శ్రీలలితా సహస్రనామ పారాయణ యాగము ఈనెల 5 నుండి.
>> Wednesday, December 3, 2008
అన్నిరూపములకాదిరూపమై ,అనంతసృష్టిపాలనలయకారిణియై సకలభువనాలను పాలించు తల్లి శ్రీలలిత .తానే వివిధరూపాలలో భక్తులసేవలను అందుకునివారిని తల్లిలా కాపాడి,రక్షిస్తున్నది. అందుకే ఆతల్లి నివాసమునకు ప్రతీకయైన శ్రీచక్రార్చన చేస్తే సకలదేవతార్చన జరిగినట్లేనని శాస్త్రవాక్యము. అమ్మను ఆనందింపచేయటానికి "లలితాసహస్రనామపారాయణము" అత్యంత శీఘ్రకారిణీ. ఈ పారాయణద్వారా భ్క్తులు పొందలేనిది లేదు. కనుకనే కోట్లాది మానవులు నిరంతరం ఈపారాయణాన్ని సాగిస్తూ ఉంటారు.
అమ్మకు ప్రీతిపాత్రమైన ఈ నామార్చనను ఈక్లిష్టమయిన,విపత్కర కాలములో ఉపద్రవనివారణార్ధం, భక్తజనుల సంరక్షణార్ధం షోడశ కళలకు ప్రతీకగా ,షోడశీ మంత్రాక్షర సంకేతముగా 16 రోజులు జరపాలని పరమగురువుల ఆజ్ఞ. ప్రత్యక్షముగాను,పరోక్షముగాను భక్తులందరూ దీనిలో పాలుపంచుకుని ఇష్టకామ్యార్ధసిద్ధిని పొందుటయేగాక లోకకళ్యాణమునకు పాల్పంచుకోగలరని మా ఆహ్వానము. డిసెంబర్22వరకు కాలసర్పయోగము పొంచివున్నందున దానినుండి మానవాళికి కీడు జరగకుండా వుండేందుకై మీవంతుగా ఈపారయణ యజ్ఞములో పాల్గొని లలితా సహస్రనామాలను పఠించవలెనని.మా విన్నపము.
ప్రారంభము: 5-12-2008 శుక్రవారము
ప్రతిరోజు జరుగు కార్యక్రమములు : - శ్రీసూక్త ,దుర్గాసూక్త యుక్తంగా అభిషేకములు ,షోడశోపచారములు,. రోజుకొక రకము
పూలతో శ్రీచక్రార్చన 16 రకముల ప్రసాదముల నివేదన
యజ్ఞము : - 20-12-2888 శనివారము లలితాహోమము ,పూర్ణాహుతి.
పాల్గొనువిధానము:- మీరు ప్రత్యక్షముగా వచ్చినను రాలేకున్న మీఇంటివద్దనే పూజ గదిలో కూర్చుని పారాయణము మీశక్త్యానుసారము ఒకటి లేక మరెన్నిసారులు పారాయణము చేయగలరో అన్ని సారులు పారాయణ చేయాలి. చేసేముందు మీఅభీష్టములను,మరియు లోకశాంతిని కోరుకుంటూ సంకల్పము చెప్పుకోవాలి. పారాయణానంతరము ఎదోఒక ఫలాన్ని నివేదించాలి.ఇష్టకామ్యసిద్ధికి సహస్రనామాలలో సంబంధిత నామాన్నిజపించడం ,లోకశాంతికోసం పారాయణాన్ని చేయండి.
20 వతేదీలోపల మీరు , 16,15, 9,8, 5 రోజులుగా పారాయణము సాగించాలి. మధ్యలో ఒక్క్యరోజు కూడా ఆపకుండా చేసిన రోజులే లెక్కలోకి తీసుకోండి.
మీగోత్రనామాలు కుటుంబసభ్యులపేర్లు తెలయచేస్తే ఈ పారాయణయజ్ఞము ముగిసినదాకా మీపేర్లమీద పూజ జరుపబడుతుంది. పూర్ణాహుతి తరువాత యజ్ఞప్రసాదము,శ్రీచక్రార్చనలో ఉంచిన రక్షలు అమ్మవారి కుంకుమ పంపమనేవారు తమ పూర్తి అడ్రస్ మరియు పొస్ట్ ఖర్చులు పంపవలసి ఉంటుంది.
మరిసిద్ధం కండి ....ఆ అమ్మ అనుగ్రహవర్షములో తరించడానికి. మనందరం కలసి గొంతెత్తి ఆతల్లి కీర్తిగానాన్ని ప్రారంభిద్దాము.
భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వర
శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం
mail...durgeswara@gmail.com ......,,cell....9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment