ప్రమాదఘంటికలు మ్రోగుతున్నాయి -పవనసుతుని ఆశ్రయించి శరణువేడండి
>> Thursday, April 12, 2012
భూమిపై పలువిపత్తులు సంభవించే కాలంలో ఉన్నాము మనం . భూకంపములు,అగ్నిప్రమాదములు,రోడ్డుప్రమాదాలు,
వంటి విపత్తులు మానవజీవితాన్ని అలకల్లోలం చేస్తున్నాయి.[ఈవిషయమై సంవత్సరం ప్రారంభంలోనే ఇక్కడ కొన్ని పోస్ట్ లు వ్రాసి ఉన్నాము]
మానవుల సామూహిక పాపములు ఇలా సామూహిక ప్రమాదములుగా మారుతున్నాయి . కోరుకున్నవన్నీ దక్కాలనే దురాశ , భౌతిక సంపదలనుపోగేసుకునే ఆత్రుతలో మానవధర్మాలను విడచి దానవలక్షనాలు పెంచుకుంటున్నాం మనం. తద్వారా ప్రకృతిని హిసంపెడుతూ కౄరస్వభావులమవుతున్నాం. కలి పురుషుని ప్రేరణతో జిహ్వాంగము,గుహ్యాంగాల సంతృప్తే ప్రధానమనుకునే దౌర్భాగ్యానికి దిగజారిపోతున్నది మానవజాతి . భాగవతము, భవిష్యపురాణాదులలో చెప్పబడిన ప్రమాదపూరిత చేష్టలు మానవులలో పెరిగిపోతూ ప్రకృతికోపానికి గురవుతున్నాడుమనిషి . అంతటితో ఆగక శివ,కేశవులను నిందించటం,వేదవిద్యలను,సత్సాంప్రదాయాలను ధ్వంసం చేసే పనిలో పెట్రేగిపోతున్నది కలిసేన. ఇవన్నీ తిరిగి వినాశనానికి దారితీస్తున్నాయి. ఇంత తప్పులు చేసినా తల్లివంటి ప్రకృతిమాత కొన్ని హెచ్చరికలను మాత్రమే ప్రదర్శిస్తున్నది ప్రస్తుతం. ఇలాగైనా తప్పులు దిద్దుకుంటారనే ప్రేమతో.
మనం ధర్మాచరణతో బ్రతకటం . దురాశకు ,దుర్భుద్దులకు తావీయక రామనామ జపశీలురమై ,నిరంతరం హరిభజనతో,సత్పురుషుల సాంగత్యంతో ,మనజీవితాలను యజ్ఞమయం చేసుకోవాలి. అంతకు వినా ఏ అహంకారములు మనలను రక్షించలేవు అనేది సత్యం.
ఇక ఇటువంటి ఆపదసమయంలో హనుమంతులవారిని శరణువేడి రక్షణపొందవచ్చునని పెద్దలసూచన. హనుమదుపాసనద్వారా ధర్మబధ్దమైన జీవన విధానం, భగవత్ భక్తి ,సత్సీలత, నిర్భయత్వం మనకు ప్రాప్తిస్తాయి. ఎక్కడ హనుమంతుడుంటాడో అక్కడ ఆపదలుండవు అనేది శాస్త్రవచనం . అందుకే ఈ పరిస్థితులలో ఆంజనేయస్వామి ఉపాసన శ్రేష్ఠతరము.మీమీ గురుసాంప్రదాయానుసారం స్వామిని ఆశ్రయించి ఉండాలని మనవి
ఇక హనుమదుపాసనాఫలితాలను నిరూపించుటకొరకు శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠం హనుమత్ రక్షాయాగం ను నిర్వహిస్తూ వస్తున్నది . ఈ సంవత్సరం కోటిచాలీసా పారాయణం అనుసంధానిస్తూ అష్టోత్తరశతకుండీయం గా పూర్ణాహుతి మే పదహారున జరుపుతున్నాము. ఇందులో పాల్గొనదలచుకున్నవారు హనుమాన్ చాలీసా పారాయణం చేసి యాగానికి రావచ్చు. స్వయంగా యజ్ఞం చేయదలచుకున్న వారు ముందుగా తెలియపరచినచో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమతరపున యాగం జరిపించదలచుకున్నవారు ,రాదలచుకున్నవారు ఈక్రింది అడ్రెస్ లలో సంప్రదించండి .
సర్వేజనా సుఖిఃనోభవంతు
durgeswara@gmail.com
9948235641
జైశ్రీరాం




0 వ్యాఖ్యలు:
Post a Comment