పూజను పనిగా మార్చకండి.పనిని పూజగా మలుచుకోండి .
>> Tuesday, November 4, 2008
నాకు తరచుగా వినపడే మాటలలో ఒకటి " ఎక్కడ మాస్టర్ గారూ పూజ చేయాలంటే సమయము చాలటం లేదండీ" అని. నాకైతే చాలా చిత్రముగా వుంటుంది ఈమాట. సమయం అందరికీ ఒకటే కదా? అందరికీ 24 గంటలు సమయము సమానమే. మరి పూజ చక్కగా చేసుకుఁటున్న వారి కున్న సమయం మనకెందుకుండదు. వాళ్ళంతా సంసారాలూ బాదరబందీలూ లేనివాళ్ళేమీ కాదే? ఎందుకిలా అనిపిస్తున్నది. ఆలోచించి చూడండి. మన ఇంటిలో ఎవరన్నా ఏదన్నా తినాలనిపిస్తున్నది అంటే అమ్మ ఎంతసేపైనా ఇష్టముగా తయారుచేసి పెడుతుంది. మన మిత్రుడెవరన్నా వస్తే ఎంతో ఇష్టముగా సమయంతెలియకుండా మాట్లాతాము. బిడ్ద ఏదన్నా తెమ్మని పేచీపెట్టి గోలచేస్తే అప్పటి కప్పుడు బజారుకు పరిగెత్తుకెళ్ళి మురిపంగా కొనితెస్తాము వాడుకోరినది. ఏదన్నా లాభంవస్తున్న పని అనుకుంటే రాత్రి నిద్రకాచయినా పని పూర్తిచేస్తాము. మరి వీటన్నిటికి ఉన్న సమయము పూజ చేసు కోవటానికి లేక పోవటమేమిటి.? అది కాదు అసలు విషయం . పూజ అనేదానిని ఒక పనిగా భావించటం వలన వస్తున్న సమస్య ఇది. ఈ మధ్య మన పీఠములో నిర్వహిస్తున్న పంచాక్షరీ కోటిజప యజ్ఞములొ పాల్గొనాలని వున్నా సమయము చాలటము లేదని కూడా కొందరు మెయిల్ లో వ్రాస్తున్నారు. వారు కూడా చదువుతారని ఇది వ్రాస్తున్నాను.
ఏతల్లీ తన బిడ్దలకు కావలసినది వండి పెట్టటము పనిగా భావించదు. ఏవ్యక్తీ తనకుటుంబము కోసము శ్రమించటము పనిగా భావిఁచడు. నేను ఇంత సాధిస్తున్నను అని సంతోషపడతాడు తప్ప. ఎందుకని అది తన మనసుకు ఇష్టము కనుక. ఆపని చేయటము వలన తాను ఆనందాన్ని పొందుతున్నాడు కనుక . ఆనందం పొందటమంటే మనసు దానిని సంపూర్ణముగా ఇష్టపడుతున్నది కనుక. మరిక్కడ పూజ ఎందుకు పనిగా అనిపిస్తున్నది. అది చేయక పోతే ఏమవుతుందో అనే భయం, అదిచేయటము వలన ఏదన్నా మేలు జరగక పోతుందా అనే కోరిక మన మనసులో నాటుకోవటము వలన.
బిడ్ద కు వండి పెడిటే బిడ్ద బాగా తిని సంతోషిస్తాడు అన్న భావన తప్ప దానివలన తనను బ్మెచ్చుకుంటాదు అన్న భావన తల్లికి ఉండదు.వండే టప్పుడు. నేను సంపాదిస్తే నాకుటుంబము సుఖంగావుంటుందని శ్రమిస్తామే తప్ప వాళ్లు నన్ను మెచ్కుకుంటారు గూఒరవిస్తారు అని ఎవరూ ఆలోచించరు. మా గురువుగారు పూజ్య రాధికా ప్రసాద మహరాజ్ వారు చెప్పేవారు. తవసుఖేన మమసుఖం అనే గోపికలభావన ఉన్నతోన్నతమైనది. అని . అంటే ఆభావన శక్తివంతమయి సృష్టిని ఇన్ని రూపాలుగా నడిపిస్తుందన్న మాట.
అలా భగవంతుని పూజ ,జపం, ధ్యానం ,కీర్తన శ్రవనాదులైన నవవిధభక్తి మార్గాలలో ఏ మార్గమునుండయినా భగవంతుని కొరకు ప్రయత్నించాలి. అందుకు పూజ చేయటము ఒక పనిలా భావించకుండా ,ఆపని చేయతము వలన భగవ0తునికి ప్రీతికలుగుతుంది అనె విషయాన్ని నిరంతరం గుర్తుతెచ్చుకుంటూ సాగించాలి. నువ్వు నీబిడ్దకు మంచీ చెడ్దా చూసినప్పుడు ఎలా ఆనంద పడతావో అలా
ఆనందపడాలి. బిడ్దను ఎంతసేపు ప్రేమిస్తావు దానికేమన్నా కొలత ప్రమానం,ఉన్నదా? లేదు ప్రేమకు కొలతలు లేవు నీమనసు తృప్తి చెందినంతసేపు ఆప్రేమ ప్రవాహం సాగుతూనే ఉంటుంది. కనుక నువ్వేపని చేస్తున్న ఇష్టమయిన వారిని చింతనచేయటానికి ఆపని అడ్దము కాదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయి సాయంత్రం వచ్చే భర్తకోసము ఎదురుచూస్తూ ఇంటిపని వంటపని పొలంపని ఇంకా చేయవలసినవన్నీ అలుపు లేకుండా శ్రమ తెలియకుండానే చేసేస్తుంది. కారణం మనసు తనకిష్టమయినదానిపై లయమయినప్పుడు మిగతా సహజక్రియలన్నీ నిఱాటంకంగా జరిగిపోతుంటాయి మరింతతొందరగా.
కనుక భూఒతికముగా చేసే మూర్తి పూజ కూడా పతాలకో ,విగ్రహాలకో చేస్తున్నాననే భావనరానీయక ఆరూపములో మనముందు కూర్చున్న ఆపరమాత్మకు ఉపచారాలు జరుపుతున్నమనే భావన సడలనీయరాదు. అదే మూర్తి పూజలోని అసలు విధానం. ఇక జపం ధ్యానం అనే పద్దతులను అన్నివేళలా పాటించవచ్చు. మనం పాటపాడుతూ కూడా కారుడ్రైవ్ చేయగలంకదా. ఒకే సమయమ్లో కారు కంట్రోల్ చేస్తూనే ,పాటలోని రసాన్ని ఆస్వాధిస్తున్నమా లేదా?.
అదేవిధంగా మిగతా పనులను కూడా దైవ సేవా భావనతో చేస్తూ భగవంతుని స్మరించటం అభ్యసించాలి. మనం . మా మిత్రుడు మల్లిఖార్జున రావని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒకాయనున్నాడు. తన వ్యాపారం చేస్తూ మధ్య మధ్యలో విష్ను సహస్ర నామ పారాయణం చేస్తూవుంటాడు. మరలా బేరంవస్తే కొట్లొ గుమస్తాలను కేక్ల వేస్తు ,సరుకులు కడుతూ,మరలా వారు వెల్లాక ఆపిఅన దగ్గరనుంచి పారాయణం చేస్తూ వుం\టాడు. మనసు పారాయణము మీదనుంచి తొలగలేదు కనుక అది చాలా మంచి పద్దతేనని నాభావన.
ఒక మహాత్ముడు తన శిష్యులకు చెప్పినది చదివాను ఒకచోట. ఒకాయన పరమాత్మను పక్కకు నెట్టి యజ్ఞము చెస్తే అది యుద్దమయి కూర్చున్నది. మరొకాయన పరమాత్మను పక్కనబెట్టుకుని యుద్ధముచేస్తే అది ధర్మ యజ్ఞమయినది అని.
నిజమే పరమేశ్వరునితో వైరము పూని ఆయన లేకుండా యజ్ఞము చేసిన దక్షుని గతి ఏమయినది. అది య్ద్ధముగా పరిణమించి మాహాపాపమై చుట్టుకుని అథోగతి కల్పించినదతనికి.
పరమాత్మా నువ్వే నాకుదిక్కు అని కృష్ణభగవానుని ఆశ్రయించి ఆయనను నిరంతరము తన మనసులోను , భౌ తికముగా రథము మీద కూర్చోబెట్టుకుని రక్తపాతముతో కూడిన యుద్ధము చేసినా అది ధర్మమునకు సమ్మతమయి మహా పుణ్యప్రదమయి మోక్షాన్నిచ్చినది అర్జునునకు.
కనుక మన పనులను కూడా ఆసమయాన్ని కూదా పరమాత్మ సేవగా భావించి భగవంతుని నామాన్ని స్మరించటము ద్వారా అది పూజ గానే పరిగణించబడి ఆయనకృపకలుగుతుంది. చేయండి. అలాగని సోమరి పోతుతనంతో మనకు ఈపూజలు గీజలు వద్దు, మనమాత్మపూజచెయ్యగల గొప్పవారిమయ్యామని ఊహించుకుని మీరు నిరంతరము చేసే పూజలు ఆపకండి. సమయమున్నంతవరకు శ్రద్దాసక్తులతో చేయండి. మిగతాసమయము లో ఇలాచేయమని నాభావన. కనుక జపం చేయటానికి మనకు సులభమయిన మరొక మార్గము కూడాదొరికినది కనుక కొనస్సగిస్తారని పరమేశ్వరుని అనుగ్రహం మీఅందరిపైన వర్శించాలని వేడుకుంటూ
భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వరరావు
11 వ్యాఖ్యలు:
అమ్మా ,
నేను అన్ని సాంప్రదాయాలకు చెందిన మహాత్ములు వ్రాసిన గ్రంథాలను చదువుతుంటాను.భరద్వాజ మాస్టర్ గారి గ్రంథాలు కూడా కొన్ని చదివాను.కాని పరిప్రశ్న ,మతం ఎందుకు మొదలయిన గ్రంథాలు వున్నాయని తెలుసుకాని వాటిని చదివే అవకాశము రాలేదు. చిన్నప్పటినుంచి విన్నవి చదివినవి అన్నీ నామనసులో నాటుకుపోయి ఆమహాత్ములు నడిచిన బాటలో పాదధూళిని తలపై చల్లుకుంటూ నడక నేర్చుకుంటున్నాను. నేను వ్రాస్తున్నవన్నీ అటువంటి మహాత్ములు ప్రసాదించిన మంచిమాటలు మాత్రమే.
కనుక వాటిలో పోలిక వుండవచ్చు.వాటినే నేను వ్రాసివుండవచ్చు. వారి మాటలు నేను వ్రాసాను అని మీకనిపిస్తే నేను వారిమార్గంలోనే నడుస్తున్నానని ,అది నాఅద్రుష్టమని భావిస్తున్నాను.
ప్రమాణపూర్వకముగా విన్నవించుకుంటున్నాను. నేను వారిరచనను ఎత్తివ్రాయలేదు. నా భావనను వ్రాశాను. దానికి ఆమహాత్ముల అనుగ్రహము నాకు లభించిఉండవచ్చని ఆనందిస్తున్నాను. నమ్ముతారని ఆశిస్తున్నాను.
అయ్యయ్యో ఎంతమాట. మీ నుండి ప్రమాణం వంటి పెద్ద పదాలు నావంటి అల్పురాలికి తగదు. మనకి ఒక వ్యక్తి, లేదా వారి గ్రంధాలపై వుండే విపరీతాభిమానం వాటిని ఆచరించటం మీద మాత్రమే కాక, అతివాద పోకడలు కూడా పోతుంది. అదివరకటి నా వ్యాఖ్య అలాగే వున్నది లాగ వుంది. నా తొందరపాటు తో మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి.
మహాత్ములందరి భావాలు ఒక్కలాగే వుంటాయి. మాస్టారి గారి లాంటి వారు గ్రంధాల్లో రాస్తే, మీరు బ్లాగుల్లో రాస్తున్నరు.
blogworld needs a blog like hariseva. Please do continue with your good work.
hey durga
i know you are opposite to islam.
dont finger your hands in islam
before also you start a blog purely opposite to islam. i know everything about that matter.
i know kafir is laways a kafir
your kafir
kafir,kafir,kafir
i know you remove this comment but and i also know you read this comments
చూడండిరఫిగారు
నేను ఇస్లామ్ కు వ్యతిరేకమని నువ్వన్న మాట నిజమొకాదో నీకు తెలియదు కాని నువ్వు మాత్రమ్ ఇస్లామ్ కు ఖచ్చితంగావ్యతిరేకివే.వాచకంగా నువ్వు ఇస్లామ్ వైనా ఆచరణాత్మకంగా ఇస్లాం సూత్రాలకు పక్కా వ్యతిరేకివి నీవు.ఇలా తామసికపు వాదనలు చేసి . పవిత్రమయిన ఆచార్యులు బోధించిన శాంతిమార్గాన్ని పదిమంది తప్పు పట్టేలా చేయకు.
పరమేశ్వరుని సన్నిధిలోవుండే శివకింకరుడు మామూదుడు భూమి మీద అవతరించి పరమాత్మ నిరాకార తత్వాన్ని ప్రవచించి తద్వారా భగవత్ సేవకు మానవులను మలపాలని ప్రయత్నం జరుపుతాడని భవిష్యపురాణములో చెప్పబడిన వివరాలు మీలాంటివారికి చేరవు. ఎందుకంటె మీరు తెలుసుకునే రకంకాదు,వాదించేరకం. భగవంతుడు నీవాదనలకందడు.అని చెబుతున్నాయి సకల శాస్త్రాలు అన్ని సాంప్రదాయాలలోను. కనక ఆచరణ రీత్యా అన్ని మార్గాలగురుపరంపరను గౌరవించి వారిమాటలను వారు చెప్పిన మంచిని స్వీకరించే మాకు నీ ఆరోపణలకు సమాధానమివ్వవలసిన పనిలేదు. కాని ఇవి చదివే ఉన్నతమయిన భావాలు గల తెలుగు బ్లాగర్లకొరకు ఇది వ్రాస్తున్నాను.
కాఫిర్ అంటే ఏమిటో తెలుసా? ఇస్లాం మార్గాన్ని అనుసరించని వాడు అని అర్ధమని ఈమధ్యనే పత్రికలలో ఒక ఇస్లాం పండితుడు ప్రవచించారు. సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలుంటాయి. ఎవరి మార్గం వారనుసరించినా చేరే లక్ష్యం ఒక్కటే. కనుక ఆపదమేమీ తప్పుకాదని వారన్నారు .మరి దానిని ధూషణ భావంతో వాడిన మీ స్థాయి ఏమిటో అలాంటీవారిని అడిగి తెలుసుకోండి.
మీవూరు చేరటానికి నాలుగైదు రహదారులునాయనుకుందాము. అన్ని వైపుల ఊర్లలోనున్న మీస్నేహితులు మిమ్మల్ని కలవాలంటె ఏవైపునున్నవారు ఆవైపునుంచి ప్రయాణిస్తేనే త్వరగా క్షేమముగా చేరుతారు మీదగ్గరకు. అలాకాదు అటుబాగుంటుంది ఇటుబాగుంటుంది అని వాదనలు చేసే సోమరిపోతులు అక్కడే వుంటారు. ముందు నడక ప్రారంభించు. ఆదారిలో ఎవరో ఒక మహాత్ముడు నీకు సరయిన విధానాన్ని చూపి పరమాత్మవద్దకు చేర్చుతాడు. ఆధ్యాత్మిక మార్గములో మీకున్న అరిషడ్వర్గాలనే శత్రువులను జయించి మీరు నిజమయిన దైవవిశ్వాసులవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను.. శుభం
రఫి గారికి మీరిచ్చిన సమాధానం చాలా హుందాగా వుందండి.
dhanyavaadamammaa
ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. విమర్సించే ఓపిక మాత్రం కొండంత వుంది (సందర్భమెవరిక్కావాలి?) తెలుసుకొనే ఉద్దేశ్యం ఉందని నాకైతే అనిపించలేదు. అసలాయనకు ఏమైనా తెలుసోలేదో నాకు తెలియదు. కొందరంతే వాళ్ళానలా వదిలేయాలేమో.
amte kadamdi manam cheyagaliginadi
namaskaram
Post a Comment