శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సమయం లేదు మనకు !??

>> Thursday, October 20, 2011

మనకు మిగతావిషయాలలేమో గాని భగవత్ చింతనావిషయాలలోనూ .జప,ధ్యాన,పూజా విషయాలలో సమయం చాలటంలెదు అనేమాట మననోటినుంచి ఎక్కువగా వస్తుంది. ఏమండీ ,రోజూ కాస్త భగవదారాధన చేసుకోవచ్చు కదా ! అని పెద్దలు లేక మనకు హితులెవరన్నా సలహా ఇచ్చారనుకోండి ,వెంటనే మనం " అవునండి! నాకు కూడా కోరికగానేఉందండి .కానీ సమయం లేదండి ! పొద్దున్నుండి ఇంట్లోపనులతోనే సరిపోతుంది .పరిగెత్తే జీవితాలు .ప్రశాంతంగా కూర్చునే తీరికేది? అని చెబుతాం . ఇక కొందరుంటారు .అయ్యా ! రామాయణంలో ఇలాఉందట ? నిజమేనా ? ఇలాఉందా ? ఇలాసవాలక్ష తలతిక్కప్రశ్నలు ఎక్కడెక్కడో డస్ట్ బిన్ లనుంచి పోగుచేసుకొచ్చి అడుగుతుంటారు . ఇన్ని అనుమానాలున్నప్పుడు నువ్వు ఆగ్రంథాన్ని చదివి తెలుసుకోవచ్చు కదా ? అని అడిగామనుకోండి ...సమయంఎక్కడండీ ! చదువుదామని ఉన్నా కుదరటం లేదు . అంటారు . కానీ పేపరు తీసుకుని మొదటనుంచి చివరిదాకా వదలకుండా చదువుతారు. ప్రపంచంలో పనికిరాని విషయాలన్నీ మనమెదడుకెక్కించుకునేలా అడ్డమైన సీరియలన్నీ,సినిమాలన్నీ చూడగలరు. కానీ మనకు ఇరవైనాలుగు గంటలలో ఓ అరగంట సేపు భగవంతునిగూర్చి తెలుసుకొనటానికి వెచ్చించలేమా ? మన ధర్మగ్రంథాలు చదవటానికి,మనపిల్లలకు పదినిమిషాలు వాటిగూర్చి వివరించటానికి ప్రయత్నించలేమా ?
విషయం అదికాదు . మనకు ధర్మమంటే అంత ప్రాధాన్యవిషయంగా కనపడటం లేదు . అందువలన ఆథ్యాత్మిక విషయమంటే జీవితం మలిదశలో ఆలోచించవలసిన విషయంగా అప్రాధాన్యతావరుసలోకి వెల్లిపోతున్నది.
మానవజీవితం అల్లకల్లోలం కాకుండా పరిపూర్ణప్రశాంతతతో సాగటానికి మనకు పెద్దలు ఒక వరుసక్రమాన్ని నిర్దేశించారు
ధర్మ,అర్థ,కామ,మోక్షాలను వరుసగా సాధించాలి అన్నారు. అంటే ముందు ధర్మ గూర్చి తెలుసుకుని ,ధర్మబద్ధంగా అర్ధసంచయనం చేసి ,ధర్మబద్దమైన రీతిలో కామ్యాలను అనుభవించి తదుపరి మోక్షమార్గాన నడవాలని సూచించారు.
అయితే కలి మాయవలన నేడు అర్ధం కోసమే చదవుసాగించటమ్ డబ్బుసంపాదించటమే పరమలక్ష్యమయిపోయి ఆడబ్బు తో కళ్ళు కానక కామమార్గాన చరించి ధర్మ మోక్షాలనేవి ఎప్పుడో అంతిమదశలో చూసుకోవలసిన అంశాలుగా మారాయి. దానిఫలితమే నేటిసమాజంలో అందోళన .అశాంతి .
కనుక మనబిడ్డలను పెద్దలు చెప్పిన వరుసక్రమంలో సాగేలా ప్రోత్సహించవలసి ఉంది. లేకుంటే వృధ్ధాప్యంలో నీకు కూడు పెడతారన్న నమ్మకం లేదు . ఎందుకంటే వానికి ధర్మప్రాధాన్యత తెలియకుండా చేశాంగా మరి ?
అయితే అవినేర్పాలంటే మనం ఆచరించాలి .అందుకు భగవదారాధనామార్గమే శ్రేయస్కరమైన మార్గము. అందుకోసం మనం కొంతసమయం వెచ్చించాలి . అందుకు మనకు సమయం చాలదు అనుకుంటే భవిష్యత్ లో శాంతి ఏమాత్రమూ ఉండదు .

3 వ్యాఖ్యలు:

Anonymous October 20, 2011 at 9:17 AM  

నిజమేనండి. మన నిద్రలో ఒక్క పావుగంట తగ్గించుకుని దైవారాధన చేస్తే రోజల్లా ప్రశాంతం గా వుంటుంది. మన పిల్లలకు రోజూ కనీసం సాయంత్రం పూటైనా ఒక్క ఐదునిమిషాలు దేవుడిని స్మరించుకోవడం నేర్పాలి.

Tejaswi October 20, 2011 at 11:04 PM  

బాగా రాశారండి. పిల్లలకు రాత్రి నిద్రపోయేముందు, ఉదయం లేవగానే చదవడానికి ఏదైనా ఒక మంచి శ్లోకం ఉంటే చెబుతారా. మీ పోస్ట్ అంతా చదివి కూడా వెతుక్కోకుండా మళ్ళీ అడిగానని అనుకోవద్దు.

durgeswara October 21, 2011 at 8:51 AM  

శ్రీరాముని దయచేతను...అంటూ సుమతీశతకాన్ని
భాగవత కథలను చెప్పండి
అలాగే రామకృష్ణపరమహంస లవారి కథలను బోధించండి రోజూ ఒకపదినిమిషాలు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP