రాధాగోవిందుల మహాభక్తుడు మహమ్మద్ సుల్తాన్
>> Thursday, September 2, 2010
సర్వేశ్వరి శ్రీ రాధాదేవి ప్రేమకు కులమతవర్గవిబేధాలు హద్దులు కాబోవు. బృందావనంలో అమ్మనారాధించి తరించిన గులాబ్ బాబా ,రసఖాన్, బాల రెహమాన్ ,సుల్తాన్ మహమ్మదుల జీవితాలు ఇందుకు ఉదాహరణలు.
బృందావనంలో ప్రసిధ్ధమందిరం శ్రీరాధాగోవింద్ జీ మందిర్ . జైపూర్ మహారాజ్ సుమారు ౫౦ లక్షల రూపాయలవ్యయంతో రాజభవనంలాగా నిర్మించిన గొప్పమందిరం . ఆయనవద్ద ఉన్న సేనాధిపతులలో పఠాన్ వంశమునకు చెందిన సుల్తాన్ మహమ్మద్ ఒకరు. ఒకసారి మహారాజా వారు రాజపుతృలతో కలసి బృందావనం వెళుతూ సుల్తాన్ను కూడా వెంటబెట్టుకెళ్లారు.ఈ సేనానికి బృందావనం రావటం కొత్త . మహారాజు రాధాగోవింద్ జీ మందిరం లో ప్రవేశించి సాష్టాంగ పడుతూ దీనుడై పెక్కువినయంగా ప్రార్ధనలు చేస్తున్నాడు. ఆయనతోపాటు రాజపుతృలంతా పరిపరివిధాల ప్రారధనలు చేస్తున్నారు. ఇదంతా మందిరం బయట నిలబడి గమనిస్తున్న సుల్తాన్ మహమ్మద్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈయనయే ఒక మహారాజు . ఈయనతో వచ్చిన రాజపుతృలంతా వీరాధి వీరులు . వీళ్ళే ఇలా సాష్టాంగ పడుతున్నారంటే పాదాక్రాంతులగుతున్నారంటే ? ఆలోపలున్న వారింకెంత గొప్పచక్రవర్తులో కదా .! పనిచేస్తే అటువంటి గొప్పవారి దగ్గరపనిచేయాలి. ఒక్కరోజైనా సిపాయిగా అటువంటివారి దగ్గరపనిచేయని జన్మమెందుకు ? అని భావించాడు . తిరిగి జైపూర్ వచ్చినా ఆయనను ఈ ఆలోచనలు నిలువనీయలేదు. మహారాజునే అడిగి అక్కడి బృందావనంలో మందిరంలో ఉన్న ప్రభువులవద్ద పనిచేయాలనుందని ,వారి గుమ్మంవద్ద కాపలాసిపాయిగానైనా సరే పంపమని బ్రతిమాలాడు . ఆయన లోని భక్తిభావాన్ని గమనించిన ఆమహారాజు మందిరం కాపలాదారునిగా నియమిస్తూ అక్కడకు పంపారు.
అక్కడ చేరిన క్షణమునుండి చేత ఖడ్గము ధరించి ఆలయ సింహద్వారం వద్దనిలబడి పారాహుషార్ అనుచు కాపలాకాస్తున్నాడు. ఏ క్షణమున నూతన యజమానులు బయటకు వత్తురో యని నిద్రాహారాలు మాని కాపలాకాస్తున్నాడు. ఎవరయినా ఏదన్నా చెప్పబోయినా తను ఇక్కడుండటం ఇష్టం లేకచెబుతున్నారని భావిస్తూ ఎవరిమాటావినకుండా ఆ యజమానులకోసం ఎదురుచూస్తున్నాడు. ఎటన్నావెళితే ఆసమయంలో నే యజమానులు బయటకొస్తే తనగురించి ఏమనుకుంటారో ? అనే సందిగ్దతతో ఏమాత్రం ఏమరకుండా కాపలాకాస్తున్నాడు. జీవితంలో ఒక్కసారైనా అట్టిమహారాజును మహారాణిని దర్శించవలెననే కోరిక పట్టుదల పెరిగిపోతున్నది. అతని శారీరిక పరిస్థితికూడా బలహీనపడుతున్నది రోజురోజుకు .
పరమ దయానిధులగు రాధాగోవిందులు వీనికి దర్శనమీయనిచో విశేషకాలము జీవింపడని ఎంచి ఒకపూర్ణిమనాటి రాత్రి ౧౧ గంటల సమయమున చతుర్ధశ భువనములను వెలిగింపజేయు తమ దివ్యతేజస్సుచే ,సర్వాలంకారములతో కిశోరవయస్కులై గర్భాలయం నుండి వెలికి వచ్చిరి. వారిని దర్శించిన ఆతని ఆనందాశ్చర్యములకు హద్దులేకపోయెను . మాట తడబడ సాగింది. తనదేహమునందేదో నూతన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తున్నది శరీరం వణకుచున్నది. భక్తి పారవశ్యముతో కన్నీరుకారుస్తూ శ్రీమూర్తులనుగాంచి " శ్రీ గోవింద్ జీ మహరాజాధిరాజ్ కు జై శ్రీ రాధా మహారాణికీ జై అనుచు జయజయనినాదాలు చేస్తూ సాష్టాంగ పడుతున్నాడు .. అప్పుడు ఆ మోహనాకారులు సుల్తాన్ ! ఈదారినే ముందుకు నడువుము మేము నీవెంట వస్తున్నాము అని వెళ్లదలచిన మార్గము చూపిరి . సుల్తాన్ ముందు నడుస్తుండగా వెనుక రాధాగోవిందులు పోయి పోయి యమునా తీరమునకు చేరుకున్నారు.
అద్భుతము వేలాదిమంది గోపికలు దివ్యతేజో రూపముతో పూల హారములు చేతను బూని వీరిరాకకై ఎదురుచూచుచున్నారు. ఒకే మూర్తి భిన్న ప్రతిబింబములా యన్నట్లు గగనమార్గమున వస్తున్న వీరందరూ రాధాదేవిని పోలిఉన్నారు. వారందరు పరమ సుఖకర దివ్యగానములతో నాట్యములతో రాధాగోవిందులను సేవింపసాగిరి. వారి సౌందర్యము నిరుపమానమై ఉండెను . ఇంతలో ప్రభాత సమయమగుచుండెను . రాధామాత సుల్తాన్ ను పిలచి ఇదిగో నా దివ్యకంకనము నీదగ్గర భద్రపరచుమని ఇచ్చెను. మహాభాగ్యమనుచూ సుల్తాన్ దానిని భద్రపరచాడు. వారు తిరిగి సుల్తాన్ వెంటవచ్చి గర్భాలయములోనప్రవేశించిరి. సుల్తాన్ మాత్రం తన యజమానులకు నిద్రాభంగం కలగకూడదని సింహద్వారం దగ్గర కాపలాకాస్తూన్నాడు.
ప్రభాత సమయాన్నే నామకీర్తన చేయుటకు భక్తులు దర్బారు మందిరంలో ప్రవేశించి వాద్యగీతములతో సంకీర్తన మొదలెట్టారు. వెంటనే లోనికి ప్రవేసించి సుల్తాన్ వాల్లనుమందలించసాగాడు . మహారాజుగారు రాణి గారు ఇప్పుడే నిద్రపోవటానికి లోనికెళ్లారు మీరు నిద్రాభంగం చేయవద్దు అని హెచ్చరించాడు. ఆమాటలు పిచ్చివాని ప్రేలాపనలుగాభావించిన భక్తులు నవ్వుతూ వయిద్యాలు వాయిస్తుంటె వారి పై కలబడి వాటిని ధ్వంసం చేయతం మొదలెట్తాడు సుల్తాన్. విషయం ఆలయ ధర్మకర్తకు తెలిసి వచ్చాడు.
సుల్తాన్ నీ్వుచెప్పెడిదేమిటో అర్ధమగుటలేదు . వీరి సంకీర్తనను ఎందుకడ్డుకుంటున్నావని ప్రశ్నించాడు.
సుల్తాన్ రాత్రి వృత్తాంతమంతా వివరించి హుజూర్! ఇదిగో మహారాణివారు భద్రపరచమని ఇచ్చిన సువర్ణకంకణమని దుస్తులలో దాచియుంచిన దానిని తీసి చూపాడు. ఆకంకణము పై తడి ఇంకా ఆరలేదు . అక్కడక్కడా ఇసుకరేణువులు అంటుకుని ఉన్నవి. దానితో ఆశ్చర్యపడ్ద ధర్మాధికారి ఆభరణముల పెట్టె తీసిచూడగా ఈకంకణము తప్ప మిగిలినవన్నీ ఉన్నవి . ఈ సుల్తాన్ ఎవరో మహానుభావుడని తలచి భక్తులంతా అతని పాదములపై బడి నమస్కరింపసాగిరి.
బిత్తరపోయిన సుల్తాన్ వెనుకకు జరిగి అయ్యో ! ఇదియేమి మీరంతా పిచివాల్లలా ఒక మనిషి పాదాలమీద పడుతున్నారు ? సిపాయికి నమస్కరిమ్చటమేమిటీ అంటున్నాడు.
అపుడు ధర్మకర్త ఓ సుల్తాన్ ! నీకు దర్శనమిచ్చినవారు మనవలె మానవులు కాదు .స్వయంగా భగవంతుడైన పరమాత్మ రాధాగోవిందయుగళ స్వరూపం ఇది రాజభవనం కాదు ఆలయం అని వివరించాడు.
ఇప్పటివరకు రాధాగోవిందులంటె మహారాజులనుకున్న సుల్తాన్ కు ఈమాటలతో జ్ఞానోదయమై భక్తి పారవశ్యంతో విలపింపదొడగెను.
భగవాన్ ! రాధాగోవింద్ జీ ! అమ్మా రాధా ! ఈ క్షుద్రజీవిపై ఇంత కరుణ చూపారా ? ఇంతదయగలనిన్ను విడచి ఎలా జీవింపగలనమ్మా ? మిమ్మలవిడిచి నేనెట్లు జీవించగలనమ్మా , ఒక్క క్షణముకూడా మిమ్మల్ని విడిచి బ్రతుకజాలను నన్ను నీ సన్నిధికి చేర్చుకోతల్లీ ! అంటూ రాధే రాధే అని పసిబాలునిలా ఏడుస్తూ తన దేహాన్ని వదలివేసి అమ్మ నిత్యలీలలో ప్రవేశించాడా మహా భక్తుడు.
సర్వేశ్వరి యగు రాధ సర్వవ్యాపకురాలైనప్పటికీ ఆమె రచించు రాసలీల మాత్రము పవిత్ర బృందావన ధామములోనే జరుగుతున్నది. అందలి ఒకపరమాణు భాగము మాత్రమే సుల్తానుకు చూపబడినది .
4 వ్యాఖ్యలు:
చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు. నిజంగా ఆ సుల్తాన్ గారు ధన్యజీవి. మతాలకు అతీతంగా భగవంతుడు అందరివాడె అనే విషయం ఇలాంటి సంఘటనల ద్వారా ఋజువు అవుతున్నా పట్టించుకోని దౌర్భాగ్య స్థితిలో నేటి తరం ఉండడం చాలా బాధాకరం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచెదరు అన్న క్రీస్తు మాటలు గుర్తుకొచ్చాయి ఈ టపా చదువుతున్నప్పుడు.
రాధ ఓ గొల్లభామ, వివాహిత వరసకు కృష్ణుడికి మేనత్త అని విన్నాను. మీరు ఆమెను దేవతగా కీర్తించడం ఎంతవరకూ సబబు? దయయుంచి తెలియచేయగలరు.
అజ్ఞాతగారూ
మంచి ప్రశ్న అడిగారు. రాధాదేవి గూర్చిన వివరాలు మన దక్షినాదిన అంతగా ప్రాచుర్యం లేకపోవటం తో ఇలాంటి అనుమానం రేకెత్తుతున్నది. మీరనుకున్న రాధ పేరుగల మానవులు వేరు. అన్నిలోకాలకు పైన గోలోకంలో పరమాత్మ అగు కృష్ణుని హ్లాదినీ శక్తిగా లోకాలను పాలిస్తున్న రాధాదేవి వేరు. వేదాలు స్తుతించేది పూజించేది ఆతల్లినే.
ఆ మహాదేవి గూర్చి దేవీ భాగవతం ఏమిచెబుతుందో వినండి
కృష్ణార్చాయా నాధికారో మతో రాధార్చనం వినా
వైష్ణవై: సలకలై స్తస్మాత్ కర్తవ్యం రాధికార్చనం //
కృష్ణ ప్రాణాధికాదేవీ తదధినో విభుర్యత:
రాసేశ్వరీ తస్యనిత్యం తయాహీనోన తిష్టతి.
రాధ్నోతి సకలాన్ కామాన్ తస్యాద్ రాధేతి కీర్తితా //
ఆదిపరాశక్తి ఐదురూపాలుగా విలసిల్లుతున్నది
రాధ దుర్గ లక్ష్మి సరస్వతి సావిత్రి ఆరూపాలు అని కూా దేవీ భాగవతం వివరిస్తుంది .
సాక్షాత్తూ దుర్గాదేవి శిష్యుడై ఆపరాశక్తి చే రాధాషడక్షరీ మంత్రోపాసన పొంది ామ్మ దివ్యప్రేమను చూరగొని దక్షిణ భారతదేశంలో రాధా తత్వాన్ని ప్రచారం చేసిన మా పరమగురువులు రాధికాప్రసాద్ మహరాజ్ గార రచనలు చదవండి వివరంగ అర్ధమవుతాయి .అవి అమ్మకానికి దొరకవు . మీకు కావాలంటె గుంటూరులగాని లేక బృందావనం లో ి ఆశ్రంలోగాని ఈ సాహిత్యం దొరుకుతుంది ఉచితంగా .
మిరు ఓసారి బృందావనం వెళ్లి వస్తే రాధంటే ఏమిటో అర్ధమవుతుంది.
ఆరాధ ఈ రాధ వేరు అంటారు. అదే అనుకున్నా బృందావనం రాధ ఓ శృంగార కవుల కల్పన అని. బృందావనం వదలి నప్పుడు కృష్ణుడికి పదేళ్ళు అని చదివాను. నెనర్లు.
Post a Comment