బ్లాగ్మితృలారా! ఒక్కరోజు సమయమియ్యండి . అసలేంజరుగుతుందో వివరిస్తాను.
>> Saturday, March 6, 2010
మితృలకు నమస్కారం
నేను రెండు రోజులుగా ఓ ముఖ్యమయిన పనిపై మనసు కేంద్రీకరించిపనిచేస్తున్నాను. రేపు అంటే ఆదివారంరోజున ఇంటర్ ,పదవతరగతి విద్యార్ధులకోసం వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము నేను మామితృలమ్దరమూ కూడా . హనుమాన్ చాలీసాలో ఉన్న ఒకదోహా పదే పదేస్మరించటం ద్వారా ఏకాగ్రత ,జ్ఞాపకశక్తి ,మనోధైర్యం పెరిగి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించటం ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకుని ఫలితాలను పదిమందికీ అందించాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు ప్రతిఏటా చేస్తుంటాము . ఈ ఏడాది కూడా చేస్తున్నాము రేపు వినుకొండలో .
ఇప్పుడు బ్లాగు ల్లో కలిసేన రెచ్చిపోతుంది . మనం మౌనంగా ఉంటే మంచివాల్లని అంటారో లేదోగాని పిరికివాల్లని ,
వాగేవాడి మాటానిజమని నమ్మే ప్రమాదముంది .అసలిదంతా ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుందో మీకు సవివరంగా మనవిచేస్తాను రేపు .ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఉన్నందునసమయాభావం వలన వెంటనే వివరణ ఈయలేకపోతున్నాను.
రేపు వ్రాసే టపాను తప్పనిసరిగా చదవాలని కోరుకుంటూన్నాను
జై శ్రీరాం
13 వ్యాఖ్యలు:
ఎదురు చూస్తూ వుంటాం !
WAITING
I am all ears. Shoot.
తప్పకుండా
Sure. Thanks for the mail
మీరు డబ్బుల కోసమో, పేరు కోసమో, ఇతరులని ప్రలోభపెట్టాలనో ఏమీ చెయ్యట్లేదు. అది చాలా మందికి తెలుసు. ఇక ఎందుకండీ సంజాయిషీలు?
మాష్టారు గారు,
మీరు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. మీకు ఎవరైనా గోత్రనామాలు పంపినా, వాళ్ళ పిల్లలతో హనుమదుపాసన చేయించినా అది వాళ్ళ వాళ్ళ నమ్మకంతోను, ఇష్టంతోను చేస్తున్నారు. మీరు ఏ డబ్బు కోసమో, పేరు కోసమో చేయనప్పుడు ఎందుకు మీకు అనవసరమైన హైరానా.
ధర్మో రక్షతి రక్షితః
సచిన్ భారతరత్నా !?: హవ్వ
ఏంటొ ఈ మధ్య ఈనాడు సచిన్ ను ఆకాసానికెత్తేస్తుంది భారతరత్న అనీ పలానా రత్న అనీ. దానికి ఊతంగా వివిధ ప్రముఖుల చేత ప్రకతనలు ఇప్పిస్తింది . ఇదంతా చూస్తుంటే సచిన్ కు భారతరత్న ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్లుంది . దానికి గానూ మీడియా జనాలను మానసికంగా సిద్దం చేస్తున్నట్లుంది . ఈ రోజు ఈనాడులో థాకరే ఏమన్నాడో తెలుసా? సచిన్ భారతరత్నమట ఆయనను మించిన రత్నాలు ఈ దేశంలో లేవట , అలాంటి రత్నాలు మహారాష్ట్రలోనే పుడతాయట .