శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం గూర్చి కొన్ని వివరణలు

>> Wednesday, March 7, 2012

ఈ సంవత్సరం భూమిపై సంభవించే ఉత్పాతాలు ప్రమాదాలనుంచి భక్త జనుల సంరక్షనార్ధమై "హనుమత్ రక్షాయాగం " నాల్గవ ఆవృతి ని మొదలుపెట్టడమైనది .మహాత్ములు సాదు సంతుల ఆశీర్వాదములతో శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్న ఈ యాగంలో కోటిచాలిసా పారాయణం జరిపి మే పదహారవతేది న పూర్ణాహుతి జరుపబడుతుంది . ఇందులో భాగంగా ప్రతి గృహంనుండి అందరు కుటుంబసభ్యులు కలసి వెయ్యిన్నేనిమిది హనుమాన్ చాలీసా పారాయనములు జరిపి దానికి గుర్తుగా వెయ్యిన్నేనిమిది రామ నామములను లిఖించి పంపుటకు అనుకూలముగా ప్రతులను ముద్రించి పంపిణీ చేయటం జరిగింది . రాష్ట్రవ్యాపితంగా పలువురు భక్తులు భక్త సమాజాలు నిర్విఘ్నంగా పారాయణములు సాగిస్తున్నారు. తదాంగంగా కొందరు సాధకులు సుందరా కాండ పారాయణం మంత్రజపములను చేయుచున్నారు .
స్వామిని ఆశ్రయించి జనులెల్ల సుఖసంతోషాలను ,శ్రేయస్సును పొందాలనేదే సంకల్పం

ఇక ఈ యాగంలో పాల్గొనటానికి కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .వారి కొరకీ వివరణ

ఈ యాగంలో పాల్గొనదలచుకున్నవాళ్ళు పారాయణం చేసి [తమ నిత్య పూజాసమయంలో ] రామనామాన్ని లిఖించి మే పదికల్లా ఆ ప్రతులు యాగాస్తలానికి చేరాలి . యాగంలో స్వయంగా పాల్గొనదలచినవారు రావచ్చు .రాలేనివారు దగ్గరలోగల హనుమదాలయంలో పూజజరుపుకొనవచ్చు .

ఇక యాగంలో పాల్గొనదలచినవారు ముందుగా సమాచారం అందించండి . సాధారణ వసతులతో మాతోకలసి ఉండవలసి ఉంది . ఆడువారిని తీసుకువచ్చినా ఇబ్బందేమీ లేదు . కాకుంటే చెప్పాముకదా సాధారణ సౌకర్యాలతో సర్దుకోవాలి .

ఇక కొన్ని సమస్యలతో సతమతమవుతున్నవారు దీక్షా విధానంగా ఈ పారాయణం చేయటం వలన శీఘ్రంగా ఫలితాలు పొందవచ్చు . ఇంకా సమయముంది కనుక ఇప్పుడైనా పారాయణం modalubeTTavachchu
ఇంకా వివరాలు కావాలను కున్నవారు సంప్రదించి మీ అనుమానాలు నివృత్తి చేసుకొనవచ్చు

durgeswara@gmail.com
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP