శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాలం బహుకఠినంగా ఉండబోతుంది.....భక్తజనరక్షకులైన హనుమంతులవారిని ఆశ్రయించి ఉండండి.

>> Sunday, January 1, 2012


కాలం బహు చిత్రమైనది .కఠినమైనది. ... అవేమోగాని నిష్పక్షపాతమైనది . మానవుడు చేసుకునే పుణ్యపాకర్మల ఫలితాలను అలా అందిస్తూ సాగిపోతూనే ఉంటుంది . ఆ ఫలితాలు వ్యక్తిగతంగానే కాక సామూహిక కర్మలకు సామూహికగా కూడా ప్రసాదిస్తూ ఉంటుంది . కాల గమనంలో ఇంగ్లీషువాళ్లు ఏర్పాటుచేసుకున్న ఓచిన్న ప్రమాణమగు ఈ 2012 సంవత్సరం లో ఫలితాలు కొంత కఠినంగానే ఉండబోతున్నాయని హెచ్చరికలందుతున్నాయి . ఈకాలవిజ్ఞానం లో అపూర్వమైన ప్రజ్ఞ గల మన మహర్షులు మానవజాతికి కొన్ని సూచనలిచ్చి ఉన్నారు . అవి భాగవత,భవిష్యపురాణాదులలో మనకు కనపడతాయి. ఇక వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారు విక్రమ నుండి నందనవరకు భూమిపై విపరీతములుపుట్టి జననష్టమే సంభవించేను అని హెచ్చరించి యున్నారు . అయితే పాశ్చాత్య మతమార్కెట్ దారులు ఊదరగొడుతున్నట్లు భూమిపై ప్రళయమేమి సంభవించదుగాని కొంతస్థాయిలో విలయాలు తప్పవు అని మనశాస్త్రవేత్తల అంచనా .భూమి , నీరు ,అగ్ని వంటి పంచభూతాల కోపం వలన, విషాహారాలు,ప్రయాణాలలో ప్రమాదాలు మానవుల విపరీతపు చేష్టలు,అధార్మికప్రవర్తన ఉత్పన్నమయ్యే పాపఫలితంగా మిక్కుటమయ్యే అవకాశాలున్నాయి . ఇక డబ్బు,అధికారం , వితర్క వాదాలు ,మెట్ట వేదాంతుల సంగతి వదలితే భక్తులైనవారికోసం భగవంతుని ఆశ్రయించి ఈకలికాలంలో కూడా భగవంతునిపై ఆయనకరుణపై నమ్మకం సడలని వారికోసం భగవత్ శక్తి రక్షణవలయాన్ని ఏర్పాటుచేస్తుంది. అందులో ఉండేఅవకాశం వినయవంతులకు ,వివేకవంతులకు మాత్రమే. ఈప్రమాదాలనుండి రక్షణ కోసం భక్తజన రక్షకుడు ,అతులిత బలశాలి, మహాబలి హనుమంతుని ఉపాసన శ్రేష్టమని పెద్దలసూచన . భక్తులను కాపాడటం ,భగవంతునికి దగ్గరగాచేర్చటం వారి కర్తవ్యం కనుక హనుమంతులవారు ఈకలియుగంలో భక్తజనరక్షాదీక్షతో ఆశ్రితులను రక్షిస్తున్నారు. మనం కూడా స్వామి రక్షణవలయంలోకి చేరుదాం .ఆయనను ఆశ్రయిద్దాం.
భక్తజనశ్రేయస్సుకై జరుగుతున్న హనుమత్ రక్షాయాగం లో మీరూ పాల్గొనవలసినదిగా కోరుతున్నాము.

వివరాలకై చూడండి
http://durgeswara.blogspot.com/2011/12/blog-post_29.html
జైశ్రీరాం .

1 వ్యాఖ్యలు:

Disp Name January 1, 2012 at 12:08 PM  

మరీ హడల గొట్టి, బెదర గొట్టేస్తున్నారండీ మాష్టారు !

లోకం లో మనం అనగా సో కాల్డ్ మనుషులం ఒక 'నీవార శూకవత్తన్వీ పీతా ' - అంతే ! ఏది కావాలని వుంటుందో అది అవుతుంది. ఆ పాటి దానికి వెరవ నేల!
సర్వం కృష్ణార్పణం !


నూతన వత్సర శుభాకాంక్షలు !

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP