దీక్షాధారణలో కానిపనులుచేయటం ప్రమాదకరం
>> Monday, December 1, 2008
భగవంతుని కృపను పొందటానికి సాధారణ జీవితం గడుపుతున్న మనుషులకు ఒక గొప్ప సాధనామార్గం దీక్షాధారణ. మండలం పాటు సాగే ఈదీక్షల పద్దతి పూర్వం వున్నప్పటికీ ,అయ్యప్పసవామి దీక్షలరూపములో ఈశతాబ్దములో బాగాప్రాచుర్యానికొచ్చాయి. .తరువాత భవాని,శివ,,గోవింద మాల తదితర దేవతాఉపాసనలు దీక్షారూపములో జనబాహుళ్యంచేత విస్తృతంగా జరుగుతున్నాయి. ఈదీక్షలవలన మనిషియొక్క శారీరిక మానసిక ఆరోగ్యాలు చక్కబడి మనసు భగవంతుని పట్ల నిలకడకలిగి వారి సాధనద్వారా వారికి శ్రేయస్సు కలుగుతున్నది. వేలాది మంది భక్తులు ప్రతిసంవత్సరం కొత్తగా దీక్షలు స్వీకరిస్తున్నారంటే వారికి ఆదీక్షలద్వారా జరుగుతున్న మేలు ప్రత్యక్షముగా అనుభవము లోనికి రావటమే. కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని మానసిక శాంతిని ,మనోనైర్మల్యాన్ని,ఈతిబాధలను నివారించే శక్తిని మానవులకు దీక్షలు ప్రసాదిస్తున్నాయి. నియమాలను నిష్ఠగా ఆచరించినవారికి ప్రయోగాత్మకంగా వారి సమస్యలు నివారణవుతుండగా,మరికొందరికి శీఘ్రఫలితము రాకపోవటానికి,వారి సాధనలో జరుగుతున్నలోపాలే కారణమనిచెప్పవచ్చు.
గురుముఖతా చేసే సాధనలో శిష్యుని సాధనలోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయనే సరిచేస్తాడు. కానీ కలియుగములో గురుభక్తి లోపించటము,అంతటి సమర్ధులయిన గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం వలన కొందరి సాధనలో సరయిన ఫలితాలు రాకపోవ్టానికి కారణంవుతున్నది. కొండొకచోటవారి సంచిత ఆగామి,ప్రారబ్ధకర్మాదుల వలనను ఆలస్యం అవుతుంది. దీక్షాధారుల కు సరయిన మార్గదర్శనం చేసే గురుస్వాములు సహకారం అందరూ తీసుకోకపోవటం ,కలిమాయా ప్ర్భావానికి లోనయి కొన్ని కానిపనులు చేసి కష్ఠాలు తెచ్చుకునేస్వాములను మనం చూస్తుంటాము. వాటికి వెనకున్న కారణము తెలియదు గనుక ఆదీక్షపట్ల ,దైవం పట్ల విశ్వాసాన్ని సడలించుకుంటారు తెలియనివారు. నిష్టానియమాలతో ఆచరించినప్పుడు ఎంతశుభకరపరిణామాలను ప్రసాదిస్తాయో కానిపనులు చేసినప్పుడు తీవ్రమయిన కష్ఠాలు వస్థాయి. అవి మనంచేసుకున్న కర్మలఫలితాలుగా గుర్తించాలి. సహజంగా కామక్రోధాది అరిషడ్వర్గాలు , దుష్టశక్తుల సమూహాలు మానవులను భ్గవ్న్మారగం నుంచి మల్లించి పతనమొనర్చే పనిని నిరంతరం చేస్తూనేవుంటాయి. జాగురూకతతఒ వుండకపోతే సాధకునికి పతనం తప్పదు.
అటువంటి ఒక సన్నివేశం మీకు తెలియజేస్తాను. మాఊరిలో పది సంవత్సరాలక్రితం జరిగిన సన్నివేశమిది. ఆసంవత్సరము మాలధరణ చేసిన స్వాములంతా దీక్షపూర్తిచేసి శబరిమల యాత్రకు వెళ్ళారు. అందరూ కొండఎక్కేటప్పుడు జనం ఎక్కువగావున్నందువలన చిన్నగా వారి సహనానికి పరీక్షలా సాగుతున్నదట యాత్ర. మాఊరి స్వాములలో ఒకరు[పేరుచెప్పటం భావ్యంకాదు] అప్పటికప్పుడు ఆవేశం వచ్చినవానిలా నేనీ యాత్రకురాను అని విసుక్కుంటూ స్వామీ ...స్వామీ అని వెంటనున్నవారు వారిస్తున్నా వినకుండా మెడలో మాలను పీకి విసిరివేసి తిరుగు ముఖం పట్టాడు. వచ్చిన పదిరోజులకు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ముందు జ్వరం,తరువాత కీళ్ళనొప్పులు రకరకాల కారణాలతో చికిత్సపొందుతూ హాస్పటల్స్కు తిరుగుతున్నాడు. నెలరోజులలో వెన్నుముకలో చీముపట్టీఅనదని గుంటూర్ జనరల్ హాస్పటల్ కు చేర్చారు. తల్లిదండ్రి కుటుంబం బావురు మంటున్నారు. ఆర్ధికంగా పెద్దగా లేని వారు బ్రాహకుటుంబముకనుక ఊర్లోవాల్లు కూడా తలాఒకచెయ్యిఅందించారు. వ్యాధి తీవ్రత ఎక్కువైనది. శబరిమలపోయి వచ్చిన కాడనుండి మావానికి ఇలా అయినదన్న అపోహలో కొందరు కుటుంబసభ్యులున్నారు. చివరకు అతను మరణించాడు. మరణించటానికి ఒకరోజు ముందు తనకు సన్నిహితుడయిన ఒకరిక అసలు విషయం చెప్పాడు. అన్నాఇది నేను చేసుకున్న పాపమే , మాలలో వున్నరోజులలో నేను ఒకసారి పొలానికి వెళ్ళినప్పుడు నాకు సంబంధమున్న స్త్రీ కూడా గడ్డికి వచ్చినది. అక్కడ ఎవరూ లేకపోవటము వలన నన్ను బలవంతపెట్టటముతో మాల తీసి చెట్టుకు తగిలించి ఆమెతో కలిశాను.తరువాత కాలువలో స్నానం చేసి మరలా మాలధరించాను. నేను చేసుకున్న పాపానికి నాకీశిక్షపడినది మీరెన్ని వైద్యాలు చేసినా నాపరిస్థితి నాకు తెలుస్తున్నది కనుక నేను సజీవముగా ఇంటికిరావటము కల్ల. అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారట. ఈవిషయాన్ని బయటపెట్టడం బాగుండదని చాలారోజులు ఆయన దాచివుంచాడు.
కనుక మాలాధారణ జేసిన భక్తులు వళ్ళు జాగ్రత్తగావుంచుకుని నడవాల్సివుంది. ఎందుకంటే మన కర్మలకు కర్తలము మనమేకనుక .
0 వ్యాఖ్యలు:
Post a Comment