యజ్ఞము- విజ్ఞానాత్మక పరిశీలనము [1వభాగము]
>> Sunday, December 7, 2008
భారతీయ సంస్కృతిలో యజ్ఞానికి విశేష ప్రాధాన్యత వున్నది. భారతీయ జీవన విధానమే యజ్ఞమయము. అసలు యజ్ఞమనేపదానికి అత్యుత్తమ కారణాలనిమిత్తము మనం స్వార్ధరహితముగా చేసే బలిదానము అని అర్ధము. అహంకారము ,స్వార్ధం భౌతిక భవబంధాలను త్యాగం చేసి యుక్తమయిన ఆలోచనావిధానాలతో సాటిమానవులపై సానుభూతి,సర్వమానవ సౌభ్రాతృత్వానికై అంకితము చేయబడిన సృజనాత్మకత ,ఇది నిజంగా అందరూ ఆచరించదగిన అత్యున్నత యజ్ఞము. సంఘములో సామరస్యభావనతో జీవించటం, అత్యున్నత మానవ విలువలను సంఘములో స్థాపించటం,కొరకు అవసరమయిన జీవన విధానాన్నిమనకు బోధిస్తుండట మే దీనిలోని తాత్వికత. ఇదే ఆదర్శవంతమయిన మానవసంస్కృతికి పునాదవుతుంది. సంఘములో అందరినీ గౌరవిస్తూ చేసేది సేవాయజ్ఞమయితే,ఇతరుల జీవితాలను కాంతివంతము చేసేందుకు విజ్ఞానాన్ని,విద్యను అందించేది జ్ఞానయజ్ఞము,. ప్రపంచములో బాధలను వేదనలను అనుభవించేవారి జీవితాలలో నూతన జీవితాన్ని నింపేది ప్రాణయజ్ఞమవుతుంది. ఇక భౌతికముగా పదార్ధాలతోను మనసును అనుసంధానించి మంత్రశక్తినుపయోగించి ఫలితాలను రాబట్టేందుకు అగ్నిముఖముగా చేసే పవిత్రక్రియ యజ్ఞముగా మనము పరిగణిస్తాము. మరి ఇందులో వున్న శాస్త్రీయ దృక్పథ మేమిటి? అనేది తెలుసుకోవటము మనశ్రద్ధాసక్తులను పెంపొందిస్తుంది.
దేవతలు అగ్నిముఖులు . అంటే అగ్ని ద్వారా తమకు సమర్పించిన సమర్పణలను స్వీకరించువారు అని భావము. మనము మనమనోభావాలను కేంద్రీకరించి అగ్నిద్వారా సమర్పించిన పదార్ధాలను అగ్నిదేవుడు. దేవతలకు చేరవేస్తాడు. అగ్నికి అంతశక్తివున్నదా ? అని సందేహమక్కరలేదు. ఉదాహరణకు ఒక చిన్న ఎండుమిరపకాయను తీసుకుని నలిపితే మనకు కోరు వస్తుంది. దానినే రోట్ళో లేక గ్రైండర్ లోవేసి కొడితే ఇంటిల్లపాదికి దగ్గువస్తుంది. దానినే పొయ్యులో వేస్తే మన ఇంటి సమీపములో వున్నవారికి కూడా దగ్గువస్తుంది. అంటే ఒకపదార్ధములోని అణూవులను ఎక్కువదూరము వ్యాప్తి చేయగలశక్తి అగ్నికి వున్నదని భౌతికముగా అర్ధమవుతున్నది. ఇక అత్యున్నతమయిన ఆథ్యాత్మిక విషయములో ఈక్రియ ఉత్పన్నం చేయగలశక్తి , సాధించేఫలితాలు చాలాగొప్పగా వుంటాయి. కనుక యజ్ఞం గూర్చి సమగ్రమయిన విజ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.[ఇంకావున్నది]
2 వ్యాఖ్యలు:
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...మంచి టపా.. ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను
ఇంకావున్నది.సమయము చాలక వ్రాయలేదు.త్వరలో వ్రాస్తాను చదవండి.ధన్యవాదములు
Post a Comment