శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గాణ్గాపూర్ లో జరిగే గురుపౌర్ణమి పూజకు మీగోత్రనామాలు పంపి పాల్గొనండి

>> Tuesday, June 30, 2009



పరమ పావనమైన దివ్యక్షేత్రము శ్రీగురుని లీలావిలాసభూమి గాణ్గాపురము. అక్కడ వసించిన శ్రీనృసింహసరస్వతీ యతీంద్రులు సాక్షాత్తు దత్తులు. వారి పాదస్పర్షతో పునీతమైన ఆదివ్యక్షేత్రం లో దత్తత్రేయుని పూజించటం జన్మ జన్మల పాపాలను తొలగించి తాపాలను నశింపజేసి సకల కోరికలను ఈడేర్చగలదని శీగురుచరిత్ర మనకు తెలియజేస్తున్నది.తాము అక్కడే గుప్తముగా వశించి భక్తులను కాపాడుతుంటామని సద్గురువులు సెలవిచ్చి యున్నారు.అటువంటి దివ్యక్షేత్రం లో గురు పౌర్ణమి రోజున శ్రీగురుని పూజించటం విశేష ఫలదాయకమని వేరు చెప్పాల్సిన పనిలేదు.
పరమేశ్వరానుగ్రహంతో ఒక సత్సంకల్పము కలిగినది. రేపు జూలై 7న గురుపౌర్ణమికి దత్తక్షేత్రమయిన గాణ్గాపూర్ వెళ్ళి అక్కడ నిర్గుణపాదుకలను దర్శించుకుని పూజించాలని . అయితే ఈకార్యక్రమాన్ని పదిమందితో కలసి పంచుకోవాలని సద్గురువుల సంకల్పము కాబోలు ,అందుకు ఒక ప్రణాళిక సిద్ధమైనది. సద్గురు భక్తులు ,పరమాత్మ స్వరూపులైన మీ అందరినీ ఈయాత్రకు రమ్మని ఆహ్వానిస్తున్నాము. అలా రావటానికి వీలు పడని భక్తులు కూడా తమ గోత్రనామాలను పంపించి మేము సూచించిన సూచనలను పాటిస్తే వారి తరపున కూడా అక్కడ శ్రీ గురు పాదుకలకు రుద్రాభిషేకము పూజా జరిపించదలచాము.అదికూడా క్షేత్రదర్శనమంతటి పుణ్యాన్ని ప్రసాదించగలదు.

మాతోపాటు రాదలచుకున్నవారు ,అలాగే తమతరపున అక్కడ పూజ జరిపించుకోవాలనుకున్నవారు తమ గోత్రనామాలను పంపి ఇంటివద్ద పౌర్ణమి వరకు ఈక్రిందవిధముగా సాధనలో పాల్గొనగలరు.

౧ . ఏడురోజులు ,సమయము చాలనివారు ఐదు రోజులు లేదా మూడు రోజులు సమయము లో గురుపౌర్ణమికి పూర్తయ్యేలా "శ్రీగురుచరిత్ర " గ్రంథాన్ని పారాయణం చేయాలి.[మీకు వీలుననుసరించి ఉదయము ,లేక సాయంత్రము గాని]
౨. ప్రతిరోజు శివలింగమునుగాని ,గురుపాదుకలను గాని లేక గురు ప్రతిమలను గాని అభిషేకించు కోవాలి . వీలైన వారు రుద్రసూక్తం చెప్పుకోవచ్చు ,రానివారు భక్తిగా "ఓం నమ: శివాయ " అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసుకోవచ్చు.
౩.పాటించగలిగినవారు ఒంటిపూట భోజనం ,భూశయనం ,బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది.
౪. జూలై ఏడు న పౌర్ణమి రోజు దగ్గరలోవున్న ఏదైనా సద్గురువుల దేవాలయానికి లేదా శివాలయాని కెళ్ళి దర్శించుకుని ఒక కొబ్బరి కాయ సమర్పించుకోండి.,ఆరోజు ఆకలిగొన్న జీవులకు మీకు చేతనైనంత వరకు ఆకలి తీర్చటానికి ప్రయత్నించండి.
౫.ఈవారం రోజులు మీకెదురువున్నవారు పరమాత్మ స్వరూపులుగా భావించి గౌరవించండి . ఎవరినీ ధూషించవద్దు. ముఖ్య గమనిక మీఇంటికి వచ్చి బిక్షకోరినవారిని ఎవరినీ కసురు కొనక మీకు చే్తనైనంతలో భిక్షిచ్చి పంపండి.

ఇంకెందుకాలస్యం వెంటనే మాకు durgeswara@gmail.com కు మీ సమాచారాన్నివ్వండి. రాదలచుకున్నవారు ,ఏదైనా అనుమానాలున్నవారు నాఫోన్ లో సంప్రదించండి. 9948235641
పరమ గురువుల పాదసేవకు పోదాంరండి .సద్గురువుల కృపను చవిగొందామురండి.
ఈ సమాచారాన్ని మీకు తెలిసిన భక్తజనులందరకు పంపండి .



4 వ్యాఖ్యలు:

చక్రవర్తి July 1, 2009 at 9:54 AM  

క్షేమంగా వెళ్ళి పుణ్యంతో తిరిగి రండి. ఇలాంటి సత్ కార్యాలు మీరు మరిన్ని చేయ్యాలని, చేసే శక్తి ఆయురారోగ్యాలు ఆ పరమ శివుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

రవి July 2, 2009 at 8:34 PM  

"ఈవారం రోజులు మీకెదురువున్నవారు పరమాత్మ స్వరూపులుగా భావించి గౌరవించండి . ఎవరినీ ధూషించవద్దు. ముఖ్య గమనిక మీఇంటికి వచ్చి బిక్షకోరినవారిని ఎవరినీ కసురు కొనక మీకు చే్తనైనంతలో భిక్షిచ్చి పంపండి."

కనీసం ఇదైనా మనసులో పెట్టుకుంటాను. ఏదో వస్తుందని కాకపోయినా, నా మనసుకు నెమ్మది వస్తుందని.

చింతా రామ కృష్ణా రావు. July 2, 2009 at 10:03 PM  

దుర్ గతులు పారద్రోలుచు
దుర్ గుణములు రూపు మాపి, దురితము బాపన్
దుర్గేశ్వర! మీ జతనము
దుర్గాంబిక శక్తి యగును. దురితాపహరా!

maheshudu June 18, 2011 at 2:57 PM  

sri datta deva is now incarnated .He is my sri guru deva.I did observed for 10 years and realized he is really sri datta guru deva.he is Sri sri sri Ganapati Sachchcidananda swamiji in mysore datta peetham.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP