యజ్ఞము- విజ్ఞానాత్మక పరిశీలనము [2వభాగము]
>> Thursday, December 11, 2008
యజ్ఞమందలి శాస్త్రీయ దృక్పధం.
--------------------------------------------------
ఈభౌతిక ప్రపంచములో శక్తి ప్రాధమికముగా శక్తి రెండురూపాలలో వుంటుంది. అవి ఉష్ణము ,శబ్దము. యజ్ఞము చేయటములో ఈరెండు శక్తులు అంటే ,యజ్ఞములోని అగ్నిలో వచ్చే ఉష్ణము,అప్పుడు వల్లించే మంత్రములను ఉచ్చరించడముద్వారా వచ్చేశబ్దము కలిసి కావల్సిన భౌతికమానసిక,ఆధ్యాత్మికలాభాలను మానవాళికి అందిస్తాయి. నిర్దేశించిన పదార్ధాలను హననం చేయటమువలన ఆయా పదార్ధాలలో నిబిడీకృతమయిన సూక్ష్మనిగోచర శక్తులను వెలుకితీసుకువచ్చి,చుట్టుపక్కల వాతాఅవరణములోనికి వ్యాపించేలా చేసి తద్వారా లాభము కలిగేలా చేయటము జరుగుతుంది. యజ్ఞక్రతువులో ఆసమయములో పలికే మంత్రాలద్వారా ఉత్పన్నమయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఆయా మంత్రాలలో నిబిడీకృతమయినశబ్ద సంకేతాలను విశ్వమంతా వ్యాపించేలా చేస్తాయి.
యజ్ణములో వాడే సామాగ్రి
----------------------------------
యజ్ఞములో జరిగే పలురకాల రసాయన చర్యలను గూర్చి అర్ధము చేసుకునేందుకు ఇందులో అర్పింఛబడే పలురకాల పదార్ధాల్ను గూర్చి తెలుసుకోవడము అవసరం.
1.దారువు:- ఇందులో వాడబడే దారువు తేమలేనిదిగాను,ధూళికీటకాలు పురుగులు లేనిదిగాను ,యజ్ఞాకుఁడానికి సరిపడా అనువయిన చిన్న ముక్కలౌగా చేయబడాలి. వీటిని సమిధలు అంటారు. వీటిలో ముఖ్యమయినవి చందనము, అగరు,తొగరు,దేవదారు,మామిడి,రావి,మర్రి,జమ్మి,గులార్ మొదలయినవి.
2 సుగంధభరిత పదార్ధాలు :- కుంకుమ పూవు కతూరి,అగరు,తొగరు,చందనము,జాజికాయ,జాపత్రిమరియు కర్పూరము.
మధుర పదార్ధాలు:- పంచదార, ఎండుద్రాక్ష,తేనె వగైరాలు.
ఔషధపదార్ధాలు:- వీటిలో ఒక్కొక్కదాన్ని నిర్దిష్టమయిన అవసరాలకోసం వాటికనుగుణముగా వినియోగించాలి. సాధారణ్ముగా వాడే మొక్కలు..... సోమలత,,శంఖపుష్పి ,బ్రాహ్మి, నాగకేసర,ఎర్రచందనం ,.ప్రస్తుతము చాలాచోట్ల మూలికలను పొట్టులగా చేఇ అమ్ముతున్నారు.దీనిలో పైన,చందనం,అగరౌ తగరు,గుగ్గిలం,జటామాంసి,కచ్చూరం,సుగంధపాల,యాలకులు,జాజికాయ జాపత్రి లవంగాలు ,దాల్చినచెక్క మొదలయినవున్నాయి.
యజ్ణములో వాడబడే వస్తువుల గుణము ,పరిస్తితులు,వాటి పాళ్లు,ఉష్ణోగ్రత సమిధల అమరిక అనుసరించి వేరువేరుగా వుఁటాయి కనుక భౌతిక శాస్త్ర ఆధారాలను వివరించటం కొద్దిగా ఇబ్బంది. అంటే యజ్ణము జరిగే వాతావరణము వేరు వేరుగా ఉంటుందికనుక సార్వత్రికముగా ఒకేరకముగా వుండక కొద్ది మార్పులు ఉంటాయి.
గంధోత్పత్తి పదార్ధాల భాష్పీకరణము :- యజ్ఞకుండములో ఉత్పత్తయ్యే ఉష్ణోగ్రత250డిగ్రీల సెంటీగ్రేడ్నుండి 600డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మండుతున్నప్పుడు 1200నుఁడి 1300ల సెంటీగ్రేద్ వరకు పెరిగే అవకాశమున్నది. ఇందులో ఆవిరిగా మార్చబడేపదార్ధాలు మరిగేఉష్ణబిందువుల స్థాయికి చేరుకుని ఆవిరిగా మారి వాతావరణములోనికి వ్యాపిస్థాయి. సెల్యులోజ్ ,పిండిపదార్ధాలు దహన మయినప్పుడు వాటిలోవున్న హైడ్రోజన్ ఆక్సిజన్ లకలయిక జరిగి అధిక పరిమాణములో నీటియావిరి ఉత్పన్నమై వాటితో థైమాల్, యూజినాల్,పైనీన్,టెర్సినాల్ వంటి పదార్ధాలు వాతావరణములోనికి వ్యాపిస్తాయి. ఇందువలన యజ్ఞము యొక్క సుగంధం సుదూరమునకు వ్యాపిస్తుంది.
నీటియావిరి తోబాటు అధికముగా విడుదలైన ధూమము అప్పటి ఉష్ణోగ్రత ,గాలి వాటములను బట్తి వ్యాపనం జరుగుతుంది.
[ఇంకావున్నది]
0 వ్యాఖ్యలు:
Post a Comment