శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రూపుమార్చకండి మన పండుగలను[దీపావళి శుభాకాంక్షలతో]

>> Monday, October 27, 2008




జ్యోతిర్మయ స్వరూపమయిన పరమాత్మ లోని దివ్యకాంతులను వెదజల్లుతున్న భవ్యదీపావళి శుభాకాంక్షలు తెలుగు బ్లాగర్లందరికి.

మన పండుగ ప్రతిదానిలోను ఆధ్యాత్మిక రహస్యాలేకాక ,మానవునికి శ్రేయస్సును కూర్చే ఆరోగ్య,సామాజిక లాభలన్నీ ఇమిడివుంటాయి. అయితే కాలానుగుణముగా కొన్ని అనవసరమయిన ఆచారాలు ఇందులోకి ప్రవేశించి స్థిరపడతాయి అవిగమనించి తొలగించాల్సిన బాధ్యత మనదే.

వాటిలో కొన్నిటిని మనవిచేసుకుంటాను. మనం ఈ సందర్భముగా కొవ్వొత్తులను వెలిగించటము అలవాటు చేసుకున్నాము. ఈ మధ్య కాలములో శాస్త్రవేత్తలు పరిశీలన జరిపి చెప్పిన విషయమేమిటంటే ఎక్కువగా కొవ్వొత్తులు వెలిగించిన చోట పెద్దమొత్తములో విషవాయువులు వెలువడతాయి అని . చాలాకాలం క్రితమే చేసిన పరిశోధనలలో మంచి నూనె,ఆవునెయ్యి తో వెలిగించిన దీపాలవలన ఆప్రాంతములో మానవునకునకు హానిచేసే క్రిములు నశించి పోతాయని తేల్చబడినది. కనుక దీపాలవరుసను అమర్చి ఆనందిద్దాము. కాలుష్యం కలిగించే పాదార్ధాలను తగలబెట్టటం ,భయంకరధ్వనులు చేసి ఆనందించటం తగ్గించుకుందాము క్రమేపి. అవి మన సాంప్రదాయాలకు,ఆరోగ్యాలకూ రెండిటికీ మంచివికావు కనుక. మీఅందరి జీవితాలు దీపావళి కాంతులలా వెలిగిపోవాలని కోరుతున్నాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP