ముక్కోటి ఏకాదశి మరియు శనిత్రయోదశి పర్వదినములలో పూజలకు గోత్రనామాలు పంపండి
>> Tuesday, January 3, 2012
ఈనెల ఐదవతేదీ న ముక్కోటి ఏకాదశి పర్వదినం . మహావిష్ణువు ను దర్శించుకునేందుకు ఉత్తరద్వారంద్వారా దర్శనమిచ్చే శుభదినం . పీఠంలో ఈరోజు శ్రేవేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు అర్చనలు జరుపబడతాయి.అర్చనలలో భక్తుల తరపున ఒక తుళసీదళం స్వామివారికి తులసీదళార్చనలో సమర్పించబడుతుంది .
నిలువెత్తు ధనరాసులతో తూయలేని స్వామిని ఒక్కతులసీదళంతో తూచి భక్తిగొప్పదనాన్ని తులసీదళ పవిత్రతను నిరూపించింది రుక్మిణీదేవి . ఆరోజు ఇంటిలో కనీసం ఒకతులసీదళమన్నా స్వామికి సమర్పించి నమస్కరించండి.
ఇక ఏడవతేదీ శనిత్రయోదశి పర్వదినం . ఈరోజు శనిదోష నివారణార్ధం శనీశ్వరునకు తైలాభిషేకం, అర్చనలు జరుపబడతాయి. భక్తులు గోత్రనామాలు పంపితే వారి తరపున అర్చనలు నిర్వహించటం జరుగుతుంది .
ఆరోజు ప్రదోషకాలంలో రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం మారేడు దళములతో అర్చనలతో శనిప్రదోషపూజ నిర్వహించబడుతుంది.
మీ గోత్రనామాలను durgeswara@gmail.com నకు పంపండి
0 వ్యాఖ్యలు:
Post a Comment