శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉదారవాద వ్యాధి గ్రస్తులారా...ఇప్పుడేమనాలి మిమ్మల్ని

>> Thursday, December 11, 2025

మిగతా మతస్థులకు లేని పెద్ద కేన్సర్ వంటి జబ్బు కొందరు హిందువులకు పట్టుకుంది. ఏమిటంటే అది మేం గొప్ప ఉదారవాదులాగా కనిపించాలి, వీర సెక్యులర్స్ గా కనిపించాలి, మిగతా మతాల వారి దృష్టిలో చాలా గొప్పవారిగా గుర్తింపబడాలి. మంచిదే. తప్పులేదు. మీరు నమ్మిన విదీశీ సెక్యులర్ సిద్దాంతం మిమ్మల్ని అలా తయారు చేసింది. కానీ, ఆ ఉదార వ్యాధి అనే పేరు సంపాదించడానికి మీరు పుట్టిన హిందూ ధర్మాన్ని కించపరచనవసరం లేదు. అలాగే, అందరిని కలుపుకుని పోవాలి అనే విశాల దృక్పథం ఉన్న హిందూ ధర్మం పాటిస్తున్న అనేక మందిని ప్రలోభపెట్టో మోసం చేసో మా దేవుడు మాత్రమే దేవుడు అనే ఎక్సక్లూజివ్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్న అబ్రాహామిక్ మతాల లోకి లాగేస్తూ, మీరు నచ్చే ఆ ఉదార భావ హిందూ ధర్మాన్ని బలహీన పరుస్తున్న అటువంటి శక్తులను ఖండించకుండా కూడా మీ ఉదారవ్యాధి మీకు అడ్డు తగులుతోంది. అంతే కాదు, ఆ అబ్రాహామిక్ మతాలు మరియూ ఎర్ర మతం ఈ హిందూ ధర్మం పై దాని ఆచారాలు,పండుగలు,ఆటలు, దేవాలయ వ్యవస్థ లు, గురువులు మరియు వారి సంస్థలపై పలు కుట్రలు పన్నుతూ హిందూ ధర్మాన్ని బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటివి బ్రిటీష్ కాలం నుండి వున్నా ఆ తర్వాత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయినా వాటిని గట్టిగా ఖండించడానికి కూడా మీ ఉదార వ్యాధి మీకు అడ్డు వస్తోంది. సరే! మీ ఉదార వ్యాధి బిరుదు పోతుందనే భయంతో అటువంటి కుట్రలు ఖండించే సాహసం ఎలాగూ చేయరు. కనీసం, ఏదైనా హిందూ సంస్థ మీద కానీ, గురువుల మీద కానీ ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజమా? తప్పుడు ఆరోపణలా? వీటి వెనకాల కుట్ర కోణం ఏమైనా ఉందా అని కనీసం కూడా ఆలోచించకుండా... ఆ కుట్రదారులు, ఎర్ర మతం గాళ్ళు, అబ్రాహామిక్ మతాల వారు, ఇతర హిందూ ద్వేషుల కంటే మీరే ముందుగా పరిగెత్తుకుని వచ్చి ఆ సంఘటనలను ఘట్టిగా ఖండించేసి, "నేను సిగ్గుతో తల దించుకున్నాను" అని ఒకడు అంటే "నేను హిందూవుగా పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను" అని ఉదర వ్యాధి బాగా ముదిరిన మరొకరు అంటూ బోర విరుచుకుని నిలబడి మా ఉదారవ్యాధి ఎంత ముదిరిపోయిందో చూసారా అని ప్రదర్శన ఇస్తారు. హిందూ ధర్మం పై నేరుగా దాడి చేసే ఎర్ర మతం వాళ్ళు, అబ్రాహామిక్ మతాల వారి కంటే హిందూ ధర్మానికి ధర్మం లోపలే ఉండి దానిని బలహీనపరిచే శక్తులకు మద్దత్తు ఇస్తున్న మీవంటి ఉదార వ్యాధి గ్రస్తుల వల్లే హిందూ ధర్మానికి ప్రమాదం. ఈ సోది అంతా ఎందుకు అంటే... #ధర్మస్థల వివాదం అంతా కుట్రపూరితంగా జరిగింది. ఆ సంస్ధ ను అపఖ్యాతి పాలు చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అని నా వంటి వాళ్ళం మొదటి నుండి నెత్తి నోరు కొట్టుకు చెపుతూనే ఉన్నాం. అయినా మా మాట అసలు వినకుండా పై పెచ్చు మమ్మల్ని ఎగతాళి చేసి హిందూ ద్వేషులతో పాటు మీరు కూడా ఆసంస్థ మీద పెద్ద పెద్ద బండరాళ్లు వేయడానికి ఉత్సహం చూపించారు. ఇప్పుడు చివరకు ఏమైంది? #ధర్మస్థల వివాదం అంతా కావాలని కుట్ర పూరితంగా చేశారు అని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన "సిట్" నిన్న కోర్ట్ కి తెలిపి 6గురు కుట్ర దారులపై ఛార్జి షీట్ ఫైల్ చేసాము, అసలు అక్కడ సామూహిక ఖననాలు చేసినట్లుగా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు, ఈ మొత్తం కుట్ర వెనకాల ఇంకా ఎవరెవరున్నారో విచారణ చేస్తున్నాం అని సిట్ కోర్టు కి తెలిపింది. మా ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి మాస్ మర్డర్లు లేవు. మొదటి ఫిర్యాదుదారు చిన్నయ్య (సానిటేషన్ వర్కర్‌గా పనిచేసినవాడు) చేసిన ఆరోపణలు అబద్ధాలు, కుట్ర అని బయటపడింది. దీనిలో ఆక్టివిస్టులు మరియు ఇతరులు పాలుపంచుకున్నారని SIT కోర్టుకు తెలిపింది. విచారణ సారాంశం: * SIT త్రవ్వకాలు, పలువురి దగ్గర స్టేట్‌మెంట్లు, ఆధారాలు సేకరణ తర్వాత ఆలయ అథారిటీలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. *చిన్నయ్య చూపించిన పుర్రె ఎవిడెన్స్ కూడా ఫేక్‌గా రుజువైంది. SIT 3,900 పేజీల ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఇందులో చిన్నయ్య మరియూ ఆక్టివిస్టులు మహేష్ షెట్టి తిమరోడి, గిరీష్ మట్టెనవార్, టి. జయంత్, విట్టల గౌడ మరియు సుజాత భట్ (ఒక ఫిర్యాదుదారు)పై తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ, అధికారులను తప్పుత్రోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటి నేరాలపై కేసులు రిజిస్టర్ చేయబడ్డాయి. సరే! ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నియమించిన సిట్ నిజం నిగ్గు తేల్చింది కాబట్టి అప్పుడు సిగ్గుతో దించిన మీ తలలు మళ్ళీ ఎత్తుకోండి. మరో సారి మళ్ళీ తల దించుకోవడానికి ఇటువంటి కుట్రలు కోసం ఎదురు చూడండి. .....చాడా శాస్త్రి....

Read more...

పాహి దత్త ప్రభో!

>> Thursday, December 4, 2025

Read more...

స్కంద షష్టి

>> Wednesday, November 26, 2025

Read more...

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

>> Tuesday, November 4, 2025

Read more...

ఎంతని పొగడెద స్వామీ...

>> Monday, November 3, 2025

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP