అన్నదానమెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము రండి
>> Thursday, January 22, 2009
దానములలో కెల్లా అన్నదానము గొప్పది. ఎందుకంటే అర్ధిని సంపూర్ణముగా సంతృప్తి పరచగలిగే అవకాశము వున్నది ఇక్కడ మాత్రమే.
నువ్వు ఎన్ని కోట్లరూపాయలు ఎంతెత్తు బంగారము ,ఎన్ని సంపదలను ధారబోసినా చాలు అనే పదము రాదేమోగాని కడుపునిండా అన్నం పెడితే చాలు..చాలు అనితృప్తిపడతారు తీసుకునేవారు. కనుకనే అన్ని పురాణాలలోనూ ఈదానానికి విశేషపుణ్యఫలితము చెప్పబడినది.
అన్నదానము చేసేకాడ ఏ వ్యత్యాసాలు చూడరాదు.ఈవిషయాన్నే తాతగారు[వీరబ్రహ్మేంద్రులవారు] ఒక చక్కని పద్యములో చెబుతారు తమ కాళికాంబశతకములో.
అన్నమయములైనవన్ని జీవంబులు
కూడులేక జీవకోటిలేదు.
కూడుదినెడికాడ కులబేధమేలొకో
కాళికాంబ హంస కాళికాంబ..........అని
. అన్నదానము చెసేటప్పుడు కొందరిని చీదరించుకుని,గొప్పవారిని గౌరవించి సంతర్పనలవలన పుణ్యము లభించదు,అన్నదానానికి అర్హత కేవలము ఆకలి మాత్రమే. కడుపునిండినవానికి నీవి పంచభఖ్శ్యపరమాన్నాలు పెట్టినా లభించని పుణ్యం ఆకొన్నవానికి పచ్చది మెతుకులతోనైనా కదుపునింపినప్పుడు వస్తుంది. మనం చెసే పెళ్ళిల్లు,వ్రతాలు, విందులు వినోదాలలో అన్నదానం ముందుగా మన బంధువులకు ఆహ్వానితులకు చేస్తాము.అలాగే వందరకాల వంటకాలతో దానిని ఖర్చుపెంచి చేసినా చాలావరకు వృధా అవుతుండటము చూస్తుంటాము.దానికి బదులు మామూలు కూరలతో వేలమంది ఆకలి తీర్చొచ్చు ఆరోజు.నిజంగా పుణ్యఫలితం ఇలా లభిస్తుంది. నాకైతే కొన్ని ఆలయాలకూడా [సాయి ఆలయాలు,అయ్యప్ప భజనలు } జరిగేకాద ఒక విచిత్రదృశ్యము కనిపిస్తుంది.ఆకలితో బొచ్చెలు పట్టుకుని బయట జనం ఎదురు చూస్తుంటారు.వారిని చీదరించుకుంటూ,మనం పిలచిన అతిధులను వద్దాన్నా తినమని బలవంతం చేస్తూ వడ్దిస్తుంటారు.ఏమిటీ చిత్రం?.కారణమొక్కటె వీరికి దానము విలువ తెలియకపోవటము . అన్నముతినటాని కొచ్చిన జీవి భగవద్ స్వరూపముగా భావించక ఇక్కడ కూడా భౌతిక మర్యాదలకే ప్రాధాన్యత ఇవ్వటము వలన. అన్నదానము పవిత్రభావనతో కాక సంఘములో మన గౌరవ మర్యాదలను పెంచుకునేందుకు అనే భావనతో చేస్తుండటము వలన.
ఈ పద్దతిని మార్చుకోవాలి మనము. చేసే పనికి సరయిన ప్రతిఫలము రావాలంటే, యాచకున్ని నీఛముగా చూడకూడదు,అతను నీదోషాలను స్వీకరించి నిన్ను చెడు కర్మనుండి విముక్తము చేయటానికొచ్చిన విశిష్ట వ్యక్తి అని గుర్తించాలి.కనుకనే
నీదగ్గరకొచ్చినవారిని కసిరి కొట్టి వట్టి చేతులతో పంపకు,ఒక బెల్లంముక్కైనా పెట్టి పంపు అని సమర్ధసద్గురువులు సాయినాధులు బోధించారు.కడుపు నిండినవాడికి కాదయ్యో!ఆకలితో వున్నవానిపెట్టు...అని అవధూత గొలగమూడివెంకయ్యస్వామివారు హెచ్చరించేవారు భక్తులను. ఆకలి తో తిరిగిపోయే అతిథి ఆగృహస్తు పుణ్యాన్ని తీసుకుని పోతాడని శాస్త్రవచనం. పూర్వం ఎంతదరిద్రములోనున్నా ఆకొని వచ్చినవారిని అన్నంతినిపొమ్మని కొద్దిగా అంబలన్నాపోసి ఆకలి్తీర్చేసాంప్రదాయమ్ గలవారిమి మనము. నేడు అన్నీ వున్నా ఎవరన్నా అన్నం పెట్తమని వేడుకుంటే పొద్దున్నేతీరిందా! అంటూ చీదరించుకునే భావదారిద్ర్యానికి లోనవుతున్నామునేడు.
ఒక్కవిషయము గుర్తుంచుకోవాలి ఈరోజు ధనదాన్యాలతో తులతూగుతున్నవారంతా పూర్వ జన్మలో దానాలాచరించినవారుగా గుర్తించండి.మనకు భగవంతుడు ప్రసాదించినది సాటి జీవులతో పంచుకోకపోతే దొంగతనము చేసి తిన్నదిగా తెలుసుకోండి,
ఈజనమలో అన్నీ వున్నా తినటానికి వీలులేని రోగాలతో బాధపడేవారు పూర్వము అన్ని దానాలు చేసినా ఆన్నదానము చేయనివారని గుర్తించాలంటున్నాయి శాస్త్రాలు .
కనుక అన్నదానము చేద్దాము .సాటిజీవులలో నున్న పరమాత్మను తృప్తి పరుద్దాము.
[ఈనెల ఇక్కడ పీఠములో జరిగే పూజలకు గోత్రనామాలు పంపినవారు అన్నం పొట్లాలు కట్టుకునైనా వెళ్ళి బస్ స్టాండ్ లలో రైల్వేస్టేషన్లలో, ఆకలితో నకనకలాడుతూ వుండే వారికిచ్చి వారి ఆకలి తీర్చండి.ఇక్కడ మీకొరకు మేము చేసే పూజ వేయిరెట్లు శక్తివంతమై మీకు సకలశుభాలను కలుగ జేస్తుంది.]
2 వ్యాఖ్యలు:
అనుసరణీయం, ఆచరణీయమైన పెద్దల సూచనను తప్పక పాటిస్తాను.
ధన్యవాదములు శ్రీనివాస కుమార్ గారూ.
Post a Comment