మహా శివరాత్రి
>> Sunday, February 19, 2012
మహా శివ రాత్రి - పర్వదినం - ఈ నెల ఇరవైవ తేది సోమవారం. శివరాత్రి ,
శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం (చంద్రాంస) రావడంతో మరింత విశేషాన్ని
సంతరించుకుంది.
శ్రీ ఖర నామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి "మహా శివ రాత్రి". భక్తులు
నియమ నిష్టలతో జరుపుకొనే పర్వాలలో ప్రధానమైంది ఈ శివరాత్రి. ప్రతి నెల
మాస శివరాత్రి బహుళ చతుర్దశి రోజున వచ్చినా,
మాఘ బహుళ చతుర్దశి మహా శివ రాత్రి కి ప్రత్యేకత. ప్రళయ కాలంలో
విశ్వమంతా అంధకార బందురమైన వేళ, అంటా జలమయమైన వేళ , జీవులు అనువులై
అంతరాళం లో ఉండిపోయిన వేళ,
జగన్మాత పార్వతి దేవి లోక కల్యాణం కోసం తపస్సు చేసి, ఈ కాళ రాత్రిని
ఉపసంహరించి, జీవుల్ని ఉద్ధరించమని ప్రర్దిన్చిందట. ప్రళయ కాలంలో దీర్ఘ
కాల రాత్రి సమయంలో చేసిన పార్వతి దేవి చేసిన శివ పూజ ప్రలయానంతరం
"శివరాత్రి" గా పరిణితి చెందిందని పురాణ వచనం. ఆ అమ్మ తపస్సుకు మెచ్చి,
ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కోటి సూర్య సమ ప్రభలతో ఆ మహాశివుడు
లింగాకారంలో ఉద్భవించినట్లు - ఆ అర్ధ రాత్రి నే లింగోద్భవ కాలం అంటారు
అని ఈశాన సంహితలో వివరింపబడింది. ఇది ఉపవాస పండగ.
శివ రాత్రి నాడు పగలు ఉపవాసం, శివలింగార్చన రాత్రి జాగరణం, అభిషేకాలు,
పార్వతి కళ్యాణం ... ఇలా రోజంతా భగవత్ సేవలో, ధ్యానంలో గడిపే మహా
పర్వదినం "శివ రాత్రి".
అజ్ఞానాని పోగిట్టి జ్ఞానోదయం కలిగించడమే శివరాత్రి విశిష్టత. మన పూజ్య
గురువుల మాటలలో ... శివ అంటే మంగళం, శుభం, కళ్యాణం. శివ నామ శబ్దం లోనే
సర్వ శుభాలు ఉన్నాయి. శం కరోతి ఇతి శంకర: . శివుని "శివా" అని ఆర్తి తో
పిలిస్తే చలించి పోతాడా దయాసాగరుడు. శివా రాధకులకు ఏ కష్టములు ఉండవు.
శుభప్రదుడు, మంగళ మూర్తి, దీన జన రక్షకుడు, అమృత మయుడు, జగద్బంధువు అయిన
ఆ మహాదేవుని భక్తీ శ్రద్ధ లతో అర్చించి, స్వామి కృపతో , ఆయురారోగ్య,
సిరి సంపదలతో, మంగళ ప్రదమైన జీవితాన్ని సర్వులు గడిపెదరు గాక. శ్రీ
సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన ఒక పాటలో " శివా అని నంతనే చమరించు
కనుదోయి - పులకరిన్చెడి వడలు - పొంగి పోయెడి ఎడద- చాలునయ్యా -- ఇదే శాస్వ
తై శ్వర్యము .. ఇది ఒక్క టీయుమా ఇతరములు కోరను శివా.." అంటారు.
ఈ రోజంతా మంత్ర రాజతుల్యమైన "ఓం నమః శివాయ" అనే షడక్షరి గాని; "నమః
శివాయ" అనే పంచాక్షరి గాని సదా స్మరిస్తూ తరించండి - భజ నమశ్శివమేవ
నిరంతరం (మన నిత్య దైనందినంలో కూడా). శివాభిషేకం ఆచరించి సర్వ మంగళములు;
ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుని అర్చించి సర్వ శుభ మనోభీష్టములు,
అర్ధనారీశ్వరుని సేవించి సర్వ శుభములు, రోగ భయములనుంచి విముక్తి, నీల
కంఠునిగా ధ్యానించి అపమృత్యు భయం నుంచి విముక్తి పొందడం తధ్యం.
నడిచే దేవుడు, ప్రాతః స్మరణీయులు, శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య స్వామీ వారు
పంచాక్షరి మంత్రం గూర్చి వివరిస్తూ - వేదాలలో యజుర్వేదం గొప్పది.
యజుర్వేదంలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో
ఉన్న పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలో గల "శివ" అనే రెండు
అక్షరాలూ మరీ మరీ గొప్పవి.
శివ అయ్యవారు. శివా అమ్మవారు. శివ - శివా అంటే "అయ్యా - అమ్మా "
ఇద్దరు మన వద్దే ఉంటారు. జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ "
రుద్రాభిషేకం - అభిషేక ప్రియుడైన శివునికి రుద్రాభిషేకం సమస్త రోగాలను,
శని దోషాలను, సర్వ గ్రహ పీడలను, పోగోత్తడంలో పాశుపతంలాంటిది.
శివుని పంచ వదనుడు (అయిదు ముఖములు కలవానిగా) చెప్తారు. ఒక సారి తిలోత్తమ
సుందోపసుందులు అనే రాక్షసులను సంహరించడానికి బయలుదేరి, ముందుగా శివునికి
ప్రదక్షిణం చేసింది. ఆమె ఏ దిక్కున శివునికి ప్రదిక్షినం చేస్తే ఆ
దిక్కున శివునికి ఒక ముఖం ఉద్భవిస్తూ వచ్చిందని, ఆ విధంగా పంచావదనుడు
అయినాడు.
పంచ భూతాలకు ప్రతీకగా చెప్పే ఆ మహారుద్రుని అయిదు ముఖములు పేరులు
తలచినంతనే సమస్త పాపాలు తొలగి పోతాయని పురాణ వాక్కు. అయిదు ముఖములలో....
తూర్పు దిక్కుకు ఉండేది (సద్యోజాతముఖము)
దక్షిణానికి (వామదేవ ముఖం)
పశ్చిమానికి (అఘోర ముఖం)
ఉత్తరానికి (తత్పురుష ముఖం)
ఊర్ధ్వ భాగం (ఈశాన ముఖం)
అరూప రూపి అయిన ఆ పరమేశ్వరుని భక్తీ శ్రద్ధ లతో సేవించి తరిద్దాం.
శ్రీ సాయిపథం
జయ సాయిరాం.
radhakrishna
2 వ్యాఖ్యలు:
It's very excellent
I AM INTERESTED
Post a Comment