శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వేడుకోవటమే మనవంతు . ....వేగమే అనుగ్రహించటం ఆయన వంతు [ఇదిగో మరొక లీల ]

>> Wednesday, April 11, 2012


ఈ తల్లి తనకు కలిగిన స్వామి అనుగ్రహాన్ని అంతర్జాలంలో ఓ గుంపులో ప్రస్తావించగా స్వామి భక్తజనపాలనలో
ఎంతటి ఆత్రుతతో ఉంటారో ఉదాహరణ కనుక అందరికోసం వారి అనుమతి అడగక నే ఇక్కడ ఉంచుతున్నాను .
------------------------------------------------------------------------------------



సభ్యులందరికీ ప్రణామములు.
కిందటివారం మా మరిదిగారి (చెల్లెలు భర్త) కర్మకాండలకోసం విజయవాడలో ఒక కర్మలుచేసే సత్రంలో వుండవలసివచ్చింది. పగలు అందరూ వున్నారు. ఇబ్బంది లేకపోయింది. రాత్రికి అంత పెద్ద సత్రంలో 12మందిమి మాత్రమే వున్నాము. ఎప్పుడూ అలాంటిచోట లేకపోవటంవల్ల భయం వేసింది. అప్పుడు గుర్తు వచ్చింది. ఈ మధ్య శ్రీ దుర్గేశ్వరగారు ప్రారంభించిన కోటి హనుమత్ చాలీసా పారాయణలో నేనూ పాలుపంచుకోవటంవల్ల చాలీసా పూర్తిగా కాకపోయినా కొంత కంఠతా వచ్చింది. ఆ స్వామిని తలచుకుంటూ, గుర్తు వున్నంతమటుకు చాలీసా పారాయణ చేసుకుంటూ ఎప్పుడు నిద్రపోయానోకూడా తెలియదు. ఒక రాత్రివేళ బయటకు వెళ్ళాల్సివచ్చి లేపారు మా చెల్లెళ్ళు. లేచి కూర్చున్న నాకు గుమ్మం బయట ఆంజనేయస్వామివారి అతి పెద్ద రూపం ప్రసన్న వదనంతో నా వంకే చూస్తూ...అది నా ఆలాపన అనకోండి, నా భ్రాంతి అనుకోండి ఏదైనా కావచ్చు. కానీ దానివల్ల నాకు లభించింది స్వామి నాకు అండగా వున్నారు, దేనికీ భయపడక్కరలేదు అనే అమితమైన ఆత్మ విశ్వాసం. అది చాలు నాకు.

దుర్గేశ్వరగారూ, మీవల్ల నాకు హనుమాన్ చాలీసా కొంతయినా కంఠస్తమయింది. కృతజ్ఞతలు.

లక్ష్మి
హైదరాబాద్


3 వ్యాఖ్యలు:

Sridevi April 11, 2012 at 10:47 AM  

Chala anandam mariyu prerana kaliginche visayam panchukunnanduku dhanyavadaalu.

astrojoyd April 11, 2012 at 9:03 PM  

మనసు మంత్రంతో మమైకం అయినపుడు దేవతామూర్తుల దర్శనం కలగుతుంది.కానీ ఈ దర్శనానుభూతులను బయటికి వెల్లడించడం వలన తిరిగి అ మూర్తి దర్శనం దుర్లభం అవుతుంది.మీది భ్రాంతి కాదు-మనో రూప ఎండమావీ కాదు..వాస్తవమే

astrojoyd April 11, 2012 at 9:07 PM  

నారదునికి శ్రీహరి కొద్దిపాటి తపానికే దర్శనం ఇచ్చారు,కాని ఆ దర్శన మూర్తి శ్రీహరియా కాదా అన్న సంశయం నారదునికి కలిగిన ఉత్త్హర క్షణంలో అయన మాయం అయ్యి తిరిగి నారదునికి కొద్ది లక్షల వస్త్సరాల తపం తర్వాతగాని అయన తిరిగి దర్శనం ఇవ్వాలా..ఇది నేను చెప్పినదికాడు..అ శ్రీహరియే నారదునికి ఇచ్చిన వివరణ ఇది.వ్యాస భాగవతంలో ఈ ఘట్టం ఉంది కూడా..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP