అధ్యాత్మిక దివ్యజ్యోతి అవధూత చివటం అమ్మ.
>> Saturday, October 18, 2008
సూర్యుడు చంద్రుడు,నక్షత్రాలు ప్రకృతిలో వివిధరూపాలలో ఎంత శోభాయమానంగా మనదృష్టినాకట్టుకుంటాయి. . ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతతో మనలనాకర్శిస్తాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశములోనయితేవున్నాయో అదివాస్తవానికి వీటన్నిటికంటేఅద్భుతమైనదయినా మనలను ఆకట్టుకోదు. పరిపూర్ణ అవధూతస్తితిలోవున్న మహాత్ములుకూడా ,మనలను చిల్లర మహిమలను మంత్రశక్తులను ప్రదర్శించేవారిలా ఆకర్శించరు. అటువంటి మహాత్ముల కోవకు చెందినదే అవధూత చివటం అమ్మ.
సాధుఅమ్మగా ప్రసిద్ధమయిన దిగంబరయోగిని చివటం అమ్మ అసలుపేరు అచ్చమ్మ. తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ తల్లి భర్తబాధ్యతారాహిత్యంగాతిరిగినా ఇరుగు పొరిగిండ్లలో పనిచేసి భర్తకు బిడ్డకు వండిపెట్టేవారు. భర్త దుర్మార్గుడయి కొట్టినా పల్లెత్తి మాట అనేదికాదు. ఆమెకు రామనామమంటే ప్రీతి. గ్రామస్థులదగ్గర అడిగితెచ్చిన బియ్యం పప్పు వండి పిల్లలందరికీ తినిపించటం ఆమెకు ఇస్టమయిన పని. కాలాన్ని వ్యర్ధంగా గడపక ,పనిచేసే సమయములోకూడా రామనామాన్ని స్మరిస్తూవుండేవారట. ఖాళీదొరికితే ధ్యానానికి కూర్చొనేవారు. అటువంటి అచ్చమ్మ ఒకరీజు కొడుకును తనతల్లికి అప్పజెప్పి ఇల్లువిడిచివెళ్ళిపోయారు. కొన్నాల్లు ఆమె చిన్నాయిగూడెమ్లో వున్నారు. ఆరోజులలో ఆతల్లి నోటివెంట కృష్ణా,రామా అనేపదాలుతప్ప మరేమీవచ్చేవికావు. తరువాత మన్నెం జగన్నాధపురం వెళ్ళి ఆప్రాతమ్లో 12సం. మౌనంగా కఠిన దీక్షలు చేసారట. అక్కడ ఎన్నోలీలలు ప్రదర్శించేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు అక్కడ. రాజమండ్రి స్త్రీల మఠములో కొంతకాలముండి,చివటం చేరారు.
చివటం లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలుకూడా జారిపోతున్నా తెలియని స్తితిలో వుండేవారు. ఒకరోజు జారిపోతున్న తనచీరను తీసి ఒకబాలునిపైవేసి అప్పటినుండి దిగంబరంగావుండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టుక్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.
ఎక్కువకాలం అమ్మ స్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇల్లకుమాత్రమే బిక్షకువెళ్ళేవారు. బిక్షచేతిలోవుంచుకుని పరుగులు తీసేవారు. తనగురించి,శరీరసృహేలేకుండా చిదానందస్థితిలోవుండేఆమెకు గ్రామమ్లోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగాతీసుకెళ్ళి స్నానము చేపించేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానం లో గడిపారు.
మహాత్ములుకూడా ఆమెదర్శనం కోసంవచ్చేవారు. అయితే వచ్చనవారిపాదాలను తాకినమస్కరించేవారు అమ్మ. ఎదగటమ్లో ఎలావొదగాలో సాధకులకు చేసిచూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలానమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వుపండిపోయావు నేనింకా పండవలసినవాడిని అనిఅన్నారు.
ధ్యానం ఎలాచెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారంచెయ్యాలి ,ఆతర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి.ధ్యానమ్లోంచి లేచేటప్పుడుకూడా, ఓంకారం చేయాలి. చీపురుపెట్టితుడిస్తే వాకిట్లో ఎంతశుభ్రంగావుంటుందో ,అలాగే ఓంకారముచేసినప్పుడుకూడా మనసులో మాలిన్యము తొలగిపోతుంది అనిచెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం కూర అంతవినాలి,ధ్యానం అన్నమన్నమంత చేయాలి అనేవారు. ధ్యానం బంగారుముద్దవంటిది,దానికి మించినదిలేదు. అనిచెప్పేవారు,అండుకొరకు ఎటువంటి నిబంధనలు అక్ఖరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవ్లేదే ,రామరామా అనుకోండే అనేవారు. నాలుగురూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవంకోసం అనేవారు అమ్మ. రామాలయమ్లోనివసిస్తూ స్వయంగావంటచేసి అందరికీ తల్లిలా తినిపిస్తుండేవారు ఆమహాత్మురాలు.
తన సమాధిని ముందుగానేసూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజులముందు తనపంటినిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు. 1981 జూన్ 8 వతేదీ అర్ధరాత్రి కావస్తుండగా తన భక్తులను కూచోబెట్టుకుని .. ఎవరైనా ఏదన్నా అంటే పది అనకూడదు. ఎప్పుడూదృఢంగావుండాలి , గుమ్మమ్లోకి వచ్చినవారికి ఒకముద్దచేతిలోపెట్టి నీరివ్వాలి..అని చెప్పారు. తరువాత గీత చదివించుకుని విన్నారు. తరువాత కొబ్బరికాయకొట్టించి హారతి ఇప్పించుకుని ప్రశాంతంగా దేహత్యాగం చేశారు అమ్మ. సమాధిఅయిన వెంటనే వచ్చిన వాడపల్లి బాబుగారు శిరస్శు చూసి అమ్మ కపాలభాగం చిట్లి రక్తం గడ్డకట్టిఉన్నదని. అమ్మ బ్రహ్మరంధ్రంగుండా శరీరాన్ని విడిచారని చెప్పారు.
ఇక్కడకెందుకువచ్చామే పిడకలెరుకోవటానికా ,? రామరామ అనుకోండే అని త్నచుటుపక్కలవారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరణద్వారా చూపిన ఆసద్గురువు పాద పద్మాలకు మనసారా నమస్కరించి ముగిస్తున్నాను.
0 వ్యాఖ్యలు:
Post a Comment