శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సూర్య గ్రహణ సమయాన్ని ఉపయోగించుకొండిలా

>> Sunday, January 25, 2009


ఈనెల ఇరవై ఆరున సూర్యగ్రహణము మకరరాశి శ్రవణా నక్షత్రం లో ఏర్పడుతున్నది.భారత కాలమానం ప్రకారము మ.2-44నుండి సా.4-02వరకు వుంటుంది. ఈగ్రహణప్రభావము వలన దక్షిన భారత దేశానికి అరిష్టం.మకర రాసివారు ,శ్రవణ ,హస్త,రోహిణి నక్ష్త్రములవారు విశేష గ్రహణ శాంతి చేపించుకోవాలి.12 రాశులవారు సామాన్య గ్రహణ శాంటి చేపించుకోవాలని పంచాంగకర్తలు చెబుతున్నారు.


ఇక గ్రహణము విశేషసమయము. ఈ సమయములో చేసే మంత్రజపం నామజపం మామూలు సమయము కంటె ఎన్నోరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కనుక గురుముఖతా మంత్రోపదేశము వున్నవారు,నామస్మరణ చేసే వారు అలాగే గురుముఖతా మంత్రోపదేశము లేకున్నా పంచాక్షరినిగాని[ఓం నమ: శివాయ ] అష్టాక్షరిని గాని [ఓం నమో నారాయణాయ ] జపించదలచుకున్నవారు అవి జపిస్తే శీఘ్ర ఫలప్రదమవుతాయి.వివిధ వృత్తులలో నున్నవారు ఇంటివద్ద వుండటానికి వీలు లేకున్నా ఆసమయము లో మీరున్న చోటునుండైనా జపము సాగించుకొనవచ్చు.ఈసమయాన్ని వృధా చేసుకొనవద్దని మనవి.

2 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ January 25, 2009 at 8:21 AM  

ధన్యవాదములు

పరిమళం January 25, 2009 at 7:40 PM  

గ్రహణ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియచేసినందుకు ధన్యవాదాలండీ .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP