శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనిత్రయోదశి పూజకు గోత్రనామాలు పంపండి

>> Monday, January 19, 2009




ఈనెల 24 న శనిత్రయోదశి పర్వదినము వస్తున్నది.విశేషించి ఈరోజు శనీశ్వరునకు తైలాభిషేకము చేపించుటద్వారా జాతకములో శనిదశ ,అంతర్దశలలో శని సంచారములతోను చికాకులు పడుతున్నవారికి దోషములు పరిహారమవుతాయని శాస్త్రవచనము.

అలాగే ఈరోజు శివునకు రుద్రాభిషేకము తో పూజలు జరిపించటము వలన జీవితములో కష్టాలెదుర్కుంటున్నవారు వాటిని తొలగించుకోగల శక్తి పొందుతారు. పరమదయాళువైన ఆస్వామి అనుగ్రహం భక్తులపై వర్షిస్తుంది. ప్రత్యేకముగా ప్రదోషకాలములో శివార్చన అనంతశుభాలను ప్రసాదిస్తుందని పురాణాదులు తెలుపుతున్నాయి. కనుక ఆరోజు ఆభోళాశంకరుని అర్చించండి.

ఇక భక్తజనుల సేవలో భాగంగా" శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం" ఈపర్వదినాన భక్తులకోసము ఈపూజలు జరుపుతున్నది. భక్తులు తమ గోత్రనామాలు పంపితే వారి కొరకు శనికి తైలాభిషేకము ,రుద్రాభిషేకము ప్రదోషకాలార్చనలలో వారి పేర్లమీద పూజ జరుగుతుంది. ఇందు కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3 వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4 శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5 వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6 ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

ఇంకా ఏదన్నా అదనపు వివరాలు తెలుసు కోవాలనుకుంటే durgeswara@gmail.com cell 9948235641 లలో సంప్రదించండి.

సూచన:-భక్తిలేని పూజ పత్రిచేటు అన్నారు పెద్దలు కనుక మీకోసము,అలాగే తాము జపము చేయలేని నిస్సహాయస్థితిలోనున్న మీవారి కోసము భక్తితో మంత్రజపము చేయండి.పరమాత్మఅనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. శుభమస్తు.

4 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. January 19, 2009 at 6:16 PM  

ఆర్యా! దుర్గేశ్వరా! మీ హరిసేవ పూర్వ జన్మ సుకృత ఫలం. అదృష్టవంతులే మీరందించే హరిసేవానందామృతాన్ని అందుకోగలుగుతారు.
మీరు శని త్రయోదశి ప్రత్యేకతను గూర్చి వివరించి చెప్పడమే కాక, వారి కొఱకు గోత్ర నామాలను కూడా ఇమ్మని తెలుసుకొని అభిషేకాదులు నిర్వహిస్తున్నారంటే మానవులలో మాధవుని చూడగలిగి పునీత హృదయంతో లోక కల్యాణకారకులౌతున్నారు. ధన్యజీవులైన మీకు మీలోని అంతర్యామికి వందన శతములు.
మీకు అబినందనలు.
ఇట్లు,
బుధజన విధేయుడు
చింతా రామ కృష్ణా రావు.
ప్రథమ శాఖ,
కౌశికస గోత్రము,
చోడవరం గ్రామము.
విశాఖ పట్టణం జిల్లా.
సెల్ నెం. 09247272960.

విరజాజి January 19, 2009 at 9:36 PM  

మాస్టరుగారూ,

చాలా సంతోషమండీ... ! మా వారి జాతకంలో శని మహర్దశ ప్రారంభం అయినది. నిన్ననే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము. నేను శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిదని చెప్పాను. అంతలో ఈ అవకాశం వచ్చింది. మా వివరాలు క్రింద ఇస్తున్నాను. వీలుంటే ఇక్కడ (హైదరాబాదు) లో కూడా పూజలు జరిపించుకుంటాము. మీరు చెప్పిన ప్రతి అంశాన్నీ పాటిచడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాము.

మా వారు: పొదలకూరు మురళీధర్ రావు
నా పేరు : మానస (పెళ్ళపుడు మార్చారులెండి :-) )
మా బాబు: అనంత శ్రీహిత్
గోత్రం : తామర్ల

మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,

విజయ శిరీష
9246155201

Anonymous January 20, 2009 at 5:28 AM  

durgeswara garu

chala chala thanks andi mee intha krushi ki
nenu kooda gotra namalu istunnanu daya chesi abhishekam lo include cheyyagalaru

peru Aswani
gotram: harithasa

Peru anasuya
gotram:harithasa

peru Ramachandran
gotram:srivatsa

dhanyavadamulu

Anonymous January 20, 2009 at 10:14 PM  

Durgeswara rao gaaruu,

Meeru chaala manchi pani chestunnaaru.adigi mari maa perlatoa abhishekaalu chestunnaaramtea yento prasamsaneeyam.
My name: venkata bhujanga prabhakara rao..
Gotram:Bharadwajasa
Wife: Lalita
Daughter
Sai sneha.

maa perlatoa kooda abhishekam cheyistaarani sistaamu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP