శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీ ప్రయాణం నీదే !

>> Tuesday, March 2, 2010

[గణపతి సచ్చిదానంద స్వామి]

జీవనము ఒక రైలు ప్రయాణము
కొంతమంది ఎక్కుదురు - దిగుదురు
దూర ప్రయాణము చేయుదురు
సొంత ఊరిలోన దిగుదురు
రైలు మాత్రము సొంతము కాదు సచ్చిదానంద!

వేదశాస్త్రం సారభూతమైన సిద్ధాంతాన్ని ఈ చిటికెలో స్వామీజీ మనకు అందిస్తున్నారు. ఈ శరీరం నీది కాదు. నీది అనుకొని నీవు భ్రమపడుతున్నావు. శరీరంలో ఉన్న జీవుడవు నీవు. శరీరాన్ని దాచు కొనుటకు చొక్కాలు మార్చినట్టు జీవుడు తన శరీ రాలను మారుస్తూ ఉంటాడు. అందువల్ల శరీరం నిత్యం అనుకొని దుఃఖాలను అనుభవించవద్దు అని వేదాన్తశాస్త్ర వచనం.
దీన్ని స్వామిజీవారు రైలు ప్రయాణానికి అన్వయించి బోధిస్తున్నారు. రైలుబండి ఎక్కిన వెంటనే ఎవరి స్థానాలలో వారు కూర్చుంటారు. తాము సుఖంగా కూర్చొనుటకు, పడుకొనుటకు అనువుగా వాటిని శుభ్రం చేస్తారు. మరొకరు వారికి కేటాయించిన స్థలంలో పొరపాటున కూర్చుంటే వారితో తగవు లాడి తమ ప్రతిభాపాటవములు ప్రదర్శించి వారిని పంపించి వేస్తారు. పైగా డబ్బిచ్చి కొనుక్కున్నాం ఈ సీటు మాది అని గదమాయిస్తారు.

నీ సీటులో కూర్చొని నీవు ప్రయాణం చేస్తున్నంత వరకు ఆ సీటు నీదే! మరి నీవు దిగవలసిన ఊరు వచ్చేసింది. ఒక్కసారిగా సామానంత సర్దుకొని క్రిందకు దిగిపోతావు. కాని రైలుబండిని, నీ సీటును, తోటి ప్రయాణీకులను విడచిపెట్టేస్తున్నావు కదా!
నీ ఊరిలో దిగిన తర్వాత నీకు రైలుబండి మీద వ్యామోహం లేదు. జీవితం కూడా అంతే. ఇది ఒక రైలు ప్రయాణం. బంధుత్వమనే పేరుతో మనతో చాలామంది కలిసి ప్రయాణం చేస్తారు. కానీ ఆ బంధాలన్నీ ప్రయాణం చేస్తున్నంతవరకే! నీవు దిగవలసిన ఊరు వచ్చేసింది అంటే శరీరాన్ని విడచి జీవుడు వెళ్లిపోతాడు. ఈ శరీరం మీదకాని, బంధు వుల మీదగాని ఎట్టి వ్యామోహం వాడికి ఉండదు. ఒక్కొక్కడు తొందరగా పోతాడు. మరొకడు చివరి దాకా ప్రయాణం చేస్తాడు. మధ్యలో కొంతమంది రైలుపెట్టేలోకి ప్రవేశిస్తారు. కాని ఎవరిగమ్యం వారిదే.


1 వ్యాఖ్యలు:

kittu March 5, 2010 at 5:18 AM  

maayameley jagambe nityamani sambhavinchukonuchu mohambunan...
Naa illaalani, naa kumarulani pranambunnandaaka entho allaadina ee sareeramu ipudindu kattelan naduma kaaluchundagan....
Aaa illalunu raadhu, putrudunu thodaina raadu dakkimpagan.....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP