శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీ పెద్దరికం ఏమయి పోతొంది?

>> Saturday, December 5, 2020

ఇది శ్రీమతి Rajya Lakshmi Kolla వారి అద్భుతమైన పోస్ట్ !! ఇది చదివి మీ మిత్రులతో పంచుకోండి !! మీకు తెలిసిన  Whatsapp గ్రూపులలో కూడా పంచుకోండి. (వారి పేరుతోనే సుమా )  
ప్రశ్నించాల్సిన  మీ పెద్దరికం ఏమౌతోంది?
నాలుగు గోడల మధ్య వేసుకోవలసిన
దుస్తులను పదిమందిలో వేసుకుంటూ
దాచుకోవలసిన వాటిని వదిలేస్తూ
దాపరికం లేని వలువలకు
విలువలు నేర్పించాల్సి వచ్చినప్పుడు
నీ పెద్దరికం ఏమౌతోంది?
పుట్టినరోజు లంటూ...అర్ధరాత్రి పన్నెండు వరకు
మేలుక్కూర్చుని....దెయ్యాలు తిరిగే సమయంలో
దీపాలు ఆర్పుకుంటూ..కేకుల ఫలహారాలుభుజిస్తూ...
ఎంగిలి పదార్థాలు పంచుకొంటూ..
ఇంగ్లీష్ వాని లెక్కల విషమసంస్కృతి లో
తానాలు ఆడుతుంటే ఇది కాదు
మన సంప్రదాయం అని చెప్పడానికి
నీ పెద్దరికం ఏమౌతోంది?
పేరంటాలకు... శుభకార్యాలకు
ఆప్తులు పిలిచినప్పుడు...సాకులు వెదుకుతూ..
సంబంధాలు మర్చిపోతూ..నేటి తరం పరుగులు తీస్తూంటే..
సరిదిద్దవలసినది పోయి..
నీవు కూడా వత్తాసు పలుకుతూ..చతికిల బడిపోతే
నీ పెద్దరికం ఏమౌతోంది?
ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి
గుక్కెడు నీళ్లు ఇవ్వాలని తెలియని
చేతులకు.. చేతలు నేర్పవల్సి వచ్చినప్పుడు..
సంస్కార దీపాలకు చెయ్యొడ్డి  నిలవాల్సినప్పుడు..
మౌనంగాఉంటున్నావు..నీ పెద్దరికం ఏమౌతోంది?
వాట్సాప్ లంటూ... ఫేసుబుక్ లంటూ
నిశాచరుల్లా రాత్రి అంతా మేలుక్కూర్చుని
పగలు పన్నెండు అయినా పడకగది వదలకుండా
రాక్షస స్నానం చేస్తూ.. అదీ కుదరకపోతే
రెండు కాకిమునకలు వేస్తూ వేళాపాల లేని
వెర్రితనానికి నడకలు నేర్పడానికి
నీ పెద్దరికం ఏమౌతోంది?
మేము ఇంత సంపాదిస్తున్నాం...అంత సంపాదిస్తున్నాం...
ఒళ్ళంతా ముక్కలు చెక్కలు చేసుకుంటున్నాం .... అంటూ...భజంత్రీలు మోగించుకుంటూ..
మమతానురాగాలకు తలుపులుమూస్తుంటే..
ఇదికాదు మన జీవన విధానం అని చెప్పడానికి..
మాననీయ బంధాలు నిలపడానికి..
గొంతు విప్పాల్సిన తరుణంలో..
ఎందుకు సర్దుకుపోతున్నావు..
నీ పెద్దరికం ఏమౌతోంది?
ఇంటికి పట్టిన దుమ్ము.. ధూళి ని
వదలకొట్టే చీపురు ని పనయ్యాక
మూల న పెడతాం...దానికి
ఒక తృప్తి ఉంది... మూల న పెట్టినా
కనీసంఇంటిని శుభ్రం చేసాను అని..
మలిన మవుతున్న మనసుల్ని
ఉతికి ఆరేయ్యకుండా..
ఒంటికి పట్టిన గబ్బు ని వదిలించకుండా
ఊరికే మూలన కూర్చోవడానికి..
నీ పెద్దరికం ఏమౌతోంది?
సిగ్గుపడు అని.. మేల్కొల్పడం లేదా..
చీపురు పాటి పనికుడా నీవు చెయ్యలేవా
అని ప్రశ్నించడం లేదా...
ఏమౌతోంది.. నీ పెద్దరికం?
నా మాట ఎవరూ వినరు-నా పెద్దరికానికి విలువ ఇవ్వరు అని ఆత్మవంచన చేసుకోకు- నీవు పద్దతిగా నడచి చూపిస్తే -ఏదొ ఒక రోజు నీ దారిని వారుకూడా ఇష్టపడుతారు-వారికి సరైన రీతిలో సమాధానం చెప్పిన జ్ఞానివి అవుతావు- కాని, ముందు నీ దగ్గర జ్ఞానము, ఇంగిత జ్ఞానముంటేగా?
నీవల్ల భారతదేశం కొన్ని తరాల జ్ఞానం -కొత్త తరాలకు అందివ్వలేకపోయింది-పిల్లలు ఆత్మన్యూనతలో పడి -పాశ్చాత్య సంస్కృతి గొప్పదనుకుంటున్నారు
నీవు సంపాదన యావలోపడి-భగవద్గీతను -పురాతన ఆరోగ్య సామెతలను,నీతి కధలను,ప్రేమను పిల్లలకు అందించడం మరిచావు- సామాజిక సేవనూ మరిచావు-చివరలో ప్రపంచమంతా స్వార్థమయం అయిపోయిందని-నా బాధలను పట్టించుకోవడం లేదని ఏడుస్తున్నావు-
లే.....లేచి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఫలితం ఆశించని యోగిలా
ఇప్పటికైనా ప్రయత్నించు....వయసుతో పాటు బుద్దీ పెరిగిందని నిరూపించు -

1 వ్యాఖ్యలు:

manasa December 6, 2020 at 12:56 AM  

వాస్తవ పరిస్థితి చక్కగా చెప్పారు. 🙏

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP