అపమృత్యువును తొలగిఁచే అన్నా చెల్లెళ్ళ పండగ
>> Wednesday, October 29, 2008
కార్తీక మాసములో రెఁడవరోజయిన విదియ తిథి నాడు యమున తనసోదరుడయిన యముని సత్కరించినది. ఆరోజును భగినీ హస్త భోజనము, వ్యవహరిస్తారు. ఆరొజు సోదరులను తమయింటికి పిలచి ,భోజనము పెట్టి వారి ఆశీర్వాదము తీసుకొనుట భారతదేశములో మహిళలు పాటించే ఆచారము. ఆ సోదరులు కూడా తమ సోదరి లను కానుకలతో సత్కరిస్తారు. దీనివలన వారి మాంగల్యబలము మరింత శక్తివంతమవుతుందని. శాస్త్రవచనము. అలాగే తమచెల్లెళ్లను సత్కరించిన వారికి అపమృత్యువు లేకుఁడా వరమిచ్చాడు. యమధర్మరాజు.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. మరెందుకాలస్యం మరచిపోయిన వారుంటే వెంటనే పిలవండి. రేపు అంటే అక్టోబర్ 30 గురువారం జరుగుతుంది. బ్లాగ్ లోకములో వున్న నాసోదరీమణులకందరికీ సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను.
5 వ్యాఖ్యలు:
మంచి సమాచారం.
మీరు ఇతరుల మంచిని కోరుతున్నందుకు అభినందనలు ...
దుర్గేశ్వర గారు, మంచి పోస్టు రాశారు.
మన తెలుగు వాళ్ళలో చాలా మందికి అసలు ఇలాంటి పండగ ఒకటుందని తెలియదు. శ్రావణ పూర్ణిమ కు రాఖీ కట్టడానికి మాత్రం తయారు.(కట్టకూడదని అనటం లేదు, మన స్వంత సంస్కృతి గురించి కూడా తెలుసుకోవాలని అంటున్నాను)
మా ఇంట్లో తప్పక దీన్ని పాటిస్తాము.
చాలా మంచి విషయం ఛెప్పారు కాని ఇలా అనేక వ్రతాలు నియమాలు నిష్టలతొ జీవితం చాలా సంక్లిష్టమై పొవట్లెదు చెప్పండి.
వ్రతాలు నియమ నిష్టలతో నిండిన జీవితము సంక్లిష్టంగా మారదండీ. ఆరోగ్యంగా ,ఆనందంగా నిత్యనూతనంగా కొనసాగుతుంది. వీటిలో ఇమిడివున్న ఆరోగ్య,ఆధ్యాత్మిక రహస్యాలుశరీరాన్ని ఆరోగ్యంగా వుంచితే,సామాజిక బంధాలు మనసును ఉల్లాసంగా,భద్రతతో ఆనందంగా జీవిత నౌక సాగేలా చేస్తాయి.
గమనించాల్సిన మరొక ముఖ్య అంశము ఏమిటంటే,మన జీవిత విధానమే సంస్కారాలమయమయి ఒక క్రమశిక్షణాపూర్వక మార్గం లోసాగేలా రూపొదించారు మహర్షులు . పాశ్చాత్య దేశాలలోలాగా తినడము,కామసుఖాలు అనుభవించడము మాత్రమే కాక, మానవజీవితము యొక్క పరమ లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేసేలా సాగుతాయి మన ఆచారాలు. అందువలనే ప్రపంచమంతటిలోకి మానసికంగా వున్నతస్తాయిలోవున్నామని భారతీయులను అందరూ పొగడేది. అమెరికాలో బాంబుదాడి జరిగితే దేశం దేశమే నెలలతరబడి నిద్రలేని ,రాత్రులను గడిపింది.అభద్రతతో తీవ్ర ఆందోళనతో .
అదే ముంబాయిలో స్టాక్ ఎక్చేంజి మీద పేలుల్లు జరిగినా మరునాడే యథావిధిగా తమ కార్యక్రమాలకు హాజరయిన మనవాళ్లను మీరింత ధైర్యంగా ఎలా వుండగలుగుతున్నారు?అని వాళ్ళు మనవాళ్లను ప్రశ్నించిన విషయాన్ని మీరు పేపర్లలో చూసేవుంటారు. ఆధైర్యం మనకు మన ఆచార వ్యవహారాలవలన ఉగ్గుపాలతోనే లభించింది. మనవాళ్ళు కేవలం పశుప్రాయంగా తిని,పెరిగి చస్తే పారవేసే పశుప్రాయంగా గడిపేలా చెయ్యలేదు మనజీవితగమనాన్ని. మానవజీవితానికి సంపూర్ణతను తెచ్చేవిధంగా రూపొందించారు. ఆలోచించిచూడండి.
Post a Comment