శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిజంగా జీవించాలి!

>> Thursday, June 7, 2012


ఎందుకూ కొరగాని వేలాది మందితో మీరు ఎందుకు సమయం గడుపుతున్నారు? మీరొక ఆధ్యాత్మిక గురువు, సరైన దృష్టి ఉన్న వారితోనే మీరు సమయం గడపాలి కానీ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? అని బుద్ధభగవానుడిని ఓ భక్తుడు ప్రశ్నించాడు. అందుకు బుద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు. 'వారందరూ బోధిసత్వులే. వారికి కూడా బుద్ధుడు కాగల సామర్ధ్యం ఉంది. వారొక అర్థం లేని జీవితం గడుపుతున్నట్లు కనపడుతుంది కానీ, వారికి బుద్ధుడు కాగల లక్షణాలు ఉన్నాయి. విత్తు క్షేమంగా ఉండాలి, ఇక సరైన సారవంతమైన నేల దొరకడమే ఆలస్యం. నా యత్నం అంతా విత్తనానికి సరైన నేల లభ్యం అయ్యేలా చూడటమే. విత్తనం ఒక ప్రాణం లేని గులకరాయిలా కనిపిస్తుంది.

కాని అదే అందమైన పుష్పంగా వికసించగలదు. ఆధ్యాత్మికత అంటే విత్తనం తన మూలాలను కనుక్కోవడమే. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటే ఎక్కువగా సాంఘిక అవగాహన ఆధారంగా ఉన్నది, అందులో అస్తిత్వం చాలా చిన్న పాత్రను పోషిస్తుంది. చాలా మందికి ఆధ్యాత్మికత అంటే తమ భగవంతుడి మీద విశ్వాసం ఉంచడం, పూజలు చేయడం, తమ సంప్రదాయాలను పాటించడం. కానీ మనం అందరమూ గుర్తించాల్సిన విషయం ఏమంటే ఈ రకమైన ఆధ్యాత్మిక ధోరణిలో పడటం వల్ల మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం. మనం కేవలం 'బతుకుతున్నాం', ఎటువంటి ఉత్కృష్టతకు అవకాశం ఇవ్వడం లేదు. జీవితం మీద ఉన్న ఇలాంటి సామాజిక భావనల నుంచి బయట పడినపుడే మీకు ఆధ్యాత్మిక మార్గం గోచరిస్తుంది అన్నాడు గౌతముడు.

ఆధ్యాత్మికత అంటే...?
ఆధ్యాత్మికత అంటే ఒక సిద్ధాంతము కాదు, ఒక నమ్మకాలతో కూడిన వ్యవస్థ కాదు, మీరు 'చేయగలిగిన' పని కూడా కాదు. మీరే అది కాగలిగింది. మీ అసలు సహజ స్వరూపం. కాని ఆధ్యాత్మికత కావాలంటే జీవించి ఉండాలి. అందుకే జీవితం ఎంతో ముఖ్యమైంది. ఈ ఒక్క జీవిలోనే, బతుకులోని అనివార్యతను దాటి వెళ్లగల విచక్షణతను ఇస్తుంది. మరే ఇతర జీవికి ఇలాంటి మేధోపరమైన విచక్షణ లేదు. ఇదో పెద్ద కానుక. మీరు దానిని ఇంకా వినియోగించి ఉండకపోవచ్చు. కానీ దాని సంభావ్యత మాత్రం అపారమైంది.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, కంటికి కనపడని ధ్యేయాన్ని పొందాలన్న ఆత్రుత, స్థిరంగా ఉన్న నేలను వదిలి అవకాశాన్ని అందుకోవాలనే ఆకాంక్ష , ఇది కొత్తదేమీ కాదు. అది మానవ హృదయంలో ఎపుడూ ఉప్పొంగుతూనే ఉంది. చాలామంది దానిని నొక్కిపెట్టారు. జీవించడమే అంటే అది కాదు, తమలోని పిలుపును నొక్కి పెడుతున్న వారు ఒక రకంగా నిస్సార జీవితాన్ని గడుపుతున్నారు. భౌతికత్వం అనేది అస్తిత్వంలో చాలా చిన్న భాగం కావడం వల్లనే నిజంగా వారు జీవించలేక పోతున్నారు. జీవితంలోని భౌతికత్వం అతి స్వల్పమైనది.

అనంత విశ్వంలో రేణువులం!
మీ మనుగడ ఎంత ముఖ్యమైనదైనా మీరు, మీరు నివశిస్తున్న గ్రహం, సౌరవ్యవస్థ, నక్షత్రాలు, పాలపుంతలు, మీరు అన్నీ అనంత విశ్వంలో అతి చిన్న నలుసు మాత్రమే. అస్తిత్వాన్ని ప్రభావితం చేసేది భౌతికాతీత మైనది. మానవులు ఇంద్రియాల ద్వారానే తమ అనుభూతిని పొందుతారు. కానీ అవి మనుగడకు మాత్రమే పనికి వచ్చే సాధనాలు అని మరచిపోతారు. ఈ ఇంద్రియాలే జీవితానికి పరమార్థాలు అనుకుంటారు. అదే వారికి భౌతికత గురించి, జీవితం గురించి తప్పు భావన కలగచేస్తుంది. నిజానికి చాలామంది భౌతికమే అసలు జీవితం అనుకుని ఉంటారు.

చాలా కొద్దిమంది మాత్రమే భౌతికత ముఖ్యమే అయినా అదే పరమార్థం కాదు అని తెలుసుకుంటారు. భౌతికాతీతమైనది ఏదైనా మిమ్మల్ని బాధించినపుడు, మిమ్మల్ని కుదిపేసినపుడు, అది తీవ్రం అయినపుడు మాత్రమే భౌతికత్వం ఎంత అప్రధానమో గుర్తిస్తారు. మనందరి జీవితానికి సంబంధించి ఒక సామాజిక స్పర్శ ఉంటుంది. కానీ మనం జీవితంలో అస్తిత్వపు అంశాన్ని గుర్తించాలి. అపుడే ఆధ్యాత్మికత.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP