ఊ.పె.కు.హ ఈ జోక్ గుర్తొస్తోంది
>> Thursday, March 4, 2010
ఊ.పె.కు.హ ఈ జోక్ గుర్తొస్తోంది
ఇదెప్పుడొ ఒకసినిమాలో రాజేంద్రప్రసాద్ వేసిన జోక్ . అర్ధమేమిటయ్యా అంటే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అని చెబుతాడు.
ప్రస్తుతం సమాజం లో కొందరు దౌర్భాగ్యుల చీకటి కోణాలు బయట పడుతూ సంచలన వార్తలుగామారాయి .అవి ధర్మానికి హానికలిగించేవిగా ఉన్నాయని ఆస్తికులు ఆవేదన చెందుతున్నారు. కానీ ఒక మహాప్రవాహం సాగుతున్నప్పుడు చూడండి చెత్త చెదారం గట్టువైపుకు కొట్టుకొస్తాయి .ధర్మం ముసుగులో ఉన్నదౌర్భాగ్యుల ను ధర్మమే ఇలా ఏరి బయటపడవేసి చెత్తను వదలించుకుంటుంది . దీనిపైన బ్లాగులలో వచ్చిన పోస్ట్ లలో ఈ విషయమై వ్యాఖ్యలు వ్రాసారు కొంతమంది .వారిలో నేను కూడా ఒకడిని .
అక్కడా ఈ దౌర్భాగ్యులకు ఇంత ప్రచారం కల్పించి పెంచేది కలి సేనకు చెందిన అంతర్గత శక్తులే అని, చివరగా ఈ మాయాబొమ్మలు కూలిపోయేప్పుడు ఆ అవకాశాన్ని కూడా ధర్మానికి హాని చేయటం కోసం వినియోగించుకుంటారని వ్రాశాను నేను
ఇక్కడ ఎక్కడా కూడా ఇటువంటి అనాచారులను సమర్ధించటం నేను చేయలేదు. చేయాల్సిన అవసరం ఏ హిందువుకు లేదు.
విషయమేమిటంటే ఈ విషయమై ఈ బ్లాగులలో స్వయంప్రకటిత కుహన మేధావి [కలిసేనా ప్రచార విభాగంలో దళవాయి లాంటివాడని అనుకుంటుంటాను ఈయనను] ఒకాయన తమ స్థాయి మేధావిత్వం తో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఒక పోస్ట్ వ్రాశాడు, పిచ్చి ఆనందం తో . అప్పుడనిపించింది ఇదా పైన రాజేంద్రప్రసాద్ జోక్ కు అర్ధము అని. అవును ఎంగిలాకులకోసం హడావుడి చేసే శునకాలకు వుండే వెర్రి ఆనందం వాటికి సంప్రాప్తించాలని కోరుకుందాము . పాపం వాటి జన్మ లక్షణం అది. వాటికి ఇలాంటప్పుడన్నా వాటికిష్టమైన ఉఛ్ఛిష్టం దక్కకపోతే వాటి జన్మకు సార్ధకత ఎలా చేకూరుతుంది ?
7 వ్యాఖ్యలు:
ఎం పర్లేదు ఇంకొంచేం బలమయిన చెప్పుతో కూడా కొట్టొచ్చు
సరిగ్గా చెప్పారు గురువు గారూ. నాకూ ఇలాగే అనిపించింది.
well said sir...
అయ్యా
క్లాశ్ట్ గారూ
నేను మేధావినని ఎక్కడా చెప్పుకోలేదు. మానవసహజంగా మూర్ఖత్వం కొంత ఉందేమో తెలియదు గానీ > తమరు మాత్రం సంస్కారం లేని హీనులను అర్ధమవుతుంది. ఇతరుల బ్లాగులోకొచ్చి నప్పుడు పాటించవలసిన మర్యాదలు తెలియని సంస్కారహీనులు ఇక్కడకొస్తారని తెలియక మోడరేషన్ పెట్టు కోలేదు. మీకు గతం లో సున్నితంగా హెచ్చరిక్ చేసినా గమనించలేదంటే మీరు పైన నేను చెప్పిన లక్షణమే కాక గర్వం ,మీరన్నా లక్షణాలు కూడా పుష్కలంగా కలవారని తెలుస్తుంది . అటువంటి స్తాయి వారికి ఇంత మర్యాద అవసరం లేదు కనుక మీ వ్యాఖ్య తొలగిస్తున్నాను.
Post a Comment