సత్యనారాయణస్వామి వ్రతానికి, పిల్లినికట్టెయాడానికి సంబంధం ఏమిటి?
>> Friday, October 17, 2008
మనదేశములో పాటించే ప్రతిఆచారం వెనుక ఒక కారణము శాస్త్రీయదృక్పథం ఇమిడివుంటాయి. అయితే అవి అర్ధం చేసుకోవాలంటే కొంచెం లోతుగా విశ్లేషించిచూడగలగాలి. అంతఓపికలేని ఆఫ్ నాలెడ్జి మేధావులు ఇక్కడంతా మూఢనమ్మకాలు, విజ్ఞానదృష్టి లేని ఆచారాలని విమర్శిస్తుండటము మామూలే. ఆవిషయాన్ని పక్కన పెడదాము. మన మహర్షులు ప్రతిపాదించిన ప్రతిఅచారము మానవజీవితాన్ని సంపూర్ణముగా ఆనందదాయకము కావటానికి ఉద్దేశించి నిర్దేసించినవే. అయితే కాలప్రవాహములో కొన్ని అర్ధం పర్ధం లేని అచారాలు సమజములోకి వచ్చి చేరుతుంటాయి. ఇటువంటివాటిని వెంటనే తొలిగించటానికి ప్రయత్నించక పోవటమువలన అవి కూడా ఆచారాలుగా చలామణి అవుతూ మనసంస్కృతిని విమర్శించటమే మేధస్సుగా భావించే కుత్సితపు బుద్దులు కలవారికి అవకాశముగా మారుతుంటాయి. అటువంటి ఒకహాస్యసన్నివేశాన్ని నేను విన్నదానిని మీముందుంచుతున్నాను.
ఒక గ్రామములో ధనవంతురాలయిన ఒక గృహస్తు తన పిల్లవానికి పెళ్ళి చేసాడు. తదనంతరం సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆకార్యక్రమము రోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయింటి ఇల్లాలు ప్రేమ పూర్వకంగా పెంచుకునే పిల్లి ఆవిడవెంట బడి తిరుగుతూ అరుస్తూ గోలచేస్తున్నది. తనపనులకు అడ్దమవుతుందని,పాలు పెరుగులలో మూతి పెడుతుందని ఆవిడ దానిని మెడకు ఒక పట్టీ బిగించి ఒక స్థంబానికి కట్టి వేసినది ఒరండాలో. కార్యక్రమానికి వచ్చినవారందరూ దానిని చూస్తున్నారు. కొత్తగా వచ్చిన కోడలికి ఈ ఇంటి ఆచారాలేవో తెలియదు .కనుక మా అత్తగారింటిలో వ్రతం చేసేటప్పుడు పిల్లిని కట్టివేసే ఆచారం వున్నదికాబోలు అనుకున్నది, వ్రతానంతరం తమఅత్తగారు పిల్లిని విడిచిపెట్టడాన్ని చూసి.
తరువాత కాలములో ఆవిడకు కూడా పిల్లవాడుకలిగిపెద్దయ్యాక వివాహానంతరం సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయ సంకల్పించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతము ఈవిడదే పెత్తనం ,కనుక పిల్లిని కట్టేయ్యాలనే విషయం గుర్తుకువచ్చి చూస్తే ఇంటిలో పిల్లి లేదు. పక్కింటిలోనుండి పిల్లిని తెచ్చి వరండాలో కట్టివేసినది. అది భయంతో కొంచెంసేపు అరచినా పెరుగన్నం పెట్టడంతో తిని మెదలకుండా వున్నది. వచ్చిన చుట్టాలు ఇదీ గమనించారు. ఈవిషయాన్ని వచ్చిన కొత్తకోడలు కూడా గమనించింది.
తరువాత కాలములో పెత్తనం ఈవిడకు బదలాయించబడినందున ఒకసారి వ్రతంచేపించాలనే సంకల్పముతో ఆవిడకూడా అన్నిఏర్పాట్లను చేసుకుని చుట్టుపక్కల ఇల్లలో పిల్లి లేకపోవటముతో పనివాల్లను పంపి ఒక పిల్లిని తెప్పించి కట్టి వేసినది .అది మరీకొత్తయి గోలగోల చేయటముతో వచ్చిన వారిలో కొందరు పెద్దవారికి అనుమానం కలిగింది. వీళ్ళ ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా పిల్లిని కట్టివేస్తున్నారు, కారణము ఏమయ్యుంటుందని ఆలోచించి,అమ్మాయి మీయింట్లో ఎప్పుడుచూసినా వ్రతానికి ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పమని అడిగారు. ఆవిడ అమాయకంగా ,ఏమోనండీ ఇదిమాయింటి ఆచారం మా అత్తగారు నేను వచ్చిన కొత్తలో చేయటం చూసిచేస్తున్నానన్నది. కొంచెం సుస్తీ చేసి గదిలో వున్న వాళ్ళ అత్తగారి దగ్గరకెళ్ళి వివరమడిగారు. నాకూ తెలియదు మా అత్తగారు చేస్తుంటే చూసాను చేసాను అన్నది. బాగా వయసు మీదపడి ఆరోగ్యం సరిగాలేక ప్రత్యేక పాకలో వుంచిన వారి అత్తగారిదగ్గరకెల్లిన చుట్టాలు అమ్మమ్మా ! మీ ఇంట్లో సత్యన్నారాయణ స్వామి వ్రతానికి పిల్లిని కట్టేసే ఆచారం ఎలావచ్చినదో తెలుసుకోవచ్చా? అని అడిగారు. అచారం లేదు పాడులేదు, పాలూ పెరుగూ పాడుచేస్తుందని నేను అలాకట్టేస్తే చూసి వీల్లు కూడా ఆచరిస్తున్నారా? హవ్వ .. ఏమిటీ తెలివితక్కువతనం అని కేకలు వేసినదట.
అలాగే మనం అర్ధము పర్ధము లేని పనులను ఆచారాలుగా జరుగుతున్నచోట ఉపేక్షిస్తే అవే అనాచారాలు స్థిరపడిపోయే ప్రమాదమున్నది. నేనొక గ్రామములో చూసాను .స్వామి మాల వేసుకుని తన ఇంట దీక్షాదారులకు బిక్ష ఇచ్చిన గృహస్తును ఎంగిలి విస్తర్లమీద దొర్లించి తరువాత ఆవిస్తరలను అతని నెత్తిపై కెత్తి వూరేగింపుగావెల్లి వాటిని బావిలో కలుపుతున్నవారిని. అయ్యా ఇది చాలా తప్పు. పవిత్రమయిన మాల కు ఎంగిలి అంటుకుంటున్నది. అన్నం పెట్టటము పుణ్యం కానీ ,ఇలా ఎంగిలాకులమీదదొర్లించటం లాంటి పనులు ఎక్కడా శాస్త్రాలలో చెప్పబడలెదు, గురుస్వాములయినా దీనిని ఖండించవద్దా?అని వారి చర్యను ఖండించాను. నేనా గ్రామము మరలా వెల్లలేదు, వారు ఆ ఆచారాన్ని మానవేసారో కొనసాగిస్తున్నారో తెలుసుకోవటానికి .
కనుక మన పూర్వీకులయిన మునులు చూపిన రహదారిలాంటి బాటవున్నది .దానిమీద నడుద్దాము. అంతేగాని అనాచారాలను ఆచారాలుగా పాటించవద్దని, ఏది ఆచారమో ,ఏది అనాచారమో సందిగ్దత ఏర్పడప్పుడు. పెద్దలు పదిమందిని విచారించటం మంచిదని నావిన్నపము.
7 వ్యాఖ్యలు:
దుర్గేశ్వరగారు,
పిల్లి సంగతి సరే. సత్యనారాయణ వ్రతం లోని కధ చెప్పే నీతి మీ ద్వారా వినాలని కుతూహలంగా ఉంది. వీలైతే ఓ టపా రాయగలరు.
అంతఓపికలేని ఆఫ్ నాలెడ్జి మేధావులు... అమాయకత్వంతో,అజ్ఞానంతో అడిగినా మీలాంటి ఫుల్ నాలెడ్జి మేధావులు పెద్దమనసు చేసుకుని చెప్తూ ఉండాలి.అబ్రకదబ్ర అడిగిన సంగతి వినాలని నాకూ కుతూ హలంగా ఉంది,త్వరగా చెప్పాలి దుర్గేశ్వరా
దేవర పల్లి గారూ!
ముందు మీకుఒక విషయము చెప్పాలి. నేను ఆఫ్ నాలెడ్జివారిలో మొదటివరుసలోవాడిని .అయితే పెద్దలు చెప్పిన ప్రతిసూచనవెనుక ఒక కారణమేదో వుండివుంటుంది అని దానిని గురించి తెలుసుకోవలని ప్రయత్నించే భారతీయ పరంపరకు చెందినవాడిని .తమకుతెలియకపోయినా , తెలుకోవాలని ప్రయత్నించకపోయినా ,అడ్దగోలుగా వాదించి అదేమేధావిత్వమనుకునే దౌర్భాగ్యపు సంస్కారం భగవంతుని దయవలన అబ్బనివాడిని. తెలియనిది తెలుసుకో వినయంతో. తెలిసినదానిని పంచుకో ప్రేమతో అని మనమహర్షులు సూచించిన బాటను నమ్మిన వాడిని. ఇక సత్యన్నారాయన స్వామి వ్రతంలో మీకు కనిపించిన చెడు ఏమిటో ,దానివలన మీకుగాని, లేక మీవారికిగాని జరిగిన నష్టమేమిటో ముందు తెలియజేస్తే, దానిలో నాకు కనిపించిన మంచిని గురించి నాకుతెలిసినంతలోచెబుతాను తెలియకపోతే తెలిసిన పెద్దలను అడిగిచెబుతాను. అన్నీ నాకెతెలుసు ,నాకుతెలియనిదంతా అజ్ఞామనే మేధావిత్వం నాకు ఏజన్మలో కలగకుండాలని నన్నిలా సామాన్యునిగానే వుంచాలని భగవంతుని కోరుకుంటున్నాను.
ఇక్కడ అబ్రకదబ్ర అడిగిన సంగతి తెలుసుకోవాలని నాకూ కుతూహలంగా ఉందన్నాను,దానికి సమాధానం లేదు.పైగా " .తమకుతెలియకపోయినా , తెలుకోవాలని ప్రయత్నించకపోయినా ,అడ్దగోలుగా వాదించి అదేమేధావిత్వమనుకునే దౌర్భాగ్యపు సంస్కారం " అని మా ఇద్దరి మీదా విసుర్లూ,
నేనెక్కడన్నా "సత్యన్నారాయన స్వామి వ్రతంలో మీకు కనిపించిన చెడు ఏమిటో ,దానివలన మీకుగాని, లేక మీవారికిగాని జరిగిన నష్టమేమిటో"అన్న మాటలేమన్నా వాడానా?
దానికి తోడు "అన్నీ నాకెతెలుసు ,నాకుతెలియనిదంతా అజ్ఞామనే మేధావిత్వం "అన్న సూటీపొటీమాటొకటి!ఎందుకింత ఉక్రోషం?ఏమిటీ అసహనం?ఆఫ్ నాలెడ్జి మేధావులన్నది మీరు,మళ్ళీ ఇప్పుడు నేను మొదటి వరుసలో ఉండే ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తిని అనటమేమిటి?పెద్దమనసు చేసుకుని సమాధానం చెప్పండీ అనటం తప్పా?అనుమానమొస్తే అడక్కూడ దన్నప్పుడు ఆమాటే ముందు చెప్తే ఈ బ్లాగు చదవటం,కామెంటు రాయటం మానేస్తాము కదా?
సత్యన్నారాయణ స్వామి వ్రతంలోనూ కథలోనూ నాకయితే ,ఏదోషమూ కనపడలేదు. ఇక మీరు అడిగినవిధానం తెలుసుకోవాలన్న పద్దతికంటె ,అందులో ఏదో తప్పువున్నదనే అర్ధమేద్వనిస్తున్నది. కనుక అలా స్పందించినది మనస్సు, ఇక ఈమధ్య నవరాత్రులలో అలసివున్నానేమో. కొద్దిగా విసుగు ప్రదర్షించి నట్లు నాకనిపిస్తున్నది. ఏదేమైనా అతిథులను బాధపెట్టటం మన సంస్కారం కాదు కనుక నామాటల ద్వారా మీకేదన్న మనసు నొచ్చుకుని వుంటే క్షమించండి. ఇప్పడు చెప్పండి. మీకు సత్యన్నారాయణ స్వామి వ్రతంలో కనిపించిన లోపమేమిటి. దానినిగూర్చి మీ అభిప్రాయమేమిటి? తరువాత నాకుతెలిసిన పరిధిలో చెప్పుకుంటాను. ఎందుకంటే నేను పెద్దలు చెప్పిన మాటలను ఆధారం చేసుకున్నవాడినేగాని అంతా తెలిసిన వాడినికాదని మీకు మరొకసారి మనవిచేసుకుంటున్నాను.
దుర్గేశ్వర గారూ, మూర్ఖంగా ప్రతీదాన్నీ విమర్శించేవాళ్ళ కంటే, మూర్ఖంగా ప్రతీదాన్నీ నమ్మేవాళ్ళే నయం.
ఇక్కడ వ్యాఖ్యల్లో మీరు ప్రదర్శించిన సహనానికి నా అభినందనలు.
dhanyavaadamulu
Post a Comment