శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆర్తజన రక్షకునిగా, మహిమాన్వితునిగా రాధికాప్రసాద్ మహారాజ్ [రసయోగి _ 11 ]

>> Friday, September 3, 2010

రాధామహాలక్ష్మి గారు నిత్య రాసలో ఐక్యమైన తర్వాత మందిర నిర్వహణ బాధ్యతలు, ఆర్తజన పరిరక్షణా భారం, రాధాకృష్ణ తత్వ ప్రచారోద్యమాన్ని ముందుకు నడిపించవలసిన గురుతర బాధ్యతలన్నీ రాధికాప్రసాద్ గారి భుజస్కందాలపై పడ్డాయి. రాధికాప్రసాద్ గారు అవన్నీ బాధ్యతలని, తాను వాటిని ఏదో నిర్వర్తించాలని ఏనాడూ భావించక ఇవన్నీ రాధారాణి సేవలో భాగాలే అనే ఆలోచన కల్గినవారై ఎంతో చిత్తశుద్ధితో, భక్తితో సమర్ధవంతంగా రాధాకృష్ణ తత్వాన్ని వాడవాడలా ప్రచారం చేస్తూ రాధాకృష్ణ మందిర "ఖ్యాతిని " నలువైపులా వ్యాపింపచేశారు. ఈ సమయంలో రాధికాప్రసాద్ గారు కొన్ని వందల వేల అద్భుతాలు చూపించారు. ఆర్తజనులను ఆదుకున్నారు.

1954 లో రాధికాప్రసాద్ మహారాజ్ గారికి అనంతపూర్ నుండి కర్నూలుకు జిల్లాఅధికారిగా బదిలీ అయింది. ఒక రోజు ఉదయం ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చి _" అయ్యా ! నా భార్య రోజుకు రెండు, మూడు గుండిగలు అన్నము తింటున్నది. దయ్యము పట్టినట్లు తింటున్నది. దాని వలన నాకు దరిద్రము పట్టుకొనినది. మిమ్ముల గురించి విశేషముగా వింటిని. నన్ను ఉద్దరింపుడు" అని ప్రార్ధించెను. శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ బ్రాహ్మణునికి ధైర్యము చెప్పి పంపిరి. మరునాడు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ వద్దకు వచ్చెను. ఆ బ్రాహ్మణును భార్య తెలుగుయే కాక సంస్కృతము కూడా ధారాళముగా మాట్లాడుచుండెను. ధ్యానమున చూడగా ఒక మహాపండితుడు పిశాచి రూపము ధరించి ఆ వనితను పట్టెను. ఆ మహా పండితుడు మరెవరోకాదు. ఆ బ్రాహ్మణుని జ్యేష్ఠ సోదరుడే. అదే విషయమును రాధికప్రసాద్ మహారాజ్ గారు బ్రాహ్మ్ణునితో చెప్పిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు _ " అదేమి స్వామీ ! మా అన్నగారు గొప్ప నిష్ఠాపరుడు, మహాపండితుడు. ఆయన చనిపోయిన తర్వాత కర్మను నేను చేశాను. వాని అస్థికలను కాశీలోని గంగలో కలిపాను. వాని శాంతికై గోదానము చేశాను. బ్రాహ్మణ సమారాధన కూడా జరిగింది. మా అన్నగారు గొప్ప వేదపండితులు. మరి వారికి ఈ పిశాచత్వమేమి ? అని ప్రశ్నించెను. అప్పుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ పిశాచమును ప్రశ్నించగా అది _ "మా వాడు కర్మ చేసినది నిజమే. కానీ వాటి వలన నా కర్మ తొలగలేదు. నాకు పిశాచత్వమే కలిగినది.నా పాప జీవితము నుండి దయ చేసి ఉద్ధరించండి" అని పల్కెను.

"మనము చేసిన పాపములు సులభముగా అంతరించవు. "కర్మణాం భోగతో నశ్యేత్" అను శాస్త్రవాక్యమును బట్టి కర్మను అనుభవించిన గాని కర్మ వాసన అతొలగదు. ఆ కర్మ వాసన నుండి జీవుడు విముక్తి చెందవలెనన్న " ప్రత్యక్ష భగవద్దర్శనము కావలయునని వేదమే పల్కుచున్నది. నీ పాండిత్యమునకు సంతసించి కర్మ తొలగదు, కొన్ని నదుల స్నానము చేత కర్మ తొలగదు, కొన్ని దాన ధర్మముల చేత కూడా కర్మ త్లగదు. తీవ్ర తపోనిష్ఠ వలన, మహాదేవతా భక్తి వలన కొంతవరకు కర్మ తొలగిపోవునని మనము ఎరుంగవలయును. తీవ్ర తపస్సు వల్ల మార్కండేయునకు చిరంజీవత్వము కలిగినది కదా ! తీవ్ర యోగసాధన చేత "సావిత్రి" కర్మ తొలిగినది. కర్మ ఫలము వేరు, కర్మ వాసన వేరు. కర్మ ఫలము అనుభవించిననూ కర్మ వాసన ఉండును. ప్రత్యక్ష భగవద్దర్శనము చేతనే కర్మ వాసన తొలగును" అని రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ బ్రాహ్మణునుతో పల్కి ఆయన భార్యకు పట్టిన పిశాచమును పారదోలెను. ఆ బ్రాహ్మణ దంపతులు శాంత చిత్తులై రాధికాప్రసాద్ మహారాజ్ గారి చరణములకు నమస్కరించి ఆనందముతో గృహోన్ముఖులైరి.

1955 _ 56 ఒక రోజున శ్రీ రాధికాప్రసాద్ గారి వద్దకు ఆయనకు చిరకాల పరిచితులైన ఎల్.బాబూరెడ్డి అనే వ్యక్తి వచ్చెను. అతను శ్రీరాధికాప్రసాద్ గారితో "నాన్నగారూ ! నాకు ఇటీవల గుండెపోటు వస్తున్నది. ఏ రోజునైనా నాకు మరణం సంభవించవచ్చును. నా ఇష్టదేవత హనుమంతుడు. ఆయన దర్శనం కాకుండానే చనిపోదుననే భయం నాకు కల్గుచున్నది. నా అంతిమ కోర్కె హనుమాన్ జీని దర్శించటమే. మీరు మహనీయులు కనుక మీ సహాయముతో నేను చనిపోకముందే ఒక్కసారైనా నా ఇష్టదేవత హనుమాన్ జీ దర్శనం మీ సహాయంతో పొందవలెనని గంపెడాశతో వచ్చాను" _అని విలపించసాగెను. అంతట రాధికాప్రసాద్ గారు _ " నాయనా !అమ్మ కృప వల్ల నీకు దర్శనం కాగలదు." అని పల్కిరి. ఆ తర్వాత రాధికాప్రసాద్ గారి ఇష్టదేవతయైన శ్రీ రాధామహాలక్ష్మి దేవి సహాయం వల్ల హిమాలయ పర్వతములలో తేజోరూపమున తపమాచరించుచున్న శ్రీ రాధికాప్రసాద్ గారు హనుమంతునితో భక్తుని కోర్కె నెరవేర్చమని ప్రార్థించిరి. అంతట హనుమాన్ జీ రాధికాప్రసాద్ గారి ఇష్ట దేవతతో _ " అమ్మా ! నేను తప్పక వస్తాను. కానీ ఒకటి రెండు నిమిషములకంటే ఎక్కువ ఉండుటకు వీలుండదు. ఆ సమయంలో నా ప్రస్తుత రూపమైన తేజో రూపములో నా భక్తునకు దర్శనమిస్తాను" అని చెప్పెను. ఆ దేవత రాధికాప్రసాద్ గారికి ఈ విషయము ఎరుక పరిచెను. హనుమాన్ జీ సూచించిన సమయం మధ్యాహ్నం 12 గం లు. ఒక గదిలో హనుమాన్ జీ పటము, దానికి ఎదురుగా బాబురెడ్డిని కూర్చుండ బెట్టిరి. సరిగా 12 గం లకు ఒక విద్యుత్ కాంతి వలె ఒక దివ్య కాంతి ఉద్భవించింది. ఉత్తరక్షణంలో బాబూరెడ్డి బిగ్గరగా "హే హనుమాన్" అంటూ మూర్చనొందెను. ఆ రోజు రాత్రి 10 గం లకు ఆయనకు మెలుకువ వచ్చెను. మెలుకువ వచ్చిన తర్వాత ఆనంద పారవశ్య స్థితిలో రాధికాప్రసాద్ మహారాజ్ పాదములపై పడి హనుమాన్ జీ దర్శనము కలిగినదని పల్కెను. హనుమాన్ జీ ఆ భక్తునకు రాధికాప్రసాద్ గారి కోర్కె మీర దర్శనమిచ్చి వెంటనే అంతర్ధానమయ్యెను.

ఒక రోజు ఒక ధనికుడు రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి _ " స్వామీ ! మా వంశంలో ఆరుతరాలుగా మొదట జన్మించిన మగపిల్లవాడు మరణిస్తున్నాడు. నా కుమారుడు కూడా మరణించెను. నా స్నేహితుని ద్వారా మీరు మహాత్ములని, గొప్ప మహిమ గలవారని విని యుంటిని. మా వంశంలో మొదటి బిడ్డకు ఈ అరిష్టం వాటిల్లడానికి కారణం ఏమిటో మిమ్ములను కల్సి తెలుసుకోవాలని, రక్షణ కోరి వచ్చాను. దయ ఉంచి కారణ తెల్పి దాని నివారణోపాయాన్ని కూడా మీరే చెప్పండి" అని ప్రార్థింఛెను. రాధికాప్రసాద్ గారి ధ్యాన నిమగ్నులై విషయమును గ్రహించిరి. అది " ప్రతీకార వాంఛ గోరే ఒఅక్ ఆత్మ చేయు ఆగడమని తెలుసుకొనిరి. దానికి కారణం ఆరు తరాల ముందు ఆ కుటుంబం వారు తమ ఇంట ఆతిధ్యమునకు వచ్చిన ఒక రెవిన్యూ అధికారిని హత్య చేసి అతని వద్ద ఉన్న 200 వరహాల ధనమును అపహరించిరి. హత్య చేయబడిన వ్యక్తి శరీరమును వాళ్ళు వారి వంట ఇంటి యందు పూడ్చిపెటిరి. ఆ రెవిన్యూ అధికారి అలా బలవన్మరణంతో శరీరాన్ని పోగొట్టుకొని ప్రేతాత్మయై ప్రతీకార వాంఛ కల్గి ప్రతి తరంలోనూ ఆ వంశ నిర్మూలనార్ధమై మొదట జన్మించిన మగపిల్లవానిని మట్టు పెట్టుచుండెను" . అంతట రాధికాప్రసాద్ గారు _ " ఎన్నడో వందల సంవత్సరముల క్రితం జరిగిన దానికి అమాయకులైన అనంతర తరాల వారిని హింసించటం న్యాయం కాదని " ఆ ఆత్మకు నచ్చచెప్పిరి. అంత ఆ ఆత్మ శాంతించి _ " ఆ రోజు ఈ కుటుంబ పూర్వీకులు తమ ఇంట్లో పూడ్చి పెట్టిన తన శరీరం తాలూకు కపాలం, రెండు ఎముకలు జీర్ణం కాకుండా యున్నాయని, వాటిని ఆ కుటుంబ యజమాని శాస్త్రీయంగా కాశీలోని గంగలో నిమజ్జనం చేయాలని, సంతర్పణ గావించాలని, అలా చేస్తే తను వారిని వదిలి వేస్తానని" పల్కింది. ఆ విషయాన్నే రాధికాప్రసాద్ గారు ధనికునికి చెప్పగా ధనికుడు ఇంటికి వెళ్ళి ఆ ప్రాంగణమును త్రవ్వించగా అక్కడ ఒక కపాలము, ఎముకలు దొరికెను. ఆ ఆత్మ కోరినట్లే చేయగా అది వదిలి వెళ్ళి పోయెను. ఆ విధంగా రాధికాప్రసాద్ గారు ఆ కుటుంబానికి కలిగే తీరని కష్ట_నష్టముల నుండి వారిని కాపాడెను.

ఒకసారి రాధికాప్రసాద్ గారు హిందూపురం అనే ఊళ్ళో ఒక అతిధి గృహమున విడిది చేసెను. అక్కడ ఒక వ్యక్తిని ఒక క్షుద్రశక్తి ఆవహించెను. దాని ప్రభావమునకు లోనైన ఆ వ్యక్తి కోళ్ళను, మేకలను సైతం అమాంతంగా పట్టుకొని కొరికి చంపుతూ రక్తం త్రాగసాగెను. ఆ భీకర దృశ్యాన్ని చూసి ప్రజలు భయభీతులైనారు. ఆ గ్రామంలో ఒక మునసబు ఉండెను. అతను పరమనాస్తికుడు. అతడు ప్రజల ద్వారా విషయం తెలుసుకొని _ " భూతం లేదు, ప్రేతం లేదు. అంతా బూటకం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే డొక్క చించుతానని పల్కెను. ఆ క్షుద్రశక్తి ఆవహించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతనితో ఇవే మాటలు పల్కెను. అంత క్షుద్రశక్తి విరగబడి నవ్వుతూ _ " ఏమిటీ ! నీవా నా అంతు చూసేది. ఈ రోజు మీ ఇంటి పైకై వస్తున్నాను, నీవు ఏం చేయగలవో చూస్తానని పల్కింది. చెప్పిన విధంగానే ఆ క్షుద్రశక్తి మునసబు ఇంటి పై దాడి చేసెను. ఇంట్లో బీరువాకు, పెట్టెలకు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. బీరువాలో, పెట్టెల్లో ఉన్న దుస్తులు, ధనం, దస్కం అంతా తగలబడసాగింది. మునసబు పరిస్థితిని చూసెను. అతనికి నోట మాట రాకున్నది. ఆ క్షుద్రశక్తి అతని పీక పట్టుకుంది. అతను భయభీతుడైనాడు. విడిచి పెట్టమని ప్రాధేయపడ్డాడు. ఆ క్షుద్రశక్తి తన ఎడమకాలు ముందరకు జాపి దానికి నమస్కారం చేయమని గద్దించింది. మునసబు భయంతో వణుకుతూ నమస్కారం చేసెను. అంతట ఆ శక్తి " రోజూ నీ దగ్గరకు వస్తానని " పల్కి వెను దిరిగింది. మునసబు భార్య ఇదంతా చూసి భయ కంపితురాలై, ఎవరో చెప్పగా విని రాధికాప్రసాద్ గారిని కలిసి విషయము విశదీకరించింది. అంతట రాధికాప్రసాద్ గారు ఆ దుష్ట శక్తి ఆవహించిన వ్యక్తిని బంధించి తన వద్దకు తీసుకురమ్మని ఆమెతో పల్కెను. అంతట ఒక పది మంది బలిష్టులు ఆ దుష్టశక్తి ఆవహించిన వ్యక్తిని బంధించి రాధికాప్రసాద్ గారు ఉండు ప్రదేశమునకు తెచ్చిరి. కానీ ఆ సమయమున రాధికాప్రసాద్ గారు ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉండిరి. అంత ఆ దుష్ట శక్తి _ " మీ నాన్నగారు లేరురా ! మీ అంతు చూస్తానురా" అని రంకెలు వేయసాగెను. ఇంతలో రాధికాప్రసాద్ గారు అక్కడకు చేరి _ " ఆ దుష్టశక్తి ఆవహించిన వ్యక్తిని బంధవిముక్తుని కావించండని" పల్కిరి. కానీ ఎవరికీ ధైర్యం చాలలేదు. అంతట రాధికాప్రసాద్ గారు తానే ఆ వ్యక్తిని బంధవిముక్తిని చేసి నేలపై కూర్చోమని ఆజ్ఞాపించెను. క్షుద్రశక్తి ఆవహించిన వ్యక్తి కూర్చుండెను. రాధికాప్రసాద్ గారు కొలది సేపు ధ్యానం చేసి ఆ వ్యక్తిని క్షుద్రశక్తి పీడనుండి విముక్తి గావించెను. స్వస్థత చేకూరిన ఆ వ్యక్తి రాధికాప్రసాద్ గారి పాదాలపై పడి నమస్కారం చేసి ఆనందంతో వెనుదిరిగెను.

ఆనం వెంకటరెడ్డి గారు ప్రఖ్యాతి గాంచిన మంత్రివర్యులు వారికి అభ్రకంగని ఒకటి ఉండేది. ఒకసారి ఒక విచిత్ర పరిస్థితి వారికి ఏర్పడింది. అభ్రకం గనిలో పనిచేసే కూలి వాళ్ళు గనిలోకి వెళ్ళి, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లుగానే అంతర్ధానమవ్వసాగిరి. గని మూసే పరిస్థితి వారికి ఏర్పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యకు పరిష్కారము లభించలేదు. అటి సమయంలో ముంగమూరి శేషారెడ్డి గారు ఆనం వెంకటరెడ్డి గారిని కలిసి " గుంటూరులో ఒక మహాత్ముడు ఉన్నారు. ఆయన గొప్ప ధ్యానశక్తి గలవారు. వారిని ఆశ్రయించు. వారు నీ సమస్యను పరిష్కరించి నీకు మనశ్శాంతిని కలుగచేయగలరు"అని సలహా ఇచ్చారు. అయితే " నీవు నిరాడ్మ్బరముగా ఆయనను ఆశ్రయించు. కోటీశ్వరుని వలె ఆడంబరముగా వారి ముందర నిలువకు. ఆయన నిరాడంబరంగా రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ ( వీర భద్రరావు ) గారి వద్దకు వచ్చి తన సమస్యను విన్నవించుకొని, ఈ ఆపద్ద నుండి గట్టెక్కించమని ప్రార్ధిస్తూ " స్వామీ ! ఇప్పుడు గని అంతా నీటితో నిండి పోయి ఉన్నది. తిరిగి అది పనిచేయునట్లు మీరు ఆశీర్వదించవలెను. అందుకే నేను ఇక్కడకు వచ్చాను. ఈ కార్యంబు ఒక మహాయజ్ఞము వంటిది. మీరు కాక ఈ యాగమును కొనసాగించుగారు మరొకరు లేరని విన్నాను. నన్ను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించి, మీరు ముంగమూరి శేషారెడ్డిని చూచినట్లే నన్ను కూడా చూడవలయునని ప్రర్ధన. వారి ప్రార్ధనను మన్నించారు శ్రీ వీరభద్రరావు గారు. 3_4 రోజులలో పని పూర్తి అయినది. ఆయన సంతోషముతో " ఇట్టి ఘనకార్యమును సాధించిన మీకు జైపూర్ నుండి పాలరాతి రాధాకృష్ణ విగ్రహాలు తెప్పించి సమర్పింపవలెనను కోరిక యున్నది" అని పల్కెను. ఈ విగ్రహ ప్రతిష్ట గుంటూరులో ఆయన సమక్షంలోనే జరిగినది. ఆ విగ్రహమూర్తులు గుంటూరు రాధాకృష్ణమందిరమూర్తులై గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమునకు ఆలవాలమైనాయి. విగ్రహ ప్రతిష్ట తర్వాత ఆయన రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ ( వీరభద్రరావు ) వద్ద నుండి శ్రీ రాధా మంత్ర దీక్షను కూడ తీసుకొనెను. ఈ విధంగా రాధారాణి రసయోగి ద్వారా ఎన్నో అలౌకిక లీలలను ప్రదర్శించి అనేకమందిని రాధాకృష్ణ భక్తి పథమున ముందుకు నడుపసాగెను.

రాధికాప్రసాద్ గారి అనుగ్రహానికి పాత్రులైన వారు కేవలం మానవమాత్రులే కాదు. వారిలో కొంతమంది దేవత్లు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన సంఘటనలు రెండు ఉదహరించటం సబబే అని తలుస్తాను.

కలకత్తా సమీపంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం లోని "శ్యామ్ కాళి"అనే దేవత గ్రామమున సంచరించెడిది. ఒక మాంత్రిక శిఖామణి ఆ ఊరికి వచ్చెను. అతను ఆ దేవతను గుర్తించి ఈ విధంగా దేవత ఊరి మీద పడి సంచారము చేయుట అనర్ధమని ఎంచి ఆ దేవతను తన ప్రయోగము చేత ఆలయమున దిగ్భంధన గావించి తను ప్రయోగము చేసిన "పాదు" ను ఎవరికీ తెలియని ప్రదేశమున ఒక చోట భద్రముగా దాచెను. ఆ దేవతకి విమిక్తి కలుగవలెనన్న ఆ "పాదు" ను తీసి మంత్రబద్ధముగా ఆ ప్రయోగమును ఉపసంహరించవలయును, ఇది సామాన్యుల వల్ల సాధ్యపడే పని కాదు. కొంతకాలమునకు ఆ మాంత్రికుడు పరలోక గతుడయ్యెను. ఆ దేవత గుడిలో దిగ్భంధన గావింపబడి స్వేచ్ఛ కొరకై అలమటించసాగెను.

రాధికాప్రసాద్ గారు ఒక పర్యాయము ఆ దేవాలయమును సందర్శించిరి. ఆ దేవత వారికి కన్పడి తనకు విముక్తిని ప్రసాదించమని ప్రార్ధించింది. దయార్ధ హృదయులు రాధికాప్రసాద్ గారు. ధ్యానములో ఆ పాదును మాంత్రికుడు ఎక్కడ దాచెనో చూచి, మంత్రబద్ధంగా ఆ పాదును అచట నుండి తొలగించి ఆ ప్రయోగమును ఉపసంహరించెను. ఆ దేవత ఆ మహాయోగికి నమస్కరించి విఖ్యాతి నొందగలవని పల్కి రాధికాప్రసాద్ గారి ఆధీనముననే ఉండెదనని పలుకుచు అదృశ్యమయ్యెను.

ఇటువంటి సంఘటనే ఒకటి వారి జీవన స్రవంతిలో శృంగవరపు కోటలో వారు ఉద్యోగం చేస్తున్న రోజులలో జరిగెను. రాధికాప్రసాద్ గారు ఇంట్లో ఒక పాము పుట్ట ఉండెడిది. రాధికాప్రసాద్ గారు రోజు తను కాఫీ త్రాగుతూ, కొద్ది కాఫీని మిగిల్చి ఆ పుట్ట దగ్గర ఉంచేవారు. పుట్టలో నుండి పాము బయటకు వచ్చి పాలు త్రాగి తిరిగి పుట్టలోకి వెళ్ళిపోయెడిది. ఈ కార్యక్రమం ఉదయం సాయంత్రం కొనసాగుతూనే యున్నది. కానీ ఈ విషయం అన్యులకెవ్వరికీ తెలియదు. వారు కూడా ఎవరికీ ఈ సంగతి చెప్పలేదు. ఆ సమయంలో రాధికాప్రసాద్ గారు వృత్తిరీత్యా పొరుగూరికి స్కూళ్ళ తనిఖీ నిమిత్తమై వెళ్ళారు. బయటకు వచ్చి కాఫీ కొరకు అటునిటు చూచుచూ అన్వేషించ సాగెను. ఆ సమయంలో రాధికాప్రసాద్ గారి ప్రక్కింటి వారు ఆ పామును చూసి దాని వెంటబడి తరిమి తరిమి దానిని చంపిరి.

రెండు రోజుల అనంతరం రాధికాప్రసాద్ గారు తిరిగి ఇంటికి చేరినప్పుడు విషయమును తెలుసుకొని బాధపడిరి. ఆ రోజు రాత్రి రాధికాప్రసాద్ గారు నిద్రకు ఉపక్రమిస్తున్న వేళలో సగం సర్పం, సగం మానవ రూపం ధరించిన ఒక వింత ఆకృతి వారి ముందు సాక్షాత్కరించి, వారికి నమస్కరిస్తూ ఇట్లు పల్కెను _ " మీ వంటి మహాయోగుల ప్రసాదం వల్ల నా కర్మ వాసనలు తొలగినాయి. నేనొక నాగకన్యను. కర్మ వశమున ఈ లోకములో సంచరించవలసి వచ్చెను. నేటితో నా కర్మ వాసనలు తొలగినవి. నేను నాలోకానికి వెళ్తున్నాను. మీరు చేసిన మేలుకు బదులుగా నేను మీకు ఒక వరం ఇస్తున్నాను " _ "మీరున్న చోట మీకు గాని లేక మరెవ్వరికీ గాని మా సర్ప జాతి వల్ల ఎటువంటి హాని కలుగదు" అని పల్కి ఆ నాగకన్య అదృశ్యమయ్యెను.

1955_56 సం లో శ్రీకాకుళంలో "సర్వజణు" అనే మంత్రవేత్త ఉండేవాడు. అతని వద్ద కొన్ని శక్తులుండేవి. "సర్వజణు" అంటే అంతా తెలిసిన వాడు అని అర్ధం. ఆయన తన శక్తులవల్ల కొన్ని మహిమలు చూపేవాడు. ఎవరైనా ఏదైనా ప్రశ్న వ్రాసి ఒక కవర్ లో ఉంచి, దానికి సీలు వేసి ఆయనకు ఇచ్చిన, దానిని విప్పకనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు. ఒక సారి ఆయన మేనల్లుడు ధనుర్వాత సంబంధమైన "ఫిట్స్" కు గురి అయ్యెను. ఆ మేనల్లుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో అధ్యాపకునిగా పని చేయుచుండెను. రోగికి స్వస్థత చేకూర్చలేక ఒక రోజు సర్వజణు తన శిష్యులతో శ్రీ రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చెను. శ్రీ రాధికాప్రసాద్ గారు ధ్యానంలో రోగిని, వచ్చిన సర్వజణుని చూసెను. అప్పుడు సర్వజణు వశమై యున్న ఒఅక శక్తి రాధికాప్రసాద్ గారికి ధ్యానంలో కనబడి ఈయన ఉచితముగా ఎవరికీ సహాయము చేయక వారి వద్ద నుండి ధనమును గుంజుకొనుచుండెను. ఇవికాక ఆయనకు కొన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నవి. మంత్రబంధము చేత ఇతనికి కట్టుబడి ఉంటిని. ఈయన చెడు ప్రవర్తనలను చూస్తూ ఈయనకు సేవలు చేయుచూ ఈయన అన్యాయార్జితమునకు సహాయపడుతూ విధిలేక ఈయనతో ఉండవలసి వచ్చినది" అని చెప్పెను. అంతట రాధికాప్రసాద్ గారు ఆ శక్తితో _ " నీ బంధనమును తీసివేసినచో నీవు కృష్ణ భక్తురాలివే కాబటి మా వద్దకు వచ్చి రాధాకృష్ణ సేవను చేయుటకు ఏమైనా అభ్యంతరము ఉన్నదా ? అని అడుగగా నేను సంతోషముగా వచ్చెదను. తక్షణమే ఈ మంత్రబంధము నుండి నన్ను విడుదల చేసి ఉద్ధరించండి" అని ప్రార్ధింఛెను. ఆమె కోర్కె ధర్మ విరుద్ధము కాదు కనుక 4 ,5 దినములలోన ఆమెకు పాశ్ విమిక్తి కలుగజేసిరి. ఆ శక్తికి కృష్ణ మంత్రమును కూడా ప్రసాదించిరి. ఈ విషయము తెలుసుకొనిన సర్వజణు ఒక క్షుద్ర మాంత్రికుని సహాయముతో రాధికాప్రసాద్ గారి పై ఒక భూత ప్రయోగమును కావించెను. కానీ రాధారాణి కృపవల్ల రాధికాప్రసాద్ గారు ఆ ప్రయోగమును చెల్లాచెదురు చేసెను. కొలది కాలమునకు "సర్వజణూ" చనిపోయెను. ఆయనకు వశమై ఉన్న శక్తి నేడు రాధికాప్రసాద్ గారి వద్ద కృష్ణ భజన చేయుచూ ఉండెను.

ఈ విధంగా ఒక్క ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలెన్నింటిలోనో వీరి మహిమల ఫలితాన్ని పొందిన వారు ఉన్నారు. ఒరిస్సా, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు వీరి దివ్య శక్తి విలాసాలకు నిలయమైనవి. ఒరిస్సాలోని బరంపురం సిటీస్కూలు హెడ్మాస్టరు కుమారుడు తనకు మూగతనం తొలగించి వాక్కులను ప్రసాదించినందుకు ఇప్పటికీ భక్తి పూరితుడై ఉన్నాడు.

రాధికాప్రసాద్ గారు "దర్శి" లో ఉంటున్న రోజులలోని సంఘటన. రాధికాప్రసాద్ గారి బంధువులలోని ఒకరి కూతురుకు స్పోటకం వచ్చింది. పిల్లతండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫీసర్. స్పోటకం తీవ్రత వల్ల కళ్ళలో కూడా పుండ్లు లేచి ఆ అమ్మాయికి కళ్ళు పోయాయి. మెడ్రాస్ లోని నేత్రవైద్యులు డా| | శ్రీనివాసన్ మరియు కోమరన్ నాయర్ లు పరీక్షలు చేసి చూపు రాదని స్పష్టం చేశారు. ఆ దంపతులు కూతురు చూపు పోయేసరికి క్రుంగి పోయారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయి తల్లికి కలలో ఒక యోగి కన్పడి _ " దర్శిలో ఒక మహాత్ముడు ఉండెను. ఆయనను దర్శించండి. మీ అమ్మాయికి చూపు వస్తుంది" అని పల్కెను. వాళ్ళకు "దర్శి" పేరు వినగానే రాధికాప్రసాద్ గారు మనసున మెదలారు. అయితే వారికి "రాధికాప్రసాద్ గారు గొప్ప సాధకులని, మహిమాన్వితులని, కలలో యోగి చెప్పిన మహాత్ముడు రాధికాప్రసాద్ గారే యని" తెలియదు. రాధికాప్రసాద్ గారు కూడా ఎప్పుడూ, ఎవరితోనూ తాను గొప్పవాడినని చెప్పలేదు,చెప్ప్లేరు. అంతట ఆ దంపతులు కూతురిని తీసుకొని దర్శిలో రాధికాప్రసాద్ గారి గృహము నందు దిగిరి. వారు రాధికాప్రసాద్ గారికి వచ్చిన విషయము చెప్పి _ " ఇక్కడ ఎవరో యోగి వున్నారట. మీకు వారెవరో తెలిస్తే చెప్పండి" అని అడిగిరి. దానికి రాధికాప్రసాద్ గారు నవ్వుతూ వ_" ఓ నాకు తెలుసు. మన ఇంటికి ఎదురుగానే ఉంటారు. అయితే అతను పోస్టాఫీసులో ప్యూనుగా పని చేస్తుంటాడు. మీరు వెళ్ళండి. అతనిని కలవండి. అయితాఏ ఒక మాట ! అతనిని మీరు యోగి కదా! "అని అడిగితే కాదని అంటాడు సుమా ! మీరు గట్టిగా అతనిని అడగాలి" అని వారిని ఎదురింటికి పంపించారు.

ఎదురింటిలో ఒక "పోస్ట్ మ్యాన్" ఉన్నాడు. అతనికి గంపెడు సంతానం. ఇంట్లో నిత్య దరిద్రం. అతని పేరు "యోగానందం". రాధికాప్రసాద్ గారు చెప్పిన విధంగానే అమ్మాయి తల్లిదండ్రులు అతనిని కలిసి _ " మీరు యోగులని, సర్వజ్ఞులని విన్నాం. దయచేసి మాపై దయ చూపెట్టండి. కరుణించండి. మా కూతురుకు చూపు ప్రసాదించండి" అని ప్రాధేయపడ్డారు. పోస్ట్ మ్యాన్ కి మతిపోయినట్లయింది. "అయ్యా ! మీరు పొరబాటు పడుతున్నారు. నేను పేరుకు యోగానందం కాని నిజానికి కాదు. నేనేమిటి యోగినేమిటి ? మహిమలేమిటి ? సంసార సాగరంలో పడి గిలగిల కొట్టుకుంటూ ఎట్లా బయటపడాలా అని దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ గొడవేమిటి మధ్యలో, అసలు నేను యోగినని మీకు ఎవరు చెప్పారు?" అని విసుగుకొనెను. దానికి వారు రాధికాప్రసాద్ గారి పేరు చెప్పిరి. దానికి అతను బిగ్గరగా నవ్వుతూ _ "మిమ్మల్ని చూస్తుంటే చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెదుకుతున్నట్లు" ఉంది. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడకు పంపారో వారే నిజానికి సిద్ధయోగులు, మహాత్ములు, వెళ్ళి వారిని శరణు వేడండి" అని పల్కెను. అంతట ఆ తల్లిదండ్రులు తిరిగి రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి _ " ఊరంతా మిమ్మల్ని మహాత్ములని, సిద్ధపురుషులని, కారణజన్ములని కొనియాడుతుంటే, మీ వారమై ఉండియూ అది గ్రహింపక ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్ధమయింది" అని రాధికాప్రసాద్ గారి చరణములపై పడిరి. దానికి రాధికాప్రసాద్ గారు నవ్వుతూ _ " మీరు "యోగి"ని అడిగారు, నేను యోగి దగ్గరికే పంపించాను" అని పల్కిరి. దానికి ఆ దంపతులు "నాన్నగారూ ! ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా? " అని బాధపడిరి. దానికి రాధికాప్రసాద్ గారు వారికి ధైర్యం చెబుతూ _ " నేను వైద్యుడిని కాదు తల్లీ అయితే ఒక పని చేస్తాను. మీ బాధను నా తల్లికి (రాధకు) చెబుతాను. తరువాత అమ్మ సంకల్పం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది" అని పల్కి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోయిరి. తరువాత కొద్ది సేపటికి కళ్ళు తెరిచి వెన్నపూసను ఒక గిన్నెలో తెప్పించి దానికి తన చేతితో తాకి ఆ దంపతులకు ఇచ్చి పాప కంటికి వ్రాయమని పల్కిరి. ఇలా కొన్ని రోజులపాటు జరిగింది. పాపకు కంటి చూపు వచ్చింది. ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేవు. వారు ఆనందంతో రాధికాప్రసాద్ గారి పాదాలపై పడి మీకు ఏమివ్వగలము ? మీ రుణం ఎలా తీర్చుకోగలం" అని పల్కారు. అంతట రాధికాప్రసాద్ గరు _ " నాకు ఏమీ అవసరం లేదు. మీరు రోజూ ఇంట్లో రాధారాణిని సేవించండి. అదే మీరు నాకిచ్చే గొప్ప బహుమతి" అని పల్కిరి. ఆ అమ్మాయి రాధికాప్రసాద్ గారి పాదాలపై వ్రాలి నమస్కరిస్తూ _ " ఈ జన్మలో తిరిగి చూపు వస్తుందనుకోలేదు. ఇది కేవలం మీరు పెట్టిన భిక్షయే" అని కన్నీటీతో రాధికాప్రసాద్ గారి కాళ్ళు కడిగింది. రాధికాప్రసాద్ గారు ఆ పాపను తన దగ్గర్కు తీసుకొని _ " అమ్మా ! నీకు చూపు ఇచ్చినది "నా చిన్నారి". నీ దృష్టిని సదా చిన్నారి మీదే నిలుపు. ఆ తల్లి ఇచ్చిన వరాన్ని దుర్వినియోగ పరచకు. ఆ తల్లికి సేవ చేయి. నా చిన్నారికి పూలంటే చాలా యిష్టం. రోజూ రకరకాల పూలమాలలు ధరిస్తుంది. కనుక నీవు పూలమాలలు చేసి నా చిన్నారిని సర్వాంగ సుందరంగా అలంకరించాలి. అది నీవు నా చిన్నారికి చేసే సేవ" అని పల్కిరి. ఆ దంపతులు రాధికాప్రసాద్ గారికి నమస్కరించి తన కూతురుతో తన గృహమునకు చేరి అత్యంత భక్తి శ్రద్ధలతో రాధారాణిని సేవించుచుండిరి.

రాధికాప్రసాద్ గారు రాధాతత్వాన్ని వాడవాడలా ప్రచారం చేయుచుంద్డిర్. ఒక రోజు కాకినాడలో గోపాలుని ఆలయంలో ఏకాహం జరుగుతుంది. అక్కడ రాధికాప్రసాద్ గారి ఉపన్యాసం జరుగుతున్నది. రాధికాప్రసాద్ గారి ఉపన్యాసం ఎక్కడ జరిగినా ఒక గాజుల వ్యాపారి తప్పక హాజరయ్యేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపన్యాసం వినేవాడు. అతని పేరు "శీలం జగన్నాధం". ఒక రోజు ప్రమాదవశాత్తు అతనికి కంటి చూపు పోయింది. విషయం తెలిసిన రాధికాప్రసాద్ గారు అతనిని దగ్గరకు పిలిచి తన చేతులతో కళ్ళను తాకిరి, ఒక్కసారిగా కంటికి ఉన్న అడ్డు ఏదో తొలగినట్లయెను. తిరిగి అతనికి కంటి చూపు వచ్చెను. అతను ఆనందంతో రాధికాప్రసాద్ గారి చరణములను స్పర్శించెను.

గుంటూరులో ఒక జడ్జి ఉండెడివాడు. అతని కుమారునికి ఒకసారి పెద్ద జబ్బు చేసింది. డాక్టర్లు "మేము చేయవలసినదంతా చేశాము. ఇకపై భగవంతుడే కాపాడాలి" అని చేతులు దులుపుకున్నారు. ఆ కుమారుని తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. వారు పిల్లవాని మంచం ప్రక్కనే నిద్రాహారాలు మాని దుఖి:చసాగారు. ఆ దంపతులు లోగడ తమ కుమారునితో కలసి రాధికాప్రసాద్ గారి దర్శనము చేసుకొనియున్నారు. అప్పుడు రాధికాప్రసాద్ గారు "రాధారాణి" చిత్రపటమును ఆ దంపతులకు ఇచ్చి యుండిరి. ఆ పటము ఒక గోడకు అలంకరించియుండెను. పిల్లవాడు అనారోగ్యముతో బాధపడుచూ కనులు పైకెత్తి గోడమీద వ్రేలాడుతున్న "రాధారాణి" పటమును తిలకించెను. అతనికి _" గుంటూరు.అందులో రాధాకృష్ణమందిరం, అక్కడ రాధికాప్రసాద్ గారు" వరుసగా ఈ చిత్రములన్నీ అతని స్మృతిపధము పై ఒకదాని వెంట ఒకటి కదలాడసాగెను. ఆ ఆలోచనలోనే అతను నిద్రలోకి జారెను. నిదురలో స్వప్నము కదలాడెను._ "అతను విశాఖపట్టణము నుండి గుంటూరుకు రైలులో ప్రయాణము చేసి గుంటూరు స్టేషన్ లో దిగి, అక్కడ నుండి రాధాకృష్ణ మందిరమునకు చేరెను. మందిరములో రాధికాప్రసాద్ గారు తన ఆసనముపై ఆశీనులై యుండిరి. పిల్లవాడు రాధికాప్రసాద్ గారిని సమీపించి వారి పాదములకు నమస్కారము చేసెను. రాధికాప్రసాద్ గారు ఆ పిల్లవానిని _ " ఎప్పుడు వచ్చావు నాయనా ? అందరూ కుశలమే కదా ?" అని ప్రశ్నించిరి. అంత ఆ పిల్లవాడు _ " నాన్నగారూ ! నాకు రోజూ జ్వరం వస్తున్నది. మందులు వాడిననూ తగ్గుటలేదు. అమ్మా నాన్నా రోజూ నన్ను చూసి బాధపడుచున్నారు" అని చెప్పెను. అంత రాధికాప్రసాద్ గారు ఆ పిల్లవానిని దగ్గరకు పిలిచి అతని నుదుటన కుంకుమ నుంచిరి. తరువాత పిల్లవాడు రాధికాప్రసాద్ గారికి నమస్కరించి తిరిగి గుంటూరు నుంచి విశాఖపట్టణమునకు చేరెను. ఇంతలో ఏదో అలికిడి అగుట వలన పిల్లవాని స్వప్నము చెదరెను. పిల్లవాడు కనులు తెరచెను. అతను అనారోగ్యము నుంచి విముక్తుడయ్యెను. లేచి కూర్చునెను. ఏదో తేజస్సు ఆ పిల్లవాని ముఖంలో కన్పడసాగెను. పిల్లవాడు ఎంతో ఆనందంగా ఉండెను. వైద్యులు ఆశ్చర్యపడిరి. తల్లిదండ్రులు పరమానందభరితులైరి. పిల్లవాడు జరిగిన విషయమును తల్లిదండ్రులకు చెప్పెను. వారు తమకు పుత్రభిక్ష పెట్టిన రాధికాప్రసాద్ గారికి శతకోటి నమస్కారములు సమర్పించిరి.

1977 లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రాధికాప్రసాద్ గారు గీతారహస్యము పై ఉపన్యసిస్తున్నరు. ఉపన్యాసం ముగిసింది. అందరూ రాధికాప్రసాద్ గారికి పండ్లు,పూలు యధాశక్తి భక్తితో సమర్పించుకొని వారి ఆశీస్సులును అందుకుంటున్నారు. ఆ ప్రాంగణానికి దూరంగా ఒక కుష్టువ్యాధి పీడుతుడొకడుండెను. వాదు రాధికాప్రసాద్ గారి ఉపన్యాసమును విని తానూ వారికి ఏదో యొకటి సమర్పించాలని అనుకొనెను. కానీ తను కుష్టువాదు. ప్రజలు తనను చూస్తేనే అసహ్యించుకుంటారు. కసురుకుంటారు. దూరంగా నెట్టేస్తారు లేదా దూరంగా తొలగిపోతారు. అయినా అతను ధైర్యం చేసి రాధికాప్రసాద్ గారిని సమీపించెను. చుట్టుప్రక్కల ఉన్నవారు అతనిని చూసి చీదరించుకుంటూ ప్రక్క పొమ్మని కేకలేయసాగిరి. రాధికాప్రసాద్ గారు జనంలో కోలాహలం, కేకలు విని కారణమేమిటని అడిగిరి. ప్రక్కనే ఉన్న వ్యక్తి విషయము చెప్పగా రాధికాప్రసాద్ గారు ఆ రోగిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పెను. అతను రాధికాప్రసాద్ గారిని సమీపించి ఆయన పాదములపై బడెను. తను తెచ్చిన "పకోడి" ని రాధికాప్రసాద్ గారి ముందుంచి _"స్వమీ ! మిమ్మల్ని చూశాను. ఈ జన్మకిదే చాలు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రకమైన రోగంతో బాధపడుతూ, అందరిచే అసహ్యించుకోబడుతూ అతి నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నాను. అని దుఖి:స్తూ రాధికాప్రసాద్ గారి చరణములపై పడెను. చూస్తున్న వారంతా _ "స్వామిని తాకవద్దు" అని పల్కిరి. వారికి రాధికాప్రసాద్ గారు ఆ విధంగా కుష్టువానితో మట్లాడటం భరించలేకపోయిరి. రాధికాప్రసాద్ గారు ఆ రోగిని పైకి లేవదీసి అతను తెచ్చిన పకోడిలో కొద్ది తను స్వీకరించి మిగిలింది అతనికే ఇచ్చివేసిరి. అది అతను భగవత్ ప్రసాదంగా భావించెను. ఆనందంతో అక్కడనుండి బయటకు వచ్చెను. కొలది రోజులలోనే అతని కుష్టువ్యాధి నివారణయ్యెను. తను స్వామి వారి ప్రసాదం స్వీకరించిన తర్వతే ఈ భయంకరరోగం నుండి విముక్తి పొందినానని అతనికి అమిత విశ్వాసము. అదియే సత్యము. అతను ఒక రోజు తిరిగి రాధికాప్రసాద్ గారిని కలిసి _ " స్వామీ ! లోకమంతా నన్ను అసహ్యించుకుంటూ, చీదరించుకుంటూ వెలివేసినప్పుడు మీరొక్కరే నన్ను ఆప్యాయంగా చేరదీసి నే నిచ్చిన పదార్ధమును స్వీకరించి నన్ను కృతార్ధుని చేసినారు. మీ అనుగ్రహం వల్ల రోగ విముక్తుడనైనాను. భగవంతుడెక్కడో లేడు. మీరే నా పాలిట భగవంతుడు. నన్ను కరుణించటానికి ఈ రూపంలో విచ్చేశారు" అని ఆనందోన్మాదంతో కన్నీరు కారుస్తూ రాధికాప్రసాద్ గారి కాళ్ళపై బడెను.

నరసరావుపేట వాస్తవ్యులు శ్రీ సక్కుబాయక్కగారు. వారు విప్పర్లప్ల్లెలో ఒక ఇల్లును కొన్నారు. అయితే ఎవరో ఆమెను మోసం చేసి శ్వశానభూ భాగంలో కట్టబడిన ఇంటిని అమ్మారు. ఇంటిలో ప్రవేశించిన నాటి నుండి కుటుంబ సభ్యుల అవస్థలను మాటల్లో చెప్పలేము. వారు పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారిని తమ ఇంటికి ఆహ్వానించిరి. పరిస్థితిని వివరించి తన్నివారణోపాయమును తెలియజేయమని ప్రార్ధించిరి. అంతట రాధికాప్రసాద్ మహారాజ్ గారు " మీ ఇంటికి వచ్చి పరిస్థితిని చక్కపరచెదనని పల్కెను. సక్కుబాయక్క గారు కొన్న నూతన గృహమునకు బయలుదేరగా మార్గమధ్యమున ఎవరో ఒక పెద్ద గొయ్యి త్రవ్విరి. కారు వెనుక చక్రము అందులో కూరుకొని పోయెను ఎందరు ప్రయత్నించిననూ కారు ఒక్క అంగుళము కూడా కదలలేదు. అప్పుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారు తన ఆరాధ్యదేవతను స్మరించగా ఇది గ్రహసంబంధిత చర్య అని చెప్పి తన పరివారములో ఒకరిని రసయోగికి సహాయార్ధము పంపించెను. వెంటనే కారు ఆశ్చర్యముగా గాలిలో అంత ఎత్తున లేచి రోడ్డుపై వ్రాలెను. చూచువారందరూ ఆశ్చర్యచకితులయ్యిరి. రాత్రి 12 గం| | లలోపు సక్కుబాయక్క ఇంటిలోని గ్రహములను ప్రారదోలవలెను. 12 గం| | లలోపు రాధికాప్రసాద్ మహారాజ్ గారు అక్కడకు చేరి వాటిని ప్రారదోలి వారికి మానసిక శాంతిని కలుగచేసెను. ఇదంతయూ అమ్మ కృపావిశేషమేగాని మరియొకటి కాజాలదు. అమ్మను హృదయపీఠమందు ఎవరు అధిష్టించుకొందురో అట్టివారు దేనికినీ భయపడవలసిన పనిలేదు. అమ్మ ఎల్లప్పుడూ వారి వెంటనే ఉండి సదా కాపాడుచునే యుండును. రసయోగి శ్రీ రాధాదేవిని తన హృదయమునందు ప్రతిష్ఠించుకొనెను. ఆ తల్లి సదా వారిని అంటి పెట్టుకొనెయే ఉండును. ఆ తల్లి వీరి రూపంలో అనేకములైన లీలలను రచించింది. రచిస్తున్నది. ఎందుకంటే రసయోగి మరెవరో కాదు తన ( రాధికారాణి ) ఇష్ట సఖియే కధా !

పూజ్య గురువులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి రూపంలో రాధారాణి ఎన్నో లీలలను జరిపింది. ఎంతో మంది ఆర్తులను కాపాడింది. శ్రీ రాధారాణి యొక్క నిరంతర ధ్యానాదుల వల్ల ఆయన నుంచి అద్భుత శక్తి తరంగముల్ఉ నలుదిశలా ప్రసరిస్తూ ఉండేవి. ఆ ఆత్మశక్తి తరంగముల ద్వారా ఆయన బాధాతప్తహృదయులెందరో వారి బాధల నుండి విముక్తి ప్రసాదించింది.

ఆయన వల్ల సహాయం పొందినవారు, బాధల నుండి విముక్తులైన వారు కోకొల్లలు. వర్ణించుకుంటూ పోతే, బహుశా వర్ణించడానికి నా జీవితం సరిపోదేమో ! అయినా మచ్చుకు రెండు, మూడు సంఘటనలు వివరిస్తాను.

అమెరికాలో యస్. అనంతకృష్ణన్ అనే యువకుడు మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టరేట్ డిగ్రీని పొందాడు. 1995 మార్చి 9 వ తారీఖున అతనికి కారు యాక్సిడెంట్ జరిగింది. మెదడుకు దెబ్బ తగిఇంది. ఎందరో డాక్టర్లను కలిశాడు. అయినా బాధ నుండి విముక్తుడు కాలేకపోయెను. ప్రసిద్ధికెక్కిన డాక్టర్లు డా| | విలియంకాన్లీ, డా| | బ్రూస్ సిల్వర్ మాన్ మొదలగు వారు పరీక్షించిరి. కానీ ప్రయోజనం లేకపోయింది. బాధను ఓర్చుకోలేక రెండు సార్లు, ఆత్మహత్యాప్రయత్నమునకు కూడా ప్రయత్నించుట జరిగింది. ఆ సమయంలో తను అమెరికాలో హైదరాబాదు వాస్తవ్యుడైన ఇన్నారెడ్డిని కలిసెను. అతను "గుంటూరులో ఒక మహాత్ముడుండెను అతనిని కలుసుకో నీకు మేలగును" అని పల్కి హైదరాబాదులోని "శిరీష్" అను ఇంజనీయర్ని కలవమని చెప్పెను. వారు చెప్పిన దానిననుసరించి ఆ మహాత్మును సందర్శించాలనుకొన్నాడు. అనంతకృష్ణన్ వారి పేరు "శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్" అని తెలుసుకొని అమెరిక నుండి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి ఫోన్ చేసి తన బాధను వెళ్ళవించుకొనెను. అంతట రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఫోన్ లోనే తన మంత్రశక్తి చే ఆత్మశక్తి తరంగములను ప్రసరింపచేసిరి. అవిఅతనిని తాకగానే తాత్కాలికముగా అతను బాధ నుండి విముక్తుడయ్యెను.

ఒకరోజు అతను శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారితో "శాశ్వతముగానే ఈ బాధనుంది ఎప్పుడు విముక్తుడను కాగ్లను ? అని ప్రశ్నించెను. అంతట రాధికాప్రసాద్ గారు నీవు ఇక్కడకు వస్తే బాధ నుండి విముక్తుడవు కాగలవని చెప్పెను. అంతట అనంతకృష్ణన్ హైదరాబాద్ వచ్చి అక్కడనుండి గుంటూరు చేరెను. 41 రోజులు రాధికాప్రసాద్ గారి సాంతగత్యంలో "అనంతకృష్ణన్" గడిపెను. తన అనుభూతి వర్ణిస్తూ.........

Naanagaaru took me with all love and affection and gave shelter. I came on feb 20, 1999 and its is 41 daya since Icame here. My Experience with naanagaaru is unique and I cannot fully describe it in words, seeing my desperats condition, he said that he has to see me from the astral plane to cure me both in the physical and astral plane.

upon inverstigation, he found that the cause os my sufferings, and removed the cause on March 21, 1999. Since than, I dont experience serve headachec and I am happy to say that I am cared of my headache by the spiritual powers of Naanagaaru oftained through the divine grace of sri Radha Rani.

అటు పిమ్మట అనంతకృష్ణన్ పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు చూపిన బాటలో నడుస్తూ ధ్యానయోగసాధన చేస్తూ ఆనందపూర్వక జీవితాన్ని గడపసాగెను.

యువకుని సోదరుడు కిరణ్ రాధికాప్రసాద్ మహారాజ్ వద్ద మంత్రదీక్ష తీసుకొని దీక్షతో సాధన చెయ్యసాగెను. ఆ సమయంలో ఒక ప్రసిద్ధ మంత్రవేత్తతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ మంత్రవేత్త "రేపుదశరాలో నీ సాధన ఏమిటి? ఎవరి గురించి సాధన చేస్తున్నావు? అని అడిగెను. దానికి కిరణ్ "రాధామంత్రము పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారి వద్ద తీసుకున్నాను. అదే నా సాధన, అదే నా మంత్రము అనెను అంతట మంత్రవేత్త నీకు త్వరితగతమున అనుభవము రావలెనన్న నేను చెప్పిన విధమున చేయుమని పూజా ప్రక్రియ గురించి, పూజా వస్తువుల గురించి చెప్పెను. దశరా మొదటి రోజున మంత్రవేత్త సూచించిన విధమున పూజకు సిద్ధమయ్యెను. రాత్రి గం.9.30 లకు పూజా ప్రక్రియ ప్రారంభించుటకు సంసిద్ధుడగు సమయమున హఠాత్తుగా పూజ్యులు రాధికా ప్రసాద్ మహారాజ్ గారి గొంతులో ఏదో అదృశ్య వాణి _ " రాధారాణికి దర్శించు విధానము ఇది కాదు. నీవు వెంటనే బృందావనం బయలుదేరిరా ! " అని పల్కెను. ఇది గుంటూరులో జరుగుతున్న సంఘటన. ఆ సమయంలో శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు బృందావనంలో ఉన్నారు. మరి ఎవరు వారి గొంతుతో పల్కినట్లు ? కిరణ్ వెంటనే తన సాధనా ప్రక్రియను ఆపివేసెను. బృందావనమునకు బయలుదేరి బృందావనమున శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారిని కలిసి విషయమును విశదీకరించగా వారు _ " ఇది అమ్మ లీల. నావాక్ రూపమున నిన్ను హెచ్చరించింది. ఆమెయే నీవు దారి తప్పి మరొక దారిన పోవుచున్నావని తెలిసి ఆ తల్లి నిన్ను హెచ్చరించింది. " అని పల్కుతూ "The voice you heared is of mine but the representative person is not me it is by sri Radhaji herself with the experience it is clear that you are usder the observation by the Divine and you are not supposed to follow the lower and ordinary procedure for bringing the grace of the supreme divine. That is why the divine voice of higher plance wanted you like above through my voice, taking it as a medium"

తల్లి రాధారాణి అకారుణకరుణామయి, సాధకుడు రెండు అడుగులు వేస్తే తల్లి పది అడుగులు వేస్తుంది. అందులోనూ రాధారాణి " భక్తానుగ్రహకాతరాం" భక్తులను కాపాడుటకు ఆవిడ ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటప్పుడు సాధకుడు దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకుంటుందా గురురూపంలో సాధకుడిని సచేతుడ్ని చేసి సరయైన మార్గంలో పెట్టే బాధ్యత ఆవిడ స్వీకరించింది. సాధకుడు చేయవల్సింది ఒక్కటే బిడ్డ తల్లి చేయు ఎలా విడవకుండా గట్టిగా పట్టుకుంటాడో అలాగే సాధకుడు తన ఆరాధ్యదేవత చేయి వదలకుండా పట్టుకోవడమే.

పూజ్యులు రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు గుంటూరులో రెండవ లైనులో అద్దెకు ఉంటున్న రోజులు. ఒక రోజు ఒక వృద్ధురాలు "బాగా ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. అన్నం పెట్టరూ" అంటూ దీనంగా అర్ధించింది. రసయోగి ఆవిడని చూశారు. ఇంట్లోని వాళ్ళను పిలిచి ఆ వృద్ధురాలికి "భోజనం " పెట్టించారు ఆ వృద్ధురాలు రసయోగికి అంతకు మునుపే తెలుసు. ఆవిడ మంచి ధనికురాలు, ఇల్లు_వాకిలి ఉన్నాయి. మరి అటువంటి స్త్రీకి ఇటువంటి దీనస్థితి ఏమిటి !" అని ఆశ్చర్యపోయారు. తరువాత కారణం అడుగగా ఆవృద్ధురాలు "స్వామీ ! ఏమి చెప్పమందువు ? మాకు ఒకే ఒక కుమారుడు. వాడు సుఖముగా ఉండాలి అని చిన్నతనం నుండీ వాడిని గారాబంగా పెంచి పెద్ద చేశాను. పెళ్ళి చేశాము. ఆస్తిపాస్తులన్నీ వాడి పేర పెట్టాము. ఇప్పుడు వాడు భార్యకు లొంగి నన్ను బయట నెట్టివేశాడు అని ఏడ్వసాగింది. రసయోగి ఆ వృద్ధురాలిని ఊరడించి ఆమె కుమారునుకి కబురు చేసి " నీవు చేసినది తప్పు నాయనా ! నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిని ఇలా నిలువనీడ లేకుండా చేయుట మహాపాపం " అని మందలించి ఆస్తి " ఆ తల్లిపేర" వ్రాయమని పల్కారు. అలా వ్రాస్తే నీ భార్య కూడా ఆవిడ పట్ల గౌరవం కల్గి ఉంటుంది అని పల్కారు. అతను తప్ప్కుండా అలాగే చేస్తాను అని పల్కి వెళ్ళాడు. రేపు ఉదయం నేను లాయర్ ను పిలుస్తాను. నీవు వచ్చి విల్లు వ్రాయమని రసయోగి పల్కెను. కానీ మరునాడు ఆ వృద్ధురాలు ఏడుస్తూ రసయోగి వద్దకు వచ్చి కుమారుడు చనిపోయిన వార్త చెప్పెను. ఆ సమయంలో రసయోగి వద్ద లాయరు కూడా ఉండెను. అతని పేరు అన్నంరాజు సీతాపతిరావు గారు. రసయోగి హుటాహుటిన ఆ మృత దేహం దగ్గరకు వెళ్ళి లాయరుతో అతను సంతకం పెడతాడు మీరు సంతకం చేయించుకోండి అని పల్కి ఆ మృతయువకుని ఒక్కసారి తాకెను. ఏదో విద్యుత్ ఘాతం తగినట్లు స్పృహ కోల్పోయెను. కాని ఆశ్చర్యముగా చనిపోయిన యువకునిలో చైతన్యం కలిగినది. అతను లేచి కూర్చునెను. లాయరుగారు అతనిచే వీలునామాపై సంతకం చేయించిరి. సంతకం పెట్టిన కొలది సమయమునకు తిరిగి ఆ యువకుడు అచేతనుడయ్యెను. రసయోగి స్పృహ వచ్చెను. జరిగిన విషయము అక్కడివారు రసయోగికి తెలియపరిచిరి.

తల్లి కరుణ ఆ వృద్ధురాలి పట్ల ఉన్నది అని పల్కి ఆ తల్లితో " అమ్మా నీ జీవితాన్ని మంచి సాధనామార్గములో ముందుకు సాగించుము. రాధారాణి సేవలో నీ శేషజీవితాన్ని గడుపు అని బోధించెను. సమస్త దు:ఖములను ప్రారదోలి మిగుల ఆనందమును కలిగించే హ్లాదినీ శక్తి శ్రీ రాధ. ఆమె కరుణగొన్న జీవుని జీవితము ధన్యము. నీవు కూడా ఆ తల్లి సేవ చేసుకుంటూ జీవితాన్ని సార్ధకపరచుకొనుము. "అని పల్కెను. ఆ వృద్ధురాలు రసయోగి పాదములకు నమస్కరించి తన కోడలిని చేరి ధైర్యము చెప్పినది. ఇరువురూ కలసి ఆధ్యాత్మిక జీవితమును కలసి కొనసాగించిరి. ఈ విధముగా తల్లి రాధ కరుణ ఎవరి మీద ఎట్లు ప్రసరించునో, ఎవరిని తనవైపు ఆకర్షించుకొనునో స్పష్టముగా తెలియజాలము కాదు కదా ! జీవుడు ఆ తల్లి కృపకు సదా సంసిద్ధుడై ఉండవలయును.

ఈ విధముగా రాధికాప్రసాద్ గారి యోగ శక్తి వల్ల వందల వేల మంది అధివ్యాధుల నుండి, దుష్టగ్రహ పిశాచ బాధలనుండి విముక్తులై ప్రశాంతతను పొందారు. పామరులు, పండితులు, ఆచార్యులు, మంత్రులు, శ్రీమంతులు ఎందరో వారి అనుగ్రహమునకు పాత్రులైనారు.

పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు ఇలా దేశమంతా ఆశ్రితులను, అనుగ్రహిస్తూ తిరిగుతూ ఉన్నా, వారి దృష్టి మాత్రం బృందావనం మీదనే ఉంది. అక్కడ ఒక ఆశ్రమం స్థాపించాలి. దానికి రాధారాణి అనుగ్రహం కావాలి. ఆ పర్వదినం తన జీవితంలో ఎప్పుడు వస్తుందో, రాధారాణి తన నిత్యధామమైన బృందావన ధామమునకు నన్ను ఎప్పుడు తీసుకెళ్తుందో అని ఆ తల్లి ఆజ్ఞకు ఎదురు చూచుచుండిరి. ఆ రోజు రానే వచ్చింది. రాద్గారాణి వారుకు స్వప్నమున కన్పడి _ " నీవు నా ధామమునకు రా ! అక్కడ స్థిర నివాసము ఏర్పరుచుకో. నేను నిత్యమూ అక్కడ నీ చేత పూజలందుకుంటను" అని పల్కిండి. అమ్మ ఆజ్ఞ అయినది. ఇక ఆమె సంకల్పం అయినప్పుడు దానికి కావలసిన శక్తిని ఆమెయే ఇచ్చినది. ఆశ్రమ స్థాపనకు కావలసిన వనరులు వాటంతంట అవే కుదిరినవి. ఒక్క మాటలో చెప్పాలంటే భాగవత మార్గమున భావకులై, రసికులై రాసమండలిలో సఖులగుట జీవుల ధ్యేయము. దానికి తగిన భావదేహము సాధించుట, శ్రీ రాధా దివ్యానుగ్రహమును పొందుట బృందావన ధామమున వసించుట ద్వారా సులభసాధ్యము. అందుకొరకై యమునా తీరమున్ ఆ పవిత్ర బృందావనమున ఒక దివ్యాశ్రమం 12 మే 1986 లో గోపేశ్వర్ బజార్ లో "బడేకుంజ్" అనే పవిత్ర స్థానమున వెలసినది. ఆ ఆశ్రమం పేరు శ్రీ రాధామహాలక్ష్మి ఆశ్రమం. ఈ ఆశ్రమ నిర్మాణం కూడా రాధారాణి కృప వల్లే జరిగింది. బృందావనంలో ఆశ్రమ సేకరణ భవనం కూడా రాధారాణియే నిర్ధేశించటం ఒక అద్భుత విషయం.

రాధికాప్రసాద్ గారు బృందావనాన్ని దర్శించిన తొలి రోజులలో బృందావనంలోని ప్రసిద్ధ దేవాలయం "రంగజీ మందిరం" లో బస చేశారు. రంగజీ మందిర నిర్వాహకులు తెలుగు భాష తెలిసిన వారు. వారి పేరు బాలాజీగోస్వామి. విషయం తెలిసిన గోస్వామి వారు _ "ఇక్కడకు దగ్గరలోనే " అమ్మాజీ తోట" ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం. మీకు కావలయునన్న దానిన్ని మీకు అతి తక్కువ ధరకు ఇప్పించగవాడను" అని పల్కిరి. రాధికాప్రసాద్ గారు, అంజనీమాత, రాంబాబు ఆ ప్రదేశమును చూచుటకు వెళ్ళారు. గోస్వామి చెప్పిన విధంగానే ఆ ప్రదేశం అత్యంత సుందరంగా, ప్రశాంతంగా నుండెను. రాధికాప్రసాద్ గారు ఆ తోటను కొని అందులో ఆశ్రమం నిర్మించవలెనని నిశ్చయించుకొనెను.

మరుసటి రోజు రాధికాప్రసాద్ గారు గోస్వామిని కలిసి స్థలమును రిజుస్ట్రేషన్ చేయించుకొనవలెనని బయలుదేరిరి. అప్పటివరకు తోటను కొనమని పల్కిన అంజనీదేవి ఎందుకనో "ససేమిరా! మీరు అది కొనవద్దు" అని మొండి పట్టు పట్టినారు. కారణం తెలియదు. నిజమునకు కారణమేదియులేదు. ఎందుకనో ఆమెకే తెలియకుండా అంత మంకు పట్టు పట్టినారు. కానీ రాధికాప్రసాద్ గారు ఆ తోటను కొనవలెనని బయలుదేరిరి. అంజనీదేవి వారితో వెళ్ళలేదు. ఇంతలో రంగజీ మందిర పాఠశాలలో పని చేస్తున్న ఒక టీచరు అంజనీమాత దగ్గరకు వచ్చి విషయమును తెలుసుకొని _" మీరు మంచికే పల్కినారు. ఆ తోటను మీరు కొనవద్దు. కారణం ఆ తోట యమునకు దిగువున ఉన్నది. యమునకు వరదలు వచ్చిన నది పొంగి ముందర ముంచివేయునది ఆ తోటనే. ఒకసారి తుఫానులో ఆ తోట ఆ విధముగానే మునిగిపోయెను." అని పల్కెను. అంతట అంజనీ దేవి ఏ విధముగానైనా ఈ ఆపద నుండి గట్టెంక్కించమని రాధారాణిని ప్రార్ధించసాగెను. కొద్ది కారణముల వల్ల వెళ్ళిన పని కాలేదు. తోటను కొనలేదు. విషయమును తెలిసిన పిదప అంజనీదేవి నాన్నగారికి "టీచరు" చెప్పిన సంగతిని విశదీకరించారు. ఈ విధముగా రాధారాణి పెద్ద ఆపద నుండి కాపాడింది.

29. బృదావనమున ఆశ్రమ స్థాపన

ఆ తర్వాత ఒకరోజు స్వప్నమున రాధికాప్రసాద్ మహారాజ్ గారికి రాధారాణి కన్పించి ఆశ్రమ స్థాపనకు అనువగు స్థలమును సూచించెను. ఆ ప్రదేశము "బడేకుంజ్". యమునా నది ఒడ్డున, యమునకు ఎగువ భాగమున ఉన్నది. ఇది గొప్ప తపోవనము. కృష్ణావతారంలో శ్రీకృష్ణుని క్రీడలతో సంబంధం గల దివ్య క్షేత్రము. అక్కడ "రాధామహాలక్ష్మి ఆశ్రమము " ను రాధికాప్రసాద్ గారు నిర్మించిరి. ఈ ఆశ్రమం నిర్మించబడిన స్థలము ఒక పావన పురాతన క్షేత్రము. దానికి సంబంధించిన ఒక కథ యున్నది _

ఒక దినము చైతన్య మహాప్రభువు వారి భక్త ప్రముఖులగు షడ్గోస్వాములలో ఒకరగు శ్రీ సనాతన గోస్వామి ఇచ్చోటనే యమున యందు స్నానమాడి వచ్చుచుండగా ఈ అరణ్యము నందే ఇచ్చోటనే మురళీధరుడైన రాధామనోహతుడు మెల్లమెల్లగా ఆడుతూ, పాడుతూ తిరుగాడుత్చూ దర్శనమిచ్చెను. వెంటనే వారు భావ సమాధిలో మునిగిరి. ఆ పవిత్ర ప్రదేశమునకు "ధీరసమీర" అను పేరు. ఈ ఆశ్రమమునకు తూర్పు సరిహద్దే "ధీర సమీర". గోడ ఈ ఆశ్రమమునకు తూర్పున గోపేశ్వరాలయం ఉన్నది. ఇచ్చోటనే ఈశ్వరుడు గోపికగా మారి శ్రీ రాధాజీ అనిగ్రహమును పొందినాడని స్థల పురాంఅం చెబుతున్నది. ఈ ఆలయమునకు కొలది దూరంలోనే "వంశీ వట్" అను మిఖ్య యాత్రాక్షేత్రమున్నది. ఈ ప్రదేశమునందే ఒకప్పుడు మురళీధరుడైన శ్రీ కృష్ణుడు వృక్షము పై కూర్చొని తన మురళీ గానముచే వేలాది గో, గోప, గోపికలను ఆకర్షించుట జరిగినది. ఇన్ని విశేషములతో కూడుకొని యున్న ఆశ్రమం శ్రీ రాధామహాలక్ష్మి ఆశ్రమం. అది ఈ నాడు గోపీ పంథాకు చెందిన మహాధ్యాన యోగ కేంద్రంగా రూపొంది రాధాకృష్ణ తత్వ ప్రచారాన్ని సాగిస్తూ, ప్రజలను చైతన్యులను గావించుతూ, భక్తి మార్గ గాములను చేయుచున్నది.

బృందావనంలో ఆశ్రమాన్ని నిర్మించిన తర్వాత సంవత్సరమునకు సుమారు 8 నెలలు బృందావనంలో, 4 నెలలు గుంటూరు నందు "రాధాకృష్ణ మందిరం" లో ఉంటూ రాధామాధవసేవలో, రాధాకృష్ణ తత్వ ప్రచారం గావిస్తూ అనేకమందిని భక్తి మార్గ గాములను గావించారు శ్రీ రాధికాప్రసాద్ గారు. ఈ విధంగా శ్రీ రాధామహాలక్ష్మి ఆశ్రమం 1986 మే 12 న అక్షయ తృతీయ "బిహారీ చరణ మహోత్సవం" రోజు స్వస్వరూపాన్ని సంతరించుకున్నది. శ్రీ రాధికాప్రసాద్ గారు రాధాకృష్ణుల నామాన్ని ధ్యానం చేస్తూ మందిరం ప్రవేశించారు. శ్యామాశ్యాముల మూర్తులను ఆశ్రమంలో ప్రతిష్ఠించారు. నిత్యమూ నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందక్కడ. రోజూ రాధికాప్రసాద్ గారి ఉపన్యాసాలతో, సంకీర్తనా నినాదంతో ఆశ్రమ వాతావరణమంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయి ఉంటుంది.

బృందావన ఆశ్రమ స్థాపన, బృందావన నివాసం వారి జీవితంలో ఒక అద్భుత ఘట్టమనే చెప్పవచ్చును. బృదావనాన్ని తన కేంద్రంగా చేసుకొని నిరంతర రాధారాణి ధ్యానంలో పరవశులగుతూ ఉంటారు శ్రీ రాధికాప్రసాద్ గారు.

ఈ సమయంలోనే రసకిశోరి శ్రీ రాధాదేవి ఆయనను అద్భుత భావాలతో ముంచివేసేది. కొద్దిసమయము చిన్నపిల్లగా కనబడేది, మరికొంతసేపు అత్యంత తెలివిగలదానిగా, మరియొకప్పుడు అద్భుత శక్తి గల అంబగా, ఇంకొకప్పుడు రాధికాప్రసాద్ గారి ఇష్టమైన "11 సంవత్సరముల చిన్నారి" గా కన్పడుతూ, అనేక లీలలను చూపుతూ శ్రీ రాధికాప్రసాద్ గారిని, వారి ద్వారా వారి భక్త బృందాన్ని ఆశ్చర్యపరుచుచూ, పరవశమొందుచూ ఉండేది ఆ అనంత భావ స్వరూపిణి శ్రీ రాధాదేవి. అలాంటి కొన్ని సంఘటనలు ఇక్కడ వివరిస్తాను ఈ సంఘటనలలో మీకు రాధికాప్రసాద్ ముఖ్యంగా ఒక రసయోగిగా, రసికాచార్యునిగా దర్శనమిస్తాను.

11 వ్యాఖ్యలు:

Anonymous September 3, 2010 at 4:19 AM  

నువ్వు తగ్గద్దు, జనాలకి ఇలా పిచ్చి పట్టించేయ్.

Anonymous September 3, 2010 at 4:51 AM  

Well said, Anon1. He is going crazy.

durgeswara September 3, 2010 at 8:06 AM  

ఇది అందరికి రమ్మన్నా వచ్చేపిచ్చికాదు . జన్మ జన్మల శృంఖలాలను తెంచుకుని ఆ దివ్యధామం చేరుకోవాలనే పిచ్చి మహాత్ములు నడచిన బాటలో ఒక్క ఇసుకరేణువునైనా వెదికిపట్టుకోవాలనే పిచ్చి . ఆపిచ్చి ఉన్నవాల్లకే గాని అర్ధంకాని పిచ్చి

durgeswara September 3, 2010 at 8:07 AM  
This comment has been removed by the author.
Anonymous September 3, 2010 at 5:23 PM  

ఏకంగా దేవదేవుణ్ణే స్థుతించక, ఈ రక్తమాంసాలతో పుట్టిన బాబాలను స్థుతించడంలోనే మీ జీవితంలో పుణ్యకాలము క్రుసైపోతోంది. అందుకే ..
" చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా ఒరేయ్ ఒరేయ్
ఒక్కాసారి ఆ సర్వేశ్వరునికి మొక్కి చూడరా ఒరేయ్ ఒరేయ్ "

durgeswara September 3, 2010 at 6:23 PM  

మీకు భక్తి భావంతో పాటు అహంభావం ఎక్కువైనట్లుంది. మీకు తెలియకుండగనే మీలో తిష్టవేసుకుందది. జాగ్రత్తవహించండి.

మా ఆర్ధనా విధానం గుర్చి మీకు తెలుసా ?
మాకు ఏపూర్వపుణ్యం వలన నో ఈమహానుభావుని తక్కువసార్లే కలుసుకునే అవకాశం వచ్చింది. వారు చెప్పిన సూత్రమేమిటో తెలుసా ? అమ్మను ఆశ్రయించండి .ఇంకేమీ వద్దు . అయితే అమ్మదగ్గర బిడ్డల్లాబతకండి బెగ్గర్లుగావద్దు అని. ఏరోజూ వ్యక్తిపూజను అంగీకరించలేదాయన .
ఆయన జీవితం సాధకులకు ఆదర్శప్రాయం . ఒక గురుబంధువు వీరి చరిత్రను వ్రాసి ప్రచురించగా వేలాది సాధకులకు అమ్దుతుందన్న భావంతో దానిని కొద్ది కొద్దిగా వ్రాస్తున్నానిక్కడ. పూర్తిగా చదివి అప్పుడు అర్ధం చేసుకోండి .
మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే మానసికంగా వారి సాంగత్యం చేస్తే కర్మ సులువుగా నశించి భగవదనుగ్రహానికి గల ఆటంకాలు తొలగుతాయి .
మీ నోటిద్వారా వచ్చిన సత్యం మేము పాించేదే. సోదరప్రేమతో నేనిచ్చిన సలహాలో ఏదైనా అహం జనించి ఉంటే క్షంతవ్యుణ్ణి. సన్మంగళాని భవంతు

ఇంకా ముందు ముందు చదవండి పుస్తకం పూర్తయ్యాక మీ అభిప్రాయం చెబుదురుగాని

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ September 5, 2010 at 8:18 AM  

తమ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే వారి మాటలు మీరు పట్టించుకోవద్దు సర్. వయసులోనూ, అనుభవంలోనూ, జ్ఞానంలోనూ తమ కన్నా పెద్దవారిని గౌరవించాలనే కనీస ఇంగిత జ్ఞానంలేనివారిని ఏ రకంగా సంభోదించాలో తెలియట్లేదు.

Sesirekha Munagala September 5, 2010 at 8:45 PM  

pujya durgeswar garu
Thank you very much for giving such a wonderful story of Rasayogi. Actually, that book is written by my aunt. My aunts (my mothers sisters) are very high disciples of Nannagaru. Sadly one of the aunt reached Nannagaru last dec. Anjani amma told clearly that Nannagaru removed all karma from my aunt and took my aunt with his hand. We are waiting to visit nannagari ashram in guntur. Thanks once again for giving life story of Nannagaru on net.
pranams
sesirekha.

Unknown September 6, 2010 at 12:45 PM  

నాన్నగారి స్మృతులు చాల బాగున్నై. నా జన్మజన్మల ఫలం వల్ల రాధారాణి గురించి తాతగారి ద్వారా అంజనఅమ్మ గారి ద్వారా తెలుసుకున్నాను, ఆయన పాదస్పర్సని దివ్యహస్తాలతో ఆశీర్వాదం(ఆయన మంత్రిస్తూ కుంకుమ నుదుట పెట్టె వాళ్ళు) భాగ్యం పొందాను. ఆయనకి అమ్మ గురించి చెప్పాలి అంటే చాలు ఎంతో ప్రేమ గా చెప్పేవారు(time, ఆహారం కూడా మర్చి పోయేవారు),అమ్మ గురించి అందరికి తెలియాలి అని పుస్తకాలు ఎంతో సాధికారంగ, అన్ని పురాణాలలో వున్న refrerences తో రాసారు. అయన చెప్పిన ధ్యానమార్గం చేస్తే మంచిది.

suvarna September 10, 2010 at 7:39 AM  

IAm reading this story continuely.
is Radhika prasad maharaaj is alive.
if he is alive i want to see.
this is very good story.
iam waiting next episodes.

thank u durgaji

durgeswara September 11, 2010 at 7:12 PM  

amma
vaaru golokamlo raadhaadevi sakhirupam dharimchi nityaleelalo pravesimchaaru . maanavalokaaniki amdubaatulo lerammaa

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP