భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి
>> Friday, November 28, 2008
ముంబాయి నేలపై ముష్కరులను ముట్టుపెట్టేందుకు జరిగిన పోరులో మనము కేవలము టి.వి లకు అంకితమై తే వారు మాతృభూమి రక్షణకై తమప్రాణాలని తృణప్రాయముగా ఎంచి పోరాడి అసువులు బాశారు. వారి త్యాగాలఫలితంగా మనం ప్రమాదమునుండి రక్షింపబడ్డాము. వ్యాసాలు రాసుకుంటూ మీనమేషాలు లెక్కించుకుంటూ ,మాపనులను యధావిధిగా సాగించుకుంటూ అప్పుడప్పుడూ అయ్యో అఁటూ సానుభూతిని చూపించినట్లు నటిస్తున్న మాతప్పులను మన్నించండి సోదరులారా! అమరులైన భరతమాత ముద్దుబిడ్డల్లారా .ఎవరికొరకు మీరు మీప్రాణాలను బలిదానం చేశారో ఆమేము మీస్పూర్తిని మాగుండెలలో నింపుకుని మా,మాపిల్లల జీవితాలను సహితము జన్మభూమికైసమర్పణచేయగల స్థైర్య ధైర్యాలను పొందుదుముగాక. పరంపరగా వస్తున్న ఈభారతీయ ఆత్మ అందరిలో మేల్కొని మీత్యాగాలకు సార్ధకత చేకూర్చుగాక. ప్రాణము కంటే ధర్మరక్షణ ముఖ్యమని మామనసులు మీచరిత్రవలన చైతన్యవంతమగుగాక.మీసాహసం నిరుపమానం మీకీర్తి అనుపమానము. మీరు మీయిల్లు యిల్లాలు,పిల్లలకొరకు ఆలోచించకుండా మాకొరకు ,మాపిల్లల జీవితాలకొరకు చేసిన త్యాగం మరింతకాలం మనజాతిని జాగృతంచేయుగాక.అది మాహృదయాలలో దాగివున్న స్వార్ధ,పిరికితన,నిర్లిప్తత లనే భూతాలను తొలగజేయుగాక.
వందనమోమహావీరులారా !
హేమంత్ కర్కారే,విజయ్ సలార్కర్,అశోక్ మారుతీరావుకాంమ్టే మరియు పేర్లుతెలియని ఇతర వీరులందరికి మానివాళి.
1 వ్యాఖ్యలు:
బాగా చెప్పారండీ. సిగ్గు పడాలి, టీవీని అంటుకు పోయి, అదో ఎంటర్ టైన్ మెంట్ లా చూస్తున్న మనందరం. ఆ వీరుల ధైర్యం మనకూ రావాలని ప్రయత్నిద్దాం, ప్రార్తిద్దాం.
Post a Comment