శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాటు వేస్తున్న కాలసర్పయోగము

>> Friday, November 28, 2008

ముంబాయిలో ఈనాడు జరుగుతున్న నరమేధం ముందుగా తెలుపలేదని ఇంటిల్జెంస్ వైఫలల్యం అంటున్నాము. మేము సముద్రమార్గములో వుగ్రవాదులు రావచ్చని ఆరునెలల క్రిందటే హెచ్చరించామని ఆవిభాగం అంటున్నారని తెలుస్తున్నది.
ఆరునెలలు కాదు సంవత్సరం ముందుగా లేక దశాబ్దాలముందుగా తెలియజేసినా సరైన జాగ్రత్తలు తీసుకొని జాతిని రక్షించాలనేతపనలేనినాయకత్వాలపాలనలోవున్నాము మనము. ఈరోజు ఏప్రమాదాల ను గురించయినా కొద్ది ముందుగా తెలుసుకోగల యంత్రాంగము,యంత్రపరికరాల సహాయము ప్రపంచానికుంది. కాని ఈదేశానికి అంతకంటే వున్నతమయిన విజ్ఞాన భాండారము లభించివున్నది. కాని ఏమిలాభం? అన్ని వున్న అల్లుడినోట్లో శని అన్నట్లు అయినది మన పరిస్థితి.

గ్రహస్థితులు,చలనాల ఆధారంగా భూమి మీద జరగనున్న వుత్పాతాలను,వుపద్రవాలను సహితం ముందుగానే లెక్కించి చూపగల మన జ్యోతిషవిజ్ఞానం మరేదేశానికి లేని సంపద మనకు. ఎప్పుడువర్షాలు,వరదలు తుఫానులు రాగలవో .ఎటువంటి ప్రమాదాలు సంభవించగలవో ముందుగానే వూహించగల సత్తా మనజ్యోతిషవిద్యకున్నది. కనుకనే ప్రతిసంవత్సరం ఎప్పుడు వర్షాలు తుఫానులు ,పౌర్ణిమ అమావాస్యలు, గ్రహణాలు ఏ యంత్రపరికరాల సహాయం లేకుండానే మన పంచాంగాలు తెలియజేస్తున్నాయి. వానిలెక్కలప్రకారం అవి వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఈసంవత్సరము సూర్య చంద్ర గ్రహణాలవలన కాలసర్పయోగము ఏర్పడుతున్నదని,దాని ఫలితంగా ,వుగ్రవాద చర్యలు ఏఏ ప్రాంతలలో సంభవించవచ్చో.ఎక్కడేక్కడ తుఫానులు రావచ్చో పంచాంగాలు ముందుగానే హెచ్చరించాయి. దాని ప్రకారమే వరుస సంఘటనల్తో భారతావని దద్దరిల్లుతున్నది. కాలసర్పయోగం పొంచివున్నది జాగ్రత్త అని ఈబ్లాగులో నేను ఆగష్టులోనే జ్యోతిష శాస్త్రవేత్తల హెచ్చరికలను పోస్ట్ చేశాను .
ఏదేశమయినా తమకున్న వనరులనన్నింటిని వుపయోగించుకుని ప్రజల యోగక్షేమాలకు చర్యలు చేపడుతుంది. రష్యా ,అమెరికాలు సహితం అవసరమయినప్పుడు తమ ప్రాచీన తాంత్రిక విద్యలను కూడా ఇంటిల్జెన్స్ వారికొరకు వుపయోగించుకుంటున్నదన్న వార్తలు చదివాము. కానీ ఈదేశములో మాత్రము అంతటీ అపూర్వవిద్యలను మతవిద్యలుగానే పరిగణించి దూరముగావుంచుతున్నది. 80 శాతం ప్రజలు నమ్మే ఈవిద్యలు విశ్వసనీయతను కేవలము కొన్ని వర్గాలకొరకు మాత్రమె దూరంచేసుకుని పోగొట్టుకుఁటున్నాము. వీటిలో ప్రామాణికతను గమనించాలంటే పొట్టకూటికోసం వీటీని ఆశ్రయించేవారినికాక ఈవిద్య్లపై సాధికారత వున్న మహానుభావులెందరో వున్నారు. వారిని సలహాలతో ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపి వుపయోగములోనికి తేవచ్చు. నివారణ మార్గాలు చేపట్టవచ్చు.
వరుసగా కాలసర్ప దోషమువలన దేశములో వుగ్రవాద సంఘటనలు ఒకవైపు,తుఫానులనే ప్రకృతి భీభత్సాలు మరొకవైపు ప్రమాదాలు ఇంకొక వైపు అల్లకల్లోలము చేస్తున్నాయి. డిసెంబర్ 22 దాకా మరికొన్ని అవాంచనీయ సంఘటనలు సంభవించవచ్చు. ఇంటిలిజన్స్ విభాగాలను పటిష్టపరచడము మన ప్రాచీన విద్యలసహాయముతో రాగల ప్రమాదాలను తెలుసుకుని ముందుగానే జాగ్రత్తపడటము చేయగల ప్రభుత్వాలను మనము చూడగలమా? అనుమానమే.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP