శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రాక్షసమూకలు రెచ్చిపోతున్నాయి అర్చకులనుకూడా కొరడాలతో కొడుతున్నాయి.

>> Monday, November 30, 2020


-----------------

అర్చకుల పై దాడిచేసిన ఆలయ చైర్మన్!

కర్నూలు ....బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో దారుణం - ఆలయ పూజారులను చితకబాదిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి .

కారణం ఏదైనా కానీ కొరడాలతో కొట్టి ..భయభ్రాంతులకు గురిచేసారు.

పూజారి మురుగుఫణి శర్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరో ఇద్దరు పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్‍కు స్వల్ప గాయాలు .

శరీరానికి తగిలిన గాయం కన్నా ..వారు జరిగిన దానికి ..అవమానంతో కృంగిపోతున్నారు.

సమాజం అర్చకులను..పూజాకార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణోత్తములను ఇతోధికంగా గౌరవిస్తుంది.

పుట్టుక నుండి చావు వరకు..నామకరణం నుండి మహాప్రస్దానం వరకు వారి సూచనలు..వారు చేసే దైవకర్మలు పాటిస్తాము.

సాత్వికులు గా..దైవ సన్నిధిలో జీవిస్తున్న వారిని హింసించటం క్షమించరాని నేరం.

వారి మీద జరిగిన దాడిని ముక్తకంఠం తో నిలదీయాలి.

చిలుకూరు సౌందర్యరాజన్..స్వరూపానంద..రమణదీక్షితులు లాంటి వారు రాజకీయాలు మాని..

భగవంతుడికి భక్తునికి మధ్య వారధి ..అర్చకులు..
వారిపై జరిగిన దాడి మీద తగిన చర్యలు తీసుకునేందుకు డిమాండ్ చెయ్యాలి.

అవసరమైతే..రాక్షససంహార యాగం చెయ్యాలి.

అప్పుడే మీరు చేసే ధర్మపరిరక్షణ ప్రచారానికి విలువ ఉంటుంది.

అసలు మీ వ్యవహార సరళి వల్లే పాపభీతి నశిస్తున్నది.

దైవ సన్నిధిలో..అర్చకస్వాముల మీద దాడికి తెగబడటమంటే..ఏ స్దాయికి చేరారో అర్దమవుతున్నది.

కఠినంగా శిక్షించటమే కాదు! అటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలి.
✍️ Adusumilli Srinivas Rao

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP