వినుకొండలో విద్యార్ధుల జయార్ధం ఈరోజు నిర్వహించిన విశేషపూజ..దాని ఫలితం
>> Sunday, March 7, 2010
వినుకొండ పట్టణం లో ప్రసిద్ధ గుంటి ఆంజనేయస్వామి వారి ఆలయం లో ఈ రోజు [ఆదివారం] పదవతరగతి .ఇంటర్మీడియేట్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధులకొరకు పరీక్షలలో జయార్ధం ప్రత్యేక అర్చన జరిగింది . శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున నేను ఈకార్యక్రమాన్ని చేపట్టి,విద్యార్ధులలో మానసిక బలాన్ని బుధ్ధి శక్తిని పెంచి విజయం సంప్రాప్తించజేయమని స్వామిని ప్రార్ధించటం జరిగింది. ఈ సందర్భంగా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే హనుమంతుని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో వివరించటం జరిగింది .విద్యార్ధినీ విద్యార్ధులు స్వామి వారి చరిత్రలో ఒక కార్యసాధకుడు ఎలా కృషిచేయాలో అడిగి మరీ తెలుసుకున్నారు. సంత్ తులసీ దాస్ గారు తన తపో ఫలాన్నంతా ధారబోసి లోకాని కిచ్చిన హనుమాన్ చాలీసా లోని ఒక దోహాను సంపుటీకరణ మంత్రంగా విద్యార్ధులు ఎలాసాధనచేయాలో దానివల్ల వచ్చే ఫలితాలను ప్రయోగాత్మకంగా తమజీవితాలలో ఎలా పరిశీలించి తెలుసుకోవచ్చో వివరంగా చెప్పాము. కొంతమంది పిల్లలు తమకు కలుగుతున్న భయాన్ని గూర్చి అడగగా
అభయప్రదాయకుడైన స్వామి ఆశ్రయించి నవారికి ఎలా రక్షగా ఉండి భయాలను దూరం చేస్తాడొ వివరించాము . కొండలను ఎత్తుకొచ్చిన స్వామి ని ఆశ్రయించాక భయం ఎలా దూరమవుతుందో వివరిస్తుంటే పలువురు విద్యార్థులు ఉద్వేగంతో స్వామి నామాన్ని చెప్పి ,మాకు అండగా స్వామి ఉన్నాడు కొండలనైనా ఢీకొ్ట్టగలమని ఈ పరీక్షలు ఒక లెక్క కాదని అనిపిస్తుందని ఆత్మ విశ్వాసం తో పలికారు.
స్వామి ని ఆశ్రయించినవాడు ఎప్పుడూ కార్యసాధనలో అలసత్వాన్ని దరి చేరనీయరాదు. స్వామి సోమరిపోతులకు దొరకడు ఆయనలా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని పనిచేయాలి అప్పుడే స్వామి అనుగ్రహం కలుగుతుందని వివరించాము . వివిధ పాఠశాలలు ,కళాశాలల నుండి బృందాలుగా వచ్చిన పిల్లలు ఎంతో చక్కగా పారాయణం మంత్రజపం చేసి స్వామిని వేడుకున్నారు.
ఈసందర్భంగా దక్షిణను అడిగాము పిల్లలందరినీ . ఎంతివ్వాలండీ ! అని ప్రశ్నించిన విద్యార్ధులతో డబ్బుతో కొలవలేనిది అత్యంత విలువైనదేదైఅనా ఇవ్వమని అడిగాము . పిడుగులు ఈ కాలం పిల్లలు .అయితే మీరే అడగండి అని అన్నారు
స్వామిలా సత్ శీలాన్ని, దైవభక్తిని ,దేశభక్తిని పెంచుకునేందుకు ఆయన చరిత్రను చదువుతూ ఆ సుగుణాలను అలవరుచుకుంటామని మాటివ్వమని అదే దక్షిణ అని అడిగాము . పిల్లలంతా ఎంతో దృఢ విశ్వాసంతో అలాగే చేస్తామని మాటిస్తుంటే మనసు పులకరించింది మాకందరకు . స్వామి రక్షలు .సంపుటీకరణ మంత్రం కార్డులను ప్రసాదంగా ఇచ్చి దిగ్విజయంగా వర్ధిల్లమని ఆశీర్వచనం చేసి పంపటం జరిగింది. ఇదే రోజు వినుకొండలో డాక్టర్ బి.వీ. పట్టాభిరామ్ గారి కార్యక్రమం ఉన్నందున వెళ్లి వారు చెప్పే విషయాలను వినమని చెప్పి పంపాము.
స్వామి నెలా కొలవాలి ?
ఎలా ఆశ్రయించాలి ?
మానసిక వికారాలు తొలగించి బుద్ధిబలాన్ని యశోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ హనుమత్ రక్షాధారణ
ఎలా సాధించాలి ? విజయం . స్వామి లాగా
తరలి వస్తున్న చిట్టి తల్లులు
గుంపులుగా వస్తున్న విద్యార్ధులు
స్వామి ఉండగా భయమా ?
నాటి నుంచి నేటిదాక పవన సుతుని ఆశ్రయించి విజయం సాధించనిదెవరు?
మీలో ఉన్నది కూడా ఆయనశక్తే ! బ్రహ్మచారులైన మీరు ఆయన శక్తికి ప్రతి రూపాలు.
స్వామి కత్యంత ఇష్టులైన మిమ్మల్ని చూసి భయానికే వణకు పుట్టాలి మీదరిచేరాలంటే .
పరీక్షంటే ఏముంది తమ్ముడూ ! ?
అలా చూస్తే చాలు ఇలాపట్టెయ్యొచ్చు విజయాన్ని .అదేమన్నా అందని పండా ? ఇలా తీసుకోవటమే . [ప్రాక్టికల్ గా చూపెడుతున్న పిల్లకాయల సోదరుడు.]
ఈ కార్య క్రమాన్ని చేపట్టటానికి నాకు మూడురోజులసాధనతో కూడిన సంకల్పం ,రెండు లీటర్ల పెట్రోల్[బండిపై తిరగటానికి] ఒక ఏభైరూపాయల ఫోన్ ఖర్చు అయింది . కార్డులను అడగగానే ఒక పుస్తకాల షాప్ యాజమాన్యం ఇవ్వగా రక్షలను ఖర్చును ఒక పాఠశాల యాజమాన్యం ,మిగతా అర్చనాధికములను ఆలయ కమిటి చూసుకుంది.
ఫలితం : పరీక్షలంటే భయం ఉన్నవాళ్ళు.ఆందోళనతోఉన్నపిల్లలలో స్వామి పైనమ్మకంతో ఆత్మధైర్యం ,తమపై తమకు విశ్వాసం పెరిగాయి.బాగా చదివే పిల్లలు అద్భుతాలు సృష్టించగలమని మనోధైర్యాన్ని వ్యక్తం చేశారు. స్వామి అనుగ్రహంతో ఈ బిడ్దలంతా మంచి విజయాన్ని సాధించి భారతమాతకు ముద్దుబిడ్దలుగా భారతజాతిసంస్కృతికి వారసులుగా సచ్ఛరిత్రులుగా ఎదగాలని మీరూ దీవించండి.
4 వ్యాఖ్యలు:
జై శ్రీరాం.
ఆ హనుమంతుని ఆశీర్వాదంతో విద్యార్ధులందరూ తప్పక విజయం సాధించగలరు.
జై హనుమాన్.
మీరడిగిన దక్షిణ బాగుంది. భావితరం పౌరులలో మనకు కావలిన/తేవలసిన చైతన్యం అదే! ఇంతకీ ఆ మంత్రమేంటో చెప్పలేదు మీరు.
Good Job! Keep it up , Swami gaaru.
Sankar
మీ సంకల్పం అనితరసాధ్యమైనది...
మీ కృషి వెల కట్టలేనిది...
కొండకచో సంచరించే అనుమానరాయుళ్ళలో కనీసం కొందరికైనా ఈ టపా కనువిప్పు కలిగించగలదని ఆశిస్తూ... గురువులకు సాష్ఠాంగ ప్రణామాలు.
Post a Comment