శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విడిపోయిన భార్యా భర్తలను కలిపిన భక్తాంజనేయుడు.

>> Wednesday, January 14, 2009

నమ్మినవారిని కాపాడటమే దీక్షగా పెట్టుకున్న స్వామి మరొక అద్భుత లీల చూపాడు. ఆనాడు వేరైన సీతారాములను తిరిగి కలిపి వారి హృదయాలలో వేదనతొలగించి భక్తారాజు హనుమంతుడు , మరొకసారి తన మహిమచూపి భక్తరక్షణలో తన నిత్యసత్యమైన ఉనికిని చూపాడు నేడు. విషయాని కొస్తున్నాను.

ఈకాపురాలు కూలనున్నాయి,సలహా చెప్పమని మిమ్మల్ని కోరుతూ ఈనెల ఒకటవతేదీ ఒక పోష్ట్ వ్రాసాను.దీనికి స్పందించి తమ విలువైన సలహాలను కూడా బ్లాగర్లు పంపారు.

నేను వ్రాసిన మూడు కుటుంబాలలో మూడవ కుటుంబానికి చెందిన విచిత్రం ఇది. ఇందులో వున్న భార్యా భర్తలిరువురు విడిపోయి నాలుగు సంవత్సరాలయినది. ఎన్నిసార్లు ఇతను కలుపుకు పోదామన్నా ఆవిడ కలసిరాలేదు. కన్న బిడ్దలదగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని ఎంత తపించినా సాధయం కాక,తన భార్యకు చేరువకాలేక సతమతమవుతున్న ఈతను ఈమధ్య నాదగ్గరకొచ్చి తన బాధను నాతో చెప్పుకున్నాడు.నెను మానవప్రయత్నాలనేకాదు దైవాన్ని విశ్వసించమని ,హనుమంతుని ఉపాసించమని సలహా చెప్పాను. అతను నిష్టగా చాలీసాపారాయణము, ప్రదక్షిణాలు చేస్తున్నాడీ మధ్య. అయితే మానవప్రయత్నము కూడా చేసి చూద్దామని నాప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. అతను కూడా తనప్రయత్నాలు చేసినా ఆవిడనుండి తిరస్కారమే ఎదురైనది. ఈప్రయత్నాలగురించి నేను మొన్నరాసిన పోస్ట్ లో చెప్పాను. ఆమరుసటిరోజు అతను ఫోను చేసి లాభం లేదు మాష్టారూ! తాను అంకెకొచ్చేరకము కాదు.ఇక బిడ్డలకోసము నేను తపనబడి లాభము లేదు. విడాకులే కోరుతున్నది ఆవిడ అని బాధపడి, ఆవిడ ఇష్టం ప్రకారమే విడాకులకు సిద్దమవుతానని చెప్పాడు, నేను వారించి ఇంతకాలం ఓపిక పట్టావు,స్వామిని ఆశ్రయించి నిరాశ పడవద్దు.మిమ్మల్ని విడిపోనివ్వడాయన,నాకా నమ్మకం వున్నది.ఇంకొద్ది కాలం ఆగు.చాలీసా పారాయణం తీవ్రతరం చేయి అని నచ్చచెప్పాను.

ఈరోజు ఉదయాన ఆరుగంటలకే గుడిలో వున్నప్పుడు ఫోన్ వచ్చినది.కోటేస్వరరావునుంచి అని ఇంటిలోనివారు తెచ్చిఇచ్చారు ఫోన్. నేను ఏమిటి అనగానే అతను తలనెప్పి వదిలినది సార్ అన్నాడు. అయ్యో వీల్లేదో విడిపోయినట్లుందే అని నిరాశపడి ఏమైనది అని అడిగాను.స్వామి అనుగ్రహం సార్ మీకే ముందుగా చెబుతున్నాను.రాత్రి మా అత్తగారింటికి వెళ్ళి మాట్లాడాను
ఎప్పుడూ లేనిది కొందరు ఆ అమ్మాయి బంధువులు కూడా వచ్చి తనను మందలించారు నాతో కలిసి వుండటానికి నా భార్య ఒప్పుకున్నది. అని ఆనందంగా చెప్పాదు. హమ్మయ్య...స్వామీ నామాట నిలబెట్టావు....పొరపాటు..పొరపాటు..నీ భక్తజనరక్షదీక్షను నిరూపించుకున్నావని స్వామి వారికి కృతజ్ఞతలను తెలుపుకున్నాను. నన్ను ఈరోజు రమ్మన్నారు సార్ అత్తగారింటికి అన్నీ తీసుకుని అని చెబుతున్నాడు,నామనసుమాత్రం స్వామి వారి భావనతో ఆనందం నిండిపోతున్నది. ఈరోజు కనుమ పండుగ వద్దులే ..అదీగాక మాంసాహారం పెడతారు,నువ్వు చాలీసా పారాయణలో వున్నావు ,రేపు వెళ్లమని చెప్పాను.స్వామి పారాయణము మరింత శ్రద్దతో చేయమని సూచించాను.
ఇక్కడ మానవప్రయత్నాలన్నీ వృధాయైన సమయాన ఆప్రయత్నాలకు భగవంతుని అనుగ్రహాన్ని జోడించినప్పుడు ఎలాశుభాలనిస్తాయో దైవశక్తి మరొకసారి నిరూపించినది.అలా కాదు ఎప్పుడో నుంచి ప్రయత్నాలు ఇప్పటికి ఫలితాని కొచ్చాయని వాదించకండి.ఇప్పటిఫలితమే ఎప్పుడో ఎందుకు రాలేదు అని ఎదురు ప్రశ్నవేస్తే వాదించేవారి వద్ద సమాధానం ఉండదు.కాకుంటే వితండవాదం సాగుతుంది అదివృధా! నమ్మిన వారికి సొమ్ము.నమ్మకుంటే దుమ్ము,అని మహాత్ములు గొలగమూడి వెంకయ్యస్వామివారు బోధించినవిధంగా పెద్దలమాటనమ్ముదాము.భగవంతునిశరణాగతులమై ధర్మబద్ధ జీవితమ్ గడుపుదాము.

జయ సీతాశోకనివారకాయ ,భక్తరక్షాదీక్షాధారిణే , హనుమతే నమ:

ఇంతకు ముందు ఈవిషయమై వ్రాసిన పోస్ట్ చూడటానికి ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2009/01/blog-post_05.html

6 వ్యాఖ్యలు:

ప్రపుల్ల చంద్ర January 15, 2009 at 1:42 AM  

మొత్తానికి సుఖాంతం అయ్యింది... సంతోషం..

సుజాత వేల్పూరి January 15, 2009 at 3:36 AM  

ఆయన పనే అది కదండి! మొత్తానికి ఇద్దరూ పిల్లల మూలంగానైనా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం.

నేస్తం January 15, 2009 at 5:28 AM  

ఆ స్వామి దయవల్ల మళ్ళి కలిసారు ..చాలా సంతోషం అండి :)

Anonymous January 15, 2009 at 9:06 PM  

chaala santhosham :)
raama lakshmana jaanaki...jai bolo hanuman ki !!!

durgeswara January 16, 2009 at 3:58 AM  

మంచి మనసుతో వీళ్ళు కలవాలనుకుని సంకల్పించిన మీ అందరికీ ,ఆదుకున్న స్వామికి శతకోటి వందనములు.ధన్యవాదములు. స్వామి ఇచ్చిన ఈఅవకాశాన్ని సద్విని యోగపరచుకోవాలని ఆజంటను కోరుతున్నాను.

మనోహర్ చెనికల February 6, 2009 at 3:58 AM  

తరచి చూడగలగాలే గానీ ఈ చరాచర జగత్తులో ఏ విషయంలో ఆ పరమాత్మ లీలా విన్యాసం కనపడదు చెప్పండి, మనస్సును పవిత్రంగా, పరిపూర్ణంగా ఆ భగవంతుడిమీద లయం చేసి చూస్తే ప్రతీ విషయంలోనూ ఆయనే కనపడతాడు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP