శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇంకా ఎంతపతనాన్ని చూడబోతున్నము మనము?మౌనం వీడి మాట్లాడండి.

>> Thursday, November 6, 2008

ఈవారములో నరసరావు పేటలొ జరిగిన సంఘటనను చదివిన దగ్గరనుండి మనసులో ఆవేదన తట్టుకోలేకపోతున్నాను. సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులలో కూడా ప్రవేశిస్తున్న హీన సంస్కృతి మన మాత్రుభూమిని మరెంత దిగజార్చనున్నదోనని ఆందోళనను పెంచుతున్నది.

నరసరావు పేటలో ఒక కాలేజీలో చదువుతున్న 5 విధ్యార్ధినులు ఒక వసతి గృహములో ఒకే రూములో వుంటున్నారు. వీరిలో నలుగురమ్మాయిలకు ఆధునికత పేరుతో విచ్చలవిడితనాన్ని పెఁచిపోషిస్తున్న పాశ్చాత్య సంస్కృతి బాగా వంటపట్టినది. వాళ్ళు సెల్ఫోన్లలో రాత్రుల్లు బాయ్ ఫ్రెండ్స్ కు ఫోన్లు చేయటం.అసభ్యఁగా మాట్లాడుకోవటం చేస్తున్నారట. మిగిలిన మన అమ్మాయి ఇది తప్పు మనం చదువుకోవటానికి వచ్చాము ఇలాఁటివి నేను ఒప్పుకోను రూం లో అలా చేయవద్దు అని వారించింది. అంతే వారికి ప్రకోపం తలకెక్కి ఈఅమ్మాయిని కొట్టి ,చేతనయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్స్ ను తయారు చేసుకో అని బెదిరించటం తో పాటు వారి బాయ్ ఫ్రెండ్స్ తో దాడి చేపించి కొట్టారు. ఆ అమ్మాయి ప్రింసిపాల్ కు కంప్లయింట్ చేయటంతో వారి కి కోపం మరింత పెరిగి మరలా దాడిచేసి కొట్తతమే కాక బ్లేడుతో గాయపరచారట. మనసు గాయపడిన ఆచదువులతల్లి ఈ కామపిశాచాలను ఎదుర్కోలేక చదువుమానుకుని ఇంటికి వెళ్లి పోయినది. ఈవిషయాన్ని తెలిసిన విలేఖరి ఒకరు దానిని పత్రికలో వెల్లడించటం తో అది చదివిన జడ్జిగారు ఈవిషయాన్ని విచారించమని పోలీసులను ఆదేశించారు.

ఇప్పటిదాకా మగపిల్లలు మాత్రమే గాడితప్పిన విషయాలలో కనపదుతున్నారను కుంటే ఇప్పుడేకంగా జాతికి ఆయువు పట్టయిన ఆడపిల్లలకు కూడా సోకినదీ కలి జాఢ్యం. ఇందులో తప్పెవరిది ఎవరిని శిక్షించాలి. ఎలా
కాపాడుకోవాలి యువతను ఈ విషపుగాలులనుండి. ?

పిల్లలకు తిండిపెట్టటము,అవసరాలు తీర్చటం అడిగినంత డబ్బివ్వటమేకాని ,మానవీయ విలువలను నైతిక సంపదను పంచలేని తల్లిదండ్రులనా?

పాఠాలుచెప్పి సిలబస్ లుపూర్తిచేసి బట్టీలు పెట్టించి వందకు వంద మార్కులుతెప్పించటమే కాని ఒక్కశాతమన్నా నైతిక విలువలను
పెంచేమనసంస్కృతీసాంప్రదాయాల పిల్లలకు బోధించటములొ నిర్లక్ష్యం వహిస్తున్న మా ఉపాధ్యాయవర్గాన్నా?
అసలు
ఏదేశమయినా తనసంస్కృతీ సంపదలను కాపాడుకోవటానికి కొత్తతరానికి దానిని పాఠశాలలోనే అందించేవిధంగా విద్యావిదానాన్ని రూపొందిస్తున్నది. కాని రకరకాల ఇజాలు పరాయి పాలకులు వదలివెళ్ళిన భావజాలాలకు బానిసలయిన మన నాయకత్వము ఓట్ల రాజకీయాలతో మనసంస్కృతి సాంప్రదాయాలని విద్యావిధానఁనుంచి క్రమేపీ తొలగిస్తూ పిల్లలకు చిన్నతనం నుంచి చేరవలసిన నైతిక సాంప్రదాయ విద్యను దూరం చేస్తున్న పాలకులనా?

మేధావులమని తమకు తామే సర్తిఫికెట్లిచ్చేసుకుంటూ పతనమయిపోతున్న మానవ జీవనవిధానాన్ని సంస్కరించాల్సిన బాధ్యతను మరచి దానిని కాలానుగుణమార్పులు అని పుంఖాను పుంఖలుగా వ్రాస్తూ ,వాదిస్తూ మైమరచివున్న కుహన మేధావివర్గాన్న?. [కాలం
ఎంతమారినా వీళ్ళు అన్నం నోటితోనే తింటున్నామన్న విషయం గ్రహించరేమి]
సర్క్యులేశన్ పెరగటమే ప్రధాన లక్ష్యముగా ,పబ్ లు, వీకెండ్ పార్టీలంటూ ఒల్లుబలసిన వారు చేస్తున్న వికృత విన్యాసాలను రంగురంగుల ఫీచర్లుగా చూపిస్తూ పిల్లలలో ఆసంస్కృతి పట్ల ఆశక్తిని కలగజేస్తున్న పత్రికలవారిని శిక్షీంచాలా?

ఎవరిని శిక్షించి ఈ ప్రమాదాలనుండి మన నవతరాన్ని రక్క్షించుకోగలుతాము?
కొంతమందిం కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు ,పేర్లకు పుకార్లకు సికార్లకు నిబద్దులు అనే శ్రీశ్రీగారి వ్యాఖ్యానం ఇప్పుడు వీరికి ఖచ్చితంగా సరిపోతుంది. అలాకాక కొతమందికుర్రవాళ్ళు ముందుయుగం దూతలు,భావన నవజీవన బృందావన నిర్మాతలు అని పొగిడించుకునేలా యువత తయారవ్వటానికి ఏమార్గాలననుసరించాలి. మౌనం వీడండి. వ్యభిచారం చెయ్యటానికి కండోంస్ వాడండి అనితప్ప వ్యభిచారం తప్పు అని చెప్పలేని ఈ నికృష్ట రాజకీయ నాయకత్వాలు మన పిల్లలను మరింత దిగజార్చకముందే ,మీరు మేల్కొని దిశానిర్దేశం చేయండి.
ఇప్పుడు మౌనంగా వుంటే మనం భవిస్యత్ తరాలను చేజెతులారా నాశనం చేసుకున్న పాపానికి గురవుతాము.

8 వ్యాఖ్యలు:

లక్ష్మి November 6, 2008 at 3:37 AM  

మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు అనిపిస్తోంది నాకు, కొంతమంది ఆడపిల్లలు పాతాళం కన్న లోతుగా దిగజారిపోయి చాలా రోజులు అయ్యింది గురువుగారూ. ఉస్మానియా మహిళా వసతి గృహంలో జరిగే ఎన్నో దారుణాలను నేను కళ్ళారా చూశాను. గొప్పగా కనిపించాలి, గొప్పగా బ్రతకాలి అన్న కోరికలతో ఎంతో మంది అమ్మాయిలు రాత్రి పూట గోడ దూకి వెళ్ళి కాల్ గర్ల్స్ గా రాత్రి తెల్లవార్లూ పని చేసి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఉన్నత విలువలు గల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. ఇంట్లో ఉన్నంత కాలం తల్లి చాటు బిడ్డలే. ఎవరి తప్పంటారు ఇది? వాళ్ళ హై క్లాస్ కోరికలు తీర్చలేని తల్లితండ్రులదా? అమ్మాయిలు అంటే మన కోరిక తీర్చటానికే పుట్టిన బొమ్మలు అని ఆలోచించే (వాళ్ళను అలా అలోచింపచేస్తున్న) వాళ్ళద?

ఆయుర్వేదం November 6, 2008 at 4:18 AM  

మనం మాట్లాడినా మనకు నాగరికత తెలీదు అంటారు... మనలాంటివాళ్ళము కొందరమే ఉన్నాం. అలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు... వారికి వారు బుద్దు నేర్చుకోవాలి తప్ప ఇప్పటివారు ఎవరో చెబితే వినే పరిస్థితుల్లో లేదు... వాళ్ళ జీవితానికి ఏదో పెద్ద దెబ్బ తగిలేంతవరకూ ఇలాగే విర్రవీగుతుంటారు.

చైసా November 6, 2008 at 5:04 AM  

లక్ష్మి గారు మరీ అలా జరుగుతుంది అంటారా ? చాలా మంది అనగా విన్నాను(hostel gals కాల్ గర్ల్స్ గా)కాని .. ఏమో మరి ...మీతో ఏకీభవించలేకపోతున్నా !

Anonymous November 6, 2008 at 6:52 AM  

స్వేచను దుర్వినియొగం చేసే అడపిల్లల సంక్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరైనా బుద్దిగా వున్నా తొడేళ్ళమద్య లేడిపిల్లలా బిక్కు బిక్కు మంటూ వుండాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫొన్ లో గంటలు గంటలు సొల్లు మాట్లడే ఆడపిల్లలని చూస్తే నాకు తన్నబుద్దవుతుంది. మగపిల్లలు ఐతే పర్వాలేదా అనకండి. ఆడపిల్లల్ని అందరూ గమనిస్తూ వుంటారు. కనుక వీలైనంతవరకూ నలుగురి ద్రుష్టీ పడకుండా ఇల్లు చేరగలిగితే మంచిది కదా

durgeswara November 6, 2008 at 8:19 AM  

అమ్మా! మీ ఆవేదనలు అర్ధమవుతున్నాయి. చిన్నజీవులైన చీమలు కూడా తమ నివాసంలో చేరిన ప్రమాదకరాలను తొలగించుకుంటాయి. మరి మనం ఏమిచేయాలో నిర్మాణాత్మకమయిన చర్యలను కూడా వివరిమ్చండి. ఇది మనతో మొదలయి పదిమందితో చర్చించబడి ఎక్కడో ఒక చోట నిర్మాణాత్మక రూపం తీసుకుంటూమ్ది .ఇది ప్రకృతి నియమము. కనుక మహిళామతల్లులు,మేధావులు,లోకం చల్లగా వుండాలని కోరుకునే సాధారణ పౌరులు అమ్దరం స్పందిమ్చాలి. తలా ఒక ఇటిక రాయి మట్టి ముద్ద వేశి పడ్ద కన్నాన్ని పూడ్చాలి .

Anonymous November 6, 2008 at 9:09 AM  

వాళ్ళ గ్రహస్థితులు అలా వుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరండీ? అంతా పూర్వ జన్మ కర్మ.

Anil Dasari November 6, 2008 at 9:49 AM  

అమ్మాయిలని మరీ ఎక్కువ కట్టుబాట్ల మధ్య పెంచటం వల్ల వచ్చే తంటా కావచ్చిది. పదిహేనేళ్ల దాకా ఇంట్లో తల్లిదండ్రులు చాటునో, అన్నదమ్ముల సంరక్షణలోనో అనేక నియమాల మధ్య బ్రతికిన అమ్మాయిలు హాస్టళ్లలో పడగానే ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసేస్తున్నారనుకుంటాను. పిల్లలని కట్టుబాట్లలో పెంచటం వెనుక తల్లిదండ్రులకి సదుద్దేశాలే ఉండొచ్చు. కానీ అదే సమయంలో అమ్మాయిలకి (అబ్బాయిలకి కూడా) చిన్నప్పటినుండీ మంచీ చెడూ తేడా తెలుసుకోగలిగే విచక్షణ నేర్పటం కూడా తల్లిదండ్రుల బాధ్యత. అంత బాగా పెంచినా పెడమార్గం పట్టేవారిని ఏమీ చేయలేమనుకోండి.

గత పదేళ్లలో అమెరికాలో విద్యాభ్యాసానికి వచ్చిన అనేకమంది తెలిసినవారి అమ్మాయిలని గమనించగా నాకు అర్ధమైన విషయమిది. ఇక్కడికి పై చదువులకోసం వచ్చే అబ్బాయిలకన్నా అమ్మాయిల్లో విచ్చలవిడితనం ఎక్కువ. ఇండియాలో ఐతే దూరంగా ఉన్నా ఎంతో కొంత తల్లిదండ్రులదో, తెలిసినవారిదో పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ ఆ భయం దాదాపు శూన్యం. ఇలా ప్రవర్తించేవారిలో ఎక్కువమంది చిన్నప్పుడు కట్టుబాట్ల మధ్య పెరిగినవారే. అందరూ ఇలాంటివారే అని కాదు. బుద్ధిగా ఉండే అమ్మాయిలూ చాలామంది ఉన్నారు. ఇలా బుద్ధిగా ఉండేవారిలో ఎక్కువమంది చిన్ననాటి నుండీ ఇంటికి దూరంగా ఉండి, సొంత నిర్ణయాలు ఆలోచించి తీసుకునే అలవాటు చిన్నప్పటినుండీ ఉన్నవారు. స్వేచ్ఛ హఠాత్తుగా వచ్చి పడకపోవటంతో వీళ్లు చాలావరకూ దాన్ని సద్వినియోగమే చేసుకుంటారు.

లక్ష్మి November 7, 2008 at 12:07 AM  

chaisa garu, okari meeda burada challatam valla naku vachedi emi ledandi. Naa kallara chusina nijanne nenu cheppindi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP