ఇక్కడున్నందుకెంత ఫీజు చెల్లించాలి మనం ?
>> Sunday, March 1, 2009
సూర్యరశ్మి,చల్లగాలి, వర్షపు నీరు మినహా భూలోకం లో ఏవస్తువూ ఉచితంగా లభించదు. ఏదీ డబ్బుపెట్టి కొనకుండా చేతిలో పడదు. ప్రతి వస్తువు కూ వెల చెల్లించాలి. వేసవిలోనే కాదు ప్రస్తుతము మామూలు సమయము లోకూడా తాగే గుక్కెడు నీరు కూడా డబ్బాలలో కొనుక్కోవాల్సిన పరిస్థితి. పల్లు తోముకునే పుల్లలనుండి బస్తా బొగ్గులదాకా,,కాస్త ఉప్పు కాడనుండి కూల్ డ్రింక్ లదాకా డబ్బులక్కడ పెట్టి మరీ తీసుకోవాలి.రేపిస్తానంటే రేపే వచ్చితీసుకోమంటారు.
ఇంట్లో వున్నందుకు అద్దె ఫోను చేస్తే డబ్బు,కదిలితే డబ్బు ,మెదిలితే డబ్బు చెల్లించితేనే ఏదయినా పొందగలిగేదిమనం. మందు పుచ్చుకున్నందుకేగాక డాక్టర్ తో మాట్లాడినందుకు కూడాడబ్బు చెల్లించాల్సినదే.
అయితే ఒక ఒక దేశ భూభాగం లో నివసిస్తున్నందుకు ,ఆదేశానికి చెందిన భూమిలో పంట పండించుకుంటున్నందుకు.ఆనేలమీద ఇల్లు కట్టుకున్నందుకు,అచటి జలములు త్రాగుతున్నందుకు,ఆచోట మలయమారుతములను అనుభవిస్తున్నందుకు మనమేమి మూల్యం చెల్లిస్తున్నాము? దీనివెల ఎంత అనే సందేహం వస్తుంది కొందరికి.తల్లి బిడ్డను పెంచేందుకు ఖరీదెంత అంటే ఏమి చెప్పగలం? తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను పెంచి పెద్దచేసినందుకు ఖరీదెంత? రూపయలలో విలువ కట్తలేనిది.అమూల్యమయినది అగు అంశమిది.
ఏది లేకుండా మనము లేమో.అటువంటి మాతృభూమి నుండి మనం పొందుతున్న ప్రయోజనాలకు ఖరీదెంత? ఎంత సొమ్ము చెల్లించాలి మనం? ఏరూపంలో చెల్లించాలా మూల్యాన్ని?అనే విషయాలు పరిగణలోకి తీసుకోవలసిన అవసరము ఉన్నది .
ఇవి వాటంతట అవి వచ్చిన అవకాశాలు.ఉచితంగా లభించేవి.వీటికి మనమేమీ తిరిగి ఇవ్వనవసరం లేదు అని కొందరి ఉద్దేశ్యం.అది పొరపాటు.డాక్టరు మందిచ్చినందుకు కాక అతనితో సంభాషించినందుకు కూడా కన్సల్టేషన్ ఫీజు ఇస్తున్నమనం ,మన ఉనికికి అవకాశ మిచ్చిన భూమికి మనమేమీ చెల్లించనవసరం లేదా?
దేశమంటే మనతో మాట్లాడలేని నేల మాత్రమేకాదు.దేశమంటే మనకు అనుదినమూ కనిపించే సమాజం..ఆసమాజ క్షేమంలోనే నాక్షేమం ఇమిడి వున్నది అనే ఆలోచన,నాకు గల శక్తి సామర్ధ్యాలు,మేధస్సు,ధనము-వీటన్నిటిని నాకొరకేగాక సమాజము కొరకు కూడా వినియోగిస్తాను అనే గ్రహింపు అనుదినమూ మనసులోకి తెచ్చు కోవడమే దేశానికి చెల్లించే ఫీజు.
దేశమును ప్రేమించు మన్నా........................లేకున్న నీమనుగడ సున్నా...
0 వ్యాఖ్యలు:
Post a Comment