శ్రీ కృష్ణున్ని దొంగ,చోరుడు అనగలిగే అర్హత వీరికి మాత్రమే ఉంది ?
>> Saturday, September 4, 2010
పితా౨ హమస్య జగత:
ఈ ప్రపంచంలో ఒక బిడ్డకు ఒకతండ్రి లేదా ఒకతండ్రికి నలుగురు బిడ్డలు ఉంటారు. కానీ పరమాత్మ ఈవిధంగా పరిమితమైన వాడు కాదు. ప్రపంచమంతా పరమాత్మ బిడ్దలే . ప్రపంచాని కంతటికి పరమాత్మే తండ్రి.
ఈజగత్తుకు నేనే తండ్రిని అన్నాడు గీతలో పరమాత్మ .అందరికీ అత్యంత సన్నిహితమైన మూర్తి బాలక్రిష్ణునిది .ఆయనను వెన్నదొంగ అన్నది ఎవరు ? ఏ మహర్షి గాని ,మహాత్ముడు గాని ఆమాట అనలేదు. భాగవతాన్ని గంగాతీరం లో పరీక్షన్మహారాజుకు వినిపించిన మహాజ్ఞానీ ,శ్రీ కృష్ణున్ని సదా హృదయంలో నిలుపుకున్న మహాత్ముడు సాక్షాత్తూ శుకబ్రహ్మకే ఆమాట అనేందుకు ధైర్యం చాలలేదు. శ్రీకృష్ణున్ని దొంగ ,చోరుడు అని అనగలిగింది ఒక్క గోపికలే .ఎందుకని ? ఆయన దొంగలించినది వాళ్ల ఇళ్లలోనేగానీ .శుకబ్రహ్మ ఇంటిలో కాదు .వ్యాసుని ఇంటిలో కాదు ,పరాశరుని ఇంటిలోనూ కాదు . కాబట్టి గోపికలు మాత్రమే శ్రీకృష్ణుని వెన్నదొంగ అనగలిగారు .
ఒకసారి శ్రీ కృష్ణుడు వెన్నదొంగలిస్తుండగా ఒక గోపెమ్మ చేతిలో పట్టుబడ్డాడు. పొరపాటు జరిగిపోయింది .ఇకమీదట రానులే అన్నాడు శ్రీకృష్ణుడు గోపెమ్మ ఒప్పుకోలేదు. ఇది ఒకరోజు విషయం కాదు .ఇలా ఎంతకాలంగానో "ఇకమీదట రానులే ఇకమీదట రానులే" అంటూ దొంగతనం చేస్తూనే ఉన్నావు .నిన్నునేను నమ్మను అన్నది గోపెమ్మ .నమ్మకుంటే ఒట్టుపెడతాలే ." నీభర్త మీద ఒట్టు " అన్నాడు .గోపెమ్మ ఆశ్చర్యపోయింది .ఏమిటీ ! దొంగతనం చేసేది నువ్వు . ఒట్టుపెట్టేది నాభర్త మీదనా ? అన్నది. " పోనీలే అయితే మీ నాన్నమీద ఒట్టు " అన్నాడు . ఇది మరీ బాగుంది. రెండువైపులా నాకేనా ? అటు అమ్మగారింటిమీదికి .ఇటు అత్తగారింటి మీదికి దాడి చేస్తున్నావు . అసలు తప్పు చేసింది నువ్వుకాదా ? నిలదీసింది గోపెమ్మ . పరమాత్మ చేయి జారబీక్కుని నవ్వుతూ వెళ్లిపోయాడు. కృష్ణుని చిలిపితనానికి గోపెమ్మకు నవ్వాగలేదు.
పరమాత్మ ఎందుకని నవ్వుతూ వెళ్లిపోయాడు ? ఓసీ పిచ్చిదానా ! ఎప్పుడు నువ్వు నన్ను అర్ధం చేసుకునేది ? నీ భర్తమీద ఒట్టు అని నేనన్నప్పుడే నేను నామీదే ఒట్టు పెట్టుకున్నాను . ఎందుకని ? గతిర్భర్తా ప్రభుస్శాక్షీ నివాసశ్శరణమ్ సుహృత్ .భర్త అంటే భరించేవాడు . నేను నీ భర్తలాగ నీ జీవితాన్ని భరిస్తాను .కేవలం స్త్రీలకే కాదు ,పురుషులకు కూడా సర్వమానవాళికి నేనే భర్తను . ఆపదలలో కొట్టుమిట్టాడే వారందరిని భరించి ఉధ్దరించే భర్తను నేనే . అదే విధంగా " మీ నాన్న మీద ఒట్టు " అన్నప్పుడే నేను నామీద ఒట్టు పెట్టుకున్నాను . కానీ నీకు అర్ధం కాలేదు. ఎందుకని ?
ఈ ప్రపంచానికి తండ్రిని నేనే .తండ్రి ఏవిధంగా బిడ్దలను పోషిస్తూ వారి కష్టాలను నివారించటానికి ప్రయత్నిస్తాడో ,అదే విధంగా నేను ఈ ప్రపంచాన్ని పోషిస్తూ రక్షిస్తూ ఉంతాను అని అభయప్రదానం చేశాడు .
2 వ్యాఖ్యలు:
baagundi :)
Nice one Durgeswara garu. chala baga rasaru.
Post a Comment