అడిగినయట్టి యాచకుల ఆశలెరుంగక
>> Friday, March 9, 2012
అడిగినయట్టి యాచకుల ఆశలెరుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె
య్యెడల అదెట్లు,పాలు తమకిచ్చునె ఎచ్చటనైన లేగలన్
కుడువగనీనిచో కెరలి గోవులు తన్నునుగాక భాస్కరా !
భాస్కరా ! దూడలను తాగనియ్యక పాలుతీసుకోవాలని సిధ్ధపడితే,ఆవులు పాలియ్యవు సరికదా తంతాయి. అలానే ఆశతో ఏదో ఇస్తారని వచ్చిచేజాచి అడిగే వారికి లోభితనముతో లేదుపొమ్మనువారికి ధర్మదేవత ధనప్రాప్తిలేకుండా చేస్తుంది




0 వ్యాఖ్యలు:
Post a Comment