ఇక్కడ నేనేదో ప్రాంతీయాభిమానం రెచ్చగొడుతున్నానని అనుకోవద్దు ఎక్కడ పుట్టినా వాళ్ళు కూడా భారతీయులే కదా ! ఇక్కడ విషయం అదికాదు . గత కొద్ది కాలంగా (2001 నుండి ) భారతరత్న ప్రధానం జరగడం లేదు . అయితే మధ్యలో (2008) భీంసెన్ జోషి కి ప్రధానం జరిగింది . ఈ సంఘటనను మినహాయిస్తే దాదాపు తొమ్మిదేళ్ళుగా అవార్డు ప్రధానం జరగడం లేదు. అంటె ఆ అవార్డు పొందడానికి తగిన అర్హులు లేరు ఇప్పుడు సచ్చిన్ అనే క్రిడాకారుడు తన రికార్డులతో దేశం పరువును దిగంతాలకు వ్యాపింపజేస్తున్నాడట అందుకని భారతరత్న ను ఆయనకివ్వాలని కొంతమంది (microscopic minorities) డిమాండ్. గత అవార్డు గ్రహీతల ప్రతిభాపాటవాలను పరిశీలిస్తే వారి ప్రతిభ ( వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ ) ఈ దేశానికి ఏదొవిధంగా ఉపయోగపడింది. ఉదాహరణకు లతా మంగేష్కర్ నే తీసుకుంటే భారత - చైనా యుద్ద సమయంలో జవహర్ లాల్ నెహ్రు సమక్షంలో Ae Mere Watan Ke Logon ( " Oh, The People Of My Country ) అనే పాట పాడి వేలాది భారత సైనికులను ఉత్తేజ పరిచారు ఆ ఉత్తెజం తోనే వారు ఆ యుద్దంలో పాల్గొన్నారు ( ఆ యుద్దంలో భారత్ ఓటమి చెందడం వేరే సంగతి ). మరి సచిన్ సాధించిన ఆయన వ్యక్తిగత రికార్డులు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయనే చెప్పాలి. కనీసం తన ప్రతిభతో ఈ దేశానికి ప్రపంచ కప్ కూడా సాధించి పెట్టలేకపోయారు . బహుశా ఆయనకు ప్రపంచ కప్ కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యం కావచ్చు. కప్ సాధిస్తే ఆ క్రెడిట్ జట్టు అందరికీ చెందుంతుది మరి వ్యక్తిగత రికార్డులు అలా కాదు కదా ! ఎప్పటికీ ఆయన పేరు మీదనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలనడం ఏం సమంజసం ? ఇంత కంటె గొప్ప్ వాళ్ళు ఎంతమంది లేరు ! భారతదేశంలో హరిత విప్లవానికి ( Green Revolution ) ఆద్యుడైన M, S. స్వామినాధన్ ను అందరూ మరిచిపొయారు. దేశాన్ని ఆహార ధాన్యాల కొరత నుండి కాపాడిన స్వామినాధంకు దక్కింది ఒక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి . హరిత విప్లవం మూలంగానే దేశంలో వరి, గోధుమల దిగుబడి గణనీయంగా పెరిగాయి . 1961 లో ఆయన నార్మన్ బోర్లాగ్ ను దేశానికి ఆహ్వానించకపోయినట్టైతే పరిస్తితి వేరే రకంగా ఉండేది . ఇక పోతె వర్గీస్ కురియన్ సంగతి ... ఈయన్ White Revolution కి ఆద్యుడు . ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో గ్రామీన ప్రాంతాలలో కోపరేటివ్ సొసైటీలను స్తాపించి పాల విప్లవానికి నాంది పలికాడు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆర్ధిక పరిపుష్టం చెసాడు. ఇక మూడవ వ్యక్తి పి.వి. నరసిం హా రావు . ఈయన సంగతి అందరికీ తెలిసిందే . మరి ఇంతమందిని వదిలేసి సచిన్ కు భారతరత్న ఇవ్వడంలో ఏ లాబీయింగ్ పనిచేస్తుందో అర్ధం కావడం లేదు

which doha?
great job .... most people dont likt to put them to test ... coz failure depresses them ..and shatters their belief ... i am waiting
Post a Comment