ఇలాచేస్తే రాష్ట్రం లో ప్రస్తుత సమస్య సులభంగా పరిష్కరించబడొచ్చు.
>> Sunday, December 20, 2009
ఓట్లకోసం ఎన్నికలప్పుడు వేర్పాటువాదాన్ని లేవనెత్తిన వాళ్లను,దానిని సమర్ధించినవారిని ,ఇప్పుడు తెలంగాణా అని ,సమైక్యాంధ్ర ఉద్యమాలని జనాన్ని రెచ్చగొడుతున్న సదరు రాజకీయనాయకులందరినీ కట్టగట్టి రాష్ట్ర ప్రధాన రహదారులపై పనుకోబెట్టి 1. లారీడ్రయివర్లకు వీళ్ళ సంగతి చూసుకోండని చెప్పడం 2. బస్సులు తగలెట్టొద్దుబాబూ మా నోటికాడికూడు పోద్దిఅని వేడుకుంటున్నా ఆర్టీసీ డ్రైవర్లకు ఈసమస్య ఇకముందు రాకుండా ఏంచేయాలో చేయండని చెప్పటం . ౩. ముందుగా రెక్కాడితేగాని్ డొక్కాడని జనమంతా గలసి ఈ రాక్షసీయుల ఇళ్లలో వంటగదులు తెరవకుండాచూసి వీళ్లవాహనాలన్నీ తగలబెట్టడం ,వీళ్లందరినీ థార్ ఎడారిలో పండుకోబెట్టిరావటం.
పనిలో పని ముందు తెలంగాణా ఉద్యమం ఆహా.. ఓహో... అంటూ పొగిడి రెచ్చగొట్టి ,మరలా సమక్యాంధ్ర ఉద్యమం అదిరిపోతుంది భూమి దద్దరిల్లుతూ ఉందని ,రెచ్చగొడుతూ ఏవాదమో తెలియకుండా వార్తలు వ్రాస్తున్న పత్రికలవాళ్లను ,టీ వీ ఛానల్ వాళ్లను కూడా వీళ్లతో కలపండి పీడా వదలిపోతుంది.
8 వ్యాఖ్యలు:
well said
baga chepparu
మీడియా ద్వంద్వ నీతిని బయటపెట్టినందుకు కంగ్రాట్స్.
మీడియాది నీతికాదండి . ఏదో వ్యూహం దేశాన్ని అస్థిరపరచే చర్యలవెనుక వున్నదని అనుమానం కలుగుతుంది .
మీడియాది నీతికాదండి . ఏదో వ్యూహం దేశాన్ని అస్థిరపరచే చర్యలవెనుక వున్నదని అనుమానం కలుగుతుంది .
మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు
* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు
* మధ్య ప్రదేశ్-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,
రహంతుల్లాగారు
మీరు చెప్పినవన్నీ సరే ! వాటిలో కొన్ని మూఢనమ్మకాలున్నాయి మరికొన్ని శాస్త్రీయకారణాలున్నాయి .అవట్లుంచండి . అసలు మీ ఉద్దేశ్యమేమిటో అనేకరకాలుగా స్పురిస్థున్నది .మీరు వెళ్ళి నమాజ్,చెసే వాళ్లని,పూజలు చసే వాళ్లని,ప్రార్ధనలు జరుపుకునే వాళ్లని అక్కడికెళ్ళి ఒప్పించండి ఆపించండి . ఇక్కడ వ్యాఖ్యానంతో మీ ఉద్దేశ్యాలు అపార్ధాలకు దారితీస్తుంది . మీరు ఈ బ్లాగులోకి వచ్చి మీసమయము వృధాచేసుకోరని భావిస్తున్నాను.
అరబ్బీ భాషలో నిర్బంధం చేయబడిన నమాజును మన మాతృభాష తెలుగులో చేయనివ్వాలని దేవునికి అన్నిభాషలూ అర్ధమౌతాయని వారినీ అడుగుతున్నాను
Post a Comment