రామ, సోదరులు,రావణ, సోదరులు,వాలి సుగ్రీవుల మధ్య సోదరప్రేమలో గల తేడాలను వివరించండి
>> Sunday, November 2, 2008
రామాయణ ,భారతాలలో పాత్రలు మననిజజీవితాలలో నిత్యము తారసపడుతుంటాయి అందుకే అవి జీవగర్రలైనాయి మనజాతికి. ఒకవిధంగా చెప్పాలంటే మానవజాతికంతటికినీ. ఇందులో మూడురకాలైన వ్యక్తుల మధ్య సోదరప్రేమలు మనకు కనపడతాయి. అవి మనజీవితములో కూడా వుంటాయి.
రాముడు లక్షమణుడు ,భరత శతృఘ్నలు మధ్య సోదరప్రేమ ఒకరకంగా వుంటుంది.
రావణ కుంభకర్ణ ,విభీషణులమధ్య మరొక రకంగా కనిపిస్తుంది.
వాలి సుగ్రీవులమధ్య ఇంకోరకంగా అనిపిస్తుంది.
ఇందులో వారి వారి ప్రేమలను తులనాత్మకంగా పక్షపాత రహితంగా విశ్లేషించి చూపవలసినదిగా మనవి.
ఆధునిక యుగములోనూ మీరు గమనించిన ఈతేడాలను పోల్చిచూపితే మరీమంచిది. వారి పేర్లు ఉదహరించకండి. దయచేసి.
1 వ్యాఖ్యలు:
గురువు గారు,
రామాయణం మానవజాతికి ఒక rule పుస్తకం లాంటిది. ఆ కోణం నుంచి నా అభిప్రాయం చెబుతాను.
వాలి సుగ్రీవుల ది వానర జాతి - కాబట్టి వారి పాత్రల ప్రవర్తన ఆ పరదిలోనే వుంటాయి. అంటే మొదట సఖ్యంగా వుండడం, చిన్న పొరపాటుకు శత్రువులుగా మారడం. వాలి, సుగ్రీవుని భార్య రోమాను తన దగ్గరే వుంచోకోవడం లాంటివి అన్న మాట.
రావణ-కుంభకర్ణ-విభీషణులు - వీరు పౌలస్త్యులు, కనుక వారి పాత్రల చిత్రీకరణ లో వైవిధ్యం వుంటుంది.
కుంభకర్ణుడు ఏమో అన్నకు విదేయుడుగాను, విభీషణుడు కూడా మొదట విదేయుడుగాను, ధర్మా ధర్మాలపైన అన్నతో విభేదిన్చిండము ఇలాంటివి అన్నమాట.
రామును సోదరులు - మానవ జాతిని ఉన్నతమైన జాతిగా, ఆదర్శ ప్రాయంగా చిత్రీకరించాదము జరిగిందీ.
వారి వారి జాతుల మధ్య వున్న వైవిధ్యం కారణంగానే వారి వారి అన్నదమ్ముల మధ్య అలా సంభంద బాంధవ్యాలు వున్నాయి.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, తమ్మున్ని సరిగా చూసుకోకుంటే అది వానరలక్షణం అని,
సోదర ప్రేమ కలిగి వుండడం మానవలక్షణం అని.
Post a Comment