మాయ అంటే ?
>> Tuesday, July 16, 2013
రామక్రిష్ణ పరమహంస ఒకసారి "మాయ ను దర్శించాలనుకున్నారు . కాళి మాతను
ప్రార్దించారు . గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ
బయటికి
వచ్చింది . అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి
వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది . ఆ స్త్రీ ప్రౌడఐ ఒక బిడ్డను
ప్రసవించింది . కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి ,
ప్రేమతో లాలించి పెద్దచేసింది . కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది . అంత సేపు ఆలనా,
పాలనా
చూస్తూ కానీ పెంచిన బిడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి,కరకరా నమిలి
మింగేసింది . తానూ ఆ జలాల్లో కలిసిపోయింది .అయితే ఆ స్త్రీ ముఖములో నీటి
బుడగనుంచి ఉత్పన్నమైన క్షణము నుంచి ,తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే
రకమైన ప్రసన్నత వుంది రామకృష్ణులు వంక పలకరింపుగా
నవ్వి, అంతర్దానమైంది . వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు , చుట్టు పక్కల
జనం సంచరిస్తున్నారు . వారెవరికీ దృశ్యం కనిపించినట్లు లెదు. అప్పుడు
కాళికా దేవి ఇలా వివరించింది . "నీవు చుసిన దృశ్యం మాయ . అయితే మాయను చూచు
టకు ఒకడున్డాలి . చుచువానిని విడిచి మాయ లెదు. చూచువాడు కూడా ఆ
మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" .రామక్రిష్ణులు అప్పటికే
జ్ఞాన సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని
దర్శించ గలిగారు . అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఏంటో
కొంత సుంకం చెల్లించాలి .అంటే అందులో పాత్రను పోషించి ,దాని కాస్త
నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన
అంశాలు వున్నయి.
1. మాయ తాత్కాలికమ్. దానికి మొదలు ,మధ్య,తుది ,వున్నాయి .
2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి.
3.
రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి
తిరిగి గంగ లోనే కలిసి పొయింది . అంటే కాదు తాను సృటిన్చిన బిడ్డని , తెగ
నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది . గంగ అంటే
పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి పడినట్టుగా
కనిపించి తిరిగి బ్రహ్మము లో నే కలిసి పోతుంది . పై దృశ్యము లోని
స్తేరీ మాయకు సంకెతము. ఆమె కని , ప్రేమతో పెంచిన బిడ్డ ఆమె , దేహముతో
కలుపుకుని ఈ ప్రపంచానికి సంకెతము.అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భగమె.
ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది . దానిని
వదిలిన్చుకోవటమే అభ్యాసము. దానిక్ సాధనం విచారమనే కత్తిపీట . తన సృష్టి అనే
శిశువును ఖండించి అంతర్హితం చెయ్యాలి . అనగా దేహ భావన , ప్రపంచ భావన
అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము - అనగా
బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో కలియుట .
----------------------------------------------sudhaaraani
0 వ్యాఖ్యలు:
Post a Comment