ఆత్మతో మమేకం కావాలి ;................
>> Thursday, June 4, 2009
మంచిని చూస్తే చెడు మటుమాయమవుతుంది. మంచి అనేది కాలుష్య రహిత సమాజం. చెడు పరిసరాలను సైతం మలిన పరిచే మురికి కూపం. మంచి సంకల్పమే చెడుకు దూరం కావటానికి మొట్టమొదటి మెట్టు.
మనల్ని మనం నియంత్రించుకోకపోతే అస్థిరత, కష్టాలు, విషాదం, భయం అన్నీ వెంటాడుతాయి. దీంతో మన జీవితం అథ:పాతాళానికి చేరినట్టుగా కృంగిపోతాం. ఇలాంటి సమయంలోనే యోగసాధన వలన మనలో ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
అసలు స్థిర చిత్తంతో ,ఆత్మతో మమేకం కాగలిగితే జీవితం యోగ సంపన్నమవుతుంది. ఆత్మ ప్రయాణంలో అధమ ప్రవృత్తులు జీవితాన్ని శాసించలేవు. పరుల మాటలు, చేతలు మనల్ని నొప్పించజాలవు. అవి మనల్ని ఒక వేళ బాధపెట్టినా ఆత్మ తెలివిడితో మనల్ని కలవర పరచుకోము.
దీనికి పైగా పరుల అవగాహనా లేమిని ఇట్టే పసిగట్టేస్తాం. వారిది దోష చిత్తం అనిపించదు. మనలో మాటకి మాట, చేతకి చేత అనే భావన లేకుంటే వారి మాటల్ని, చేతల్ని పట్టించుకోం. ఈ ఉదాశీన వైఖరే మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదే స్థిర చిత్తానికి అద్దంపడుతుంది.
ఎదుటి వారిపై ప్రతీకార చర్య పనికిరాదు. ఎదుటి వారు ఒకమాట అన్నాకూడా దానిని విననట్టు ఉండిపోవాలి. ఆ మాటలు మన మనస్సును తాకవు. ఎలాంటి సమయంలోనైనా మనం అతీతులమయ్యేలా మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి.
దానికి ఉపకరించేది కేవలం యోగసాధన మాత్రమే. ఆ యోగ సాధనవలన మన శరీరంపై మనకు పట్టు లభిస్తే మన మనస్సు మన ఆధీనంలోవుంటుంది. దానినే స్థిర చిత్తం అంటారు ప్రపంచ ప్రఖ్యాత జిడ్డు కృష్ణమూర్తిని తత్త్వవేత్తగా ఆవిష్కరించిన లెడ్‌బీటర్.
ఈ అతీత మానసిక స్థితివల్ల మనిషిలో పవిత్రత, నైర్మల్యం ప్రోది అవుతాయి. ఆత్మతో మమేకం కావడంవల్ల మనసు పారదర్శకమవుతుంది. మన యోగసాధన, ఆధ్యాత్మక ఉన్నతి పదిమంది కోసం అయితే, ప్రతీకారం అనేది మనసా, వాచా, కర్మేణా మన దరికి చేరదు.
4 వ్యాఖ్యలు:
chaalaa baaga chepparu
యోగ సాధన అంటే ఏమి చెయ్యాలి కూడా చెప్తారని ఆశిస్తున్నాను.
మనశాంతి లభించింది..చాలా బాగా చెప్పారు..
శ్రీ గారు..టైం తక్కువగా వుంటే ప్రాణాయామం చెయ్యండి రోజూ 10 నిముషాలు
నమస్కారములు. చాలా చక్కని విషయాలు చెప్పారు కానీ అంత తేలిక కాదు.సాధన కావాలి .అందుకు ముందుగా మనస్సును స్వాధీన పరచుకోవాలి. అదే కష్టం.బాగుంది ధన్య వాదములు.
Post a Comment