శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దత్తాత్రేయ జయంతి శుక్రవారము నాడు.ఆదిగురువు ఆస్వామిని సేవించుట మరువకండి

>> Wednesday, December 10, 2008


లోకానికి ఆదిగురువు,అత్రి అనసూయల పుత్రుడుగా జన్మించిన దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఈనెల 12. ప్రతి జీవి మహోన్నత స్థితినొందేవరకు తాను మరలా మరలా పలు గురుస్వరూపాలుగా అవతరిస్తూ లోకానికి వెలుగును ప్రసాదిస్తున్న ఆ త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు ప్రేమ మయుడు. స్వామి ని స్మరించినంతనే సంతోషించి వారికి రక్షణ నిస్తాడు. లొట్టచేతులతో పుట్టిన కార్తవీర్యునకు మహా సామ్రాజ్య సంపదలను,అద్భుతశక్తులను అనేకమంది మోక్ష కైవల్యాలను ప్రసాదిమ్చిన స్వామి ని మనసారా వేడుకునే అవకాశమొచ్చినది.ఈరోజు భక్తులు మీకు సమీపములోని దత్తక్షేత్రానికి వెళ్ళి దగ్గరలోని గురుస్వరూపముల ఆలయములలోకి వెళ్ళయినా స్వామిని అర్చించుకోవాలి.

మరొక విశేషమేమిటంటే ఈ రోజు శుక్రవారం కూడా కలసి వచ్చినందున అమ్మవారికి చంద్రోదయ సమయములో
లలితా సహస్ర నామాలతో పూజిస్తే అమ్మ ఆనందముతో పొంగిపోతుంది తన భక్తులను చూసి. పూజలు కాక ధ్యానాదుల ద్వారా భగవమ్తుని సేవించేవారు పౌర్ణమి ఘడియలలో ధ్యానానికి విశేష శక్తివుంతుంది .ధ్యానము మంచి ఫలితాన్నిస్తుంది. ఈసమయములో.
మా వూరిలోనున్న ప్రసుద్ధ దత్త క్షేత్రము కొండగురునాధుని కొండపై రాత్రికి పూజ హోమము ధ్యానము పీఠము తరపున భక్తులచేత నిర్వహింపబడుతున్నది. భక్తులు పాల్గొనవచ్చు. రాలేనివారు గోత్రనామాలను పంపితే వారి తరపున కూడా సంకల్పము చెప్పబడుతుంది. పీఠములో చంద్రోదయ సమయములో శ్రీచక్రార్చన జరుగుతుంది. ముఖ్యముగా ఇప్పుడు లలితా యాగానికి పారాయణము చేస్తున్న వారు చంద్రోదయ సమయములో పారాయణ చేయటము మరచిపోకండి.ప్రయాణములోవున్నా,మనసులో స్నానము చేసిన భావన తెచ్చుకుని పారాయనము చేయండి.


సేవించి స్వామి అనుగ్రహాన్ని పొందండి.

1 వ్యాఖ్యలు:

maheshudu January 7, 2009 at 11:35 AM  

meeku oka rahasyam chebutunnanu.sri swamivaru prastutam manaku sameepamlone avtarinchi vunnaru,enno mahimamlu chuputoo SRI GANAPATI SACHCHIDAANADA SADGURU DEVULA VARIGA.bhaktulanadagandi vari gurinchi nijam chebutaru.swami sevalo mahesh vemulapalli

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP