ఇలా విమర్శించి చూడండి రామాయణాన్ని ??
>> Saturday, October 25, 2008
ఈ మధ్యకాలములో రామాయణాన్ని అందులోని పాత్రల చర్యలని విమ్మర్శిస్తూ జరుగుతున్న చర్చలను చూస్తున్నాను. నాకు పనులవత్తిడివలన అందులోపాల్గొనటానికి సమయము దొరకలేదు. నా అభిప్రాయాలను మీతోపంచుకోవటానికి వీలుకాలేదు. నావుద్దేశాన్ని సరిగా అర్ధంచేసుకోగలరని ఇదివ్రాస్తున్నాను. నేను మీకంటే అధికంగా తెలిసిన వాడిననేగర్వముతోకాక రామాయణ ఔన్నత్యాన్ని విమర్శించడముద్వారా సంభవించేదుష్పరిమాణాల పట్ల భీతితోవ్రాస్తున్నాను.
ఏదైనా ఒక విషయాన్ని,లేదా వ్యక్తులచర్యలను మనం విమర్శించాలంటే మనం, ఒక విషయం గమనించాలి. ఆవిషయము పట్ల మనం సమగ్రమయిన అవగాహన కలిగి ఆవ్యక్తి కంటె వున్నత భావాలు .ఆచరణ కలిగి ఉండాలి. వారి చర్యలకంటె ఉన్నత చర్యలను సూచించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. .మరి ఎదుటువారిలో.లేక వారి ప్రవర్తన తప్పుపట్టామంటే మనం వారికంటే ఉన్నతమయి ఉంటేనేకదా అర్హత. అర్హత లేకున్నా విమర్శించట మంటె ఆకాశం మీద ఉమ్మెయ్యటం లాంటిది. నాతోపాటు భారత సాంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వారిమంతా శ్రీరామున్ని భగవంతునిగా కొలుస్తాము. ఈదేశ ధార్మిక సామాజిక నీతులన్నీ రామాయణములాంటి మహా గ్రంథాలమీద ఆధార పడిసాగుతున్నాయని నమ్మేవాళ్ళము. కనుక మా మనోభావలను బధపెట్టె వారు మాకు కొన్ని అనుమానాలకు సమాధానాలివ్వాలు ఇవ్వ వలసిన బాధ్యత కలిగివుంటారు. అదే ఏ ఇతర మత గ్రంథాలనైనా విమర్శిస్తే ప్రతిస్పందనలు ఎలావుంటాయోమీకు అనుభవపూర్వకముగా తెలుసుగనుక మీ రెటూ వాటిజోలికి పోరు. వెళ్లమని మాఅర్థం కాదు. మాకు మా పెద్దలు సహనం ద్వారానే సమస్యలను ఎదుర్కొనటం అనేమార్గాన్ని బోధించి ఆచరించి చూపారుకనుక భారతధర్మానికి వారసులమని గర్వపడేమాకు మాపెద్దల మార్గములో నడవడమే చాతనవుతుంది. ఇప్పుడు ఈ రూపములోనయినా స్పందించకుంటే కలియుగములో అసత్య వాదనలకు మనుషులు లోనయి పక్కదారిపడతారనిచెప్పిన భవిష్య పురాణాది గ్రంధాలన్ని గుర్తుతెచ్చుకుని, ఈ అసత్యాల చే వంచించబడి కలిపురుషుని ప్రభావానికి లోనయి తమధర్మాన్ని తామేవిమర్శించుకుంటున్న కొందరు మాసోదరీసోదరులకు నిజం తెలుసుకునేఅవకాశం దూరం చేసినవారమవుతామనే ఉద్దేశ్యంతో ఇందులో పాల్గొంటున్నాము. శ్రీ రాముని తత్వాన్ని భగవంతునిగా కాకున్నా, ఒక వ్యక్తిగా విమర్శించాలన్నా ముందు ఈ క్రింది ప్రశ్నలకు మీమనసులో మీరే జవాబు చెప్పుకుని సాగండి.
1... ... రాముని వ్యక్తిత్వ మేమిటి. ఆయన సత్యవాక్పరిపాలకుడు. తానెప్పుడూ అసత్యమాడడు. పెద్దలఎడల గౌరవభావాన్ని ఏస్థితిలోనూ వదలడు. ఈ శరీరానికి కారణమయిన తండ్రి, తల్లి పట్ల ఎనలేని కృతజ్ఞతా భావాన్ని కలిగి వారిమాటెన్నడూ జవదాటడు. ఉదయాన్నే రాజయి రాజ్య మేలబోతున్నాడు. అపార సంపదలకు భోగభాగ్యాలకు అధిపతి కానున్నాడు. కానీ హఠాత్తుగా అడవులకు పొమ్మని తండ్రి ఆజ్ఞ . అదీ ఆయన చెప్పలేని స్థితిలో. ఇచ్చిన మాటకూ, ప్రేమకూ కట్టుపడి మతి చలించినంత పరిస్థితిలో అయినా సరే ఏమాత్రం చలించలేదు. మనసులో ఏ కల్లోలమూ లేదు. చిరునవ్వుతో సమాధానంగా ప్రయాణమయ్యాడు.
మీతండ్రి భాగపంపకాలలో మీ సోదరీ సోదరులకంటె కొంచెం తక్కువగా మీకు పంచినా లేక మీకు భాగం లేదు పొమ్మాన్నా. మీరుఇలానేస్పందించగలరా? త,డ్రినిర్ణయాన్ని తప్పుబట్టకుండా ఆయనను విమర్శించకుండా , ఎన్ని కష్టాలకోర్చయినా బ్రతకటానికి మీరు వెళ్ళగలరా? అంతటి స్వతంత్రవ్యక్తిత్వ సామర్ధ్యం మీకున్నదా?
2....... ... రాముడు అడవికి వెళుతుంటే ఎండకన్నెరగని ధనవంతుల బిడ్ద .ఎంత కష్టమో వనవాసం. అయినా తనను వారించిన భర్తను ఎత్తిపొడిచి, నేను ఇల్లాలిననుకున్నావా మరొకటా? భర్త సుఖాలలోవున్నప్పుడు పక్కనుండి ,కష్టాలలో పుట్టినింటికి వెళ్లటానికి ?అని వాదించి ఆయన వెంట వెళ్ళిన సీతామాత వంటి సంస్కారబలం కలవారు?గదా మీరు, ఆ .స్థిలో భాగం సరిగా పంచుకురాకపోతే మీరేమ్ మగాళ్ళు మనభాగమతా వెళ్ళి పంచుకువచ్చినదాకా నేను అన్నమ్ముట్టను. నీళ్ళుతాగని వేధించి అత్తమామలను సాధించే వైఖరి కలవారా?. [ మొగుడు తాగుబోతయినా. తిరుగుబోతయినా అతనిని వీడక కాపుఅరం సరిచేసుకుని భారత స్త్రీఔన్నత్యాన్ని లోకానికి చాటి చూపుతున్న తల్లులందరకూ పాదాభివందనం చేస్తూ క్షమించమని వేడుకుంటున్నాను] భారత స్త్రీల ఔన్నత్యానికి సీతమ్మను ఆదర్శంగా తీసుకోవటమే కారణమని భారతీయులందరి అభిప్రాయం. రావణుడు అపహరించిన తరువాత తన భర్త ఎక్కడున్నాడొ తెలియదు. వస్తాడొ రాడో తెలియదు. వాడు తనకు లొంగితేసర్వ సంపదలకు అధిపతినిచేస్తానన్నా, వాడిని చీకొట్టి గడ్దిపరకగా చూసి నట్లు చూసి, చావటానికయినా సిద్ధపడినదేకాని మానమును కోల్పోక కోట్లాది భారతీయనారీమణుల మనసులను పవిత్రభావముతో వుంచుతున్న ఆతల్లి ప్రభావం కాదనగలవారున్నారా? తనను అనుమానించినట్లుగా భావన తెలిసినా భార్యగా , ఆయన ఆజ్ఞను తలదాల్చిన ఆతల్లి మనోబలం మరొకరికున్నదా?? లోకానికి ఆదర్శపురుషునిగావుందవలసిన వ్యక్తికిసహచరిత్వం ఎంతకష్టమయినదయినా సార్ధకత చేకూర్చిన ఆతల్లి అడుగుజాడలను మించిన ఆదర్శం ఇంకొకటున్నదా?
3................తనకు అడవులకు పోవలసిన అవసరం లేదు. అయినా అన్నగారిసేవ కొరకు బయలుదేరినవాడు లక్ష్మణుడు. రాజ్యంనిరాటంకంచేసిపెట్టినది తల్లి. ఇద్దరు భాగస్తులు అడవులు పట్టిపోయారు. అయినా తన అన్నకు లేని రాజ్యభోగాలు తనకెందుకని కోపించి,త్యజించి ,అన్నదగ్గరకు వెళ్ళి రమ్మనిబ్రతిమాలి, ఆయన రాకుంటే నందిగ్రామములోనే నివసిస్తూ కఠినముగా తనశరీరాన్ని దీక్షలకు గురిచేసి బాధ్యతలను అన్నతరపున నిర్వహించిన భరతుడు అన్నదమ్ముల ప్రేమకు నిలువెత్తు నిదర్శనము. మీకు మీ స్వార్ధాన్ని త్యాగం చేసి అన్నదమ్ములకోసం పరితపించే మనసువున్నదా? అన్నదమ్ములకోసం అవసరమయితే మీ ధనాదులను కూడా వదలుకోగల సౌజన్యము త్యాగనిరతి మీకున్నదా? అప్పుడు మీరు రామాయణాన్ని విమర్శించ్టానికి ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంకొంచెమ్ముందుకు పోదాము.
4....................... తండ్రి చనిపోయినా, తమ్ముడువచ్చి పిలచినా పెద్దలు సర్దుబాటు పద్దతులు చెప్పినా, జాబాలి లాంటివారు నాస్తిక వాదన చేసి మనసును మల్లించటానికి చూసినా చలించలేదు తన సత్యవాక్పాలననుండి. రాముడు. అవకాశము వచ్చినా ఋజుమార్గమునుండి పక్కకు మల్లని ఆత్మధైర్యం మీకున్నదా?
5......................అడవిలో వున్నప్పుడు అందగత్తెగా సూర్పణక వచ్చి వలచినది, ఎగతాళి చేసి పంపినాడెకాని పరస్త్రీని తప్పుభావనతో చూదలెదు. పెల్లాం పక్కనేవున్నా, చక్కగా వున్న పక్కవారిని దొంగచూపులు చూసే బుద్ధి మీకులేదుకదా? అది సినిమా హీరోఇన్లనయినాసరె. పరస్త్రీలను కాముకదృష్టితో చూడని గొప్ప ,చలించని మనోనిగ్రహం కలవారు రామాయణాన్ని విమర్శించేందుకు ఒక అర్హతకలవారు కావచ్చనుకుంటా?
6.. ......... భార్యను ఎవడో దుర్మార్గుడపహరిస్తే దు\:ఖాతిశయముతో మతిని కోల్పోయినవాలివలెనయి. ప్రతి చెట్టునూ పుట్టనూ నాసీత ఎక్కడ అంటూ విలపించిన ఆస్వామి ప్రేమకంటే మీ భార్యపట్ల ఇంకా ఎక్కువ ప్రేమ కలవారు ఐతే మీరు ముందుకు సాగవచ్చు. తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? సందుదొరికితే సెకండ్ సెటప్ పెట్టటానికి వెనుకాడని ఈ నాటి మాయ ప్రేమలెక్కడ. రాముని వంటి ప్రేమ మీకున్నదా? పరిశీలించండి. మీమనసులో మీ భార్యపట్ల.
6..... సహాయము కోరిన సుగ్రీవునికంటే వాలి బలవంతుడు.తనపని సులభముగా చేసి పెట్టగలడు. ఐ నా సరే నమ్మిన వారిని కాపాడెందుకే మొగ్గుచూపాడా కాని తనపనిజరుగుతుందికదా అని అవినీతిపరుడిని ఆశ్రయించలేదాయన. మన జీవితాలలో అవసరానికనుగుణంగా అభిప్రాయాలు మార్చుకునేవారము, అవసరమయితే లంచాలిచ్చి పనిచేసుకునేవారు , నమ్మిన వారిని అవకాశమొస్తే వదలివేయనివారు గావున్నవారు విమర్శకులవవచ్చు.
7....శరణని వచ్చిన విభీషణునే కాదు ,అవసరమయితే అభయమడిగితే రావణునయినా రక్షిస్తానని పలికాడు రాముడు. అంతటి క్షమాగుణసంపన్నులు. వున్నారా మనలో?
8.... యుద్ధములో మూర్చిల్లిన లక్ష్మణునికోసం చిన్నపిల్లవానిలా ఏడ్చిన సోదరప్రేమ ,సూర్యుని ఉదయాన్ని సహితమాపటానికి ప్రయత్నించిన పరాక్రమ శక్తి కలవారమా మనము?
9.... ...... యుద్ధము ముగిసిన తరువాత తన ప్రాణాధిదేవత ఎదురొస్తుంటే ,తనలో ప్రేమోద్వేగాన్ని అణచుకుని ధర్మానికి కట్టుబడి ధర్మ రక్షకునిగా తన అచరణ లో ఏలోపము లేకుండా వుడేందుకు కఠినంగా వ్యవహరించవలసివచ్చ్నప్పుడు ఎంతవేదనననుభవించాడో ఎవరికెరుక. ఆతల్లి పరమ పవిత్రురాలని తెలుసు. లేకుంటే అసలు యుద్ధప్రయత్నమే చేసేవాడుకాడు. కానీ లోకం సత్యాన్ని ప్రత్యక్షప్రమాణముతోగాని నిర్ధారించదు. రేపురాజుగా పరిపాలనసాగించేటప్పుడు., తాను శిక్షలు విధించినప్పుడు ఎవరూ తమ మనసులోకూడా రాముని గురించి సీతగురించి తక్కువగా మాట్లాడకూడదు. కనుకనే సీత పవిత్రత ఇక్కడే నిరూపించి చూపాలి .ఆశక్తి ఆపతివ్రతామతల్లికి వున్నదని పూర్ణముగావిశ్వాసం రామునికి .అందుకే అగ్ని పరీక్షకు ఆదేశించాడు. వాస్తవానికి ఆయన తప్ప మరోప్రయోజనముండదు కాలక్షేపము ,తప్ప మరొకటికాదు కల్పిమ్చుకున్నది,తనశక్తి చూపి భవిష్యత్ తరాలకు పాతివ్రత్యమహిమ తెలిపేందుకు.
అంతేకాక ఇక్కడొక సూక్ష్మామ్శమున్నది. అదిధర్మానికి సంబంధించినది . ఏపాపం ఎరుగని లక్ష్మనుని నానా మాటలు అన్న పాపఖర్మ కొంత అనుభవించవలసి వున్నది. ఆరోజు లక్ష్మణుడు ఎంత దు:ఖానికి లోనయ్యాడో ఆతల్లికికూడా అనుభవపూర్వకంగా తెలియవలసి ఉన్నందున ధర్మ రక్షకునిగా తనమన చూడకుండా ఆ శిక్ష విధించాడు రాముడు
.తమవద్దకొచ్చేసరికి. ధర్మాన్ని తప్పే న్యాయమూర్తి కాదాయన. అలా జరగకున్నట్లయితే ఈ నాడుసీతామాత గురించి మాట్లాడిన చాకలిని అనుసరించి మాట్లాడెదేమో ఈ లోకం . భార్య లేకుంటే బంగారపు బొమ్మను ప్రతిగా పెట్టుకుని యాగం సాగించాడే కాని ఎకపత్ని వ్రతాన్ని విడనాడలేదు. తుచ్చమయిన శారిరికసౌఖ్యాలకోసం తనమనసులోని ప్రేమమూర్తిని తొలగించి మరొకరికి ఆవకాశం ఇవ్వలేదు . భార్య పోగానే నాలుగురోజులకు ఆ ప్రేమను మరచి కొత్తభార్యకోరకు ఎదురుచూసే ఇప్పటి వారికి రాముని ప్రేమను అనుమానించే ఆవకాశం ఎలా వుంటుంది.?
లోకానికి ధర్మాన్ని చెప్పవలసిన రాజు తానూ మనసా వాచా కర్మణా సత్యాన్ని పాతిమ్చగాలిగితేనే ఆపదవికి న్యాయం చేసినవాడవుతాడు. లేకుంటే ప్రజలపాపాలకు ఆటను కారణమవుతాడు. అడినిరూపిమ్చి, మానవుఅలలో పాలకులు ఎలా నడవాలో చూపించాడు. తానుఎన్నిబాధలు సాహిమ్చయినా? అది తెలిసిన పూర్వపు నాయకులు సర్వస్వాన్ని వదులుకుని నిజమయిన ప్రజాసేవకులుగా చరిత్రలోకేక్కారు. తమస్వార్ధమేతప్ప ధర్మంతెలియని వారు నాడూ నేడూ ప్రజలను దోచుకుని లోకకంటకులయిన పాలకులుగా మారుతున్నారు. కులం మతం పార్టీలు తప్ప అతను dharmaatmuDaa? కాదా అనే విచక్షణ చేయకుండా వాళ్ళను ఎన్నుకుంటున్న మనం మన మనోస్తితితో రాముని లాంటి నాయకుని ప్రవర్తనను తప్పులెన్నటానికి ప్రయత్నిస్తున్నాము.
బిడ్డగా,అన్నగా, భర్తగా స్నేహితునిగా, రాజుగా ,ధర్మరక్షకునిగా,ప్రేమమూర్తిగా ఆయన లోకం గుండెలలో నిలచిపోయాడు. ఆయన ప్రేమతత్వాన్ని తట్టుకోలేని అసూయాగ్రస్తహృదయాలు ఆయన చరితకే కళంకం తేవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాయి. కొన్ని ప్రక్షిప్తాలను చేర్చి అందుకు ప్రయత్నించిన సంఘటనలున్నాయి. వాటిలో ఒకటి విన్నవిస్తాను.
రాముడు సంభూకుని వధించాడు అని.ఒక ప్రక్షిప్తాన్ని చొప్పించారు. మధ్యలో ఎవరో మూర్ఖులు. వాల్మికి గాయత్రి మంత్రాక్షరాల సంఖ్యలో 24000 శ్లోకాల తో గ్రంథ రచన సాగించినట్లు తెలుస్తున్నది. కాని ఉత్తరరామాయణములో దిఇన్ని ప్రక్షిప్తము చేసారని చరిత్రకారుల అభిప్రాయము. గుహుడు,శబరి,వానరులు పక్షులను సహితము ఆదరించి వారి తపస్సులను ఫలిమ్పజేసిన స్వామి తపోదీక్షలో వున్న శంభూకుని ఎందుకు చంపుతాడు. కాలప్రవాహములో రాగిచెంబుకు చిలుము పట్టినట్లు మహాగ్రంతాలలో కూడా కొందరు ఆనాడున్న స్వార్ధపరులు తమచర్యలకు ప్రమాణము చూపిమ్చుకోవటానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లున్నది. దీనిమీద సమగ్రపరిసోధన చేసిన వారు చెబుతున్న మాటయిది. , విషజంతువులు విషవృక్షాలు రామాయణ కల్పతరువును ఏమీ చేయలేక అలా మరుగునపడి పోతూనే వున్నాయి. కానీ అవికక్కిన కొన్ని విశబిమ్దువులు మాత్రం మానవ మనస్సులను కల్లోలపరుస్తున్నాయి.
సముద్రములో రత్నాలను ఎన్నిఏరినా ఇంకా దొరుకుతూనే ఉంటాయి .రామాయణాన్ని దాని ప్రభావాన్ని వర్ణించటం చుక్కలు లెక్కపెట్టటం లాంటిదికనుక . నాఅసమర్ధతను చెప్పుకుంటున్నాను.
లోకానికి రీతి,నీతి బోధించటానికి అవతరించిన సీతారాముల ప్రేమలో లోపాలెంచకండి. సత్గ్రంథాలను ,సత్పురుషులను విమర్శిమ్చటము పాపమయి చుట్టుకుని వేధిస్తుంది.
ఇక దేవుని నమ్మక పోయినా ఫరవాలేదు. సత్య ధర్మాలను నమ్మే వారుగా ,లోకహితిభిలాశులుగా వున్న మిగతావారుకూడా రాముని మమ్చిగుణాలను ఎన్నింటిని మనం ఆచరించ గలుగుతున్నామో వాటివలన లోకానికి కలిగే మేలును పరిసిలిమ్చుకుని సాగండి విమర్సించటమే గొప్పకాదు,మనవున్నతికి పనికిరాదని గమనించి అందులోని మంచిని మన భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేయండి . మనజాతి మరికొన్ని యుగాలు మహోన్నతంగా బ్రతకటానికి. ఆచరణ లేకుండా వాదులాటే ప్రధానంగా సాగే వివరణలకు నేను జవాబు చెప్పినా మీకు నాకు సమయము వ్రుధా తప్పమరొకటికాదు, కనుక మనపిల్లలకు రామాయణం నేర్పుదాము వాళ్ళు
అన్నదమ్ములెలావుండాలో నేర్చుకోవడానికి ,రేపుమనలనెలా గౌరవించాలో తెలుకోవడానికి .
మన ఆడపిల్లలకు నేర్పుదాము సీతవంటి సాద్వీమతత్వం, ధైర్య ము సహనతలను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి . ముందుమనం చదువుదాము, అందులో అసలు విశేషాలేమితో తెలుసుకోవడానికి ,ఎవరో విమర్శించినట్లుగా మనము మానవధర్మాన్ని మరచిపోకుండా వుండటానికి.
సర్వేజనా స్సుఖినోభవంతు.
35 వ్యాఖ్యలు:
చాలా చక్కగా వ్రాసారు. రామాయణం అర్థం చేసుకుందామనుకునేవాళ్ళకు ఒక చక్కటి సూచిక.
రామాయణం పట్ల మీకున్న నమ్మకాన్నీ,దాంట్లో ప్రభోధించిన విలువలకు మీరిచ్చే ప్రాముఖ్యతనీ ఎవరూ తక్కువ చెయ్యలేరు.
కాకపోతే,మీకున్న నమ్మకాన్ని అందరు అంగీకరించాలనుకోవడంతోనే వస్తుంది సమస్య. రామాయణాన్ని విమర్శించేవారికి వారి ధృక్కోణాలు వారికున్నాయి, వారి విలువల నేపధ్యంలోంచీ చూసి వారామాటంటున్నారు.
అంతమాత్రానా, ఆధృక్కోణాన్ని చెప్పడానికి వారు (మీదృష్టిలో)రాముడంత ఉన్నతులూ,సీతంత పవిత్రురాండ్రూ కావానే సూచన హాస్యాస్పదంగా వుంది..to say the least.
గాంధీని విమర్శించడానికి గాంధీలా బ్రతకక్కరలేదు,అంబేద్కర్ లాంటివారికీ, జిన్నాలాంటివారికీకూడా ఆ హక్కుంది. ఈ విషయం గమనించగలరని సూచన.
మహేష్ గారూ!
మీరన్నట్లు ఆరోపించటానికైతే. ఏ అర్హత అఖ్ఖరలేదు. కానీ విమర్శించాలంటే అంతకంటే ఉన్నతమయిన అర్హత వున్నవారయితేనే అర్ధముంటుంది .లేకుంటే దానికి విలువ ప్రామాణికత ఎలా వస్తాయి. లేకున్నా విమర్శిస్తామంటే ఇది సనాతన ధర్మభూమి ఎవరూ ఏమీ అనరు,ఆపాప ఫలితము కర్మానుసారంగా అనుభవానికొస్తుందని తెలుసుకనుక. అదే ఇతర ధర్మాలవారయితే ఫలితమెలావుంటుందో మీకు తెలియనిదికాదు. కనీసము తాము నమ్మని దానిని గురించి ,ఇతరుల నమ్మకాలను బాధపెట్టెవి అయినప్పుడన్నా కాస్త సంయమనం పాటించి ఊరుకున్నందువలన మనకేమి నష్టమని ఆలో చిస్తారు మంచి మనసుకలవారు. అలా కాకుండా ఇతరులను బాధపెట్టాలని ఉద్దేస్యపూర్వకమ్గాచేస్తున్నారనే భావన కలిగిమ్చేవారివలన లోకములో అలజడులు చెలరేగుతున్నాయి. ఐనా సరే అంటే చేసేదేమున్నది. బుద్ధి కర్మాణుసారణి అనుకుంటాము మాలాంటివారము.
చాలా బాగా వ్రాశారు.
@మహేష్ కుమార్
విమర్శకునికి తగిన అర్హత లేకుండా విమర్శిస్తే ఏనుగుని చూసి కుక్కలు మొరిగినట్లుంటుంది.ఇతరులకు ఏమి చెపుతావో అది నువ్వు ఆచరించగలిగితేనే మరొకరికి చెప్పు అన్నారు మహాత్మాగాంధీ.
దుర్గేశ్వర్ గారూ! ఇంతకు మించిన ఆటుపోట్లను మన హిందూమతం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగల్గింది.భయపడనవసరం లేదు.మన మనసులు ఇలాంటి విమర్శలు విని చివుక్కుమనవచ్చు.కాని బాధపడనవసరం లేదు.గజశునక న్యాయం తెలుసు కదా? వీధిలో ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి కదా.కాని అందువలన ఏనుగుకు ఏ సమస్య ఉంటుంది."సత్యమేవ జయతే నానృతం".
ఏమిచెప్పారన్నా! ఆకాశం మీదవుమ్మెయ్యటానికి అర్హత ఎందుకన్నా? ఆవేశం చాలు.తర్వాత ఆలోచించుకున్నా ప్రయోజనం లేదనుకోండి.అయినా మీ నమ్మకాలను విమర్శించాలంటే మాకున్న అర్హతమాకుంది.అదే మీనమ్మకాలనెన్నన్నా,మీరు పట్టించుకోరు,మీచర్మాలు మొద్దుబారి వున్నాయనే నమ్మకం .
అదే ఇతరుల పవిత్రగ్రంథాలజోలి వెల్లం.ఎందుకని? ఎందుకంటే వెళితే ఎముకల్లో సున్నం వుండదు అని తెలుసుగనుక.
మన ఇతిహాసాలు ఎప్పుడు మంచినే చెపుతాయి. వచ్చిన చిక్కల్లా వాటిని సరిగా అర్థం చేసుకోవడంలోనే. ఆకాశంపై ఉమ్మేయడానికి ఆవేశం ఉంటే చాలు కానీ నష్టం ఎవరికి ఆకశానికి కాదు కదా. ఎన్ని శునకాలు ఎన్ని రకాలుగా మొరిగినా ఏనుగులాంటి రాజసం, ఆకాశమంతటి విశాలత్వం మన రామాయణానికున్నది. ఇదే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ....
చాలా చక్కగా వ్రాసారు
@దుర్గేశ్వర రావు: నేను సిగరెట్ తాగుతాననుకోండి, అయినా పక్కవాడికి "సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం" అనిచేప్పే అధికారం కోల్పొతానంటారా?
రామాయణంలోని ‘పాత్రల్ని’ తప్పుబట్టటానికి కావల్సింది అంతకుమించిన అర్హతకాదు. ఆకథని(ఏ రూపంలోనైనాసరే) చదివిన ఎవరికైనా, ఆ హక్కువుంటుంది.పాఠకుడికి పుస్తకంమీద తన అభిప్రాయాన్ని చెప్పే అధికారం ఎప్పుడూ ఉంటుంది.
అది "పవిత్రమని" నెత్తికెత్తుకేవారితో మాకెటువంటి విభేధం లేదు. కారణం, వారికి ఆస్వాతంత్ర్యం వుంది.కాకపోతే, విమర్శించేవారికీ అదేస్వాతంత్ర్యం వర్తిస్తుందని గ్రహించాలనే నేను కోరుకునేది.
@చిలమకూరు విజయమోహన్: అప్పుడప్పుడూ కుక్కలుకూడా తాము ఏనుగులనుకుని విర్రవీగుతూ వుంటాయిలెండి. అప్పుడే లెక్కల్లో తేడా వచ్చేది.ఎవరికివారు ఏనుగులనుకోవడంలో తప్పులేదు. కానీ, మొరిగేవన్నీ కుక్కలే అనుకోవడం మాత్రం ఏనుగులు చెసినా మూర్ఖత్వమే అవుతుంది.
దుర్గేశ్వర గారూ మీకు తెలియనిదా,
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం దురాత్మనామ్
సూర్యప్రకాష్
దుర్గేశ్వర గారు,
నేను ఈ రామాయణ చర్చల్లో పాల్గొనటం లేదు. ఒక చిన్న సూచన చేద్దామని మాత్రమే రాస్తున్నాను.
విమర్శకులు ఆదికావ్యాన్ని ఆరాధించేవారి మీద కాకుండా, ఆ గ్రంధమ్మీద విమర్శలు చేస్తున్నారు. మీరు మాత్రం వాళ్ల అర్హతల్ని ప్రశ్నించటం ద్వారా అసలు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకుండా దాటేస్తున్నట్లుంది.
దుర్గేశ్వర గారు,
చాలా బాగా చెప్పారు. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఈ మధ్య మిడిమిడి జ్ఞానంతో రామాయణాన్ని, ఇతర హిందూ మత గ్రంధాలని అవమానించడం ఒక ఫ్యాషన్ అయిపొయింది. వీళ్ళు రామాయణాన్ని గాని, అది కుదరకపోతే కనీసం వాళ్లు విమర్శించే అంశాన్ని కూడా పూర్తిగా అర్ధం చేసుకోకుండా వితండ వాదాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఎవరి అభిప్రాయాలని వాళ్ల దగ్గర ఉంచుకుంటే పర్వాలేదు. ఈ అర్థ జ్ఞానం (half knowledge) తోనే వేరే మతాల వాళ్ల దగ్గరికి, ఇతరుల దగ్గరికి వెళ్లి వాగుతున్నారు. వాళ్లు వచ్చి హిందూ మత గ్రంథాలని, హిందూ మతాన్ని అవహేళన చేస్తుంటే, తెలిసిన వాళ్లు సమాధానం చెప్పుకోలేక చావాల్సి వస్తోంది.
- Shiv.
కత్తి మహేష్ కుమార్ గారు,
ఎంతో గొప్ప విషయ పరిజ్ఞానం, ఎన్నో గ్రంథాలు చదివిన అనుభవం ఉందని ఢంకా మ్రోగించుకునే మీరు ఇంత నేలబారు వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. గ్రామసర్పంచులకి, MCRC లో ఉండే Muslim intelligentia కి, ఇంకా అనేక మందికి మీరు ఇలాగే బోధిస్తారేమోనని తలుచుకుంటేనే భయం వేస్తోంది.
ఏదైనా విషయం ఇతరులకి చెప్పాలంటే ముందు దాన్ని మనం ఆచరించి చూపించాలనే మహాత్మా గాంధీ సూక్తి మీరు విన్నారా ? రామకృష్ణ పరమహంస, వారి తీపి తినే అలవాటుకి సంబంధించిన కథ ఎప్పుడైనా విన్నారా ? వినకపోతే మీ దురదృష్టం అనే చెప్పాలి.
'నేను సిగరెట్ తాగుతాననుకోండి, అయినా పక్కవాడికి "సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం" అనిచేప్పే అధికారం కోల్పొతానంటారా?' మీకు చెప్పడానికి తప్పకుండా అధికారం ఉంది. కాని వాడు తిరిగి నాకు చెప్పే ముందు నువ్వు మాని చూపించవోయి (నేను ఇక్కడ రాసినదానికన్న గట్టిగా) అని చెపితే మీరు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో చూడాలని ఉంది. నాతో ఎవరైనా ఇలా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సమాధానమే ఇస్తాను.
రామాయణాన్ని ఒక పుస్తకంగానే విమర్శిస్తాను, ఒక మత గ్రంథంగా కాదు అని వాదిస్తారా ? ఏ పుస్తకంలో అయినా ఒక మంచి విషయం పాఠకులకి బుర్రకి ఎక్కే విధంగా చెప్పడానికి ముందుగా ఒక మంచిది కాని విషయాన్ని సంచలనాత్మకం చేసి చివరికి మంచి గెలిచినట్లు చూపుతారు కదా ? ఇది ఒక పుస్తకాలకే కాదు, అన్ని రకాలైన మాధ్యమాలకి వర్తిస్తుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అనుకుంటాను. ఒక విషయం లో చెడుని వదిలేసి మంచిని మాత్రం గ్రహించి పాటించాలని మీకు తెలుసా ? దీన్నే క్షీర నీర న్యాయం అంటారు (దీన్ని గురించి మీకు తెలియకపోతే చెప్పండి. అర్థమయ్యేటట్లు చెపుతాను). ఇది తెలిసి కూడా ఒక విషయంలో నేను చెడునే గ్రహిస్తాను, దాన్నే ఆ పుస్తకంలో చెప్పదలుచుకున్న అంశంగా ప్రచారం చేస్తాను అని అంటే, అలాంటి వాళ్ళకి ఇంకా ఏమని చెప్పగలం ? మీరు మీ బ్లాగ్ లో ఎవరికో సమాధానం ఇచ్చినట్లు "ఈ మీ జ్ఞానం కంటే అవగాహనా రాహిత్యం ఇక్కడ మేలేమో !"
- Shiv.
@శివ్: నేలబారు వ్యాఖ్యలు చేస్తున్నదెవరో మీవ్యాఖ్య చదివితే మీకే తెలుస్తుంది.
రామాయణాన్ని విమర్శించే వ్యక్తుల అర్హతకన్నా, వారు చెప్పే విషయాలలోని (ఉంటే) విలువని గ్రహించడానికి ప్రయత్నించండి. లేకుంటే దాన్ని త్యజించండి.అంతేతప్ప ఇలా వ్యక్తుల్నిబట్టి వారు చెప్పే విషయాలను బేరీజు చేసి, మీరు చెప్పిన ‘క్షీర-నీర’ పద్ధతిని ఉపయోగించమంటున్నాను. అంతేతప్ప విమర్శించేవాళ్ళందరూ చెప్పేవి "నీళ్ళే" అనే అపోహలో, మీకు తెలిసింది మాత్రమే "పాలు" అనుకునే అజ్ఞానంలో ఉండనఖ్ఖరలేదు.
ఆలోచనకూ-అర్హతకూ, అభిప్రాయానికీ-నిబద్ధతకూ inversely proportionate సంబంధం చెల్లిపోయిన ఇక దశకం దాటిందని మనవి.
రాముని నిబద్దతని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఆయన నేర్పిన విలువల్ని విశ్లేషించాలంటే, మనకు ఏమాత్రం విలువలున్నాయో ముందు చూసుకోవాలి. మనకు లేవు కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు అంటారా? ఆయనకున్న విలువలు మనకి లేవు అన్న సమాధానం లోనే మీ ప్రశ్నలకి సమాధానం దొరకాలి. మనకన్నా గొప్పవాడు, విలువలు, నిబద్దత ఉన్న వాడు కావునే ఆ మహామహితాత్ముడ్ని భగవంతునిగా ఆరాదిస్తున్నాం. కేవలం దైవంగానే కాదు, మానవ జీవితాన్ని కూడా ఎంత ఆదర్శవంతంగా బ్రతకవచ్చో చూపించాడు ఆ మాన్యుడు.
అబ్రకదబ్ర: "విమర్శకులు ఆదికావ్యాన్ని ఆరాధించేవారి మీద కాకుండా, ఆ గ్రంధమ్మీద విమర్శలు చేస్తున్నారు." చాలా తెలివైన వాదన. కాకపోతే మరో అడుగు ముందుకేసి విమర్శకులు రామాయణాన్ని విమర్శించడం ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పాల్సింది. ఈ విమర్శల వెనక హిందూమతపు ప్రాథమిక విశ్వాసాల మీద దెబ్బకొట్టే ఉద్దేశ్యం కాక మరోటేమైనా ఉందేమో చెప్పాల్సింది.
రామాయణాన్ని ప్రేమించేవాళ్ళ మీద ద్వేషం కాకపోతే రామయణాన్ని విమర్శించాలన్న యావ ఎందుకు? రామాయణం నిజం కాదు కథన్నారు, రాముడు ఆదర్శపురుషుడు కాదన్నారు. విషవృక్షాలు రాసారు. ఇవన్నీ ఎందుకు? విశ్వాసాలను, సంస్కృతినీ దెబ్బ కొట్టే ప్రయత్నం తప్ప మరేంటో చెప్పండి. ఆ ప్రయత్నం సఫలమైందా లేదా అనేది వేరే సంగతి.
విమర్శించడం తప్పని నేననడం లేదు. కానీ.. 'నేను నిన్ననలేదు, అదిగో ఆ గోడనన్నాను, గాలినన్నాను' అని చిన్నపిల్లలు చెప్పే కబుర్లు చెప్పడమెందుకు అనేది నా ప్రశ్న. సూటిగా, 'మీ విశ్వాసాలను ప్రశ్నిస్తున్నాం' అంటూ విమర్శించండి. దీనిలో శషభిషలెందుకు?
అయినా రాముడికి, ఈ జాతికీ ఇలాంటి సాంస్కృతిక దాడులు కొత్తేమీ కాదు ఆనాటి చాకలి దగ్గరినుండీ (అతడు చూడండి.. నేరుగా రాముడినే అన్నాడు.. నేను నిన్ననలేదు, మా ఊరి రాంబాబు గాణ్ణన్నాను అంటూ తప్పించుకోలేదు.) నేటి ప్రభుత్వం దాకా జరుగుతూనే ఉన్నాయి. కానివ్వండి.
మీ రచన చదివాను, మీరు ఆలో చించే విధానము బాగుంది, కాని ఒక కోణములో నుంచే చుస్తున్నారు అని నా వుద్దేస్యము.నాకు రాముడంటే చాలా గౌరవము.నేను, వాల్మికి రామాయణాన్ని, రామాయణ విష వ్రుక్షాన్ని, ఇంకా కొన్ని రామాయణాల్ని చదివాను.కాసేపు మనకు రాముడు,సీత మొదలైన పాత్రలు తెలుయదు అనుకోండి అలాగే మనకు తెలిసిన మానవ పరిణామ క్రమాన్ని ద్రుస్టి లో వుంచుకొని రచనలు చదువుతూ మనమే ఆ కావ్యాల్ని విమర్సించు కుంటు వెలితే చాల విషయలకి, మనకు మన పురాణలు ఏద్రుస్ఠితొ కూర్చబడ్డయో అవగాహన వస్తుంది.నాకు తెలిసినంతలో ప్రతి పురాణంలో మనిషి కి అప్పటి వరకు తెలియని ప్రక్రుతి నంతటిని దైవంగా సమ్మతించి వాటిని లోబర్చుకొవడానికి రక రకాల పూజలు పునస్కారాలు చేసాడు.అసలు ప్రతి మనిషి మొదట పొరాడేది కడుపు నింపుకోవడానికి.అది నిండిన తరువాతే మిగిలినివి ఏవైనా.
రామాయణము జరిగినా జరగక పోయినా, కవి తన కాలములో, తనకు తెలిసిన విషయాలనే ఊహలను రంగరించి అక్షర రూపము ఇవ్వగలడు.ఇక రామయణ కాలానికి వస్తు మార్పిడి తప్ప నేటి కొనుగోలు( ద్రవ్య మార్పిడి) పద్ధతి వుండే అవకాసమే లేదు.బలవంతులదే పల్లె,వూరు,పట్టణము,రాజ్యము అన్నీను.ఎంతటి వారలైనా రాజుకు ( బలవంతునికి ) లోబడల్సిందే.రాజ్యము లో మనుగడ సాధించాలంటే రాజు చెప్పినట్టు చెయాల్సిందే.ఋషులు,కవులు కూడ.లేకపొతే మనగడ లేదు.కాబట్టి రచనలలో కూడ పక్షపాతాన్ని త్రోసి వేయలేము.
ఇక రామయణ పాత్రల విషయానికి వస్తే కవి వుద్దేస్యము చాల స్పష్టం.
1) తన వాసము వుంటున్న రాజో లేక పొరుగు రాజో ఆనాటి కాలపరిస్థుతులలో,ఆనాటి సంఘ కట్టు బాట్లలో వుత్తముడు కావున కథా వస్తువై వుండవచ్చు.( వాల్మికి , రాముడు సమకాలీనులైనచో ).అలాగే తన రచన రాజు గారికి నచ్చితే స్వామి కార్యము, స్వకార్యము సిద్ధించినట్లె.
2) ఒక వేళ రామాయణము తరువాతి రొజులలో గ్రంధ పరిస్తే ( ఈ వాదనకే అవకాశాలు ఎక్కువ), అప్పటి సమాజ కుళ్ళు ను కదిగి వేయలనే వుద్దెస్యమో ఏమో కాని మానవునికి వుండాల్సిన గుణ గణాలు,పెద్దల పట్ల వ్యవహరించల్సిన తీరు,స్త్రీ కి వుండాల్సిన లక్షణాలు,అన్న దమ్ముల అనుబంధము మొదలైనవి చక్కగా చెప్పారు. ( చాల మంది అనుకుంటున్నట్లు గానే నేను,ఉత్తర కాండము వాల్మికి ది కాదనుకుంటాను.ఈ కాండము లోనె రామునికి ప్రత్యక్షంగా బురద చల్లరు. కాబట్టి దాని జోలికి పోవతము లేదు )
3) ఆ రొజులలో చదువు,ఙ్ణానము కొద్ది మంది సొత్తు. ఈ లక్షణాలను పామరుల లోకానికి తీసుకు వెళ్ళాలంటే కవి కి ( లేక ఆ డేసపు రాజుకి ) ఒక పూర్వీకుల కథలో జోడింఛి చెప్తే కాని అనుకున్న ఫలితము దక్కక పొవచ్చు. ( మన హిందూ పురాణలు చాలా వరకు ఈ వుద్దేస్యము తోటే రచించారని నా ఊహ)
These views are solely my thoughts. No intention to affend any individuals.
కత్తి మహేష్ కుమార్ గారు,
మీరు నేలబారుగా వెళ్తున్నప్పుడు నేను కొంచెం ఎత్తుగా వెళ్తే మీరు చూస్తారో లేదో అని నా వ్యాఖ్య స్థాయి తగ్గించాల్సి వచ్చింది. ఇంత చేసినా, మీరు నా వ్యాఖ్యలోని అంతరార్థం గ్రహించలేక పోవడాన్నిబట్టి (నేను చెప్పిన క్షీర నీర న్యాయాన్ని మీరు అర్థం చేసుకున్న తీరుని బట్టి) మీతో మాట్లాడాలంటే నా వ్యాఖ్యల స్థాయి ఇంకా తగ్గించుకోవాలని తెలుస్తోంది. నేలబారు వ్యాఖ్యల గురించి చెప్పాలంటే చాలా ఉంది గాని, ఇక్కడ చర్చ పక్కదారి పడుతుంది కాబట్టి వాటితో సంబంధం ఉన్న ఇంకొక చోట ప్రస్తావిస్తాను.
మీరు ఈ టపాలో చేసిన మొదటి వ్యాఖ్య చూడండి. ఎవరు తమకే మొత్తం తెలుసు అన్న అపోహలో, అజ్ఞానంలో ఉన్నారో తెలుస్తుంది. నాకు గొప్ప విషయాలు తెలుసని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఎవరిని విమర్శించడం లేదు. ఎవరైనా అలా విమర్శిస్తే వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను అంతే. అది మీరు గుర్తించగలిగితే చాలు. మన నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి రాజ్యాంగం లోనే హక్కు ఉంది. కాని మనం మాట్లాడిన దాన్ని కొందరు విని పాటించే అవకాశం ఉన్నప్పుడు, అలా పాటించాలనే ఉద్దేశం లోనే మనం మాట్లాడుతున్నప్పుడు, మనం ఏమి మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలి. బ్లాగుల్లో వ్యాఖ్యలకు, టపాలకు కూడా ఇది వర్తిస్తుంది.
అసలు ఆలోచనకూ-అర్హతకూ, అభిప్రాయానికీ-నిబద్ధతకూ, inverse proportionality ఉందని ఎవరు అన్నారు ? ఒక వేళ అంటే అది పోయి ఒక దశకం మాత్రమే దాటిందని మీరు ఏ ఉద్దేశంలో అంటున్నారు ?
ఏదైనా విషయం చెప్పడానికి, విమర్శించడానికి అర్హత ఉండనక్కర్లేదు కాని, అందులోని విషయం పాటించేటప్పుడు మాత్రం అది చెప్పిన వాళ్ల అర్హత తప్పనిసరిగా చూడాలి అని నా అభిప్రాయం. నాకేదన్నా జబ్బు వస్తే, దానికి నివారణ ఒక భూత వైద్యుడు, ఒక MBBS డాక్టరు చెపితే, నేను MBBS డాక్టరు చెప్పినదే నమ్ముతాను. మీరైతే ఏమి చేస్తారు ?
- Shiv.
all of you meku em arhatha undhi ani mahesh garini vimarshistunaru.
vimarshincha haku meku unapudu andariki untundhi.
mahesh sir you are correct iam agree with you keep going
హేట్సాఫ్ మెకాలే !
ముందుగా నేను మెకాలేగారికి [అతని వ్యూహారచనకు ] అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటె ఈదేశానికి శత్రువయినా,అతనిముందస్తు వ్యూహాన్ని విజయవంతముగా అమలయ్యేలా రచించినందుకు.నిక్రుష్టందయినా అతని మేధస్సుకు.
గతంలో మాఉపాధ్యాయ సంఘపత్రికలో లార్డ్మెకాలే తనతండ్రిగారికి అప్పటిలో వ్రాసిన లేఖను ప్రచురించారు.
దానిలో తనతండ్రికిలా వివరిస్తాడతను. నాన్న గారూ! భారతదేశము మీద బ్రిటీష్ ఆధిపత్యానికి ,అదిదీర్ఘకాలం కొనసాగటానికి ప్ర్ధధాన అవరోధాలున్నాయిక్కడ. అవి వీరియొక్క సాంస్క్ట్రుతీ సాంప్రదాయములు. వీరి ఆదర్శాలు ఆదర్శపురుషుల చరిత్రలు. ఇవి చాలాశక్తిమంతమయినవి. వీనితో నిండియున్న ఈజాతిని ఏబలప్రయోగాలతోనూ అణచిఉంచుట అసాధ్యము అని నేను విశ్వసిస్తున్నాను. వీరిభవ్వనా పరమ్పరను కొనసాగిమ్చకుండా వీరిని ఏశక్తి అడ్దుకోలేదు.అవి జీవించి కాలము వీరినెవరు శాశ్వతముగా లొంగదీయలేరు. అందుకొరకే నేను మనసార్వభౌమత్వాన్ని శాస్వతత్వమ్ చేయటానికి అద్భుతమైన పథకమ్ చేపడుతున్నాను. ఈ దేశములో పెద్దయెత్తున ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను నెలకొల్పాలని నిర్ణయించాను.తమజాతి సంస్ర్క్తతి,సామ్ప్రదాయాలు,తమచరిత్ర లను తెలియని ,వాటిని కట్టుకథలుగా నమ్మే ఈదేశభావితరాలు మనపనిని తామేచేస్తాయి.మానశికంగా బలహీనమయిన జాతి ఎన్నడూ మనకెదురుతిరగలేదు.సహజంగనే బలహీనపడుతుంది. అనే భావాలను ఆలేఖలో అతను వివరిస్తాడు తనతండ్రికి.
ఆరోజు అతను వేసిన బీజం మనమనస్సులలో విషవృక్షమయి పెరిగి పోయినది. మన అన్నదమ్ములమధ్యే మనతండ్రుల లాంటి సంస్ర్కుతీ,సాంప్రదాయాలమీద అనుమానాలు .వాదనలు తో అంతరాలు ,బేధాలు పెమ్చగలిగిందది. ఇదిచాలు ఎవరైనా మనలను తేలికగా ఆక్రమించడానికి. ఇక ఎంతో దూరంలేదు ఆదుర్దినం సంభవించటానికి. ఇప్పటికే స్వేచ్చంటె విచ్చలవిడితనంగా భావించి,తాగితమ్దనాలాడి పబ్బులలో క్లబ్బులలో తైతక్కలాడే యువత,పశువులకంటే హీనముగా తాత్కాలికసుఖమే ,జీవితానందంగాభావించి చివరకు వ్యాధులపాలై శక్తిహీనమవుతున్న భావితరాలవారు,తమజాతిఅఔన్నత్యాన్ని తామే కించపరచుకుని దానిని మేధావిత్వమనుకుని నిర్వీర్యమై పోతూ మార్గదర్శకత్వము చేయవలసిన పెద్దతరము, మధ్యంమగువలే పరమానందమని భావించే సంస్ర్కుతీ వాదులు ఇలా పెరిగిపెరిగి ఈదేశంలోయువత ,శ్రీశ్రీ గారుచెప్పిన వయస్సుమల్లిన ,ఎముకలుకుళ్ళిన సోమరుల జాతిగా తయారై స్వయంవిబేధాలతో శత్రువులకు స్వాగతమ్ పలికిన అంబి,జయపాలునిలాంటివారితో నిండిపోయి శత్రువులకు తివాచీలుపరచేరోజు రావటానికి ఎక్కువరోజులు అవసరములేదు.మన తరంలోనే కల్లారా చూసి చావవలసి వస్తుందేమోనని భీతికలుగుతోంది. ప్రభూ! రక్షించు ఈదేశాన్ని కలి పురుషుని ప్రభావంనుండి. మా పరాధీనపు భావజాలాలనుండి.జగద్గురుస్తానంనుండి అథోగతికి జారిపోతున్న మా మనోశక్తుల మహాపతనాన్నుండి. మానవత్వపు మూలవిలువలను దూరంచేసుకుంటున్న మా మేధావిత్వాలనుంది.
రామాయణం ఒక కల్పిత కధ, ఒకరాజు తన గురించి గొప్పగా రాయించుకొన్న కావ్యంగా అసలు మేము ఊహించుకోము. రాముడు, సీత మాకు తెలియదు అని ఎందుకు అనుకోవాలి. మా సంస్కృతిలో, మా జీవన విధనంలో, మా విశ్వాసాల్లో గుడికట్టుకున్న మూర్తులని ప్రక్కకు తీసి పెట్టాల్సిన పనిలేదు. మహాకవుల కావ్యాలని కావాలంటే సవివరంగా విమర్శించుకోండి. కానీ దయచేసి రామాయణం అనేది ఒక మతగ్రంధం అనేది మరిచిపోవద్దు. కొన్ని కోట్ల జనాల విశ్వాసలు ముడిపడి ఉన్న విషయం పైన, మీ విశ్లేషణా పరిఙ్ఞానం నిరూపించుకునే ప్రయత్నం వద్దు. కావాలంటే చాలా కావ్యాలు, బహుళజనాధరణ పొందిన గ్రంధాలు, నవలలపైన మీ శక్తియుక్తులని ప్రదర్శించండి.
మీకు రామాయణం అనేది నిజమా కాదా? జరిగిందా లేదా? అనే అనుమానాలు ఉన్నాయి అనుకుంటా. కానీ మాకు శ్రీ మహావిష్ణువు రామునిగా అవతరించి, ఈ నేల పైన, ఈ మట్టి పైన ఒక సామాన్య మానవునిగా చరించాడని ప్రగాఢ నమ్మకం. చెడుని అంతమొందించి, కొన్ని వేల సంవత్సరాలు ప్రజల్ని కన్న బిడ్డలుగా పరిపాలించాడని నమ్ముతున్నాం. రామ మందిరం లేని పల్లెలు లేవు అనేదే మా నమ్మకాల బలానికి సాక్ష్యం. 10 ఇల్లే ఉన్న పల్లెల్లో కూడా రామ మందిరాలు చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపడ్డా. ఏ బలవంతుడయిన రాజుకి, చక్రవర్తి కి చరిత్రలో ఇంత గొప్ప ప్రజాదరణ ఉందో చెప్పండి. దయచేసి మా విశ్వాసాలని చర్చల పేరుతో వీధిలోకి లాగొద్దు.
'నేను నిన్ననలేదు, అదిగో ఆ గోడనన్నాను, గాలినన్నాను' అని చిన్నపిల్లలు చెప్పే కబుర్లు ....
కొంత మంది బ్లాగర్లు దీనిని పాటిస్తే బాగుంటుంది.
దుర్గేశ్వర గారు ఈ లింక్ కూడా చూడండి...
http://varmabv.blogspot.com/2008/10/16000.html#comments
చాల బావుంది టపా. నేను ప్రింటౌట్ తీయుంచుకున్న్నా దీనిని, మీకు ధన్యవాదాలు
కత్తికి, అంబేద్కర్ నాతో ఓ సారి ఓ మాటన్నడు. ఎవరికన్నా చెప్పేటప్పుడు ముందు నువ్వు ఆచరించు అని,
>>కాకపోతే,మీకున్న నమ్మకాన్ని అందరు అంగీకరించాలనుకోవడంతోనే వస్తుంది సమస్య.
>>నువ్వన్నమాటే<<
నీకిష్టం లేకపోతే ఇలాంటి బ్లాగులవైపు/ టపాలవైపు రాకునాయినా
ఇది కూడా నీకే నువ్వే చెప్పావ్ గా
I am a fish separate from CROWD. Still trapped in my own bowl. But,Its BIGGER and BETTER. That's all.
మాటా మీదుండయ్యా
దుర్గేశ్వర గారు : రామాయణం చర్చ లో నేను రాసిన టపా లో మీరు చేసిన కామెంట్ చూసిన తర్వాతనూ, ఈ టపాలో మీరు సమాధానం చెప్పమని డిమాండ్ చేయటం వలనా రాస్తున్నాను, ఇష్టం లేకపోయినా.
నా సమాధానం :
ఉన్నాడో లేడో తెలియని రాముడి కోసం, మిమ్మల్ని (ఎవర్నీ కూడా) బాధపెట్టటం నా ఉద్దేశ్యం కాదు. నేను, ఇంకెవరైనా రాసుకున్నది వారి బ్లాగుల్లో మాత్రమే. బ్లాగు అన్నది స్వ విషయం. నాకోసం నేను వ్రాసుకున్నది. ఇది చదివి మనసు నొచ్చుకోవటం, అన్నది అనవసరం.(ఇది నా అభిప్రాయం). ఇక రాముడి మీద, ఆ బ్లాగు చర్చ చివుకుల కృష్ణమోహన్ గారి భ్లాగులో, నాగమురళి గారి బ్లాగులో జరిగింది. వారిద్దరూ కూడా నా వ్యాఖ్యలతో విభేదించి ఉండవచ్చు కాక, అభ్యంతరం చెప్పలేదు. రామాయణం మీద నా బ్లాగులో నేనేదో రాసుకుంటే, మీరు నేనేదో మీ నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నట్టు అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. మీరు రామాయణాన్ని, అందులో విలువలను సత్యం అని భావిస్తున్నప్పుడు, భయము, బాధ ఎందుకు? అది నిజంగా సత్యమే అయితే, తనకు వత్తాసు అవసరం లేదు. దాన్ని స్వతంత్రంగా మననివ్వండి. విమర్శ తప్పయితే, ఆ తప్పు వల్ల నిజానిజాలు వెలికి వస్తాయి కదా, అందువల్ల మన 'సంస్కృతి ఇంకా బలపడుతుంది కదా?
ఇక రామాయణాన్ని ఓ కొలబద్ధ గా పెట్టి, రాముడి కంటే, ఉన్నతులే దాన్ని విమర్శించాలి అన్నది .... రాముడి గొప్పతనాల మీదే చర్చ అంతాను. రాముడు నిజంగా పితృవాక్య పరిపాలకుడా అన్నది విషవృక్షం లో రంగనాయకమ్మ ప్రశ్నించింది. దీన్ని (ఇలాంటివి) ప్రశ్నించడమే పొరబాటని మీరు భావిస్తే, సరే...అలానే కానివ్వండి. మీ బ్లాగు, మీ ఇష్టం.
అవతార పురుషుడు రామునిది జీవితం, వాల్మీకీ రాసిన రామాయణం ఒక గ్రంధం. రామాయణాన్ని విమర్శించడం వల్ల మన మతానికి ఏదో చెడు జరుగుతుంది అనే వాదన ఏ రకంగా కూడా పనికి వచ్చేది కాదు, అటువంటి భావనల వల్ల మనం విదేశీ మతాల స్థాయికి దిగజారుతాం.
ఎవరికైనా కుక్కలాగ (మన) మతం, సంస్కృతుల పట్ల కొంత విశ్వాసం ఉంటే చాలు, ఎంత అరిచినా నష్టం లేదు. మహేశ్ గారి వాక్‌స్వాతంత్ర్యాన్ని విమర్శించడం పూర్తిగా అనవసరం.
మురళి గారు,
నాకు హిందూ మతాన్ని, దాని మూలలైన మన పురాణాలని విమర్శించే వుద్దేస్యము లేదు. పొరబడ్డారేమొ.నా వరకు మతమంటే తరతరలగా మన పెద్దలు వారి కాలానికి అణుగుణంగా నిర్మిచుకొన్న కొన్ని విస్వాసలు,ఆచారలునూ.బాల్య వివాహలు, సతీసహగమనాలు ఒకప్పుడు హిందూ మత ఆచారాలు.అప్పట్లో అవి ఆచరించడానికి కారణాలు అనేకం.నా ప్రయత్నమంతా ఒకప్పుడు భారత దేశం సకల విజ్ఞాన సమాహారం.తరువాత రొజుల్లో అసలు మనల్ని మనము ప్రస్నించుకోవడమే మానేసి గుడ్డిగా నమ్మకాల్ని మాత్రమే నిజమని నమ్ముకొనే స్థాయికి దిగజారాము.ప్రశ్నలను స్వగతించి మూలాలను చేదించలేని నాడు నాడు మనము ప్రతిదాన్ని వెరే ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మెస్తే ఎప్పటికి బానిసలమే ( ఇంతకు ముందు బ్రిటీష్ వారికి , ఇప్పుడూ మన పాలకులకి)
సనాతనధర్మ పరిరక్షణ కొరకు స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రణామములు
అందరికి
రామాయణం లో మంచి ఉంది.మీరనుకున్నట్లు చెడూ ఉంది.మనం మంచినే ప్రచారం చేద్దాం.రామాయణం మీకు నచ్చకుంటే విడిచిపెట్టండి.మీకు నచ్చితే పది మందికి చెప్పండి.అంతేకాని దానిగురించి దుష్ప్రచారం ఎందుకు చేస్తారు.
రామాయణం కోట్ల మంది నమ్మకం దానిని విమర్షిస్తే కోట్ల మందిని విమర్షించినట్లే.నీలోని మంచిని చెపితే సంతోషిస్తావు. నీలోని చిన్న లోపాన్ని పెద్దగా చూపితే మండదా.వీలైతే మంచిని పంచండి.లేకుంటే మూసుకోని పడుకోండి. సిగరెట్ తాగేవాడికి తాగోద్దని చెప్పడం మంచిది.కాని సిగరెట్ తాగని వాడికి తాగమని చెప్పోద్దు.
అందరికి
రామాయణం లో మంచి ఉంది.మీరనుకున్నట్లు చెడూ ఉంది.మనం మంచినే ప్రచారం చేద్దాం.రామాయణం మీకు నచ్చకుంటే విడిచిపెట్టండి.మీకు నచ్చితే పది మందికి చెప్పండి.అంతేకాని దానిగురించి దుష్ప్రచారం ఎందుకు చేస్తారు.
రామాయణం కోట్ల మంది నమ్మకం దానిని విమర్షిస్తే కోట్ల మందిని విమర్షించినట్లే.నీలోని మంచిని చెపితే సంతోషిస్తావు. నీలోని చిన్న లోపాన్ని పెద్దగా చూపితే మండదా.వీలైతే మంచిని పంచండి.లేకుంటే మూసుకోని పడుకోండి. సిగరెట్ తాగేవాడికి తాగోద్దని చెప్పడం మంచిది.కాని సిగరెట్ తాగని వాడికి తాగమని చెప్పోద్దు.మీరందరు సిగరెట్లు కాల్చడం (చెడు ప్రచారం) ఆపుతారని ఆశిస్తు
Post a Comment