శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఒక్క క్షణం ..ఏమిటి రుణబంధాలు?

>> Friday, February 27, 2009

రావల్ఫిండి లో ఒక సైనికాదిపతి ఉండేవాడు . ఒకసారి కాబూల్ లో తిరుగుబాటుదారులను అణచివేయుటకు ప్రభువు అతనిని కాబూల్ పంపెను. ఆటను అక్కడకు చేరేసరికి యుద్దము తీవ్రముగా సాగుతున్నది. ఫిరంగులు మ్రోగుతున్నాయి .పరిస్థితిని పూర్తిగా అర్ధము చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగానే అతడెక్కిన గుర్రము ఎంతప్రయత్నించినా ఆగక శత్రువులవైపు పరిగెట్టినది. దళాధిపతి దానిని ఆపుటకు విశ్వప్రయత్నం చేసినా వీలుగాక గుర్రముతో బాటు శత్రువుల మధ్యకు చేరి అసువులు బాశాడు.
ఆకాలం లో సైనిక దళములకు కొందరు వర్తకులే కాంట్రాక్ట్ పద్దతిలో భోజనపదార్ధాలను సరఫరా చేస్తుండేవారు. ఈ దళాదిపతికి కూడా ఒక వర్తకుని వద్ద ఖాతా వున్నది. తనకు కుటుంబసభ్యులు లేనందున ఆయన తన ధనమును కూడా ఆవర్తకునివద్దనే దాచుకునేవాడు. ఆతను మరణించగానే అతని వస్తువులను అతని బంధువర్గం తీసుకున్నారు. కాని వర్తకుని వద్దవుంచిన రెండువేల రూపాయలు గురించి ఎవ్వరికి తెలియనందున,అవి తనకు దక్కినందుకు వర్తకు
డెంతో సంతోషించాడు.
కాంట్రాక్ట్ కాలం అయి పోగానే ఆవర్తకుడు తన స్వగ్రామము సహన్ పూర్ కు వెళ్లి అక్కడొక దుకాణం తెరుచుకుని గడుపుతున్నాడు. ఇలా దాదుపు ఇరువది సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి అతని మితృడొకరు తనస్నేహితులతో కలసి హరిద్వార్ వెళుతూ మార్గ మాధ్యమం లో సహన్ పూర్ కు వచ్చాడు. దానికి వర్తకుడు సంతోషించి వారిని ఈరాత్రికి తమ ఆతిథ్యం స్వీకరించి ఈరోజుకు వుండమని కోరాడు . దానికి వారు అంగీకరించారు.

వర్తకుడు వారికొరకు విందు ఏర్పాటు చేశాడు. అందరు తృప్తిగా భోజనం చేస్తున్న సమయం లో లోపలనుండి వారికి ఏడుపులు వినిపించినవి. .ఆ జాలి ఏడ్పులెవరివో ఎమ్దుకేడుస్తున్నారో తెలపమని కోరారు. .అదా! ఏమియు లేదు మీరు కానివ్వండి. అని వర్తకుడు దాటవేయాలని చూసాడు. కాని ఆదుఃఖానికి కారణం ఏమిటో తెలుపాలని వారు పదేపదే అడిగినమీదట చెప్పక తప్పలేదు. సరే! వినండి ,ఆయేడుస్తున్నది నాకోడలు. కొన్ని రోజుల క్రితం నా కుమారుడు మరణించాడు ,అతని మృత్యువు కారణం గా ఆమెకు ఆ దుఃఖము సహజమేకదా ! అన్నాడు .
దానికి వారు విచారం వ్యక్తము చేసినారు . కాని కుమారుడు మరణించినా ఆవర్తకుడు నిర్వికారముగా వుండి ఇలా అతిథి మర్యాదలు ,విందులు చేస్తూ ఎలా వుండగలుగుతున్నారని అడిగారు . ఎంతో ఆశ్చర్యంగావున్నది అని అన్నారు.
ఓమిత్రులారా! ఇరువది ఎళ్ల క్రితం నేను కాబూల్ లో సైనికులకు కాంట్రాక్ట్ గా వస్తువుల సరఫరా చేసేపని చేసి తరువాత స్వగ్రామం వచ్చి పెళ్లి చేసుకున్నాను ఆతరువాత రెండేళ్ళకు మాకొక కుమారుడు పుట్టాడు . వానిని పెంచి పెద్దవాడిని చేసి పెండ్లి చేసితిమి. కాని కొన్నిరోజులకే జబ్బుచేసి నది .అనేకమందికి చూపి వైద్యం చేపిమ్చితిని. వారు ఎన్నో మందులు వాడినా ఫలితం లేదు. వాడు కోలుకునేట్లు కనపడలేదు.
వైద్యులచే కుదరకుండుట తో రాజవైద్యులనుండి భూతవైద్యుల వైపు మల్లినది నాదృష్టి. కుమారుని బ్రతికించమని ఒక మహమ్మదీయ మతాచార్యుని వేడుకుంటిని. అతడువచ్చి ఏ వో మంత్రాలు చదివాడు. మంత్రజపం పూర్తికాగానే నావద్దనున్న రెండున్నర రూపాయలు ఆయన కిచ్చితిని.
నేను ఆవిధముగా చేయుటచూచి నాకుమారుడు నవ్వెను. పిల్లవాని నవ్వు చూస్తూ తనమంత్రం ఫలించినదని ఆమతాచార్యుడు అనెను. త్వరలోనే ఆపిల్లవాని ఆరోగ్యం బాగావుటుందని,తానుత్వరలో వస్తానని చెప్పి వెళ్ళాడు.
అతను వెళ్ళిన తరువాత , నేను నాయనా ! ఎలా వున్నది? అని నాకుమారుని అడిగితిని. నాకు సంపూర్ణ ఆరోగ్యముగా నున్నది అని అన్నాడు నాకుమారుడు. వాని మాటలు నాకర్ధము కాక సంపూర్ణ ఆరోగ్యమనగా నేమి అని అడిగితిని. దానికి వాడిట్లనెను.
ఇరువది ఏండ్ల క్రితం నేను దాచియుమ్చమని నీకు రెండువేల రూప్యముల నిచ్చితిని .అంతలో కాబూల్ లో తిరుగుబాటును అణచేందుకు వెళ్లి ,అక్కడ అసువులు బాసితిని. ఆ డబ్బు నీవద్దనే వున్నందున దానిని తీర్చుకొనుటకై నీకు కుమారునిగా జన్మించితిని. అనెను.
అంతే కాదు నీవుచేసిన సేవలతో నారుణము తీరినది . చివరి సారిగా నీవు మతాచార్యునకిచ్చిన రెండున్నరరూపాయలతో మిగిలన రుణముకూడా తీరిపోయినది. ప్రస్తుతము నాకు భార్యగానున్నస్త్రి నన్ను యుద్దరంగములోనికి లాక్కొనివెల్లిన నా గుర్రమే. ఎంతలాగినను వినక నన్ను శత్రువుల మధ్యకుతీసుకుని వెళ్ళినది.
వారు మమ్మిద్దరిని చంపిరి. పూర్వజన్మలో నన్ను చంపించినవిధముగా ఇప్పుడు నేను మరణించిన పిదప ఆమె కూడా బాధనొందవలసి యున్నది.దీనితో మాయిద్దరి ఋణము కూడా తీరిపోతుంది ని చెప్పి వాడు కన్ను మూసెను.
కధను ముగించి వర్తకుడిట్లనెను. దళాధిపతి మరణించినాడు. ఆయన స్వారి చేసిన గుర్రము ఇప్పుడు భార్యరూపములో ఏడ్చుచ్చున్నది. .నేనిప్పుడు ఎవరి కోసము వేదన చెందవలెను? కావున దయచేసి భోజనము చేయండి అని వేడుకొనెను.
అందరూమరలా భోజనములు ప్రారంభించగా ఆవర్తకుడిట్లనెను ,కుటుంబ సభ్యులు ,బంధువులు మిత్రులు మున్నగువారు తమ కర్మాను సారంగా కలియుచుంటారని,వారి వారి రుణాలు తీరిపోగానే ఎక్కడి వారక్కడ విడిపోతారని సద్గురువులు చెబుతుంటారు. .

2 వ్యాఖ్యలు:

పరిమళం February 27, 2009 at 7:40 PM  

ఋణాను బంధ రూపేణా .........అన్నదానికి అద్దం పడుతోంది ఈ కధ .బావుందండీ .

Aditya August 5, 2009 at 9:31 AM  

Chala chala baagundandi mee kadha. Eee lokamlo bandhalu bandhavyalu ela yerpadathai, ela samasipothai anna vishayaniki addam padutondi mee ee kadha.

Itlu,
Aditya.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP