల్ని రిజర్వేషన్లనుంచి మినహాయిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. మీరు చెబుతున్న ఉపాధ్యాయుల తల్లిదండ్రులు వాళ్ళని ఏదో అలెగ్సాండర్లనీ, ఐన్ స్టీన్లనీ చేసేద్దామనీ, ఆ విధమైన డబ్బు expectations తో, డబ్బువిలువలతోనే పెంచి ఉంటారు, అందఱు తల్లిదండ్రుల్లానే ! కానీ వీళ్ళు ఆ స్థాయి అందుకోలేక ఇలా ఉపాధ్యాయులుగా మారారు. వీళ్ళు డబ్బు సంపాదించలేకపోయినా తాము పెఱిగిన తప్పుడు డబ్బువిలువలతో తమ శిష్యుల్నీ, పాఠశాలల ప్రమాణాల్నీ చెడగొడతారు.

Saahitya Abhimaani June 7, 2012 at 11:43 AM  

గురువుగారూ, మాంచి కోపం మీద వ్రాసినట్టున్నారు చాలా అచ్చు తప్పులు దొర్లాయి మీ వ్యాసంలో. కాస్త సరిచేద్దురూ. చాలా చోట్ల "ళ" బదులుగా "ల" పడింది. వీరిచే బదులుగా "విరిచే" అని వచ్చింది.

పాఠ్య పుస్తకాల్లో వందేమాతరం తీసేశారా!!!!!!! ఎంతటి దారుణమైన వార్త. ఇంకొన్నాళ్ళు పోతే, భారత దేశం అంటె మరెవరికో బాధ కలుగుతుంది అని ఆ పేరు కూడ పాఠ్య పుస్తకాల్లో రాకుండా చేస్తారేమో మరి. విదేశీ ఇజాలకు బానిసలు అయ్యిన మన మీడియా ఇలాంటివి పట్టించుకుంటుందా, విదేశీ పలుకుబడిలో జరుగుతున్న ఈ ప్రభుత్వం ఇలాంటి అప్రాచ్యపు పనులు మరెన్ని చేసి పాపం మూటకట్టుకోనున్నదికదా. మీ ఆవేదనతో నేను ఏకీభవిస్తున్నాను.

Chittoor Murugesan June 7, 2012 at 6:32 PM  

బాసూ !
మీ స్కూల్ వేరు. నా స్కూలు వేరు .చివరన వ్రాసిన ముక్కేదో ఇక మొదట్లోనే వ్రాయాయండి.

మీ మొదటి వాఖ్యమే మీ ఐడియాలజిని తెలిపింది. అయినా మీ టపా పూర్తిగా చదివా.

సార్వత్రిక ఎన్నికలొచ్చినప్పుడు "మనం" తేల్చుకుందాం. అందాక శెలవు

చింతా రామ కృష్ణా రావు. June 7, 2012 at 7:37 PM  

ఆర్యా! మన ఆవేదన అరణ్య రోదన. ఎందుచేతనంటే ఒక ఇతమిద్ధమైన ఆశయం కలిగి పాథ్య ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటే ఈ దౌర్భాగ్యం మనకుండేది కాదు.
నేను ౧౯౭౪ నుండి - ౨౦౦౮ వరకు ఉపాధ్యాయ - ఉపన్యాసక వృత్తిలో ఉన్నాను. ఆనాడు నేను బోధించ వలసిన వాచకాలలో చక్కని నీతి ప్రబోధక సంస్కృత శ్లోకాలు, తప్పని సరిగా భారత, భాగవత, రామాయణ, హరివంశాగి గ్రంథాలనుండి ఎంపిక చేయ బడిన పాఠ్యభాగాలు ఉండి తీరేవి.
వాటిని చెప్పాలన్నా, ఉపాధ్యాయుఁడుగా నోరు విప్పాలన్నా అత్యద్భుతమైన ఆనందంతో మనసు పరవళ్ళు త్రొక్కేది. ఏ సంస్కారం మనం విద్యార్థులకు కలిగించాలనుకొనేవారిమో ఆ సంస్కారాలు తప్పక కలిగించ గలిగేవాళ్ళం ఆ పాథ్య ప్రణాళికలననుసరించడం చేత.
మరి ఈనాడంటాఆ
సంస్కారమా????? అంటే ఏమిటి???? అనే దౌర్భాగ్యస్థితి దాపురించింది.
అంతా మన దౌర్భాగ్యమే.
ఆ పరమాత్మ ఎప్పటికైనా కరుణించకపోతాడా? మన ఆశలు అడియాశలు కాకుండా చూచి కాపాడకపోతాడా అని ఆశావహ జీవులమై ఎదురు చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగినది ఏమీ లేదు.
ఐతే మనం విద్యార్థులకు పాఠ్యపుస్తకాన్ని ఆధారం చేసుకొని, చక్కని అంశాలు బోధించే అవకాశం కల్పించుకోవాలి. తప్పక మన ధ్యేయం నెరవేర్చుకోవాలి.
మరొక్క మాట.
అసలు
SCHOOL
అనే ఆంగ్లపదంలోని పరమార్థం స్కూల్స్ నిర్వహిస్తున్న, నిర్వహింప చేస్తున్న, చదువుకొంటున్న, చదివించుకొంటున్న వారికెంత వరకూ తెలుసు? అనే సందేహం వస్తోంది.
S= సేక్రిఫైజేషన్.
C=కేరక్టర్.
H=హానెష్టీ.
O=ఒబీడియన్స్.
O=ఆర్గ్ నైజేషన్
L=లీడర్ షిప్.
విధ్యార్థికి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయే సరికి ఈ రకమైన అంశాలు పరిపూర్ణంగా విద్యార్థిలో కలిగించ గలగాలి. అలాంటిది మాత్రమే నిజమైన స్కూల్ ఎడ్యుకేషన్.
కానినాడు
విద్యార్థులను చదువు‘కొనండి’ అని మనం చెప్పడం వారు చదువ‘కొంటున్నాము’ అనడం సత్యదూరాలు కానేరవు.
నమస్తే.

రాజేశ్వరి నేదునూరి June 8, 2012 at 10:42 AM  

నమస్కారములు.
సరిగ్గా చెప్పారు నేటి విద్యా విధానం ఇలాగే ఉంది. పట్టిం చుకునే నాధుడు లేడు ఫీజులు మాత్రం , వేలు , లక్షలు . మార్పు ఎన్నటికో ?

durgeswara June 8, 2012 at 4:23 PM  

వందే మాతరానికే దిక్కులేదు . భారత భాగవతాలను ఉపవాచకాలుగా పెడతారా ? ఈమధ్య వివేకానందుని పాఠ్యాంశాన్ని ఇవ్వొద్దని ఓ ఉపాధ్యాయసంఘనాయకులు గొంతుచించుకుని మరీ చెప్పారు.

శివరామప్రసాద్ గారూ బరహా వాడీ వ్యాపార గోలతో ..మధ్యమధ్యలో ఆటంకాలవల్ల తెలుగు టైపింగులో తప్పులు పడ్డాయి మన్నించండి .
పెద్దలు చింతా రామకృష్ణారావుగారు,తాడేపల్లి గారు చెప్పినట్లు మనది అరణ్యరోదన కాకుండా మనప్రయత్నాలు మనం ఆరంభించాలి .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP