వ్రతాలు ,దానాలు ఎందుకు? వాటికి మనమెందుకు సహాయం చేయాలి ?
>> Monday, November 3, 2008
వ్రతాలు ,దీక్షలు,దానాలవల్ల ఉపయోగమేమిటి అని ఈమధ్య నన్నొక స్నేహితుడు అడిగాడు.అంతే కాదు మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బును దానాలని ధర్మాలని ఎందుకివ్వాలి?అని కూడా ప్రశ్నించాడు కోపంగా.ఈ వ్రతాలు ఉపవాసాలవల్ల వరిగేదేమున్నది.అంటూవిరుచుకు పడ్డాడు,చనువుతో.
ఆయనకు పెద్దలు చెప్పిన మాటలను కొన్నింటిని గుర్తుచేశాను,. నువ్వుఏదిపొందినా సమాజమునుంచి,లేదా ప్రక్రుతినుంచి పొందుతావు. దానిని మొత్తం నీదగ్గర ఉంచుకుంటే అది నీకే ప్రమాదం .కొంత భాగం తిరిగి ఇవ్వాలి.ఎలాగంటే మనం పీల్చిన గాలిని పూర్తిగా తీసేసుకుంటాము కొద్దిగా కూడా విడువము అంటే అది ప్రమాదకరమవుతుంది. అందులో నీ ఆరోగ్యానికి పనికిరాని విషవాయువులు కూడా వుంటాయి.కనుక కొంత గాలిని బయటకు పంపాలి.అలాగే నీకు ఈరోజు సమకూరిన సంపదలన్నీ నీవికావు. మిగతా జీవరాసికి చెందవలసిన భాగాన్ని కూడా నీదగ్గర పోగేసుకుని నేను ఎవరికీ ఇవ్వనంటే ఎలా? కనుక పరమాత్మ స్వరూపమయిన ప్రక్రుతికి,సమాజానికి దానిని కొమ్ట పంచవలసి ఉంటూంది. నువ్వు సంపాదించిన డబ్బు పైన ప్రభుత్వం ఎందుకు టాక్శ్ వేస్తున్నది.అది ఈసూత్రంమీద తయారయిన విధానమే. నేను కట్టను అనిదాచుకుంటే నువ్వునేరస్తుడివవుతావు ప్రభుత్వం ద్రుష్టిలో . పరమాత్మ ద్రుష్టిలో
ట్క్స్ కట్తటమంటే అక్రమంగా సంపాదించినా,అత్యాశతో సంపాదించినా నేరమే.ఆయన వేశే శిక్షలు రోగాలు,కష్టాల రూపం లో మనలనుబాధిస్తాయి. ఇఅతరుల కంటే నీదగ్గరే ఎక్కువ ధనమున్నదంటే అది ఆయన కరుణే. దానిని సవ్య రీతిలో నీకొఅకు నీపై ఆధారపడిన జీవులకొరకు,మాత్రమే కాక లోకం లోని సకల జీవరాసుల క్షేమం కొరకు వుపయోగించాలని దానికి నిన్ను ట్రస్టీగా పెట్టాడన్న మాట.ఇక ఆకలి గొన్న జీవులకు అన్నం పెట్టడము,ఆపదలోనున్న వారికి సహాయము చెయ్యడము,సమ్మజాన్ని మంచిమార్గంలో నడిపేమ్దుకు ఉపయోగపడే సత్ క్రియలకు ఖర్చు చేయడము ఇవన్ని ఆయనకు ప్రీతికలిగించే పనులు. అమాయకంగా అయి పోతాయేమో ననుకుంటే ,ఎలా?. విచారించి చూస్తే నీదగ్గరకొచ్చినవాటినన్నిటిని నువ్వు నిలువ చేయగలిగావా? లేదే.ఎలా వెల్లవలసినవి నీకు చెప్పాపెట్టకుడా అలా వెళ్ళి పోతూనే వున్నాయి. చెలమ లో నీళ్ళు వాడుతుంటే ఊరుతూనే వుంటాయి ,తరగకుండా. వాడకుండా అలానే వుంటె పాచిబట్టి ఎవరికీ పనికిరాకుండాను,ఆచెలమకే ప్రమాదకరంగాను మారతాయి.
ఇక వ్రతాలు ,దీక్షలు అన్నవి సమాజాన్ని సత్ ప్రవర్తన వైపు మళ్ళించే చట్టాలలాంటివి. కనుక వాటికి సహాయపడటము ద్వారా వారికి శ్రేయస్సు కలిగించటములోను సమాజమునకు మంచి పంచటములోను నీవుకూడా భాగస్వామి వవుతున్నావన్న మాట. అది భగవంతుడు నీకిచ్చిన అవకాశముగా భావించి దానధర్మాలు చెయ్యి.అంతేకాని నేనుగాంగ చేస్తున్నాననే అహంకారానికి లోనయి తే ఫలితం సున్నా. అయితే అపాత్ర దానమూ చేయకూదదని మన పెద్దలు సూచించిన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మన ఊర్లో జరిగే తిరుణాల్లకు వచ్చే భక్తుల కోసం అన్న దానమో మంచినీరందించటమో పుణ్యం కాని,ప్రభలమీద ఏర్పాటుచేసే డాన్సులకు డబ్బు చందాలుగా ఇవ్వటము ,సరయినదికాదు. అప్పుడది దానము కాదు,ధర్మమసలేకాదు.
ఇక వ్యక్తిగతముగా పాటించే వ్రతాలు, దీక్షలు సరిగా నియమ బద్దంగా చేసినప్పుడు అవి అతని శరీరానికి ,మనసుకు ఆరోగ్యాన్ని కలగించి సదాలోచనలను రగిలించి పరమాత్మవైపుగా తన ప్రయాణాన్నిసాగింప జేస్తాయి. తాను చేసిన పాపపు పనుల మూలకంగా పేరుకు పోయిన పాపపు రాసిని క్రమేపీ తొ్లగిస్తాయి.పరమాత్మ భావన మనసులో స్థిరపడిన వారెవ్వరూ లోకానికి మేలు తప్ప కీడు చెయ్యలేరు. అలా చేయలేనివారు ఇంకా ప్రయత్నము లోనే వున్నారని అర్ధము.ప్రయత్నమయినా మంచిదేగా? కాదంటావా? అని వివరించాను.
వీటన్నిటిని మనకు ప్రసాదించిన మహర్షులు సామాన్యులా? తమజీవితాలను తపస్సుతో మధించి పొందిన ఫలితాలను సమాజానికి ప్రాసాధించిన త్యాగపురుషులు. మనమేదో ఈ రోజు అ ఆ లు చదువుకున్నామని వారు సూచించిన మార్గాన్ని తిరస్కరించే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు అని అడిగాను.
మన ఊర్లో జరిగిన రాజకీయ పార్టీల మీటింగులకు.డాన్సు ప్రోగ్రాములకు, కుర్రవాళ్ళు సరదా అని చేసుకునే కార్యక్రమాలకు ఎన్ని సార్లు నువ్వు డబ్బివ్వలేదు.అప్పుడు ఎందుకివ్వాలి ?అని అడిగావా? వాటిని నిరోధించేందుకు ప్రయత్నించావా? కేవలం భగవత్ కార్య క్రమాలకు మాత్రమే ఇవ్వమన్నప్పుడు ఇవ్వు. భగవంతుని పేరుతో అనాచారపు పనులు చేస్తుంటె సహకరించమని నీకు చెప్పటమ్ లేదు.భగవ్ంతుడు ప్రసాదించిన దానిని యుక్తాయుక్త విచక్షణతో ఖర్చుపెట్టవలసిన బాధ్యత ధనవంతులు,అంటే ఆధనానికి ట్రస్టీలలాంటివారమ్దరి బాధ్యత అన్నాను, విన్నాడుమావాడు.నా నోటిద్వారా వచ్చిన మన పెద్దల మాటను. సర్వేజనా సుఖినోభవంతు.
7 వ్యాఖ్యలు:
చక్కటి సమాధానం.
దుర్గేశ్వర్ గారూ! సరిగా చెప్పారు."ఇతరులకు ఇచ్చునది సర్వమూ తనకు తానే ఇచ్చుకొనుచున్నాడు" అన్న రమణమహర్షి మాట అర్థం చేసుకొన్ననాడు లోకమే సుభిక్షమవుతుంది.
మీ స్ఫూర్తి తో నేను కూడా ఇలాంటి విషయాలపైన ఒక టపా రాయాలనుకుంటున్నా.
వ్రతాల గురించి మీతో ఏకీభవించకున్నా, మనకున్నది పరులకి పంచే విషయం మాత్రం బాగా వివరించారు. మంచి చేయటానికి వ్రతాలు, పూజలు లాంటివి అవసరం లేదని నా అభిప్రాయం.
even though it is irrelevant here, but i wanted to say,,,
గురువు గారు,
మీరు వృత్తి పరంగా కూడా గురు దేవులని నాకు తెలియదు. మీ లాంటి అరుదైన వారు సహా బ్లాగరుగా వుండడం నా అదృష్టం.
నేను చదివిన కాలేజి లో ఇప్పటికి ప్రతి సంవత్సరం మూడు రోజులు గెస్ట్ లెక్చరర్ గా వెళుతుంటాను. విద్యార్థుల కెదురుగా పాఠం చెబుతుంటే, వారు చూపించే అధరాభిమానాలు, ఆ ఆనందం, అనుభూతి వర్ణింప అలవి కానివి.
మీరు నిజంగా అదృష్టవంతులు సార్, ప్రపంచం లోనే అత్యంత విలువైన వృత్తి లో కొనసాగుతున్నందుకు.
dhanyavaadamulu
దేవన గారూ,
మీలాంటివారిని ఒకరొ ఇద్దర్నో చూసినందుకు మాకూ అప్పుడప్పుడూ అలానె అనిపిస్తుంది.
కానీ మమ్మల్ని బఫూన్లుగా, హాస్యగాల్లు గా ,తక్కువరకం మనస్తత్వంగలవాళ్ళుగా చిత్రించి చూపుతూ,తీస్తున్న సినిమాల ప్రభావంతోను, వాటిని సూపర్ హిట్ హాస్యసన్ని వేశాలుగా ఆదరిస్తున్న సమాజాన్ని, దాని ప్రభావంతో పంతుల్లను అపహాస్యంచేసి ఆనందించటం నేర్చుకుంటున్న శిష్యగణాన్ని చూస్తూ మాబ్రతుకులు ఇంత దిగజారటానికి కారణమయిన ఈ మెకాలే విద్యావిధానములో పొ్ట్ట కూటి కోసం కొన సాగుతున్నందుకు మా బ్రతుకులపై మాకే అసహ్యమేస్తున్నది. మంచిరోజులొస్తాయిలే అని సరిపెట్టుకోవడానికి అప్పుడప్పుడూ కనిపించే మీలాంటి వారే కారణ మవుతున్నారు.
Post a Comment