కోటి శివ పంచాక్షరీ మహాయజ్ఞము లో మీరూ పాల్గొనండి
>> Sunday, October 26, 2008
పరమదయాళువయిన పరమేశ్వరుని మెప్పించి పరమశుభాలు పొందటానికి పంచాక్షరి మహా మంత్రజపము సులభతరము ,శక్తివంతమయిన మార్గము. పరమ పవిత్రమయిన కార్తీకమాసములో ఆయనకు ప్రీతిపాత్రముగా ఈమంత్ర జపము చేసి ఆయన కరుణకు పాత్రమయిన వారి జీవితములో అశుభాలన్నీ తొలగి సకలశుభాలు సంప్రాప్తమవుతాయని శాస్త్రాలు సప్రమాణముగా నిరూపిస్తున్నాయి. వారి జీవితములో జాతకములో నున్న గ్రహదోషాలు తొలగుతాయి. బాధలు కష్టాలు తొలగించి కరుణతో పాలించు పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యేలా భక్తుల కొరకు కోటి శివపంచాక్షరీ మహాయాగము పీఠములో నిర్వహించబడుతున్నది. దీనిలో మీరు ప్రత్యక్షముగను, పరోక్షముగను పాల్గొనవచ్చును. మీరు కార్తీకములో అంటె 29-11-08నుండి 26-11-08 [మాసశివరాత్రివరకు] మీమీశక్త్యానుసారం పంచాక్షరీ జపము చేసి ఆసంఖ్యను వారానికొకసరి తెలియచేయాలి. ఎన్నిరోజులు ,ఎంతజపం చేయాలో ,మీరు నిర్ణయించుకోవాలి . ముందుగా మీరు మీగోత్రనామాలను మెయిల్,లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలి. ప్రతిరోజూ జరిగే రుద్రాభిషేకములో ను మృత్యుంజయహోమములోనూ మీపేర్లమీద పూజజరుగుతుంది. పాల్గొనేవాళ్ళు ఎప్పటినుండయినా మొదలుపెట్టవచ్చు. అనారోగ్యముతో జపంచేయటానికి , వీలుకాని వారు[నెలసరి ఇబ్బందులు తదితరం] వారితరపున తమకుటుంబములో ఎవరిచేతనయినా ఆరోజులలో జపంచేపించవచ్చు. రోజుకు 1008 సార్లకు తగ్గకుండా జపంచేయాలి. దానికి కొద్దినియమాలు పాటించవలసి ఉన్నది .1జపముచేసినంతకాలము . ఉదయాననే స్నానమాచరించి ఆచమనంచేసి తమ సంకల్పాన్ని భగవంతునికి తామకు చేతయిన రీతిలో చెప్పుకుని జపంచేయాలి.
2. మధ్యము ,మాంసము లను వాడరాదు.
ఇక ప్రత్యేక నియమాలను ఆచరించదలచుకున్నవారు కఠినతర సాధన చేయదలచుకున్నవారు వారి ఇష్టము. అది ఇంకామంచిది.
జపము పూర్తయిన తరువాత పూర్ణాహుతి జరుగుతుంది. దానిలో మీతరపున ఒక కొబ్బరకాయను ,ఆవునెయ్యి మీఖర్చు తోనే సమర్పించవలసివుంది. ప్రత్యక్షముగా పాల్గొనలేనివారు అందుకొరకు 15 రూ. పంపితే మీతరపున ఆద్రవ్యాలను కొనిపూర్ణాహుతిహోమములోసమర్పించటం జరుగుతుంది.
ఈకార్యక్రమానికి అనుబంధంగా పీఠములో 40 రోజులపాటు, అయ్యప్ప, శివ,భవానీ ,హనుమత్ దీక్షాదారులకు అన్నదానము జరుగుతున్నది. రామలింగేశ్వరునికి లక్ష బిల్వార్చన,,శ్రీవేంకటెశ్వరునకు లక్షతులసీదళార్చన ,అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. మహాశక్తిదాయకమయిన ఈ యాగములో మీరూ పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులై మీ ఇచ్చితాలను ప్రాప్తింపజేసుకోవాలని మా కోరిక . మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేసి వారిని సహితం పాల్గొనేలా చేయాలని ప్రార్ధన. సాధ్యమయినంత ఎక్కువమంది భగవద్భక్తుల కు మేలుకలగాలనేదే మా ప్రయత్నము. యాగానంతరం రక్ష, ప్రసాదములను పంపాలంటే మాత్రము పోస్ట్ ఖర్చులను మీరేభరించాలి. పెద్దసంఖ్యలోనున్న ఇందరుభక్తులకు పోస్ట్ ద్వారా ప్రాసాదాలుపంపేఖర్చును పీఠము భరించలేదు. మన్నించండి.
మెయిల్: durgeswara@gmail.com
1 వ్యాఖ్యలు:
గురువు గారూ,
ఇప్పుడే మనసులో మాట సుజాత గారి బ్లాగు లో కార్తీకమాసం గురించి రాసి, మీ టపా చూసాను. మీరు ఎన్నో తెలీని విషయాల గురించి మాకంతా తెలుపుతున్నారు. మా అమ్మమ్మ, నాయనమ్మలు నాకు ఊహ తెలిసినప్పటినుంచీ, వారు చనిపోయే వరకూ ప్రతీ సంవత్సరం కార్తీక మాస నియమాలు పాటించే వారు. దీపారాధన, తెల్లవారుఝామునే లేచి కార్తీక స్నానం చెయ్యడం, కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినట్లు అవుతుందని పట్టుబట్టి పిల్లల్లతో సహా అందరితో వత్తులు వెలిగింపజేసేవారు. నదీస్నానానికి అవకాశం దొరికితే తప్పక చేసేవాళ్ళం. ఇక వనభోజనాలు ఈమధ్య వరకూ చేస్తూనే ఉన్నాం. పైన నేను చెప్పిన ప్రతీ విషయానికీ ఒక అర్ధం, పరమార్ధం ఉన్నాయి. కార్తీక మాస ప్రాశస్త్యాన్ని గురించి విపులంగా మాకందరికీ మీరు తెలియజేయడమే, మాకందరికీ మీరిచ్చే దీపావళి దీవెనలుగా భావిస్తూ... విరజాజి.
Post a Comment