ముక్కోటి నాడు హనుమత్ రక్షాయాగానికి మహాసాధకుల ఆశీశ్శులందాయి
>> Thursday, January 5, 2012
ఈరోజు సుదినం .ముక్కోటి ఏకాదశి నాడు చేతులారాస్వామిని పూజించుకుని నోరారా హరినికీర్తించుకుని ధన్యులమయ్యాము.
ఇక హనుమత్ రక్షాయాగానికి ఈ పర్వదినం రోజున సాధకులు,పీఠాధిపతులనుంచి ఆశీర్వాదాలు అందటం హనుమత్ స్వామి మహిమే. ఉదయాన్నే గిద్దలూరు నుంచి మన కృష్ణారావు గారు మితృలు హరనాథ్ గారు బయలుదేరి కాలజ్ఞాన ప్రదాత తాతగారు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠానికి వెళ్లారు .అక్కడ స్వామివారి మహాసమాధినిదర్శించి యాగ వివరాలప్రతిని ఆక్కడుంచిపూజజరిపి యాగానికి తాతగారి ఆశీర్వాదం కోరారు. తదనంతరం ప్రస్తుత పీఠాధిపతులవారిని దర్శించి వారి ఆశీర్వాదములు అందుకున్నారు. బ్రహ్మం గారి మనుమరాలు మాతా ఈశ్వరాంబ పీఠాధిపతులు శివకుమార్ గారిని కలుసుకుని వారి ఆశీస్శులు తీసుకున్నారు . వారెంతగానో సంతోషించి లోకశ్రేయస్సుకోసం చేస్తున్న ఈయాగం విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తామన్నారు. వారు నాతోనూ ఫోన్ లో మాట్లాడిసంతోషం వ్యక్తం చేశారు .తాముకూడా ఈయాగంలో పాల్గొంటామని మాటిచ్చారు.
ఇక ఇటువైపు శ్రీనివాసరెడ్డి విజయవాడ వెళ్ళి తాళ్లాయపాలెంలో ఉన్న శైవక్షేత్రానికెళ్లారు. పీఠాధిపతి ధర్మప్రచారకులు పరమశివుని పరమభక్తులు శ్రీశివస్వామి వారిని కలసి యాగవివరాలందించారు . వారెంతో సంతోషించి ధర్మోద్ధరణకై సాగుతున్న ఈ యాగానికి తమ సంపూర్ణసహాయసహకాలందిస్తామని చెప్పి ఆశీర్వచనాలందించారు.
నేను ఫోన్ ద్వారా హనుమదుపాసకులు పరాశరసంహితను తెలుగులోకనువదించి అందుబాటులో తెచ్చినవారు,హనుమద్దీక్షలను రాష్ట్రమంతా ప్రచారంచేస్తున్నవారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి వారి ఆశీశ్శులందుకున్నాను.
ఇక మాపరమగురువులు శ్రీశ్రీశ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ వారి ప్రియమానసపుత్రిక మహాయోగిని శ్రీ అంజనీమాత వారికి యాగ వివరాలు వివరించి వారి ఆశీశ్శులను కోరాను. అమ్మ ఎంతగానో సంతోషించి మంగళాశాసనం చేశారు.
ఈ పర్వదినం రోజున ఐదు గురుస్థానాలనుంచి ఆశీశ్శులందటం వైభవంగా జరగనున్నదని సంకేతం గాభావిస్తున్నాం.
ఇంకో విశేషం ఏమిటంటే . మొన్న రామనామాన్ని వ్రాసే ప్రతులప్రింటింగ్ కు ఆర్డరిచ్చాము . పదివేలకాపీలు ఎంతవుతాయంటే ఐదువేలరూపాయలు చెప్పారు. ఐదు స్వామి సంఖ్యకదా అనుకున్నాం. ఇక ఈఖర్చును భరిస్తామన్న మనోహర్ కు ఫోన్ చేశాము . స్వామీ ! నాదగ్గర ఇప్పుడు ఖచ్చితంగా ఐదువేలే ఉన్నాయి . ఎంతవుతుందో అని ఎవరినన్నా అప్పడుగుదామనుకుంటున్నాను . స్వామికి తెలుసుకదా నాదగ్గరెంత ఉందో అందుకే ఐదువేలకే ఖర్చుచూపెట్టాడు బంగారు తండ్రి అని ఆనందం వ్యక్తం చేస్తుంటే ఆశ్చర్యపోవటం నావంతైంది .
ఇక యాగం లో చిన్నమార్పు .. ఈనెల ఇరవై ఆరుకాకుండా శ్రీపంచమి 28 న మొదలుపెట్టి హనుమజ్జయంతి పూజజరిపి ఆరోజు మంగళవారం పూర్ణాహుతి చేయటం కుదరదు కనుక may 16 న పూర్ణాహుతి గా నిర్ణయించారు పెద్దలు . జైశ్రీరాం .
4 వ్యాఖ్యలు:
నమస్కారములు.
మీరు చాలా అదృష్ట వంతులు. కొత్త సంవత్సరం , పర్వ దినాన , " హనుమత్రక్షా యాగం చేసి పెద్దల ఆశీస్సు లందుకో గలిగిన పుణ్యా త్ములు . కనీసం తెలుసుకుని ఆనందించ గల భాగ్యం మాకు కలిగించి నందులకు హృదయ పూర్వక ధన్య వాదములు + కృతజ్ఞతలు
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
చాలా ఉత్సుకతగా ఉంది. స్వామి ఈ యాగం తో ఎంతమందిని కరుణించబోతున్నారా అని ఉద్వేగంగా ఉంది.108 రోజులు, కోటి సార్లు చాలీసా పారాయణ అంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఇక చెయ్యడం మొదలుపెట్టాక ఎన్ని చిత్రాలు చూపిస్తాడో స్వామి. అసాధ్య సాధక స్వామి కదా,
మంచిపనులకు ఎప్పుడు మంచి జర్గుతుంది అని స్వామి వారు మళ్లి రుజువుచేసాడు.
స్వామి వారికీ శతకోటి వందనాలు.
నమస్కారములు.
మీరు చాలా అదృష్ట వంతులు. కొత్త సంవత్సరం , పర్వ దినాన , " హనుమత్రక్షా యాగం చేసి పెద్దల ఆశీస్సు లందుకో గలిగిన పుణ్యా త్ములు . కనీసం తెలుసుకుని ఆనందించ గల భాగ్యం మాకు కలిగించి నందులకు హృదయ పూర్వక ధన్య వాదములు + కృతజ్ఞతలు
Post a Comment